సమన్వయంతో వ్యవహరించాలి
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) :
రాష్ట్రంలో 10 లక్షల పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ¯ŒS అన్నారు. రాజమండ్రి బార్ అసోసియేష¯ŒSలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు, బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు అధ్యక్షతన శనివారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేష¯ŒS ఎంతో ప్రఖ్యాతి పొందినదని, అనేకమంది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, కోకా సుబ్బారావువంటి ఉద్దండులు దీని నుంచే ఆవిర్భవించారని కొనియాడారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బార్ అసోసియేష¯ŒS సావనీర్‌ను జస్టిస్ రంగనాథ¯ŒSకు ముప్పాళ్ళ సుబ్బారావు అందజేశారు. అలాగే, వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆ సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తామని జస్టిస్ రంగనాథ¯ŒS హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్‌జీ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రాంబాబు, అసోసియేష¯ŒS కార్యదర్శి పీఆర్ఎస్ మిత్రా, సీనియర్ న్యాయవాదులు ఎం.శేషగిరిరావు, నండూరి సూర్యనారాయణమూర్తి, తవ్వల వీరేంద్రనాథ్, సీహెచ్‌వీ ప్రసాద్, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
యాసిడ్ దాడులు హేయం : జిల్లా జడ్జి తుకారామ్‌జీ
యాసిడ్ దాడులు అత్యంత హేయమైనవని జిల్లా జడ్జి ఎ¯ŒS.తుకారామ్‌జీ అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యాన ‘లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ ఎటాక్స్ స్కీమ్–2016’పై జిల్లా అధికారులకు శనివారం నిర్వహించిన శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడుల నిరోధంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యాసిడ్ దాడులకు ఉపయోగించే పదార్థాలను
నియంత్రించాలి : కలెక్టర్
యాసిడ్ దాడులకు ఉపయోగించే పదార్థాలను నియంత్రించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆ పదార్థాలను బయటి వ్యక్తులకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడులకు పాల్పడినవారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. లీగల్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ ఇ.దామోదర్ మాట్లాడుతూ, లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్ దాడి యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. యాసిడ్ దాడులు బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, కంబోడియా తదితర దేశాల్లో జరుగుతున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్‌లో చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. అదే తరహాలో ఇతర దేశాల్లోనూ చేపట్టాలని సూచించారు. దీనిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపారు. వాటిని పాటిస్తే చాలా వరకూ దాడులను నివారించవచ్చని అన్నారు. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవిధంగా తల్లిదండ్రులు పెంచాలని అన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ, గడచిన పదేళ్లలో 17 యాసిడ్ దాడులకు ప్రయత్నాలు జరిగాయని, వీటిలో ఒక దాడి జరిగిందని, జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అన్నారు. విశాఖపట్నంలోని దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రీదేవి యాసిడ్ దాడుల నివారణపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎల్.వెంకటేశ్వరరావు, సెక్రటరీ పీవీ రాంబాబు, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, వివిధ విభాగాల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.