క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న అరుణ్ లాల్
కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అరుణ్‌లాల్ దవడ క్యాన్సర్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. జనవరిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్యులు... అరుదైన ప్రమాదకరమైన దవడ క్యాన్సర్‌గా తేల్చారు.
అప్పటినుంచి చికిత్సను కొనసాగిస్తోన్న అరుణ్, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. 60 ఏళ్ల అరుణ్ లాల్ 1982 నుంచి 1989 మధ్యకాలంలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 16 టెస్టులు, 13 వన్డేలు ఆడారు.