Jackets
-
నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు
బయటి ప్రపంచంలో కనెక్టివిటీ అంతగా ఉండని ఉత్తర కొరియా గురించి రకరకాల కథనాలు బయటకు వస్తుంటాయి. వాటిలో నిజాల సంగతి ఎలా ఉన్నా.. కిమ్ పాలనలో కొరియన్ పౌరులు గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నారనేది మాత్రం వాస్తవం. తాజాగా కిమ్ తీసుకున్న ఓ నిర్ణయం అక్కడి లెదర్ వ్యాపారులకు, యువతకు అసలు సహించడం లేదు. ఉత్తర కొరియా దేశవ్యాప్తంగా లెదర్ కోట్లు, జాకెట్లను నిషేధిస్తూ కిమ్ ప్రభుత్వం బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పైగా అధ్యక్షుడు కిమ్ తప్ప ఎవరూ వాటిని ధరించడానికి వీల్లేదని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇంతకీ ఆఘమేఘాల మీద ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో తెలుసా?. ఈ నెల 21న(నవంబర్) ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ వేసుకున్న లెదర్ జాకెట్ లాంటిదే.. కొందరు యువకులు అలాంటి జాకెట్లే వేసుకుని కనిపించారు. ఉత్తర కొరియా పౌరులు అలా ప్రవర్తించడం.. దేశ అధ్యక్షుడి ఫ్యాషన్ ఛాయిస్‌ను అవమానించినట్లే అవుతుందని పేర్కొంది అక్కడి ప్రభుత్వం. అందుకే లెదర్‌జాకెట్ల నిషేధ ఆదేశాలు ధిక్కరిస్తే ఆరేళ్లు నిర్బంధ కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది కూడా. చైనాకు చెందిన రేడియో ఫ్రీ ఏషియా కథనం ప్రకారం.. 2019లో ఓ కార్యక్రమం సందర్భంగా లెదర్ కోట్ ధరించి కనిపించాడు కిమ్ జోంగ్ ఉన్. అప్పటి నుంచి వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఒరిజినల్ లెదర్ ట్రెంచ్ కోట్ల ధర చాలా ఎక్కువ. దీంతో చైనా నుంచి డూప్లికేట్ లెదర్ జాకెట్లు ఎక్కువగా ఉత్తర కొరియాకు ఎగుమతి అయ్యాయి. వాటిని కొరియా యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఒరిజినల్ లెదర్ కోట్ల ధర లక్షా డెబ్భై వేల వన్(34 డాలర్లు) కాగా, డూప్లికేట్ జాకెట్ల ధర ఎనభై వేల వన్(16 డాలర్లు)కు అమ్ముడపోయేవి. వన్ అంటే నార్త్ కొరియా కరెన్సీ అయితే తాజా పరిణామంతో లెదర్ జాకెట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. కిమ్ జోంగ్ ఉన్, అతని సోదరి కిమ్ యో జోంగ్ లాంటి అధికారం నడిపించే వాళ్లకు మాత్రమే అలాంటి జాకెట్లు ధరించే అర్హత ఉందని తాజా ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. అది వాళ్లకే హుందాతనమని, కానీ డూప్లికేట్ జాకెట్లతో అధ్యక్షుడిని అనుకరిస్తున్నారని.. కించపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు ప్యాషన్ పోలీసింగ్ పేరుతో ప్యోంగ్‌సాంగ్ సిటీలో పోలీసులు పాట్రోలింగ్ చేపట్టారు. రోడ్ల మీద జనాల నుంచి అలాంటి జాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లెదర్ వ్యాపారులకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై అక్కడి యువత నిరసన వ్యక్తం చేస్తోంది. తమ డబ్బుతో కొనుక్కున్న వస్తువులపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. పైగా 2000 సంవత్సరం నుంచే లెదర్ జాకెట్ ఫ్యాషన్ ట్రెండ్ ఉందని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా నిషేధిస్తారని వాదిస్తున్నారు. అయితే కిమ్ ఆ జాకెట్లో కనిపించిన తర్వాతే.. వాటి అమ్మకాలు పెరిగాయన్నది అక్కడి లెదర్ వ్యాపారులు చెప్తున్నమాట. కానీ, తమ పొట్ట కొట్టే కిమ్ ప్రభుత్వ ఆదేశాలపై లెదర్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు. చైనా నుంచే! ఇదిలా ఉంటే కరోనాతో కిందటి ఏడాది జనవరి నుంచి చైనా నుంచి నార్త్ కొరియాకు సరిహద్దులు మూసుకుపోయాయి. అన్ని