kamesh
-
మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. కామేష్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు గమ్మెల కామేష్ అలియాస్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాలికొండ ఏరియా కమిటీలో హరి కీలకంగా వ్యవహరించేవారు. దీంతో హరిపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా అతనిపై రూ. 4లక్షల రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో హరి ప్రధాన నిందితుడు. హరి అరెస్ట్ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ.. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని పేర్కొన్నారు. ముగిసిన వారోత్సవాలు ఖమ్మం(చర్ల): మావోయిస్టు వారోత్సవాలు, బంద్ పిలుపుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో సుమారు రెండు వారాల పాటు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. వారోత్సవాలు ముగియడంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముగించుకొని బలగాలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు పలు ధపాలుగా దండకారణ్యంలోకి వెళ్లాయి. మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు బలగాలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించాయి. వారోత్సవాలు ముగిసినందున అడవులను విడిచి బలగాలు వస్తున్నాయనే సమాచారంతో సరిహద్దు ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క మావోయిస్టులు, మరో పక్క బలగాలతో సరిహద్దులోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు.. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాలు అట్టుడికాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సరిహద్దులో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు, చర్ల మండలంలోని పూసుగుప్ప సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు, చెన్నాపురం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పోలీసులు మందు పాతరలను వెలికి తీయడం.. వాటిని నిర్వీర్యం చేయడం, మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేసి రహదార్లను పేల్చివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల్లో గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన ఓ సబ్ఇన్స్పెక్టర్ తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి.. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి మృతి చెందాడు. -
పాడి సొమ్ము పక్కదారి
పాల సేకరణ ప్రోత్సాహకంలో అక్రమాలు (బొల్లోజు రవి) రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రోత్సాహకం’ పక్కదారి పడుతోంది.. ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్ర డెయిరీ సమాఖ్య (విజయ డెయిరీ) ప్రైవేటు డెయిరీల నిర్వాహకులకు, దళారులకు కొమ్ముకాస్తోంది.. పాల సేకరణపై రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున చెల్లించాల్సిన ప్రోత్సాహకం వ్యాపారులు, అధికారుల జేబుల్లోకి వెళుతోంది. పలు ప్రైవేటు డెయిరీలు, దళారులు పాల ధర తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ.. విజయ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. అధికారులు కమీషన్లు పుచ్చుకుని ఆ పాలను సేకరిస్తున్నారు. మొత్తంగా సాధారణ పాడి రైతుల నుంచి పాల సేకరణను గాలికి వదిలేసి, వారి నోట్లో మట్టికొడుతున్నారు. ఈ అవకతవకల్లో దాదాపు రూ. 