jainath mandal
-
‘క్షమించు నాన్నా..’ ఆదిలాబాద్‌లో విషాద ఘటన
సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షల వేళ.. జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి సాత్మల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ తండ్రికి అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘‘నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా..’’ అని నోట్లో ఉంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం నిబంధన వల్లే.. ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్షకు వెళ్లాడు శివ. అయితే.. అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. పరీక్షకు అనుమతించరాదనే నిబంధన ఉందని అధికారులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో శివ అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే మనోవేదనతో.. తండ్రికి లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ,విద్యార్థి చేతి వాచి,పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన విధించిన కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కష్టపడి చదివి.. ఆందోళనగా పరీక్షకు వెళ్లిన కొడుకు శవమై తిరిగొచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అమ్మా.. ఎందుకిలా చేశావ్..!
‘‘అమ్మా.. మా చుట్టూ నీళ్లే.. మమ్మల్ని ఎక్కడ వదిలేసినవ్.. తమ్ముడు గుక్కపట్టి ఏడుస్తున్నడు.. నాకూ ఏడుపొస్తోంది.. నువ్వు దూరంగా మాకు కనిపిస్తున్నా దగ్గరకు తీసుకోవట్లేదు ఎందుకమ్మా... నేను ఏడిస్తే ఆకలేస్తుందా అని అన్నం పెట్టేదానివి.. తమ్ముడు ఏడిస్తే పాలు పట్టేదానివి.. అలాంటిది నువ్వు మమ్మల్ని దూరంగా చూస్తూనే ఉన్నా.. ఏమైంది బిడ్డా అని కూడా అడుగట్లేదు.. నీ గుండె ఎందుకింత కఠినంగా మారిందమ్మా.. అందరూ నువ్వే మమ్మల్ని బావిలో తోసేశావ్ అంటున్నరు.. ఇన్నాళ్లూ ప్రేమను పంచిన నువ్వే ఇలా చేశావా.. మేం ఏం తప్పు చేశాం.. ఎందుకిలా చేశావ్.. నాన్నకు, నీకు మధ్య గొడవతో ఎంత పని చేశావమ్మా.. నీ క్షణికావేశం మన కుటుంబాన్ని ఎలా విడదీసిందో చూశావా.. అమ్మా.. నువ్వు ఏడవకు.. నువ్వు ఏడుస్తుంటే మాకు ఇంకా ఏడుపొస్తుంది..’’ అంటూ ఆ పసి హృదయాల ఆత్మఘోషించే ఉంటుంది.! ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లీ ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలిద్దరూ మృత్యువాతపడిన హృదయవిదారక ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బాలాపూర్‌లో చోటు చేసుకుంది. సాక్షి, ఆదిలాబాద్: కాపురంలో కలహాలు సహజం.. అయితే అవి చినికి చినికి గాలివానలా మారి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొన్న ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థాని కుల కథనం ప్రకారం.. బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన సుష్మతో జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన వాన్‌ఖెడే గణేశ్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదిత్య(4), ఆర్యన్(18నెలలు) సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో చిన్న చిన్న కలహాలు పెను తుపాను రేపాయి. ఈ క్రమంలో కలహాలతో విసిగిపోయిన సుష్మ చనిపోవాలని నిర్ణయించుకుంది. బుధవారం భర్త కూలీ పనికి వెళ్లిన సమయంలో గ్రామానికి కొంచెం దూరంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పిల్లలతో కలిసి వెళ్లింది. పిల్లలిద్దరినీ ముందుగా అందులో తోసేసి అనంతరం తానూ దూకింది. అయితే నీటిలో మునిగే సమయంలో భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో పక్కనే చేలో ఉన్న రైతు తాడు సాయంతో బావిలో దూకాడు. ముగ్గురిని బయటకు తీయగా సుష్మ ప్రాణాపాయం నుంచి బయటపడగా.. చిన్నారులు కొన ఊపిరితో ఉన్నారు. వారిని వెంటనే గ్రామానికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు. మిన్నంటిన రోదనలు.. పాల బుగ్గల చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు భారీగా తరలివచ్చి కడసారి చూపుకోసం గుమిగూడారు. తల్లే క్షణికా వేశంలో బిడ్డలను పొట్టన పెట్టుకుందని భర్త తరఫువారు ఆరోపించగా.. భర్త వేధింపులతోనే జీవితంపై విరక్తి చెంది ఇద్దరు పిల్లలతో సుష్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఏదేమైనా భార్యాభర్తల మధ్య కలహాలు రెండు పసిప్రాణాలను బలి గొనడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్యాభర్తలపై కేసు .. చిన్నారులు మృతిచెందిన ఈ సంఘటనలో భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే చిన్న చిన్న గొడవలతో సుష్మ అనవసరంగా పిల్లలతో కలిసి బావిలో దూకి వారి ప్రాణాలు తీసిందని, చి న్నారుల నానమ్మ నీలాబాయి ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు సుష్మపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు తన అల్లుడు వాన్‌ఖెడే గణేష్ వేధింపులతోనే కూతురు సుష్మ ఆత్మహత్యాయత్నం చేసింద ని, చిన్నారుల అమ్మమ్మ జిజాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాన్‌ఖెడే గణేశ్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. -
‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?'
