Kavval Tiger Reserve
-
అదిలాబాద్ కవ్వాల్ టైగర్ జోన్‌కు భారీగా విదేశీ పక్షులు
-
ఏ పులి ఎక్కడ తిరుగుతుందో!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ పులుల అభయారణ్యంలో విచిత్ర పరిస్థితి.. పులులు ఉంటాయని భావించే కోర్ ప్రాంతం (టైగర్ రిజర్వ్)లో కంటే టైగర్ కారిడార్ (పులి రాకపోకలు సాగించే) ప్రాంతాల్లోనే అవి జీవనాన్ని సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా విస్తరించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కేవలం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ నుంచి మంచిర్యాల జిల్లా చెన్నూర్ డివిజన్ వరకే పులులు సంచరిస్తున్నాయి. ఇప్పటికే 12 పులుల వరకు అక్కడే స్థిర ఆవాసం ఏర్పర్చుకున్నాయి. గతేడాది మహారాష్ట్రలోని తడోబా నుంచి వలస వచ్చిన ఎస్6 అనే ఆడపులి తాజాగా కాగజ్‌నగర్ డివిజన్‌లోనే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవల తల్లి పులి తన రెండు నెలల వయసున్న కూనలతో పశువును వేటాడి తింటూ కెమెరాకు చిక్కింది. వీటితోపాటు ఈ కారిడార్ పరిధిలోనే ఫాల్గుణ సంతతికి చెందిన మరో రెండు పులులు గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఫాల్గుణ అనే ఆడపులి రెండు ఈతల్లో తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పులుల సంతతి పెరిగింది. దేశంలో పులుల చరిత్రలో అభయారణ్యం వెలుపల ఓ పులి రెండుసార్లు ఒకేచోట ప్రసవించడం అరుదైన ఘటనగా గుర్తించిన కేంద్రం.. ఫాల్గుణ పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా నుంచి వలస వచ్చి కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లా ప్రాణహిత తీరం చెన్నూరు డివిజన్ మీదుగా పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల మీదుగా చివరకు భద్రాది కొత్తగూడెం వరకూ ఇక్కడి పులులు వెళ్లాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వుకు సైతం ఫాల్గుణ సంతతికి చెందిన ఓ పులి వలస వెళ్లింది. కారిడార్‌లో పులుల సంచారం పెరుగుతున్న క్రమంలోనే మనుషులపైనా దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు.(చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?) కవ్వాల్ కోర్లో కనిపించని పులి.. కొత్తపాత పులుల మధ్య ఘర్షణ రూ. కోట్లు ఖర్చు చేసి, ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా కవ్వాల్ కోర్ పరిధిలో ఒక్క పులీ కనిపించట్లేదు. కవ్వాల్ కోర్ ప్రాంతంగా ఉన్న జన్నారం డివిజన్ పరిధిలో అభయారణ్యాన్ని గుర్తించిన రెండేళ్లకు ఓ పులి వచ్చి.. కొన్నాళ్లకే వెళ్లిపోయింది. అనంతరం వచ్చిన ఓ మగ పులి జే1.. మూడు నెలల క్రితం ఆడతోడు వెతుక్కుంటూ కాగజ్‌నగర్ డివిజన్లోకే వెళ్లింది. పులులు ఇక్కడే ఉంటాయని భావించి అధికారులు కోర్ పరిధిలో గడ్డిక్షేత్రాల, శాకాహార జంతువుల పెంపకం చేపట్టినా ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం చలికాలంలో ఆడ–మగ జతకట్టే సమయం కావడంతో టైగర్ కారిడార్‌లో తమ ఆవాసంలోకి వచ్చిన కొత్త పులులకు పాతవాటికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే గత డిసెంబర్లో కోపంగా ఉన్న పులి పంజాకు ఇద్దరు బలైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పులుల ఆవాసాలను ఎక్కడికక్కడ గుర్తించి ఏ పులి ఎక్కడ తిరుగుతుందో.. ఇక్కడ సంచరించే ఆడ, మగ పులులతో పాటు కొత్తగా వచ్చే పులులు ఎలా ప్రవర్తిస్తున్నాయో రోజూ అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. అడవిలో పలుచోట్ల కెమెరాలు బిగించారు. పులిని బంధించేందుకు ప్రయత్నాలు మరోవైపు గత డిసెంబర్లో ఇద్దరిని చంపిన పులిని బంధించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా పులి సంచరించే ప్రాంతంలో ఎరగా పశువును వేసి.. పులి రాగానే వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మత్తు మందు వదిలి బంధించాలని చూస్తున్నారు. పులి సంచారాన్ని గమనించేందుకు ఐదుచోట్ల మంచెలు ఏర్పాటు చేస్తున్నారు. -
పులి ఆకలి ఖరీదు రూ.21 లక్షలు!
