Kakatiya Festival
-
రెండో రోజూ ఉత్సాహంగా కాకతీయ వేడుకలు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. పలు వేదికల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఖిలావరంగల్ ఖుషిమహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను వరంగల్ కలెక్టర్ గోపి ప్రారంభించారు. హనుమకొండ అంబేడ్కర్ భవన్లో కాకతీయుల పాలనపై కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ హాజరై పలువురు కవులను సన్మానించారు. చారిత్రక వెయ్యిస్తంభాల గుడి ఆవరణలో కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు అలరించాయి. పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో తృష్ణ నాటకం, చిందుయక్షగానం ప్రదర్శించారు. జనగామలో కాకతీయ ఉత్సవాలను కలెక్టర్ శివలింగయ్య ప్రారంభించారు. పేరిణి నృత్యం, బోనాలు, కోలాటాలు, బతుకమ్మలను ప్రదర్శించారు. ఉత్సవాల్లో తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
కాకతీయ ముగింపు ఉత్సవాలు ప్రారంభం
-
కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు
సాక్షి, హన్మకొండ : కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి వేదికలుగా ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిధుల లేమి కారణంగా కాకతీయ ఉత్సవాలు అరకొరగా సాగుతున్నాయి. ఉత్సవాల నిర్వాహణకు కోటి రూపాయలు విడుదల చేస్తామని గతేడాది ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ. 60 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులన్నీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి. డిసెంబర్లో జరిగే ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిధుల కేటాయించాల్సిందిగా ఇటీవలే జిల్లా కలెక్టర్ కిషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. -
మెగా...దగా
=కేంద్ర మంత్రి చిరంజీవి హామీ ఉత్తిదేనా.. =కనీసం ప్రతిపాదనల జాడే లేదు =మిగతా పర్యాటక ప్రాంతాలకు రెండో విడత నిధులు =ఈ ప్రాంతంపై వివక్షకు ఇదే నిదర్శనం =ముగింపునకు చేరుకున్న కాకతీయ ఉత్సవాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘వరంగల్‌ను రాబోయే సంవత్సరంలోగా మెగా టూరిస్ట్ సర్క్యూట్‌గా గుర్తిస్తాం. భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో ప్రముఖంగా ఉంచుతాం. దీంతో ఎంతో మంది పర్యాటకులు ఇక్కడకు రావడానికి.. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి దోహదపడుతుంది. వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో విశాఖ బీచ్ కారిడర్.. తర్వాత రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో వరంగల్‌కు మెగా సర్క్యూట్‌గా అవకాశం కల్పిస్తాం.’ ఇవీ.. గత ఏడాది డిసెంబర్ 21న కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేసిన బాసలు. ఆయన ఈ హామీ ఇచ్చి... దాదాపు పదకొండు నెలలు కావస్తోంది. ఏడాది పాటు మొక్కుబడిగా సాగిన కాకతీయ ఉత్సవాలు.. ముగించేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ, ఇప్పటికీ మెగా టూరిస్ట్ సర్క్యూట్ ఎక్కడ..? కనీసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయా...? అంటే జిల్లా యంత్రాంగం సైతం ఏం చెప్పలేకపోవడం గమనార్హం. కాకతీయ ఉత్సవాలకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ కిషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మెగా టూరిస్టు సర్క్యూట్‌కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు... ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం ఏమీ పంపించలేదని... టూరిజం విభాగం నుంచి ప్రతిపాదనలు పంపిస్తామని జవాబిచ్చారు. దీంతో వరంగల్‌ను టూరిజం సర్క్యూట్‌గా గుర్తించే ప్రక్రియ ఏ దశలో ఉందో తెలిసిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ కారిడార్‌ను మెగా టూరిస్టు సర్క్యూట్‌గా గుర్తించింది. ఆ ప్రాంత అభివృద్ధికి కేంద్రం తరఫున రూ.45.88 కోట్లు మంజూరు చేసేందుకు ఆ శాఖ మంత్రి చిరంజీవి ఆమోదం తెలిపారు. తొలి విడతగా రూ.3.2 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో గుర్తించిన తిరుపతి, కడప మెగా సర్య్కూట్ ప్రాజెక్టులు అమలు రెండో దశకు చేరింది. వీటికి సైతం మంత్రి చిరంజీవి రెండు నెలల కిందటే నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తిరుపతి ప్రాజెక్టుకు రెండో విడతగా రూ. 