kartik
-
విదేశీ యువతులు.. తెలుగింటి కోడళ్లు..
ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం. ►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. (టేలర్ డయానా – అభినయ్‌రెడ్డి) ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్‌లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్‌రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి.. (హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్) ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్ల్యాబ్లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్లోకొత్తకాపురం మొదలుపెట్టారు. ►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి.. (కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్) మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్‌కు, మయన్మార్‌కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్న్వేథేన్ నగరంలో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు. -
ఆ సీన్ మొత్తం ఒక్క షాట్ లోనే తీశాం..
-
నాన్నా.. అమ్మ ఎక్కడికి వెళ్లింది!
తణుకు(పశ్చిమగోదావరి) : వారం రోజులుగా తమ ఇంటి ఆవరణలో పోలీసు బూట్ల చప్పుళ్లు.. ప్రముఖులు, రాజకీయ నాయకుల పరామర్శలు.. తనను చూసి అయ్యో పాపం అంటున్న ఇరుగు పొరుగు.. ఇదంతా ఆ మూడేళ్ల చిన్నారికి వింతగా ఉంది. తన తల్లి కొన్ని రోజులుగా ఎందుకు కనిపించడం లేదేంటి? తనను లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మ ఏమైంది? ఇవే ఆ చిన్నారి ప్రశ్నలు. వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు మూడేళ్ల కార్తీక్ మాత్రం అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న కార్తీక్ తన తల్లిపై బెంగతో జ్వరం బారిన పడ్డాడు. అమ్మ ఊరెళ్లింది ఇదిగో వచ్చేస్తుంది అని నమ్మిస్తున్న కుటుంబ సభ్యులు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయం చెప్పలేక సతమతమవుతున్నారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించేందుకు అతని తండ్రి నాగపవన్‌కుమార్ పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావటంతో ఇంటి దగ్గర ఉన్న నానమ్మ వెంకటరమణ ఆ చిన్నారిని సాకుతోంది. టీవీలో తన తల్లి కనిపించిన ప్రతిసారి అమ్మా అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ అమ్మ కావాలని మారాం చేస్తుండటం చూస్తున్న వారి కళ్లూ చెమర్చుతున్నాయి. -
నకిలీ ఏటీఎం కార్డులతో కోటిన్నర చోరి!
-
నకిలీ ఏటీఎం కార్డులతో కోటిన్నర చోరి!
అనంతపురం: గుంతకల్లులో హైటెక్ చోరీ ముఠా సభ్యుల అరెస్ట్ స్థానికంగా కలకలం రేపింది. నకిలీ ఏటీఎం కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ కార్డులతో చోరీలకు పాల్పడుతున్న ముఠాలో హైదరాబాద్ కు చెందిన కార్తీక్ కీలక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్ నుంచి 31 నకిలీ ఏటీఎం కార్డులు, 8వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. నకిలీ ఏటీఎం కార్డుల ద్వారా సుమారు కోటిన్నర రూపాయలు దొంగిలించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు కార్తీక్ ను పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ ఏటీఎం కార్డులతో చోరీలకు పాల్పడుతున్న కార్తీక్ పై కేసు నమోదు చేసి.. మిగితా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఘోరం:పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు
అభం శుభం తెలియని పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు. జీడిమెట్ల పరిధిలో చిన్నారి భవ్య.. ఓ యువకుడి చేతిలో దారుణహత్యకు గురైంది. తెలిసిన వారిదే ఈ ఘాతుకమని భావిస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరో ఘటనలో.. పదేళ్ల కార్తీక్‌ను గత నెలలో కిడ్నాప్ చేసిన దగ్గరి బంధువైన యువకుడు.. ఆ బాలుడిని షాద్‌నగర్‌లో పాశవికంగా హతమార్చి కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. షాపూర్‌నగర్, న్యూస్‌లైన్: ఇంట్లో ఇంటరిగా ఉన్న బాలికను ఓ దుర్మార్గుడు అతి కిరాతకంగా హతమార్చాడు. మొదట వైరు, ఆపై లుంగీతో మెడకు ఉరి బిగించి హత్యచేసి పరారయ్యాడు. జీడిమెట్ల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకి చెందిన గోవిందరావు, భారతి దంపతులు న్యూ షాపూర్‌నగర్‌లో ఉంటూ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె భవ్య (11) స్థానిక ఎస్వీ మోడల్ హైస్కూల్లో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా భవ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం 10.30 సమయంలో ఓ యువకుడు (25) భవ్య ఉండే గది వైపు వెళ్తుండగా ఇంటి కింది పోర్షన్లో ఉండే యజమాని