సాక్షి, మంచిర్యాల: పులి ఆకలి ఖర్చు.. అక్షరాలా లక్షల రూపాయలు. మేత కోసం అడవికి వెళ్లిన రైతుల పశువులను హతమారుస్తూ పులి తన ఆకలి తీర్చుకుంటోంది. దీంతో సదరు రైతులకు పరిహారం రూపంలో అటవీశాఖ డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ప్రతి నెలా పులి ఆకలి ఖర్చు పెరిగిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా పరిధిలో విస్తరించిన కవ్వాల్ టైగర్ జోన్లో ఇటీవల పశులవులపై పులుల దాడులు పెరిగాయి. గతంలో కంటే పులుల సంఖ్య పెరగడంతో దాడుల సంఖ్యా పెరిగి నష్టపరిహారం పెరుగు తూ వస్తోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే గతేడాది ఒక్క కాగజ్‌నగర్ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకు రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ.38 వేలు చెల్లించారు. చెన్నూరు డివిజన్లో 50కిపైగా పశువులు పులి దాడిలో చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు చెల్లించారు. వన్యప్రాణుల సమతుల్యత దెబ్బతిని.. మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేం ద్రంలో పులుల సంతతి పెరిగి.. అవి ప్రాణహిత నది దాటి కవ్వాల్ టైగర్ జోన్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్లో 6 పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఈ జోన్లో పులుల సంఖ్యకు అనుగుణంగా శాకాహార జంతువులు లేవు. దీంతో పశువులపై పులుల దాడులు పెరి గాయి. దీంతో అటవీ అధికారులు గడ్డిక్షేత్రాలు పెంచి శాకాహార జంతువుల సంతతిని వృద్ధి చే స్తున్నారు. ఫలితంగా కొన్నాళ్లకు శాకాహార జం తువులు పెరిగే అవకాశాలున్నా.. ఇప్పటికిప్పు డు పులుల సంఖ్యకు అనుగుణంగా వన్యప్రాణులు తక్కువగానే ఉన్నాయి. గతంలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవా ణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బ తింది. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటివి వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం పులికి సులభంగా మారింది. ఏటేటా పెరుగుతున్న పరిహారం పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్ ఫారెస్టు డివిజన్లతో పా టు పెంచికల్‌పేట, బెజ్జూరు, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బెల్లంపల్లి, మంచిర్యాల డివిజన్లలోనూ పులుల సంచారం పెరగటంతో పశువులపై దాడులు మొదలయ్యా యి. అటవీ సమీప గ్రామాల శివార్లలో మేతకు వెళ్లిన పశువులపై పులులు పంజా విసురుతున్నాయి. గేదెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఎక్కువగా పులికి ఆహారమవుతున్నాయి. గత ఫిబ్రవరిలో మంచిర్యాల జిల్లా నీల్వాయి రేంజ్ పరిధి బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో పులి ఏకంగా పశువుల కాపరిపైనే దాడి చేయగా, అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పశువును బట్టి పరిహారం పులి దాడిలో మరణించిన పశువులకు అటవీ అధికారులు పశువును బట్టి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. గేదె, ఆవు, ఎద్దు, గొర్రె, మేకకు ఓ రేటు ప్రకారం ఇస్తున్నారు. పాలిచ్చేవి, పశువుల వయసు తదితర అంశాలను బట్టి విలువ కడుతున్నారు. ఇందుకు స్థానిక పశువైద్యులతో పులి దాడిలోనే చనిపోయిందనే ధ్రువీకరణతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అటవీ అధికారులు విచారణ చేపట్టి నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తే చెక్కురూపంలో పశువు యజమానికి డబ్బులు అందుతున్నాయి. దాదాపు రెండు వారాల్లోపే నష్టపరిహారం చెల్లించడంతో పశువుల యజమానులకు ఊరట కలుగుతోంది. పరిహారం చెల్లింపుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. పశువులు పులుల బారిన పడకుండా దాని సంచారం ఉన్నచోటకు వెళ్లొద్దని అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. -
