kadapa mp
-
వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తారనేది అవాస్తవం
కడప (కార్పొరేషన్): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమని పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ దు్రష్పచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహా జనిత కథనం సృష్టికర్త టీడీపీ అని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వాళ్లే పోస్ట్ చేయడం.. ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు, కలి్పతాలతో కథనం రాయించడం, దానిపై చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే ఇలా చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పామని, ఇప్పుడొచ్చి తెలంగాణ సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకకు రూ.1,700 వసూలు చేస్తోందన్నారు. ట్రాక్టర్ ఇసుకను కడప తెచ్చుకునేసరికి రూ.3,500 అవుతోందన్నారు. -
‘మా కుటుంబంలో చీలిక తెచ్చారు’: ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్: తనేంటో తన మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలుసని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో వైఎస్ఆర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘మూడేళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మా కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారు. మాపై ఎంత ద్వేషంతో మాట్లాడుతున్నారో చూడండి. వైఎస్ అవినాష్‌రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఉన్నాం. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. అయినా నేను ప్రజల్లోనే ఉంటా.. ప్రజల కోసం పని చేస్తా. బలిజలకు 31 ఎమ్మెల్యే 5 ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ. బలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మనది. గడచిన 16 నెలలుగా వర్షాలు పడకపోయినా గండికోట, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులను నింపడం వల్లే ప్రస్తుతం రైతులకు సాగునీటికి, ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేదు. గతంలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హామీని విస్మరించింది. చంద్రబాబు నాయుడికి ధైర్యం సరిపోక మళ్లీ కూటమిగా వచ్చి 2014 లో ఇచ్చిన అబద్ధపు హామీలను మళ్లీ ఇస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోతున్నారు’ అని అవినాష్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి.. కర్నూలు జిల్లాలో కూటమికి భారీ షాక్ -
అలుపెరుగని పోరాటం
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా....పార్లమెంటులో ప్రధాని మోదీకి తెలిసొచ్చేలా అనుక్షణం çహోదా నినాదాలతో హోరెత్తించిన ఎంపీలు చివరకు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు హోదా కోసం పార్లమెంటులో పోరు సాగిస్తూనే వచ్చారు. 13 సార్లు నోటీసులు ఇచ్చినా కేంద్రం స్పందించకపోవడం...పైగా పార్లమెంటు దీర్ఘకాలికంగా వాయిదా పడడంతో వెనువెంటనే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు చేరుకుని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. హోదా ఉద్యమ నినాదంతో ఆది నుంచి కూడా ఎంపీలు అలుపెరుగని పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఐదు రోజులు దాటిన ఎంపీల దీక్ష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ భవన్ వద్ద కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు రోజులు దాటింది. ప్రతిరోజు వైద్యులు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కూడా పలుమార్లు వారిరువురు ప్రత్యేక హోదా కోసం అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్ర సమర్పణ, కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వెల్లువెత్తుతున్న సంఘీభావం దిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా ఇప్పటికే వెళ్లి ఇరువురు నేతలను పరామర్శించారు. పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు వెళ్లి నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ పోరాటంలో తాము కూడా ఉంటామంటూ దీక్షలో కూర్చొని మద్దతు తెలియజేస్తున్నారు. -
'బాబు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు'
పులివెందుల: ముఖ్యమంత్రి చంద్రబాబు చేయిస్తున్న పనులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ విజయవాడలో గుళ్లు, గోపురాలు కూల్చివేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని.. ఈ క్రమంలో ఒక్కసారిగా భక్తుల తోపులాట జరిగి 20 మందికి పైగానే చనిపోయారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించడం వారి నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్-1 స్థానాన్ని ఆక్రమించిందంటే ఈ ఘనత చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతున్నా.. అధికార పార్టీ మంత్రులు మాత్రం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు అంతం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించారు. -
దొంతిరెడ్డి నారాయణ రెడ్డిని పరామర్శించిన అవినాశ్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతిరెడ్డి నారాయణరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని నారాణయరెడ్డి నివాసానికి వైఎస్ అవినాశ్‌రెడ్డి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని స్వయంగా నారాయణరెడ్డిని అవినాశ్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నారాయణరెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగివారు అన్న విషయం తెలిసిందే. -
రక్తదాతలను అభినందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
లింగాల (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని లీలావతి చారిటబుల్ ట్రస్ట్ ఆరో వార్షికోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. కొందరు యువకులతో పాటు ఏఎస్పీ అన్బురాజన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులను ఎంపీ అవినాష్ అభినందించారు. కార్యక్రమంలో లీలావతి ట్రస్ట్ చైర్మన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ కలెక్టర్ చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి కుమారుడు నాని పాల్గొన్నారు. -
విష ప్రచారానికి స్వస్తి పలకాలి
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో స్వయాన అధ్యక్షుడే కార్యకర్తలపై దాడికి దిగబడే సంసృ్కతి కొనససాగడం.....కుర్చీలతో సమావేశాల్లో కొట్టుకోవడం లాంటి సంఘటనలు కొదవ లేదని...కానీ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని....అలాంటి వైఎస్సార్ జిల్లాలో ఉన్న నాయకులపై టీడీపీ, కొన్ని పత్రికలు పనిగట్టుకుని విష ప్రచారాన్ని చేస్తున్నాయని, ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సమక్షంలో అమర్నాథ్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే సమావేశానికి రాలేదని కొందరి పేర్లను ఎత్తి చూపుతూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అనారోగ్య కారణంగా సమావేశానికి రాలేక పోతున్నానని...మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా గొంతులో సమస్య ఏర్పడిందని ముందే చెప్పినట్లు అమర్ వెల్లడించారు. అంతేకాకుండా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అమెరికాలో ఉన్న ఫలితంగా రాలేకపోయారని ఆయన వివరించారు. అంతేకాకుండా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సౌత్ ఆఫ్రికాకు వెళ్లారని, ఈ నేపధ్యంలోనే రాలేదని అమర్నాథ్రెడ్డి వివరించారు. చిత్తూరులో కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని మిథున్‌రెడ్డికి సంబంధించిన కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విషయం మీడియాకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగినా పార్టీ మారుతున్నట్లు దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేవలం మైండ్ గేమ్ ఆడుతూ....పార్టీని దెబ్బతీయడానికి కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు వరుస కట్టుకుని టీఆర్ఎస్లో చేరుతుండడంతో అక్కడ టీడీపీ ఖాళీ అవుతోందని ఆయన జోస్యం చెప్పారు., ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి, అల్లుడు జయసింహారెడ్డిలు సమావేశానికి హాజరైనా ఆ మీడియాకు ఎందుకు కనబడలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు వారివారి నియోజకవర్గాల్లో అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ముందుగానే ఆలస్యంగా వస్తామని సమాచారం ఇచ్చారని, ఇంతలోపే టీవీలలో స్కోరింగ్‌లు పెట్టి దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ దయవల్లే పదవి....జీవితాంతం రుణపడి ఉంటా! : జెడ్పీ చైర్మన్ వైఎస్సార్‌జిల్లాలో ఎవ్వరికీ తెలియని తనను ఈరోజు జిల్లాలో ప్రథమ పౌరుడిగా నిలబెట్టి...జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి పదవిని కట్టబెట్టి హోదా కల్పించిన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబం వెంటే నడుస్తానని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి స్పష్టం చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసేందుకు కొన్ని పత్రికలు, నాయకులు అదే పనిగా పనిచేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సమావేశానికి రాలేక పోతున్నానని ముందే అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పినట్లు గూడూరు రవి తెలియజేశారు. జీవితాంతం వైఎస్ కుటుంబం వెంటే తన రాజకీయప్రయాణమని, వార్తను రాసేముందు యాజమాన్యాలు ఆలోచించి ప్రచురించాలని సూచించారు. భారీ వర్షాల రాకతో పంటను విత్తుతున్నానని, అయితే మీడియా చేసిన దుష్ర్పచారంతోనే విత్తనాన్ని సైతం వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీని వదిలిపెట్టి వలస పోతున్నట్లు పత్రికల్లో రాయడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. అమెరికాలో రఘురామిరెడ్డి : కుమారుడు నాగిరెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే, తండ్రి అయిన రఘురామిరెడ్డి అమెరికాకు వెళ్లారని, అందువల్ల సమావేశానికి రాలేక పోయినట్లు కుమారుడు శెట్టిపల్లె నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదని మీడియా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్జగన్ నాయకత్వంపై పూర్తి స్థాయి నమ్మకముందని, ఎప్పుడూ కూడా వైఎస్ కుటుంబం వెంటే నడుస్తానని ఆయన వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, ఏదైనా రాసేముందు ఒకసారి వివరణ తీసుకుంటే బాగుంటుందని ఆయన వివరించారు. -
రేషన్ డీలర్లను తొలగించాలనుకోవడం అమానుషం
పులివెందుల : చిన్న, చిన్న తప్పులను సాకుగా చూపి రేషన్ డీలర్ షిప్‌లను రద్దు చేసే విధంగా అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి కొంతమంది తెచ్చారు. మంగళవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సింహాద్రిపురం మండలంలోని వై.కొత్తపల్లె, పైడిపాలెం, ఇడుపులపాయకు చెందిన రేషన్ డీలర్లు కలిశారు. ఇందుకు స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి రేషన్ డీలర్ల విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయబద్దంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కొంతమంది నిరుద్యోగులు తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరగా.. వారికి లేఖల ద్వారా, ఫోన్ల ద్వారా సిఫార్పు చేశారు. ఇంకా కొంతమంది ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికితేగా.. వాటి పరిష్కారానికి ఆయా అధికారులకు ఫోన్లు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వేల్పుల రామలింగారెడ్డి, కసనూరు పరమేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి
-
'ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేసేందుకు టీడీపీ కుట్ర'
-
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు రణరంగంగా మారింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను పరిశీలించేందుకు వెళ్లిన కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ కౌన్సిలర్లు అవినాష్ రెడ్డి కళ్లల్లో కారం చల్లారు. అవినాష్ రెడ్డికి గాయాలవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశంతో సాయంత్రం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఎస్ఐ సహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి భాష్పాయువు ప్రయోగించారు. -
'ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేసేందుకు టీడీపీ కుట్ర'
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అక్రమాలకు యత్నిస్తోందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శుక్రవారం జమ్మలమడుగులో ఆరోపించారు. తప్పుడు కేసులతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వారు విమర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు ప్రభుత్వ అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఛైర్మన్‌ను ఎన్నుకోనేందుకు తగిన కోరం ఉన్నా ఎన్నికను గురువారం నిర్వహించకుండా శుక్రవారానికి వాయిదా వేయడం దారుణమని అన్నారు. ఈ రోజు ఛైర్మన్ ఎన్నికను అధికారులు పూర్తి చేస్తారని నమ్ముతున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
షర్మిళతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