కల్పన ఎక్కడికి వెళ్తున్నావని అతనిని ప్రశ్నించింది. ఈ క్రమంలో భవ్యను కూడా కల్పన అడిగి నిర్ధారించుకున్న తరువాత అతనిని పైకి పంపింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమానంతో పైకి వెళ్లిన కల్పన.. భవ్య గదికి బయట నుంచి గడియ పెట్టి ఉండడం చూసి ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్లిందేమోనని భావించింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చిన గోవిందరావు గడియ తీసుకుని లోనికెళ్లగా గదిలో భవ్య విగత జీవిగా పడి ఉంది. మెడకు లుంగీ బిగించి ఉంది. పక్కనే సెల్ ఛార్జింగ్ వైరు ఉంది. ఆ స్థితితో కుమార్తెను చూసి గోవిందరావు కుప్పకూలిపోయాడు. తెలిసిన వారి పనేనా? తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో జీడిమెట్ల సీఐ సుదర్శన్ దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా?, కుటుంబ నేపథ్యం వంటివి ఆరా తీస్తున్నారు. ఆ యువకుడు తనకు తెలుసని బాలిక భవ్య.. ఇంటి యజమాని కల్పనకు చెప్పడాన్ని బట్టి ఇది తెలిసిన వారి పనేననే నిర్ధారణకు వచ్చారు. చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: పోలీసుల నిర్లక్ష్యం బాలుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారని... రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు నెల రోజులుగా మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో పదేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఏప్రిల్ 5న కిడ్నాపైన బాలుడు షాద్‌నగర్‌లో బంధువు చేతిలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్ ఎంసీహెచ్ క్వార్టర్స్‌కు చెందిన జీహెచ్ఎంసీలో పనిచేసే రాజు, సుజాత దంపతుల కుమారుడు మాస్టర్ డి.కార్తీక్ (10). అలియాబాద్లోని స్ఫూర్తి కాన్సెప్ట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా గతనెల 5న ఇంటి ముందు ఆడుకుంటుండగా అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఛత్రినాక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బాలుడి తల్లి సుజాత సోదరుడి కుమారుడు శివకుమార్ (22) వీరింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తాళ్లగూడం గ్రామానికి చెందిన శివకుమార్ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. రెండు నెలల క్రితం తనకు రూ. 10,000 కావాలని కార్తీక్ తల్లి సుజాతను అడిగాడు. దీనికామె ససేమిరా అంది. డబ్బులు ఎందుకు అడిగావని శివకుమార్‌ను అతని నానమ్మ కూడా మందలించింది. ఈ విషయాలన్నింటిని మనసులో ఉంచుకున్న శివకుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. కార్తీక్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే ఇంటి ముందు ఆడుకుంటున్న కార్తీక్‌ను కిడ్నాప్ చేసి షాద్‌నగర్‌కు తీసుకెళ్లాడు. షాద్‌నగర్ రైల్వేస్టేషన్ వెనుక భాగంలోకి తీసుకెళ్లి రాత్రి 9 గంటల సమయంలో బాలుడి తలపై గ్రానైట్‌రాయితో మోది హత్య చేశాడు. అనంతరం బాలుడి ఒంటి పైనుంచి దుస్తులను తొలగించి వాటిని తీసుకొని తిరిగి ఫలక్‌నుమాకు చేరుకున్నాడు. ఆ దుస్తులను ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కనే ఉన్న కట్టమైసమ్మ దేవాలయం వద్ద దాచి పెట్టి యథావిధిగా బాలుడి తల్లిదండ్రుల ఇంటికి అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నాడు. ఏప్రిల్ 6వ తేదీన నగరానికి వెళుతున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన శివకుమార్ కూకట్‌పల్లికి వెళ్లి కాయిన్బాక్స్తో ఉదయం 10 గంటల సమయంలో సుజాతకు ఫోన్ చేసి ‘నీ కుమారుడు నా వద్దే ఉన్నాడని...రూ. 2 లక్షలు ఇస్తే వదిలేస్తానని’ బెదిరించాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా కూకట్‌పల్లిలోని కాయిన్బాక్స్ను గుర్తించారు. అక్కడే ఉన్న సీసీ కెమెరా పుటేజ్ సాయంతో ఆ పరిసరాల్లో శివకుమార్ తచ్చాడినట్లు తేలింది. దీంతో పోలీసులు శివకుమార్‌ను విచారించగా.. బాలుడి కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదనడంతో పోలీసులు అతన్ని వదిలేశారు. మళ్లీ శివకుమార్‌ను మరోసారి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో బాలుడిని తానే చంపినట్లు సోమవారం రాత్రి పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు మృతదేహం ఫోటోలను చూపగా వారు తమ కుమారుడేనని గుర్తించారు. దు:ఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యులు వివాహమైన పదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కార్తీక్‌ను శివకుమార్ హత్య చేయడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. నిత్యం అందరితో ఆడుతూ పాడుతూ గడిపే కార్తీక్ లేడన్న విషయం తెలుసుకొని స్థానికులు కూడా కంటతడి పెట్టారు.