రోస్బర్గ్కు ఎనిమిదో ‘పోల్'
నేడు జపాన్ గ్రాండ్‌ప్రి
సుజుకా (జపాన్): గత రెండు రేసుల్లో ఆశాజనక ఫలితాలు సాధించలేకపోయిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.506 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఎనిమిదోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించిన రోస్‌బర్గ్ నాలుగుసార్లు విజేతగా నిలిచాడు. క్వాలిఫయింగ్ సెషన్లో ఇతర డ్రైవర్లు హామిల్టన్, బొటాస్, మసా, అలోన్సో, రికియారో, మాగ్నుసెన్, బటన్, వెటెల్, రైకోనెన్, పెరెజ్, క్వియాట్, హుల్కెన్‌బర్గ్, సుటిల్, గుటిరెజ్, గ్రోస్యెన్, ఎరిక్సన్, బియాంచి, కొబయాషి, జీన్ వెర్జెన్, చిల్టన్, మల్డొనాడో వరుసగా 2 నుంచి 22వ స్థానాల్లో నిలిచారు.