jagadeeswara reddy
-
నన్ను కాదని.. నిన్నమొన్న వచ్చిన వారికి టికెట్లా?
పంజగుట్ట: ‘రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ను.. అనుభవం ఉన్న వాడిని. కాంగ్రెస్ పార్టీని ఎన్నో సంవత్సరాలుగా నాగర్‌కర్నూల్‌లో కాపాడుకుంటూ వస్తున్నా. నన్ను కాదని నిన్న, మొన్న వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారు?’అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు పార్టీని కాపాడుతుంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన జూపల్లి కృష్ణారావు... కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల సీట్లు తన వారికే కావాలంటున్నాడని, ఆయన అంత పెద్ద నాయకుడు ఎప్పుడయ్యాడో అర్థం కావడంలేదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ కేడర్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండి, ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి పార్టీని నడిపిన మేము ఏం కావాలి? ఆయన గెలిచిన తర్వాత ఇక్కడే పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఉందా..ఆ గ్యారెంటీ ఎవరిస్తారని నాగం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి... కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48 వేల కోట్ల అవినీతి జరిగిందని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా సీఎం కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ అవినీతి గురించి మాట్లాడుతోందని, అయితే ఎవరూ ప్రశ్నించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు, టీపీసీసీ అధ్యక్షుడు దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఏసీబీ డీజీని కలసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
మిషన్ భగీరథ పనులను పరిశీలించిన మంత్రి
మర్రిగూడ: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం గ్రామంలో మిషన్ భగీరథ పనులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మునుగోడ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డ ఉన్నారు. -
జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ
హైదరాబాద్: మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై లోకాయుక్త సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో నివేదిక సమర్పించడానికి 4 వారాల గడువు కోరిన ఉన్నతాధికారుల విఙ్ణప్తిని లోకాయుక్త తిరస్కరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సిందేనని లోకాయుక్త, జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
త్వరలో డీఎస్సీ
విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్: త్వరలో డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా పటాన్చెరులో మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణేతర ఉద్యోగుల బదిలీలను త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చిన వెంటనే డీఎస్సీతో పాటు అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారన్నది అపోహ మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకునేలా తెలంగాణ విద్యాసంస్థలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. -
'కిరణ్‌పై తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తాం'
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అన్నారు. శుక్రవారం టి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం లోక్‌సభ, శాసనసభ స్థానాలలో విజయం సాధించి సోనియాకు కానుకగా ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా రాజీనామా చేసిన కిరణ్‌పై ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ తన పదవికి రాజీనామా చేసే ఆరునెలల ముందు నుంచి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని త్వరలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించుకుని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ వరకు గన్‌పార్క్ వరకు భారీగా ర్యాలీ చేపడుతున్నట్లు టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.