13.95 కోట్లు, కడప మెగా ప్రాజెక్టుకు రూ.11.07 కోట్లు మంజూరు చేశారు. తిరుపతి, కాళహస్తి, కాణిపాకంతో పాటు చిత్తూరు జిల్లాలోని వివిధదేవాలయాలు, పరిసర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యంలో గొలుసుకట్టులా నిర్మితమైన కోటలు, దాదాపు 21 దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కడప జిల్లాకు మెగా సర్క్యూట్ మంజూరైంది. కానీ... కాకతీయుల శిల్ప కళా వైభవానికి, కాకతీయ సామ్రాజ్యానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన వరంగల్‌ను ఇప్పటికీ మెగా సర్క్యూట్‌గా గుర్తించకపోవడం ఈ ప్రాంతంపై పాలకుల వివక్షకు అద్దం పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందిన నగరంగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారసత్వంగా చారిత్రకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని మెగా సర్క్యూట్‌గా గుర్తిస్తే కాకతీయుల దేవాలయాలతో పాటు ఆనాటి గొలుసుకట్టు చెరువులన్నీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఉపాధితో పాటు పర్యాటక రంగానికి చేయూతనిచ్చే ఈ ప్రాజెక్టుకు స్వయానా కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా... కనీసం కాగితాలపై ప్రతిపాదనలు సైతం ఇప్పటికీ సిద్ధం కాకపోవడం, రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులకు ఏకంగా రెండో విడత నిధులిచ్చేటప్పుడు కనీసం వరం గల్ ఊసెత్తక పోవడం గమనార్హం. జిల్లా నుంచి కేం ద్ర, రాష్ట్ర కేబినెట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు సైతం ఏడాది పాటుగా కనీసం ఈ హామీని అమలు చేసే దిశగా వీసమెత్తు ప్రయత్నం చేయకపోవడం...చిరంజీవిని కలిసి ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసే చొరవ చూపకపోవడం శోచనీయం. -
రా రమ్మని.. రా రా రమ్మని
ఓరుగల్లుకు పెరిగిన పర్యాటకుల రాక ఈ ఏడు అరకోటి మంది సందర్శన ఏడాదిలో రెట్టింపు సంఖ్యలో తాకిడి సాక్షి, హన్మకొండ : కాకతీయుల చారిత్రక వైభవం తెలుసుకోవడంతోపాటు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పర్యాటకులు వరంగల్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపారు. ఈఏడాది ఇప్పటికే అరకోటి మందికి పైగా పర్యాటకులు జిల్లాకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో 608 మంది విదేశీ టూరిస్టులు ఉండడం విశేషం. మేడారం మహా జాతరను మినహాయిస్తే ఈ స్థాయిలో జిల్లాకు పర్యాటకులు రావడం ఇదే ప్రథమం. కాకతీయ ఉత్సవాల ప్రభావం కాకతీయ రాజుల రాజధాని వరంగల్ . వారి పాలనకు గుర్తుగా ఖిలావరంగల్, వేయిస్తంభాల ఆలయాలతోపాటు కళ్లు చెదిరే శిల్పసంపదకు నెలవైన రామప్ప ఆలయం, గణపురం కోటగుళ్లు వంటి చారిత్రక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. అంతేకాదు... లక్నవరం, పాకాల, గణపసముద్రం, ఏటూరునాగారం అ భయారణ్యం వంటి ప్రకృతి అందాలు జిల్లా సొంతం. అన్నీ ఉన్నప్పటికీ సరైన ప్రచారం లభించక హైదరాబాద్‌తో పో ల్చితే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గతంలో తక్కువగా ఉండేది. అయితే ఇక్కడి చారిత్రక ప్రాంతాలను వరల్డ్ హెరి టేజ్ సైట్స్‌గా గుర్తించాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం 2012 డిసెంబర్లో కాకతీయ ఉత్సవాలను ప్రారంభిం చింది. ఈ నేపథ్యంలో మీడియా సైతం ఓరుగల్లులోని ప ర్యాటక ప్రాంతాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో 2012-13 ఏడాదికి గాను వరంగల్ నగరం బెస్ట్ హెరిటేజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. వీటి ప్రభావంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2012లో జిల్లాకు వచ్చిన పర్యాట కుల సంఖ్య 23,00,000 ఉంది. జిల్లా పర్యాటక శాఖ ఆది వారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2013 జనవరి నుం చి సెప్టెంబర్ వరకు 51,92,266 మంది పర్యాటకులు జి ల్లాను సందర్శించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకు లు 2,27,079 మంది, విదేశీ పర్యాటకులు 608 మంది ఉ న్నారు. ఏడాది కాలంలోనే పర్యాటకుల సంఖ్య రెట్టిం పైం ది. ఈ తొమ్మిది నెలల కాలంలో మార్చిలో అత్యధికంగా 14,18,652 మంది పర్యాటకులు సందర్శించారు. -
సాంస్కృతిక రంగానికి పూర్వవైభవం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : కళలకు ప్రోత్సాహం కరువవుతున్న తరుణంలో కాకతీయ ఉత్సవాల ద్వారా జిల్లాలో కళా, సాంస్కృతిక రంగాలకు పూర్వవైభవం లభిస్తోందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న సంగీత, నృత్య నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రదర్శనలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఓరుగల్లులో కళలకు కొదవలేదని అన్నారు. లలిత కళలు జనజీవితంలో పెనవేసుకుని అన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో కె.వెంకటరమణ, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓలలాడించిన డాక్టర్ శేషులత సంగీత, నృత్య నవరాత్రోత్సవాల్లో భాగంగా డాక్టర్ కె.శేషులత శాస్త్రీయ సంగీతంప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది. శష్ముఖ ప్రియ రాగంలో సిద్ది వినాయకం అనే ముత్తుస్వామి దీక్షతార్ కృతితో శేషులత తన గాత్రాన్ని ప్రారంభించారు. అనంతరం, హేమగిరి తనయో హేమలత్ అంచశుద్ద ధన్యాసి రాగంలో త్యాగరాజ కృతి, బంటురీతి కొలువు అనే కృతిని హంసపద రాగంలోనూ, నగుమోము అనే త్యాగరాయ కీర్తన అభేది రాగంలో ఇలా దాదాపు గంటన్నరపాటు తన శాస్త్రీయ సంగీత కార్యక్రమం జరిగింది. శేషులత గానానికి మృదంగం జయభాస్కర్, వయోలిన్ నందకుమార్, ఘఠంపై రవికుమార్ వాద్య సహకారం అందించారు. అనంతరం జయాపసేనాని నృత్యాలయం, చాతరాజు నవ్యజ బృందం చేసిన ఆలయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో పీవీ.మదన్మోహన్ పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు.. గురువారం సాయంత్రం 6 గంటలకు వద్దిరాజు నివేదిత శిష్య బృందంచే శాస్త్రీయ సంగీతం, హైదరాబాద్‌కు చెందిన ఎం.సురేంద్రనాథ్ బృందంచే కూచిపూడి నృత్యప్రదర్శన ఉంటాయి. అలాగే వరంగల్ కాకతీయ కళాక్షేత్రం వెంపటి నాగేశ్వరి బృందంచే శాస్త్రీయ నృత్యాలుంటాయని జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ కె.వెంకటరమణ తెలిపారు. -
కాకతీయుల చరిత్రపై సెమినార్లు
గణపురం, న్యూస్‌లైన్ : కాకతీయుల చరిత్రను ప్రపంచానికి తెలియజేయడానికే ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పౌర సంబంధాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం(కోటగుళ్లు)లో మూడు రోజులపాటు జరిగిన కాకతీయ ఉత్సవాలు గురువా రం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకతీయుల పాలనలో దేవాలయాలు, భారీ నీటి వనరులు, గొలుసు కట్టు చెరువులను తవ్వించారని చెప్పారు. ఈ నీటి వనరులు నేటికీ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ప్రపంచ బ్యాంక్ నిధుల తో జిల్లాలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేయించిన ట్లు చెప్పారు. కాకతీయుల చరిత్ర, పాలనపై జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహిస్తామని, గణపేశ్వరాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గణపేశ్వరాలయా న్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. కాకతీయ ఉత్సవాలకు గుర్తుగా గణపేశ్వరాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు మంత్రిత్వశాఖ దేవాలయానికి మంజూరు చేసిన రూ.2కోట్ల 70లక్షల నిధుల నుంచి ఆర్చి నిర్మిస్తామని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య చెప్పారు. ఆలయ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూ రు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్లో చివరి వారంలో ముగింపు ఉత్సవాలు : కలెక్టర్ కిషన్ కాకతీయ ముగింపు ఉత్సవాలు డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఉంటాయని కలెక్టర్ కిషన్ తెలిపారు. అక్టోబర్ 2న ఇంటాక్ ఆధ్వర్యంలో రాణి రుద్రమదేవి మహిళా సాధికారత సదస్సు, 5, 6 తేదీల్లో యువజన ఉత్సవాలు, 25, 26 తేదీల్లో ‘కాకతీయ చరిత్ర-కళలు-కట్టడాలు’ అనే అంశంపై కాకతీ య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఇరిగేష న్, టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్ అనే అంశంపై ఎన్ఐటీ ఇం టాక్ ఆధ్వర్యంలో సదస్సు, నవంబర్ 14న కాకతీయ బాలల సృజనోత్సవాలు, డిసెంబర్13, 14 తేదీల్లో రాక్ రిస్టోరేషన్‌పై సెమినార్ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. దేవాలయాలను పరిరక్షించుకోవాలి : డీఐజీ కాంతారావు కాకతీయులనాటి దేవాలయాలను పరిరక్షించుకుని భావితరాలవారికి అందించవలసిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందని డీఐజీ కాంతారావు అన్నారు. కాకతీయుల కాలం స్వర్ణయుగమని, భక్తి కోసం దేవాలయాలను నిర్మించి కాకతీయులు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. కోటగుళ్లలో ముగిసిన కాకతీయ ఉత్సవాలు మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం(కోటగుళ్లు)లో ఈనెల 24 నుంచి నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు గురువారం విజయవంతంగా ముగిసాయి. కాకతీయ సామ్రాజ్యానికి 930 ఏళ్లు, రామప్పగుడి నిర్మాణం జరిగి 800 ఏళ్లు, రాణి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి 750 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు జిల్లాలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొద టి, రెండు విడుతల్లో కోటగుళ్లలో ఉత్సవాలకు అవకాశం లభించకపోయినా ఈ మూడు రోజులు ఉత్సవాలు అంగరం గ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో కనిపించని జిల్లా మంత్రులు కోటగుళ్లలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకతీయ ఉత్సవాల్లో జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య మూడు రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా హాజరు కాకపోవడంపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది. సొంత జిల్లాలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొనకపోవడం దురదృష్టకరమని పలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. -
రేపటి నుంచే కాకతీయం
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల కొనసాగింపులో భాగంగా ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2కే రన్‌తో ఉత్సవాలు ప్రారంభించామని చెప్పారు. మూడు రోజులపాటు గణపురం కోటగుళ్లలో 300 మంది కళాకారులతో 30 బృందాలుగా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయని వివరించారు. 27న హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌లో కాకతీయుల చరిత్ర,సంస్కృతిని ప్రంచస్థాయికి తెలిపే విధంగా జాతీయస్థాయిలో సెమినార్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సెమినార్‌కు కాకతీయుల చరిత్రపై పరిశోధనలు చేసిన వారందరినీ ఆహ్వానిస్తామన్నారు. కాకతీయుల ఇరిగేషన్ టెక్నాలజీని చాటిచెప్పేలా ఆ కాలంనాటి గొలుసు చెరువులు, కట్టడాలపై ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. ఎన్ఐటీ హైడ్రాలజీ విభాగం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో కాకతీయ చరిత్రకు సంబంధించిన సావనీర్‌ను విడుదల చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇన్టాక్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో నిధుల కొరత ఉన్న విషయం వాస్తమేనని... ప్రస్తుతం కొంత మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నిధులు విడుదల జేయూలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గత ఉత్సవాల సందర్భంగా కళాకారులకు బకాయిపడ్డ మొత్తం చెల్లింపుల కోసం ప్రస్తుతం రూ. 30 లక్షలు వచ్చాయన్నారు. సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వేయిస్తంభాల దేవాలయం పనులు వచ్చే ఏడాది జూన్ నాటిని పూర్తవుతాయన్నారు. జిల్లాలో దేవాలయాల పురుద్ధరణకు రూ. 20 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. షెడ్యూల్ ఇదే... 24వ తేదీ... -సాయిబాబా గుడినుంచి కోటగుళ్ల వరకు కళాకారుల ర్యాలీ -వరంగల్లు జయాపసేని పేరిణి నృత్యాలయం వారి పేరిణి నృత్యం -చుక్కసత్తయ్య బృందం శివసత్తుల ప్రదర్శన -రాజేష్‌ఖన్నా బృందం కాకతీయ -కళాతోరణం నృత్యరూపకం -వెంకట్రాం నాయక్ జానపద నృత్యం -కన్నా సాంబయ్య బుర్రకథ 25వ తేదీన... -వెంపటి నాగేశ్వరి బృందం కూచిపూడి నృత్యం -ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయగిరిజన నృత్యం -శ్రీలలితా సంగీత నృత్య పాఠశాల భక్తపోతన శాస్త్రీయ నృత్యరూపకం -గడ్డం సారయ్య బృందం చిందుయక్ష గానం -స్వర్ణభారతి గణపురం వారి నృత్యప్రదర్శనలు -జిల్లా జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జానపద కార్యక్రమాలు 26వ తేదీన... -సుధీర్‌రావు శ్రీ శివానంద నృత్యమాల బృందం శాస్త్రీయ నృత్యాలు -అంజయ్య బృందం ఒగ్గుకథ -ఆజ్మీరా గోవింద్‌నాయక్ బృందం బంజారా నృత్యం -రహీమొద్దీన్ బృందం జానపద నృత్యం -పోరిక శ్యాం బృందం ధీంసా కోయ నృత్యం -గణపురం శ్రీసాయి జానపద కోలాట బృందం ప్రదర్శన -ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నృత్యం -మార్తరవి ఇంద్రజాల ప్రదర్శన -నారగోని విశ్వనాథ బృందం బుర్రకథ ప్రదర్శన