సాక్షి, జైనథ్ (ఆదిలాబాద్): ‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..? మమ్మల్ని ఒంటరి వాళ్లను చేసి ఎందుకు వెళ్లిపోయినవమ్మా? మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా.. అసలేమైంది బిడ్డా..’ అంటూ కూతురు మృతదేహం వద్ద తల్లి మరాఠీలో గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మండలంలోని లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఓ విద్యార్థిని మృతదేహం లభించగా.. మరో విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బేల మండల కేంద్రానికి చెందిన పాటిల్ ప్రియాంక(14) జైనథ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. జైనథ్‌కు చెందిన పారిక్ ప్రీతి కూడా అక్కడే పదో తరగతి చదువుతోంది. ఇద్దరూ ఒకే తరగతి కావడంతో ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవారు. మిత్రులుగా, చురుకైన విద్యార్థినులుగా వీరికి పేరుంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా ఇద్దరు కలిసి హిందీ ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. అయితే హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం ప్రియాంక మృతదేహం లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో లభించడం కలకలం రేపింది. పారిక్ ప్రీతి సైతం అదే రిజర్వాయర్‌లో అపస్మారక స్థితిలో లభించడంతో అసలు ఏం జరిగి ఉంటుందని రెండు మండలాల్లో చర్చనీయాంశమైంది. అటుగా వెళ్తున్న కొంతమంది విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ప్రీతిని బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు చెబుతున్నారు. సంఘటన స్థలం వద్ద లభించిన బెల్టు మిన్నంటిన రోదనలు ప్రియాంక తల్లిదండ్రులు విపుల్–సంగీత వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో ప్రియాంక అందరి కంటే పెద్దది. ప్రతిరోజు బేల నుంచి జైనథ్‌కు స్కూల్‌కు బస్సులో వెళ్లి వచ్చేది. ఉన్నత చదువులు చదివి ఎంతో ఎత్తుకు ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ ఇలా శవమై తేలిందంటూ సంఘటన స్థలం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కదిలించింది. చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది) వీడని ఉత్కంఠ.. అపస్మారక స్థితిలో లభించిన ప్రీతి రిమ్స్‌లో కొంత కోలుకోవడంతో పోలీసులు ఆమె నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించారు. అయితే భయాందోళనలో ఉన్న ఆమె తాము ఇద్దరం పాఠశాలకు వెళ్లకుండా కాలినడక రిజర్వాయర్ వద్దకు వెళ్లినట్లు చెప్పినట్లు తెలిసింది. ఫొటోలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లోకి పడిపోయామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఇద్దరి వద్ద కూడా సెల్ఫోన్లు లేకపోవడంతో వీరి వెంట ఇంకా ఎవరో ఉండి ఉంటారని పోలీసులు, ఇరు కుటుంబాల సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీతి ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో ఆమెను మరిన్ని ప్రశ్నలు అడిగి విసిగించవద్దని వైద్యులు పోలీసులకు సూచించినట్లు తెలిసింది. దీంతో మృతురాలు ప్రియాంక తల్లి సంగీత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. ఉలిక్కిపడ్డ మండలం.. అభం శుభం తెలియని టీనేజ్ విద్యార్థినుల్లో ఒకరి శవమై తేలడం, మరొకరు కొన ఊపిరితో అపస్మారక స్థితిలో రిజర్వాయర్‌లో