kanaka reddy
-
కనకారెడ్డికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: అవయవమార్పిడి ద్వారా గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న కనకారెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 2న గ్రీన్ చానెల్ సాయంతో ఎల్బీ నగర్ కామినేనిలో బ్రెయిన్‌డెడ్ అయిన దాత గుండెను తెచ్చి మరో వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సోమవారం మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్ ద్వారా అవయవాలను తరలించడం ప్రపంచంలో ఇదే మొదటిసారన్నారు. 8గంటల పాటు గుండె మార్పిడి జరిగిందని, ప్రస్తుతం కనకారెడ్డి ఆరోగ్యంగా ఉన్నా రని తెలిపారు. ఈ సర్జరీ జరగడానికి జీవన్దాత ఆర్గనైజేషన్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇలాంటి సర్జరీల్లో 75శాతమే సక్సెస్ రేటు ఉంటుందని, ఇప్పటి వరకు నగరంలో 60 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరగ్గా అందులో 42 అపోలో హాస్పిటల్లోనే జరిగా యన్నారు. అవయవదానం చేసిన రైతు నర్సిరెడ్డి కుటుంబానికి తగిన సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గోఖలే కోరారు. నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ... గత సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో 25 సార్లు గ్రీన్ చానెల్‌ను ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లోనూ పోలీస్ వ్యవస్థ నుంచి సహకారం అందిస్తా మన్నారు. చికిత్స జరిగిన 2 రోజుల వరకు తనకు ఏ విషయం తెలియదని, దేవుడిలా డాక్టర్లు తనకు పునర్జన్మనిచ్చారని కనకారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గుండె దానం చేసిన రైతు కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.హరిప్రసాద్, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో సీఈవో అనిల్‌కుమార్, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన అపోలో బృందం పాల్గొన్నారు. చదవండి: (హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు) -
కనకారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
-
మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి (68) మృతిచెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం కన్నుమూశారు. కనకారెడ్డి 2014లో మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. 2008లో తొలిసారి ప్రజారాజ్యంలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం 2013లో టీఆర్ఎస్లో చేరి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1951లో సికింద్రాబాద్‌లో జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటల సంతాపం మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేగా కనకారెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు. కనకారెడ్డి మృతిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషనన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. -
కనకారెడ్డి, సుధీర్‌రెడ్డికి ‘ఎమ్మెల్సీ’ అభయం
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటించని నియోజకవర్గాల్లో పరిస్థితి అంత సులువుగా దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి, మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ హన్మంతరావుకు ఖరారు చేస్తూ.. తాజా మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తామంటూ పంపిన రాయబారం ఫలించేలా లేదు. తొమ్మిదో తేదీ అనంతరం రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈలోగా మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ తదితర స్థానాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి ఖరారు చేసి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో మల్లారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించినా.. నియోకవర్గంలో అందరిమధ్యా సయోధ్య కుదిరే వరకు ప్రచారం చేయవద్దని సూచించి ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి స్వయంగా సుధీర్‌రెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే, తాను కేసీఆర్‌ను కలిసిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుధీర్‌రెడ్డి అసంతృప్తినిగానే వెనుదిరిగినట్లు తెలిసింది. మరోవైపు మల్కాజిగిరిని మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేసి ఈ మేరకు ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. తొలుత తన కోడలు విజయశాంతికి టికెట్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నేతలు హామీ ఇచ్చినా ఆయన శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. ముషీరాబాద్, ఖైరతాబాద్‌లో ఢీ అంటే ఢీ నగరంలోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు గురువారం సాయంత్రం లీక్ ఇచ్చాయి. అయితే, ముషిరాబాద్లో తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని, వీలుకాకపోతే తానే పోటీ చేస్తానని హోంమంత్రి నాయిని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ మాత్రం ముఠా గోపాల్ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో నాయిని వైఖరి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది. ఖైరతాబాద్ నియోకజవర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును దాదాపు ఖరారు చేశారన్న వార్తల నేపథ్యంలో బుధవారం పార్టీ నాయకులు పి.విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అభ్యర్థిని ఎవరినీ ఖరారు చేయలేదని, మీరు తొందరపడవద్దని వారించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రానికి తనకు టికెట్ ఖరారైందని దానం సన్నిహితులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న విజయారెడ్డి.. దానం నాగేందర్‌ను ఎలాగైనా ఢీ కొట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. గోషామహల్ స్థానాన్ని ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు కేటాయించే అవకాశం ఉంది. -
24న భూ నిర్వాసితుల సంఘీభావ సదస్సు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న భూ నిర్వాసితుల సంఘీభావ రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు భూనిర్వాసిత సంఘీభావ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ పిన్నింటి కనకరెడ్డి తెలిపారు. స్థానిక రామకృష్ణాపురంలోని సాహిత్య మండలిలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో ముఖ్యంగా విస్తరణ పేరుతో ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూమిని లాక్కోవడం, గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా వారిని నిర్వాసితులను చేస్తూ, గిరిజన చట్టాలను తుంగలో తొక్కి వేలాది ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించడం, తీరప్రాంత మత్స్యకారుల జీవన శైలిని దెబ్బతీస్తున్న ప్రభుత్వ విధానాలపై చర్చ జరుగుతుతుందన్నారు. విజయవాడలో జరిగే సదస్సుకు తమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వై.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిస్తారని, ఈ సదస్సులో పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజా కళామండలి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం 24న జరిగే సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వై.వెంకటేశ్వర్లు, దేపాటి శివప్రసాద్, మెరుపు జ్ఞానరాజు, కొయ్యా అశ్విరెడ్డి, తాడి నగేష్, ఎం.రామకృష్ణ, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.