రకాల వర్తకవాణిజ్యాలు నిలిచిపోయాయి. ఐరాస, అమెరికా ఆంక్షలతో ఈ ఏప్రిల్ నుంచి అక్రమ వర్తకం కూడా ఆగిపోయింది. కానీ, చైనా నుంచి మాత్రం దొంగతనంగా వస్తువులు వెళ్తునే ఉన్నాయి. తాజా పరిణామాల తర్వాత స్వదేశంలో లెదర్ వ్యాపారాలపై కిమ్ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచినప్పటికీ.. చైనా నుంచి దొంగతనంగా దిగుమతి అవుతూనే వస్తోంది. నెలకు నాలుగు వేల వన్లు సంపాదించే ఉత్తర కొరియన్లు.. అధిక ధరల కారణంగా చైనా నుంచి వచ్చే దొంగ సరుకునే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడుతూ కఠిన శిక్షలకు గురవుతున్నారు. చదవండి: నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు -
చెట్టుకు చొక్కా
రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి వణికించేస్తోంది. పగలు నిడివి తగ్గిపోయింది. అంత మాత్రాన డ్యూటీ టైమ్ మారదు. ఆఫీస్‌లు వాటి టైమ్ వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. ఉద్యోగులు ఆ చలిలోనే చేతులను వెచ్చని ఉలెన్ జాకెట్లలో చొప్పించుకుని కనిపించిన ఆటోలు, క్యాబ్‌లలో ఇంటిదారి పడుతుంటారు. ఆటో ఎక్కిన వాళ్ల సంగతి సరే. ఆటో నడిపే వాళ్ల చలి మాటేమిటి? ఒక ఆటో డ్రైవర్ చలి జాకెట్ కొనాలంటే అంత సులభమేమీ కాదు. ఆ డబ్బుతో ఒక నెల ఇంటి అద్దె గడిచిపోతుంది. పిల్లల స్కూలు ఖర్చులు గుర్తుకు వస్తుంటాయి. ఆటో డ్రైవర్ అనే కాదు, ఇళ్లలో పనులు చేసుకునే డొమెస్టిక్ వర్కర్ల పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏమీ ఉండదు. వణికించే చలిలో ఉదయాన్నే పనులకు పోవాలి. కప్పుకున్న రగ్గు వెంటరాదు, సంపన్నుల లాగ ఉలెన్ జాకెట్లు కొనడానికి చేతిలో డబ్బు ఉండదు. సరిగ్గా ఇలాంటి అవసరాలనే గుర్తించింది బెంగళూరు యువత. తమ దగ్గర గత ఏడాది, అంతకు ముందు కొనుక్కున్న ఉలెన్ జాకెట్లు తీసుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తగిలించారు వాళ్లు! ఆ చొక్కాలు, జాకెట్ల మీద ‘మీకు వీటి అవసరం ఉంటే తీసుకోండి’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంచారు. ఆ దారిన వెళ్తున్న ఆటోవాలాలు, డొమెస్టిక్ వర్కర్లు, భవన నిర్మాణ రంగ కూలీలతో ఇతర పనులు చేసుకునే వాళ్లు ‘రాజరాజేశ్వరీ నగర్ రెసిడెంట్స్ ఫోరమ్ (ఆర్ఆర్ఎఫ్)’కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని వాటిని తీసుకుని ధరిస్తున్నారు. ‘ఫ్రీ ఆన్ ట్రీ ’ మూవ్మెంట్ ఈ ఉద్యమం మొదలు కావడానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన బల్గేరియా, హంగరీలేనని చెప్తారు ఆర్ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు శ్రీకాంత్. బల్గేరియా, హంగరీ వంటి దేశాల్లో చెట్లకు చొక్కాలు తొడుగుతారు. పేదవాళ్లు, తలదాచుకోవడానికి ఇల్లు లేని వాళ్ల కోసమే ఇలా చేస్తారన్నమాట. మన దగ్గర రెండు ఉంటే ఒకదానిని అవసరమైన వారితో పంచుకోవడమే ఇందులో ఉన్న మానవత్వం. ఫేస్బుక్లో ఈ పోస్ట్‌లు చూసిన శ్రీకాంత్ తన ఫ్రెండ్స్‌తో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి తన ఆలోచన చెప్పాడు. ‘ఫ్రీ ఆన్ ట్రీ’ మూవ్మెంట్ యువబృందం టర్కీ బల్గేరియా ఇచ్చిన స్ఫూర్తి అతడు తనవంతుగా పద్నాలుగు స్వెటర్లను కొన్నాడు. శ్రీకాంత్ అన్నేసి స్వెటర్లు ఎందుకు కొంటున్నాడో తెలుసుకున్న దుకాణదారు వాటిని డిస్కౌంట్‌తో మూడు వేల ఐదు వందలకే ఇచ్చాడు. ఫ్రెండ్ప్ అందరూ తమ దగ్గర ఉన్న స్కార్ఫులు, స్వెటర్లు, జాకెట్లు, మంకీ క్యాప్‌లు, దుప్పట్లు, రగ్గులలో వాడడానికి పనికి వచ్చే వాటిని మొత్తం 350 వరకు తెచ్చారు. ఆ స్వెటర్లు, జాకెట్లను పార్కుల్లో