10 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రైవేటు డెయిరీల నుంచి పాలు సేకరిస్తున్న ఈ అధికారులే.. రైతులకు ప్రకటించిన ప్రోత్సాహకంతో పాల సేకరణ నాలుగు రెట్లు పెరిగిందంటూ గొప్పలు చెప్పుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధి ఒకరు దీనికి వంతపాడుతుండటం విమర్శలకు తావిస్తోంది. రైతులను ఆదుకొనేందుకు.. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తూ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు పాడిని ప్రత్యామ్నాయంగా మలుచుకుంటున్నందున.. వారిని ఆదుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ సేకరణ ధర లీటరుకు రూ.24కు అదనంగా మరో రూ. 4 చొప్పున చెల్లిస్తున్నారు. అంటే మొత్తంగా లీటరుకు రూ.28 ఇస్తున్నారు. ఈ ప్రోత్సాహకం అమల్లోకి రావడానికి ముందు గతేడాది అక్టోబర్ నెలలో విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. కానీ ‘ప్రోత్సాహకం’ అమల్లోకి వచ్చాక నెలవారీ పాల సేకరణ భారీగా పెరిగిపోతూ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సేకరించిన పాలు 5.27 లక్షల లీట ర్లు కావడం గమనార్హం. ఏడాదిలోనే నాలుగు రెట్లకు పైగా పెరిగింది. దీనికి కారణం ప్రైవే టు డెయిరీలు, దళారులు, బినామీదారులు విజయ డెయిరీకి పాలు సరఫరా చేయడమే. పక్క రాష్ట్రాల నుంచి సేకరిస్తూ.. ప్రస్తుతం విజయ డెయిరీ అధికారులు నెలకు 5.27 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. అందులో ప్రైవేటు డెయిరీల నుంచే దాదాపు 75 వేల నుంచి లక్ష లీటర్ల వరకు, మరో లక్షన్నర లీటర్లను దళారులు, బినామీదారుల నుంచి సేకరిస్తున్నారు. ఈ దళారులు, వ్యాపారులు కూడా రాష్ట్ర రైతులను కాదని.. పక్క రాష్ట్రాల రైతుల నుంచి పాలను కొనుగోలు చేసుకుని వచ్చి విజయ డెయిరీకి ఇస్తున్నారు. అసలు కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు లీటరు పాలకు రూ.18 ను మాత్రమే రైతులకు చెల్లిస్తున్నాయి. అదే విజయ డెయిరీ రూ. 4 ప్రోత్సాహకంతో కలిపి రూ. 28 చెల్లిస్తోంది. లీటరుకు రూ. 10 తేడా ఉండటంతో ఆ రాష్ట్రాల నుంచి రూ. 18 చొప్పున సేకరించి, రూ. 28 ధరకు విజయ డెయిరీకి విక్రయిస్తున్నారు. అయితే ఇలా పక్క రాష్ట్రాల నుంచి సేకరించిన పాలను తీసుకోవడం, రూ.కోట్ల విలువైన సొంత ఫారాలు నడుపుతున్న వ్యాపారులకు కూడా రూ. 4 ప్రోత్సాహకం ఇవ్వడం వెనుక లాలూచీ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అవకతవకలు ఏప్రిల్ నుంచి సరిత, ఎంఎన్ఆర్, ధరణి, లక్ష్మీనరసింహ డెయిరీ ఫారాలు, జూన్ నుంచి డెక్కన్ ఆగ్రో, కపిల డెయిరీలు, ఆగస్టు నుంచి సిరి డెయిరీ పాలను ‘విజయ’కు విక్రయిస్తున్నాయి. అంటే ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించిన త ర్వాతే వీరంతా విజయ డెయిరీతో ఒప్పం దాలు చేసుకున్నారని స్పష్టమవుతోంది. ఈ ఏడాది కాలంలో ప్రోత్సాహకం కింద విజ య డెయిరీ రూ. 42 కోట్లు చెల్లించగా.. అందులో దాదాపు రూ. 5 కోట్లు ప్రైవేటు డెయిరీల చేతుల్లోకి, మరో రూ. 5 కోట్ల వరకు దళారులు, బినామీదారుల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనా. విచిత్రమేమంటే ప్రైవేటు డెయిరీలకు రూ. 4 ప్రోత్సాహకంతోపాటు నిర్వహణ, రవాణా ఖర్చుల కిం ద రూ. 4 నుంచి రూ. 5 వరకు కూడా చెల్లిస్తున్నారు. సొంత పాల సేకరణ కేంద్రాల నిర్వహణకు ఇచ్చే సొమ్మును కూడా ప్రైవే టు డెయిరీలకు ఇవ్వడంపై వి మర్శలు వస్తున్నాయి. మొత్తంగా రూ. 10 కోట్ల వర కు పక్కదారి పట్టినట్లు తెలుస్తోం ది. ఇక రైతులకు బిల్లుల సొమ్ము చెల్లించడానికి 15 నుంచి 20 రోజులు తీసుకుంటున్న విజయ డెయిరీ... కొన్ని ప్రైవేటు డెయిరీలకు రోజువారీగా చెల్లిస్తుండటం గమనార్హం. జీవోలో రైతులకే అని ఉంది.. కానీ.. ‘‘ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో రైతులకే రూ. 4 ప్రోత్సాహకం చెల్లించాలన్న నిబంధన ఉంది. మేం పాలు సేకరిస్తున్న ఇతర డెయిరీలన్నీ కూడా సొంతంగా ఫారా లు పెట్టుకొని నడిపిస్తున్నాయి. వాటిల్లో ఒక్కోదానిలో వంద నుంచి 800 వరకు గేదెలున్నాయి. ఈ డెయిరీల నుంచి సేకరించకూడదన్న నిబంధనలేమీ లేవు. విజయ డెయిరీకి పాలను సేకరించాలంటే ఇది తప్పదు. ఆ డెయిరీలేవీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి పాలను సేకరించడం లేదు..’’ - కామేష్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ -
గుర్రు..వు
భయం నుంచి వచ్చేది నిస్పృహ... నిస్పృహ పెంచేది అచేతనం. గౌరవం నుంచి పుట్టేది భక్తి... భక్తి నుంచి పెరిగేది శ్రద్ధ. స్కూలు పిల్లలకు కావలసింది టీచర్లంటే భయం కాదు... భక్తి. చదువులపై అనాసక్తి కాదు... శ్రద్ధ. రోజూ స్కూలుకు వెళ్లాలనిపించే చదువులు... రోజూ చదువుకోవాలనిపించే స్కూళ్లు. తల్లిదండ్రులను మించిన దైవం గురువు అంటారు. శిక్షకు, శిక్షణకు తేడా తెలియనివారు గురువులెలా అవుతారు? దైవం ఎలా అవుతారు? దండించకుండానే మార్పు తేవచ్చు - పోటీని తట్టుకోవాలంటే పిల్లలు చదువులో ముందుండాలి. వారు మనసుపెట్టి చదువుకోవాలంటే పాఠశాల వాతావరణమూ బాగుండాలి. - పిల్లలను ప్రశంసించడం నేర్చుకోండి. ఎంత చిన్న ఘనత సాధించినా చిన్న చిన్న కానుకలు ఇస్తూ విద్యార్థుల అభివృద్ధికి మైలురాళ్లు వేయండి. - తప్పులు చేయడం సహజం. వాటిని దిద్దుకున్న మేధావుల గురించి చెప్పండి. ఇలా దండన అవసరం లేకుండానే చదువు చెప్పవచ్చు. - విద్యార్థి తప్పు చేస్తే దాన్ని నలుగురి ముందు ఫోకస్ చేయకండి. అలాగని ‘నాకెందుకు’ అని వదిలేయకుండా సరిదిద్దండి. మీపై గౌరవం పెరుగుతుంది. - అస్సలు చదవని పిల్లవాడినైనా ‘బాగా చదవగలవు’ అనే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండండి. - శారీరక, మానసిక దండన అనేది పిల్లలను స్కూల్ నుండి, నేర్చుకోవడం నుండి దూరం చేస్తుందని గమనించండి. కిందటి విద్యా సంవత్సరం: పిఠాపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో లెక్కల టీచర్ విచక్షణ కోల్పోయి విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. ఐదవ తరగతి చదువుతున్న కామేష్ అనే విద్యార్థి తలపై ఆ టీచర్ కర్రతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమై, ఆసుపత్రి పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతున్న ఇస్మాయిల్ తరగతి గదిలో స్నేహితులతో మాట్లాడుతుండగా టీచరమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. పనిష్మెంటుగా అతడిని స్కూల్ నాలుగు అంతస్తులలోని అన్ని తరగతులకు తిప్పి, గుంజీలు తీయించింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఇస్మాయిల్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖపట్టణంలోని ఓ మాంటిస్సోరి స్కూల్లో సూర్యతేజ, దిలీప్‌కుమార్ అనే ఐదవ తరగతి విద్యార్థులు హోమ్‌వర్క్ చేసుకురాలేదని టీచర్ మూడుగంటల పాటు వాళ్ల బట్టలు విప్పించి, ఎండలో నిలబెట్టింది. ఈ నాలుగు సంఘటనలే కాదు... బడికి ఆలస్యంగా వచ్చాడనే కోపంతో ఒక టీచర్, హోంవర్క్ చేయలేదన్న కారణంతో మరో టీచర్, డిక్టేషన్ సరిగా రాయలేదన్న చిరాకుతో ఇంకో టీచర్, క్లాస్ రూములో గుసగుసలు చెప్పుకుంటున్నందుకు ఇంకో టీచర్, జుత్తు సరిగ్గా దువ్వుకోనందుకు, దుస్తులు సరిగా వేసుకోనందుకు, బ్యాడ్జీ పెట్టుకోనందుకు, బాక్స్‌లో అన్నం పూర్తిగా తిననందుకు.. ఇలా ఏదో ఒక కారణంతో స్కూల్లో టీచర్ల చేత దెబ్బలు తినని పిల్లలు లేరు. మానసిక హింస టీచర్లు విధించే ఇలాంటి చాలా శిక్షలు స్కూల్ గేట్ దాటి బయటపడవు. అందులోనూ మానసిక వేధింపుల శిక్షలైతే ఎప్పటికీ బయటపడవు. ‘పాఠశాలల్లో మానసిక వేధింపులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి’ అంటున్నారు సైకాలజిస్టులు. 8వ తరగతి చదువుతున్న పూర్ణిమ ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది. అకస్మాత్తుగా నవ్వడమే మర్చిపోయింది. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ‘నువ్వు నవ్వితే అసహ్యంగా’ ఉంటుందని తిట్టాడట టీచర్. నవ్వడమే తప్పు అన్న భావనలోనే ఆ అమ్మాయి కొన్నేళ్లుగా ఉండిపోయింది. అంతేకాదు శారీరక లోపాలను, ప్రవర్తనను, చదువులో వెనుకబాటుతనాన్ని కారణంగా చూపుతూ విద్యార్థులను తోటి విద్యార్థుల ముందు అవమానించడం అతి పెద్ద హింస’ అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఒంటిమీద కన్నా మనసు మీద పడిన దెబ్బ తాలూకు గాయం అతి పెద్దది. అది పిల్లల్లో ఆ టీచర్ పట్ల, ఆ టీచర్ చెప్పే చదువు పట్ల ఏహ్యభావనకు దారి తీస్తుంది. మీరూ టీచరేనా? అయితే... సర్వేపల్లి రాధాకృష్ణ, రవీంద్రనాథ్ టాగూర్, సావిత్రీబాయి పూలే... ఇలా ఎంతో మంది టీచర్ల గురించి నేటికీ గొప్పగా చెప్పుకుంటున్నాం. వారిలా రేపటి తరం మనసుల్లో తమ అభిమాన టీచర్ ఓ రోల్‌మోడల్‌గా మీరూ కొలువుదీరాలి. - విద్యార్థులు టీచర్నే ప్రధానంగా గమనిస్తారు. మీరు క్రమశిక్షణతో నడుచుకుంటే మిమ్మల్ని అనుసరించే విద్యార్థులు తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకునే శక్తిని పెంచుకోగలరు. - శుభ్రమైన డ్రెస్, హుందాగా నడక.. మీ పూర్తి ఆహార్యమూ చూడ్డానికి బాగుండాలి. - ఇటీవల కాలంలో టీచర్- స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. అందుకని రెగ్యులర్ టైమ్‌లో కుదరకపోయినా, స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పిల్లల కోసం సమయం కేటాయించండి. పాఠ్యాంశాలు బోధించడానికి కాదు ఓ చిన్న కథతోనో, వారి సమస్యలు వినడం వల్లనో ఆకట్టుకోండి. - ‘టీచర్‌కి అన్నీ తెలుసు’ అని మాత్రమే కాదు ‘నా గురించి మా టీచర్‌కు అన్నీ తెలుసు’ అని పిల్లవాడికి నమ్మకం కుదిరితే, కుదురుగా మీరు చెప్పింది తప్పక వింటాడు. - టీచర్‌పై అభిమానం పెంచుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తన మార్గానికి సోపానంగా నిలిచిన వారికి ఎప్పుడూ అభివాదం చేస్తూనే ఉంటాడు. ముందుతరాలకూ ఆ టీచర్ గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాడు. విద్యార్థి తన జీవితకాలపు ‘వరం’గా ఉపాధ్యాయుడు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం నేడు తప్పనిసరి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి యాక్షన్ తీసుకుంటాం శిక్షణ పొందిన టీచర్లే బడిలో ఉండాలి కానీ, శిక్షలను అమలు చేసేవారు కాదు. ఏ పాఠశాల అయినా అర్హత కలిగిన టీచర్లనే నియమించుకోవాలి. పిల్లలను శిక్షించే టీచర్‌కు సంబంధించిన సమాచారం రుజువులతో సహా ఉంటే, సదరు టీచర్‌ను తొలగించమని ఆ స్కూల్కునోటీసులు ఇస్తాం. సరైన యాక్షన్ తీసుకుంటాం. - ఆర్.పి.సిసోడియా, ఐ.ఎ.ఎస్, ప్రభుత్వ కార్యదర్శి, విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ సహనం తప్పనిసరి.... శిక్షలు అమలు చేసే టీచర్ల పట్ల బాలల హక్కు చట్టం ప్రకారమే కాకుండా శాఖాపరమైన చర్యలంటూ ఉంటాయి. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రవైట్ స్కూళ్ల తనిఖీ చేయడం మా విధి. పిల్లలను శిక్షిస్తున్నారని నిర్ధారణ అయితే ప్రాధమిక నివేదక ఆధారంగా తొలత ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాం. - కొల్లి తవిటినాయుడు, ఎంఈఓ, భోగాపురం మండలం, విజయనగరం. నిశితంగా గమనించాలి తల్లిదండ్రులతో ‘తరగతి గదిలో మీ అబ్బాయి/అమ్మాయి మిస్‌బిహేవ్’ చేస్తున్నారు అనే కంప్లైంటు చేస్తుంటారు టీచర్లు. పిల్లల ప్రతి ప్రవర్తనకు ఒక కారణం ఉంటుంది. వారిలో అల్లరినే కాదు, ఏదైనా అటెన్షన్ డిజార్డర్ ఉందా, అకడమిక్‌లో లోపమా... అనేది కూడా చూడాలి. ప్రవర్తనలో లోపాన్ని మూలం నుంచి మార్చుకురావాలి కానీ, శిక్షల వల్లకాదు. - డా.గీతాచల్లా, సైకాలజిస్ట్ అనుబంధం బలపడుతుంది అర్హత కలిగిన టీచర్లనే ఎంపిక చేస్తాం. వారానికి ఒకసారైనా విద్యార్థులకు జీవనైపుణ్యాలను సంబంధించిన తరగతులను నిర్వహిస్తాం కాబట్టి, టీచర్‌కి-స్టూడెంట్‌కి మధ్య అనుబంధం బలపడుతుంది. దీంతో దండన అనే సమస్యే లేదు. ఈ తరహా పద్ధతి వల్ల విద్యార్థుల ప్రవర్తనలో మంచి మార్పులు చూస్తున్నాం. - జయంతి వెంకటరామన్, ప్రిన్సిపల్, సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్ -
ఎన్టీపీసీలో పేలిన పైప్‌లైన్, కార్మికుడి మృతి
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు కామేష్ మృతి చెందాడు. ఎన్టీపీసీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైప్‌లైన్ పేలటంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కామేష్‌ను టార్గెట్ చేసింది ఏవరు?