లభించడంతో మండల వాసులు ఉలిక్కి పడ్డారు. బడి మానేసి దాదాపు రెండు కిలోమీటర్లు కాలినడక రిజర్వాయర్‌కు ఎందుకు వెళ్లారు? వీరి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా నిజంగానే సెల్ఫీల మోజు ప్రాణం తీసిందా? అని చర్చించుకుంటున్నారు. అన్నీ అనుమానాలే! జైనథ్‌కు చెందిన పారిక్ ప్రీతికి చెందిన పుస్తకాల బ్యాగు పాఠశాలకు, రిజర్వాయర్‌కు నడుమ ఉన్న పెన్‌గంగ కెనాల్ వెంబడి ఓ రైతుకు దొరినట్లు పోలీసులు చెబుతున్నారు. రైతు నేరుగా ఈ బ్యాగ్‌ను పాఠశాలలో అప్పగించడంతో చర్చ మొదలైంది. పుస్తకాల బ్యాగు అటు రిజర్వాయర్ వద్ద కాకుండా, ఇటూ పాఠశాల వద్ద కాకుండా కెనాల్ వెంబడి ఎందుకు పడి ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతిచెందిన విద్యార్థినికి సంబంధించిన బ్యాగు ఏమైందో ఇంకా అంతుపట్టడం లేదు. సంఘటన స్థలంలో ఆమె స్కూల్ డ్రెస్ నడుము బెల్ట్ మాత్రమే లభించడంతో ఆ బ్యాగు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు పడి ప్రియాంక పూర్తిగా నీళ్లలో ఎందుకు పడిపోయారు? ప్రీతి మాత్రం ఎవరో జాగ్రతగా ఒడ్డుకు చేర్చినట్లు ఎందుకు ఒడ్డున అపస్మారక స్థితిలో లభించిందనేది ఇంకా అంతుచిక్కడం లేదు. గురువారం వరకు ప్రీతి ఆరోగ్యం కొంత కుదుట పడితే గాని పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. -
మోడల్ స్కూల్ ఎదుట క్షుద్రపూజల కలకలం
జైనథ్( ఆదిలాబాద్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి మోడల్ స్కూల్ గేటు ఎదుట మట్టి బొమ్మలకు పసుపు పూసి, నిమ్మకాయలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్ధులు కొంతమంది పాఠశాలకు రావడంతో క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తహశీల్దార్ రాఘవేంద్రరావుకు ఫోన్లో సమాచారం అందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ క్షుద్రపూజల సామగ్రిని అక్కడి నుంచి తొలగింపజేసి వాటిని కాల్చి వేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. సోమవారం అవగాహన సదస్సు.. క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలను నమ్మరాదని తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. సోమవారం పాఠశాలలో మూఢనమ్మకాలపై ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు. -
ఫాంహౌస్‌లో గుట్కా దందా
సాక్షి, ఆదిలాబాద్ : మండలంలోని పూసాయి గ్రామ సమీపంలోని పరేష్ రావ్రానికు చెందిన ఫాంహౌస్‌లో రూ.30 లక్షల విలువగల గుట్కాను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లేశ్, ఎస్సై వెంకన్న వివరాల ప్రకారం... ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షమీ ఉల్లాఖాన్ అలియాస్ షమ్మీ రావ్రానికి చెందిన ఫాంహౌస్‌లో గుట్కా నిల్వ ఉంచి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి నిర్వహించారు. గుట్కాతో పాటు ఇన్నోవా వాహనం (ఏపీ09 సీపీ 1989)ను సీజ్ చేసి అక్కడే ఉన్న భూషన్ త్రిపాఠి, నదీమ్ ఖాన్‌లను అదుపులో తీసుకుని విచారించగా సరుకు షమీ ఉల్లాఖాన్‌కు చెందినదిగా చెప్పారు. దీంతో ఉల్లాఖాన్‌ను ఏ1గా, భూషన్ త్రిపాఠి, నదీమ్‌ఖాన్, పరేష్ రావ్రానిలను ఏ2, ఏ3, ఏ4లుగా చేర్చి కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కాను జైనథ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఏ1, ఏ4లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సంవత్సరకాలంగా దందా సంవత్సరకాలంగా ఫాంహౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా నిల్వ, రవాణా కొనసాగుతున్నట్లు చుట్టుపక్కక రైతులు తెలిపారు. ఇక్కడ తరుచుగా లారీలు, ఐచర్లు, ఇ తర వాహనాలు వస్తూ పోతుంటాయని చెబుతున్నారు. అ యితే ఊరికి దూరంగా, 44వ నంబరు జాతీయ రహదారి కి కూత వేటు దూరంలో ఫాంహౌస్ ఉండటంతో గుట్కా దందా జోరుగా సాగింది. మహారాష్ట్ర సరిహద్దు కూడ పక్కనే ఉండటం ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, తలమడుగు ఇతరాత్ర మండలాలకు ఇక్కడి నుంచి గుట్కా సప్లై చేయడానికి అవకాశం ఉండటంతో అడ్డు అదుపు లేకుండా దందా కొనసాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు దా డి చేయగా, ఫాంహౌస్‌లో భారీ గుట్కా లభించింది. అయితే ఆ ఫాంహౌస్‌లో లోపల మొత్తం బెడ్రూం, హాల్, కిచె న్, బాత్రూంలో సైతం గుట్కా బస్తాలను కుక్కి ఉండటం చూసి పోలీసులు కంగుతిన్నారు. ఇప్పటి వరకు మండలంలో ఇంత పెద్ద ఎత్తున గుట్కా ఎప్పుడు స్వాధీనం కాకపోవడంతో మండలంలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మా రింది. పట్టుబడిన గుట్కా ప్రింట్ విలువ రూ.30లక్షల వ రకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ నిషే ధిత గుట్కా మార్కెట్ విలువ మాత్రం ప్రింట్ రేట్‌కు 3 నుంచి 5 రేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం గుట్కా అమ్మకాలను నిషేధించడంతో వ్యాపారులు రూపాయి విలువ చేసే గుట్కాను రూ.3 నుంచి రూ.5కు అమ్ముతున్నారు. ఈ లెక్కన దీని విలువ సుమారు కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మహారాష్ట్ర పక్కనే ఉండటంతో జైనథ్ మీదుగా జోరుగా గుట్కా దందా కొనసాగుతుందని ఈ ఉదాంతం స్పష్టం చేస్తోంది. చి న్నచిన్న గ్రామాల్లో సైతం ఈ రోజు నిషేధిత గుట్కా విరి విగా లభిస్తుంది. అప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
అదిగో పులి.. నిజమే!
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆదిలాబాద్ శివారు మండలాల్లో గత కొద్ది రోజులుగా పులుల సంచారంపై అలజడి నెలకొన్నా పక్కా ఆధారాలు లభించలేదు. కాని మంగళవారం రాత్రి పులి జైనథ్ మండలం నిరాల వద్ద అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా రోడ్డుపై కారులో వెళ్తున్న వ్యక్తి సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీయడంతో ఇప్పుడు పులులు తిరుగుతున్నాయనేది నిజమైంది. అయితే తాంసి, భీంపూర్ మండలాల్లో సంచరించిన పులుల్లో ఇది ఒకటా..! లేదా మరోటా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా పులుల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కారులోంచి ఫొటో క్లిక్.. సురక్షిత వన ప్రాంతం కోసం వెతుకులాడుతున్న పులులు మధ్యలో ఆదిలాబాద్ శివారు మండలాల్లోని జనవాసాల్లోంచి వెళ్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయటకు వస్తున్న పులులు పెన్‌గంగ నది దాటి వచ్చి ఆవాసం ఏర్పర్చుకునేందుకు అడుగులు వేస్తూ చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలు, పంట పొలాలు, రోడ్లు దాటుతూ వెళ్తున్నాయి. బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన కె.అనిల్ అవాల్పూర్ నుంచి ఆదిలాబాద్‌కు మంగళవారం రాత్రి కారులో వస్తుండగా నిరాల వద్ద రాత్రి 10.40 గంటలకు పులి రోడ్డు దాటుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలోని లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నీళ్లు తాగి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవమో కాదోనన్నది తెలియరాలేదు. తాంసి, భీంపూర్ మండలాల్లో ఆవులు, ఎద్దులపై దాడి జరిగిన సంఘటనలను బట్టి రెండు పులులు సంచరిస్తున్నాయనే వదంతులు వినిపించాయి. తాజాగా జైనథ్ మండలం నిరాలలో రోడ్డు దాటుతూ ఒక పులి కనిపించింది. ఆ మండలంలోని దేవుజీగూడ గ్రామంలో ఎద్దులపై పులి పంజా విసిరింది. అక్కడ దాని అడుగులు కనిపించాయి. ఈ నేపథ్యంలో తాంసి, భీంపూర్‌లో సంచరించిన పులుల్లో ఇదొకటా.. లేనిపక్షంలో ఇది మరొక పులినా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేవుజీగూడలో పులి అడుగు, పులి దాడిలో గాయపడ్డ ఆవు ఆవాస బాట.. పెన్‌గంగకు అవతలి వైపు మహారాష్ట్ర భాగంలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యంలో పులుల పునరుత్పత్తి పెరిగింది. ప్రధానంగా అక్కడ టైగర్ రిజర్వు ప్రాంతంలో 3 గ్రామాలు ఉండగా, ఆ ప్రజలను అక్కడి నుంచి తొలగించి పునరావాసం కల్పించినట్లు ఇక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. పులులకు నీళ్లు, వేట కోసం వన్యప్రాణుల లభ్యత ఉండటం, ప్రశాంత వాతావరణం నేపథ్యంలో ఆడ, మగ పులుల కలయికతో పునరుత్పత్తి పెరిగినట్లు చెబుతున్నారు. అలాగే శాఖహారులైన వన్యప్రాణుల కోసం గడ్డి విత్తనాలు పెంచడం, తద్వారా ఆ వన్యప్రాణులు గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ వన్యప్రాణులు పులులకు ఆహారంగా మారుతాయి. ఇటువంటి అనువైన పరిస్థితుల్లోనే అక్కడ పులుల సంఖ్య పెరగడానికి దోహదపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే తిప్పేశ్వర్ అభయారణ్యం విస్తీర్ణంలో చిన్నది కావడం, ఇటు పులుల సంఖ్య పెరిగిన దృష్ట్యా నిర్దిష్ట ఆవాసం కోసం పులులు తిప్పేశ్వర్ను వీడి మరోప్రాంతం కోసం కదులుతున్నాయి. అవి విస్తీర్ణంలో చాలా పెద్దదైన కవ్వాల్ చేరితే ఈ ప్రాంతంలో వాతావరణ సమతుల్యత ఏర్పడేందుకు దోహద పడతాయని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కవ్వాల్‌లో పులుల సంచారం ఉన్నా స్థిర నివాసం ఏర్పర్చుకోలేదని, ఈ నేపథ్యంలో ఈ పులులు కవ్వాల్ వైపు వెళ్తే మాత్రం వాటికి నిర్దిష్ట ఆవాసానికి సరిపడ వాతావరణం ఉందంటున్నారు. రాత్రి వేళల్లోనే సంచారం పులులు రాత్రి వేళల్లోనే సంచరిస్తాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రతీరోజు సుమారు 20 కిలో మీటర్ల వరకు కదులుతాయని పేర్కొంటున్నారు. పగటి వేళా విశ్రమిస్తుంది. ఒక ప్రత్యేక ప్రాంతంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో కనిపించిన పులి కొద్ది రోజులు ఆ సమీపంలో ఉండి వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే అటవీ శాఖాధికారులు పులుల విషయంలో గోప్యత పాటిస్తున్నారు. అదే సమయంలో వాటికి జనావాసాల సమూహాల్లో ప్రశాంతత వాతావరణం కల్పించడం ద్వారా అభయారణ్యానికి తరలిపోతాయని చెబుతున్నారు. పంట పొలాల చుట్టూ విద్యుత్ వైర్లు అమర్చకుండా చూస్తున్నారు. ప్రధానంగా గ్రామస్తులు భయంతో వాటిని హతమర్చేందుకు ఇలాంటి చర్యలకు దిగే ఆస్కారం ఉందని, ముందు జాగ్రత్తగా అటవీ శాఖాధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తాంసి, భీంపూర్ ప్రాంతాల్లో ఇప్పటికీ బేస్ క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం ఎప్పుడో..?
సాక్షి, జైనథ్: భూముల రిజిస్ట్రేషన్ అంటేనే ఓ పెద్ద తతంగం..దీని కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. ఛలాన్ కట్టడం...సాక్షులను రప్పించడం..ఇలా ఎన్నో ఇబ్బందులు మనం సాధారణంగా చూస్తుంటాం.. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా అధికారుల చేయి తడపందే పనులు జరగవనేవి ఎవరూ కాదనలేని సత్యం.. ఇవన్నీ చేసి పెట్టేందుకు బ్రోకర్‌ను వెతకడం... నేరుగా వెళితే పనులు జరగకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా నానా తంటాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించుకోవడం మరో తలనొప్పిగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మండల కేంద్రాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పిన ప్రభుత్వం దీంట్లో భాగంగానే 2018లో మండల కేంద్రంలో సైతం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దీంతో మండల వాసులు రిజిస్ట్రేషన్ సేవలు ఎప్పుడు ప్రారంభమౌతాయా? అని ఎదురు చూస్తున్నారు. రూ. 6లక్షలతో కార్యాలయంలో వసతులు మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంగా తయారు చేసారు. కొత్తగా నిర్మించిన స్త్రీశక్తి భవనం ఐకేపీకి కేటాయించడంతో ఈ పాత భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసారు. బయట, లోపల రంగులు వేయడంతో పాటు అవసరమైన మేర గదులను తయారు చేస్తున్నారు. ఈ భవనంలో కంప్యూటర్లు, ఇతర పరికరాలకు ఏసీ తప్పనిసరి కావడంతో, ప్రత్యేకంగా కిటికీలు, అద్దాలు బిగించి రెండు ఏసీ యూనిట్లు అమర్చారు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కోసం ప్రత్యేకమైన క్యాబిన్, వినియోగదారుల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేసారు. స్లాబ్ కొంత శిథిలావస్థకు చేరడంతో వాటర్‌ప్రూఫ్ రసాయనాలతో పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. రూ. 6లక్షల ఖర్చుతో ఈ పాత భవనం పూర్తిగా ఆధునిక హంగులతో మెరిసిపోతుండటంతో మండల కేంద్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా ఉండటంతో రాత్రి వేళ మందుబాబులకు అడ్డగా మారింది. భవనం ముందరి భాగంలో వరండా ఉండటంతో రాత్రుళ్లు సిట్టింగ్ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ భవనం చుట్టుపక్కల మందు బాటిళ్లు, డిస్పో గ్లాసులు, ఖాళీ వాటర్ ప్యాకెట్లతో నిండిపోయింది. గంటలోపే మ్యుటేషన్.. మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అందుబాటులోకి వస్తే ఏదైన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన గంటలోపే మ్యుటేషన్ కూడా చేసేలా ఏర్పాటు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మిన వ్యక్తి పట్టపాస్ బుక్ నుంచి భూమి తొలగించి, కొన్న వ్యక్తి పాస్‌బుక్‌లో భూమిని కలపడం పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగిపోతుంది. అక్కడే ఇద్దరికి కొత్త పాస్‌బుక్‌లు కూడా ప్రింట్ తీసి ఇస్తారు. దీంతో ఇరువర్గాల వాళ్లు రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి తీరనుండటంతో పాటు పారదర్శకత పెరిగి, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని చెబుతున్నారు. దీంతో మండల వాసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదు.. ఉన్నత అధికారుల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభానికి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. మండల కేంద్రంలో ఇప్పటికే కార్యాలయం ఏర్పాటు చేశాం. కార్యాలయానికి కావాల్సిన కంప్యూటర్లు, ఏసీ, ఇతరత్ర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కార్యాలయాన్ని ప్రారంభించి, సేవలు మొదలు పెడుతాం. –సత్యనారాయణ యాదవ్, తహసీల్దార్ -
ఆర్మీ జవాన్ ఆత్మహత్య
గుడిహత్నూర్ : జైనథ్ మండలం గూడరాంపూర్ గ్రామానికి చెందిన ఏదుల్ల రవి(25) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఏదుల్ల చంద్రయ్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రవి మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ఈ ఏడాది జూన్ 4న ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన స్వప్నతో వివాహమైంది. త ర్వాత కొన్ని రోజుల నుంచి ఉద్యోగ రీత్యా, పంజాబ్, శ్రీనగర్‌లో ఉంటున్నాడు. 20 రోజుల కిందట సెలవు పెట్టి గూడరాంపూర్‌కు వచ్చిన రవి ఈసారి తన భార్య స్వప్ప కూడా వెంట తీసుకెళ్తానన్నాడు. కానీ దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం భార్యను ఆమె పుట్టింట్లో దించిన రవి ఇంటి నుండి మోటార్ సైకిల్‌పై తన భార్యను తీసుకొని ఆదిలాబాద్‌లోని అత్తవారింట్లో దింపేశాడు. గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది గ్రామ పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారి పక్కనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. మోటారు సైకిల్, పురుగులమందు డబ్బా, ఏటీఎం కార్డు, డబ్బులు లభించాయి. కోడలు కొడుకుతో కాపురానికి వెళ్లనందునే రవి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు రోదించారు.