చెట్లకు, రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తగిలించి రెస్పాన్స్ కోసం చూశారు. అరగంటలోపే వారు ఆశించిన దానికంటే మంచి రెస్పాన్స్ కనిపించింది. ఇది చూసిన తర్వాత బూట్లు కూడా చేర్చాలనే నిర్ణయానికి వచ్చిందీ టీమ్. చలికాలంలో వచ్చే అనేక అనారోగ్యాల నుంచి వాళ్లను కాపాడడం కోసమే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు ఈ యువతీ యువకులు. చలికాలం పోయిన తర్వాత కూడా సర్వీస్‌ని ఆపకూడదని, పుస్తకాలు, పిల్లల ఆటవస్తువుల వంటి ఇతర వస్తువులను పంచాలని అనుకుంటున్నారట. అయితే ఒక్క హెచ్చరిక మాత్రం చేస్తున్నారు. ‘ఈ సర్వీస్ అవసరమైన వాళ్లకు మాత్రమే. కాబట్టి వీటిని తీసుకువెళ్లి వృధా చేయడమో లేక ఇతరత్రా వ్యాపకాలకు వినియోగించడం వంటివి చేయరాదు’ అని సున్నితంగానే చెబుతున్నారు. – మంజీర -
రీడ్ అండ్ టేలర్ లిక్విడేషన్ నిలిపివేత
ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్ అండ్ టేలర్ కంపెనీ లిక్విడేషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిలిపేసింది. రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు మాత్రమేనని, లిక్విడేషన్ చేపడితే రుణ దాతలకేమీ రాదని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత, అధిక ధరలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఘానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. కంపెనీలో మొత్తం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మైసూర్లో ప్లాంట్ ఉంది. ఈ కంపెనీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు జేమ్స్‌బాండ్ పాత్రధారి పియర్స్ బ్రాస్నన్, అమితాబ్ బచ్చన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఎడెల్వీస్ వ్యాజ్యంతో ఎన్సీఎల్టీకి కస్లివాల్ కుటుంబానికి చెందిన ఎస్ .కుమార్ గ్రూప్ రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఖరీదైన సూట్లు, జాకెట్లు, ట్రౌజర్లు, షర్ట్లు, టి–షర్ట్‌లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ బ్యాంక్‌లకు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.4,100 కోట్ల మేర బకాయిలు పడటంతో వీటి వసూళ్లకు గాను ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎడెల్వీజ్ ఏఆర్సీ ఎన్సీఎల్టీలో ఒక కేసు వేసింది. ఎనిమిది కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలను సమర్పించినప్పటికీ, అవేవీ సంతృప్తికరంగా లేకపోవడంతో రుణదాతల కమిటీ లిక్విడేషన్‌కు సిఫార్సు చేసింది. ఫైన్‌క్వెస్ట్‌కే అధిక భారం... రీడ్ అండ్ టేలర్ కంపెనీ నుంచి ఫైన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీకి అధికంగా రూ.800 కోట్ల మేర రావలసి ఉంది. యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తదితర సంస్థలకు ఈ సంస్థ భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
స్లీవ్ లెస్స
స్లీవ్‌లెస్ జాకెట్స్ తెలుసు కదూ! ఇప్పుడు కాంట్రాస్ట్ స్లీవ్లతో స్లీవ్‌లెస్ కంటే కూడా సూపర్‌గా ఉండే స్లీవ్ లెస్స అనిపించే డిజైన్లు ఇవి... మల్టీకలర్ స్లీవ్స్ చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటే పెద్ద డిజైన్ అక్కర్లేదని ముందే అనుకున్నాం కదా! అలాగే పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్స్ (ప్లెయిన్ పట్టు, రాసిల్క్, బెనారస్, నెటెడ్... వంటి క్లాత్ అయితే బాగుంటుంది) ఎంపిక చేసుకొని బ్లౌజ్ బాడీ పార్ట్‌కి ఒకే కలర్ ఫ్యాబ్రిక్ వేయాలి. చేతుల భాగానికి రెండు మూడురకాల ఫ్యాబ్రిక్‌తో కుట్టి, దాని మీద అందంగా ఎంబ్రాయిడరీ చేస్తే కొత్త లుక్ వచ్చేస్తుంది. బెనారస్‌తో బుట్టచేతులు బాడీ పార్ట్ చీర రంగు ప్లెయిన్ క్లాత్‌తో డిజైన్ చేయాలి. స్లీవ్స్ పార్ట్ చీరకు, బ్లౌజ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే బెనారస్ క్లాత్‌తో బుట్టచేతులతో డిజైన్ చేయించుకోవాలి. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఆలోవర్ బుటా ఉండటం వల్ల ఇదే డిజైన్‌గా కనిపిస్తుంది. అందుకని స్లీవ్స్ పార్ట్‌కి వేరే మగ్గం వర్క్ వంటి ఎంబ్రాయిడరీ అవసరం లేకుండా చేతుల భాగాన్ని డిజైన్ చేయించుకోవచ్చు. బుట్ట చేతులు లేదంటే మోచేతుల వరకు చేతుల భాగాన్ని డిజైన్ చేసుకోవచ్చు. నెటెడ్తో నయనానందం పట్టు చీరల మీదకు నెటెడ్ బ్లౌజ్లా అని ఆలోచించేవారుంటారు. ఇలాంటి వారు బ్లౌజ్ బాడీ పార్ట్‌ని పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకొని, చేతుల భాగానికి కాంట్రాస్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. నెట్ మరీ సాదా సీదాగా ఉంటుంది కాబట్టి దీని మీద గ్రాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే లుక్ వావ్ అనిపిస్తుంది. అక్కర్లేని పెద్ద పెద్ద డిజైన్లు చీరకు బ్లౌజ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌లో జాకెట్టు చేతుల భాగం ఉండటంతో త్వరగా చూపులను దోచేస్తుంది. అలాంటప్పుడు గాడీగా డిజైన్లు అక్కర్లేదని అతివల భావన. అందుకని ఈ స్లీవ్స్ భాగాన్ని సింపుల్ డిజైన్‌తో సరిపెట్టేయవచ్చు. పట్టుచీరలకూ కాంట్రాస్ట్ పట్టు చీర అంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాల్సిందే అనే ట్రెండ్ నిన్నా మొన్నటిది. ఇప్పుడు పట్టులోనూ కాంట్రాస్ట్ స్లీవ్స్ ప్యాటర్న్ బాగా ఆకట్టుకుంటుంది. బ్లౌజ్ భాగాన్ని చీర బాడీ ప్యాటర్న్‌ని, చేతుల భాగాన్ని చీర అంచు భాగంతో డిజైన్ చేస్తే ఓ సరికొత్త లుక్ వచ్చేస్తుంది. బాడీ పార్ట్ కాంట్రాస్ట్ చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ విడిగా తీసుకొని బ్లౌజ్ బాడీ పార్ట్‌ని డిజైన్ చేయించుకోవాలి. చేతుల భాగానికి చీరలో ఇచ్చే బ్లౌజ్ ఫాబ్రిక్‌తో డిజైన్ చేయించాలి. దీంతో ఒక ప్రత్యేక లుక్‌తో పార్టీలో మెరిసిపోతారు. ∙ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ బ్లౌజ్‌లతో పోల్చితే ఈ కాంట్రాస్ట్ స్లీవ్స్ బ్లౌజ్‌ల డిజైన్‌కి ఖర్చు తక్కువే అవుతుంది. ∙దీనికి ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు చీరకు పూర్తి కాంట్రాస్ట్ క్లాత్‌ల ఎంపిక సులువు కూడా! ∙చేతుల పార్ట్‌కి విడిగా ఎంబ్రాయిడరీ చేయించిన పార్ట్‌ని ప్యాచ్‌లా తర్వాత జత చేసుకోవచ్చు. - నిర్వహణ ఎన్.ఆర్ -
జాకెట్స్... జిగ్‌జాగ్...
మార్కెట్లో వీటికి సంబంధించిన ఎంతో రా మెటీరియల్ అందుబాటులో ఉంది. వీటిని కొద్ది మార్పులతో మీ శరీరాకృతికి నప్పే విధంగా కుట్టుకోవచ్చు. కత్తెర, ఫ్యాబ్రిక్ గ్లూ, అద్దాలు, ప్యాచ్‌లు దగ్గర ఉంచుకుంటే ఎంచుకున్న జాకెట్‌ను మీకు తగినవిధంగా మీరే డిజైన్ చేసుకోవచ్చు. గ్లూతో అతుకుపెట్టదగిన ప్లాస్టిక్ అద్దాలను ఎంచుకుంటే ప్రత్యేకమైన మెజర్మెంట్స్ కూడా అవసరం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు పేస్ట్ చేసుకోవచ్చు. జాకెట్ స్ట్రిప్కి బాటమ్ కలర్ స్ట్రిప్ అంచుగా జతచేసి, దాని మీద వరుసగా మిర్రర్స్‌ను అతికించినా సరిపోతుంది. రకరకాల పూసలతో డిజైన్ చేసిన ప్యాచ్‌వర్క్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. జాకెట్‌ను మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ సాయపడతాయి. ఇదే విధంగా లెహంగా, చోళీలను మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు.