inventories
-
ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!
సాక్షి, మెదక్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ కలెక్టరెట్లో రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్ మెహదిరట్టాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉంటారని, అలాంటి వారికి ఇదొక సువర్ణావకాశమన్నారు. పాఠశాల, కళాశాలస్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, వ్యవసాయదారులు, ఇతర రంగాలలో పనిచేసేవారు, శాస్త్రీయ అవగాహన కలిగిన ఎవరైనా తమ ఆలోచనలను, ఆవిష్కరణలకు సంబంధించిన వీడియో, ఐదు వ్యాక్యాలు, పంపేటువంటి వ్యక్తి పేరు, ఇతర వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సప్ ద్వారా పంపించాలన్నారు. అలా పంపినవారిలో తెలంగాణా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు ఎంపిక చేసినవారు ఆగస్టు 15న జరిగే ప్రదర్శనలో ప్రదర్శించవచ్చని తెలియజేశారు. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారికి సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8328599157 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. -
క్రూడ్ మంట... డాలర్ల వెలుగు!
ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దేశీయంగా అమెరికా డాలర్లకు పెరిగిన డిమాండ్.. ఈ రెండూ రూపాయిని బలహీనపరచాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 24 పైసలు బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 69.86 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఒక దశలో రూపాయి నాలుగు నెలల కనిష్టస్థాయి 69.97ను కూడా చూసింది. అమెరికాలో గృహ కొనుగోళ్లు బాగున్నాయన్న గణాంకాలు ఆ దేశ మాంద్యం భయాలను తగ్గించాయి. దీనితో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 97పైన పటిష్టంగా కొనసాగుతోంది. నిజానికి డాలర్ బలోపేతం, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో రూపాయి ఇంకొంత బలహీనపడాల్సి ఉంది. కానీ దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, ఈక్విటీల పటిష్ఠ ధోరణి రూపాయిని భారీగా నష్టపోకుండా చూస్తున్నాయి. రూపాయి సమీపంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందవచ్చనేది విశ్లేషణ. 74.39 కనిష్టం నుంచి..: అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్ల మీదకు ఎక్కింది. నాలుగు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. అయితే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది. -
బదిలీ(ల)లు
‘పచ్చ'నోట్లకే సిఫార్సులు! ఉద్యోగుల బదిలీల్లో తెలుగుతమ్ముళ్లు చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి గతంలో సిద్ధం చేసిన జాబితాలను సైతం సవరించి తమకు అనుకులమైన ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయించారు. గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సిఫారసు లేఖలు తీసుకువచ్చిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా స్థాయిలోని ఓ కీలక అధికారి సైతం.. ఆ తర్వాత టీడీపీ నాయకులు సూచించినవారిని బదిలీ చేశార న్న విమర్శ ఇప్పుడు ఉద్యోగవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నెల్లూరు (పొగతోట) జిల్లాలోని రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల్లో శనివారం 41 మంది డిప్యూటీ తహశీల్దారులను బదిలీ చేశారు. పది మంది సీనియర్ సహాయకులకు డీటీలుగా పదోన్నతులు కల్పించారు. అయితే ఈ బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సిఫారసులకే పెద్దపీట డీటీలకు సంబంధించి సెప్టెంబర్ 16న జాయింట్ కలెక్టర్ జి. రేఖారాణి తన చాంబర్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ నాయకుల సిఫారసు లేఖలు తీసుకొచ్చిన ఉద్యోగులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌లో వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు జేసీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అనంతరం జాబితా సిద్ధంచేశారు. కానీ జన్మభూమి, హుదూద్ తుపాను కారణంగా బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 20తో జన్మభూమి కార్యక్రమం పూర్తయింది. 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యత లభించనివారు కాస్త నేతలను ఆశ్రయించారు. ఇదే అదనుగా కొందరు పచ్చ చొక్కాల నాయకులు చక్రం తిప్పారు. విమర్శలకు కారణాలివే! గతంలో నిర్వహించిన బదిలీలలో టీజీపీలో డీటీగా పని చేస్తున్న రవిని సీఎస్‌డీటీగా నియమించారు. డక్కిలిలో డీటీగా పనిచేస్తున్న మస్తానయ్యను ఓజిలి డీటీగా నియమించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో వారికి కేటాయించిన మండలాలను వేరే వారికి కేటాయించారు. ఇలాంటి మార్పులు అనేకం జరిగాయి. సీనియర్ సహాయకుల నుంచి డీటీలుగా పదోన్నతులు మాత్రమే వచ్చినా, పై స్థాయి నుంచి ఒత్తిడి చేయడంతో వారికి సీఎస్డీటీలుగా నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం బదిలీ చేయలేదు. కలెక్టరేట్లో ఒక కీలక అధికారి బదిలీల ప్రక్రియలో చక్రం తిప్పినట్లు సమాచారం. బదిలీల ప్రక్రియ పూర్తి అయినా, ఇప్పట్లో బదిలీలు చేయబోమని చెప్పిన అధికారులు శనివారం రాత్రి హడావుడిగా జాబితాను విడుదల చేశారు. ముడుపుల వ్యవహారమే దీనివెనుక మర్మమని కొందరు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సీనియర్ సహాయకులు, ఇతర ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. వాటినైనా పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పారదర్శకంగానే బదిలీలు డీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించి గతంలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసి జాబితా సిద్ధం చేశాం. ప్రస్తుతం 41 మంది డీటీలను బదిలీ చేశాం. గతంలో సిద్ధం చేసిన జాబితాలో కొద్ది మార్పులు చేశాం. సిఫారసులను అనుమతించ లేదు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేస్తాం. -జి. రేఖారాణి, జాయింట్ కలెక్టర్ -
తిరుమలలో నేడు ఒక రోజు బ్రహ్మోత్సవం
రథసప్తమికి అంతా సిద్ధం తరలివచ్చిన అశేషభక్తజనం సాక్షి, తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమికి తిరుమల సిద్ధమైంది. ఏడు వాహనసేవల్లో స్వామివారిని దర్శించి తరిం చేందుకు భక్తకోటి తరలివచ్చింది. ఉద యం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ దర్శనమిచ్చేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి అన్ని విభాగాల అధికారులతో కలసి జేఈవో శ్రీనివాసరాజు రథసప్తమి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆలయం వద్ద, నాలుగు మాడవీధుల్లో నిర్మించిన ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లను పరి శీలించారు. ఏకదాటిగా ఏడు వాహ సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఉండడంతో బుధవారం ప్రత్యేకంగా పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సుదర్శన చక్రతాళ్వా ర్కు స్నానం జరిపే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు చొరబడకుం డా ఇనుప కమ్మీలను ఏర్పాటు చేశారు. నాలుగు మాడవీధుల్లో ఏ ర్పాటు చేసిన చలువ పందిళ్ల వద్ద తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు వితరణ చేసేందుకు అదికారుల చర్యలు తీసుకున్నారు.