స్పేస్ సరిపోక సరిహద్దు దాటి..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ శివారు మండలాల్లో పులుల సంచారం భయాందోళనకు గురిచేస్తున్నా యి. తాంసి, భీంపూర్ మండలాల్లో ఇటీవల ఆవు లపై దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాము పులిని చూశామని కొందరు చెబుతున్నా.. వాటికి సరైన ఆధారాలు దొరకలేదు. పులులు సంచరిస్తున్నాయని అటవీ శాఖాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. పులి విషయంలో ఏదైనా మాట్లాడితే అటు పులులకు సురక్షితం కాదని, ప్రజలు భయాందోళనలకు గురవడంతోపాటు వాటిని చంపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయంతోనే అధికారులు వివరాలు వెల్లడించట్లేదు. ఆదిలాబాద్ నుంచి 18 కి.మీ దూరంలో మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ మీదుగా నాగపూర్ వెళ్లేందుకు 44వ జాతీయ రహదారికి ఇదే ప్రధాన మార్గం. పెన్ గంగ నదీ ప్రాంతమే తెలంగాణ, మహారాష్ట్రలకు సరిహద్దు. మహారాష్ట్ర వైపు యావత్మాల్ జిల్లా పాండర్‌కౌడ తాలూకా సమీపంలో తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం విస్తీర్ణా నికి మించి పులుల సంఖ్య పెరి గిందని అటవీ అధికారులు అంటున్నారు. దీంతో అక్కడున్న పులులు వేరే ప్రాంతాలకు కదులుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెన్‌గంగాలో అంతగా నీటి ప్రవాహం లేదు. తిప్పేశ్వర్ నుంచి కదులుతున్న పులులు.. పెన్‌గంగా దాటుకుని ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళ్తుం డటంతోనే పులుల సంచారంపై కొన్ని మండలాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆవాసాలు, పంట పొలాలు, రోడ్లు దాటుకుని వెళ్తున్నప్పుడు ప్రజల కంట పడుతున్నా యి. ప్రశాంత వాతావరణం కల్పించడం ద్వారా పులులు ఈ ప్రాంతం దాటి వెళ్లేలా అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిప్పేశ్వర్‌తో పోలిస్తే విస్తీర్ణంలో పెద్దగా ఉన్న కవ్వాల్ పులులకు అనుకూల ప్రదేశమని అధికారులు చెబుతున్నారు. తిప్పేశ్వర్ టైగర్ రిజర్వు 148 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఒక పులికి 10 నుంచి 15 చ.కి.మీ. విస్తీర్ణంలో ఆవాసం ఏర్పర్చుకుంటుంది. దానికంటూ ఒక ఏరియా ఏర్పర్చుకుంటుంది. ప్రస్తుతం అక్కడ 18కి పైగా పులులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆవాస విస్తీర్ణంలో పులులు ఎదురుపడితే ఘర్షణకు దిగుతాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి పులుల కదలికలు మొదలై సురక్షిత ఆవాసం కోసం సంచరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, నేరడిగొండ, పెంబి, కడెం, ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్, లక్సెట్టిపేట, తిర్యాణి ప్రాంతాల్లో దట్టమైన అడవి ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వులో పులులు ఉండేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని అధికారులు అభి ప్రాయపడుతున్నారు. తిప్పేశ్వర్ తో పోలిస్తే కవ్వాల్ విస్తీర్ణం చాలా పెద్దది. ఇక్కడ 2 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కవ్వాల్‌లో పులుల సంచారం కనిపిస్తున్నా.. స్థిర నివాసం ఏర్పర్చుకు న్నది లేదు. దీంతో అక్కడి నుంచి వచ్చే పులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు అనువైన వాతావరణం ఉంది. తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్కు అటవీ రహదారిలో 100 కి.మీ. దూరంలో ఉంటుందని చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో పులుల కదలికపై జిల్లా అటవీ శాఖాధికారి ప్రభాకర్‌ను వివరణ కోరగా.. పులి రోడ్డు దాటినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్రాంతాల్లో తమ సిబ్బంది భద్రత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పులిని చూశా.. మాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్. ఆదిలాబాద్‌లో నివాసం. మంగళవారం రాత్రి అవాల్పూర్ మీదుగా ఆదిలాబాద్‌కు కారులో వస్తున్నా. మార్గమధ్యంలో రాత్రి 10.40 సమయంలో జైనథ్ మండలం నిరాల శివారు పెన్‌గంగ కెనాల్ డెయిరీఫాం మధ్యకు రాగానే.. అంతర్ రాష్ట్ర రోడ్డు దాటుతూ పులి కనిపించింది. ఈ విషయం చెప్పి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాను. – కె.అనిల్ -
ఊరు వదిలేస్తం...ఉపాధి ఇస్తరా
సాక్షి, హైదరాబాద్: కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుంచి నిర్వాసితుల తరలింపు ముందుకు సాగడం లేదు. పులులు సంచరించే అభయారణ్యంలోని ప్రధాన అటవీ ప్రాంతం (కోర్ ఏరియా)లోని గ్రామాల నుంచి స్థానికులను కదిలించే ప్రక్రియ విఘ్నాలను ఎదుర్కొంటోంది. అక్కడినుంచి ఇరవై గ్రామాలను తరలించాలని తొలుత నిర్ణయించారు.దీనిపై మెజారిటీ గ్రామాల వారు వ్యతిరేకించారు. ఆ తర్వాత పూర్తిగా అడవిలోనే ఉన్న నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి, ఆ ప్రక్రియను ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల కృషి ఫలితంగా రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఊళ్లు ఖాళీ చేయడానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. కేంద్రం నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వ ‘ప్రాజెక్టు టైగర్’ పథకంలో భాగంగా ‘కేటీఆర్’లోని పై రెండు గ్రామాల్లోని 142 కుటుంబాల తరలింపునకు మొత్తం రూ. 14.20 కోట్లు వ్యయం కానుంది.ఇందులో కేం ద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తుంది. ఈనేపథ్యంలో 2018 అక్టోబర్ 22న కేంద్ర అటవీశాఖ తన వంతుగా రూ.8.52 కోట్లు విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నిరాసక్తతను ప్రదర్శించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన అటవీ శాఖ సమావేశంలోనే నిర్మల్ జిల్లాలోని మైసంపేట, రాంపూర్ గ్రామస్తులను తరలించేందు కు 112 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. అది పురోగతి లేకపోవడంతో మళ్లీ తాజాగా ఈనెల ఒకటిన జరిగిన రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశంలోనూ డీనోటిఫై ప్రతిపాదనపై మరోసారి ఆమోదముద్ర వేయాల్సిన స్థితి ఏర్పడింది. పునరావాసం కల్పిస్తే వెళ్లిపోయేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినా తమను తరలించడం లేదని ఆ గ్రామాల్లోని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదీగాకుండా ఇటీవల నిర్మ ల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఈనెల 3న కొత్త కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖి వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగంలో వచ్చిన మార్పు కూడా తరలింపుపై ప్రభావం పడనుంది. పునరావాసానికి రెండు ఆప్షన్లు ఈ గ్రామాల పునరావాసం కోసం...అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల వంతున ఒకేసారి నగదు అందజేయడం మొదటిదికాగా, విడిగా పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఇళ్లు, భూములు ఇచ్చి, ఇతర సౌకర్యాలను కల్పించి ఇవ్వాలనేది రెండో ప్రతిపాదన, వీటిలో 48కుటుంబాలు మొదటి ఆప్షన్‌ను, 94కుటుంబాలు రెండో ఆప్షన్‌ను ఎంపికచేసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోగా, ఉపాధి ఆవకాశాలు లేకపోవడంతో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉండేవారు వెదురు తడకల అల్లికతో జీవనోపాధిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూములున్నా సాగునీటికి ఇబ్బందిగానే ఉంది. ఈ కారణాలతో వారు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు. ఊరును, ఇళ్లను ఇడిసిపెడతం.. మా మైసంపేట ఊరు మొత్తం అడివిలనే ఉంటది. సుట్టూ జంగలే. సాగు చేసుకుందమన్నా ఇబ్బందే. అధికారుల సూచన మేరకు మా గ్రామస్తులం పులుల కో సం ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టి వస్తున్న మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నం. – పెంద్రం లచ్చు, గ్రామపటేల్, మైసంపేట్ అందరం ఒప్పుకున్నం.. అటవీ అధికారులు చెప్పిన తర్వాత ఊళ్లే అందరం ఇక్కడి నుంచే పోతందుకు ఒప్పుకున్నం. సార్లు చెప్పినట్లు మేం ఉన్న ఊరిని ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. సా గు కోసం ఇబ్బంది లేకుండా చూడాలి. ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నం. – అమృత్‌రావు, గ్రామస్తుడు, మైసంపేట్ తరలింపు కోసం ఏర్పాట్లు.. నిర్మల్‌జిల్లాలో గల కవ్వాల్ పులుల అభయారణ్యంలో నుంచి రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా తరలించి, పునరావాసం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు గ్రామసభ తీర్మానం ద్వారా పునరావాసానికి ఒప్పుకున్నారు. అదే మండలంలోని కొత్తమద్దిపడగ, నచ్చన్ ఎల్లాపూర్ గ్రామాల మధ్య గల అటవీశాఖకు చెందిన ప్రాంతానికి తరలించనున్నాం. పునరావాసానికి 112హెక్టార్ల భూమిని కేటాయించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, అధికారులతో డీఎల్సీ(డిస్ట్రిక్ట్ లెవల్ కో–ఆర్డినేషన్) మీటింగ్ నిర్వహించి, తదుపరి ప్రక్రియ చేపడతాం. –ఎస్పీ.సుధన్, డీఎఫ్ఓ, నిర్మల్ -
ఊరు వదిలేస్తం.. ఉపాధి ఇస్తరా
సాక్షి, హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుంచి నిర్వాసితుల తరలింపు ముందుకు సాగడం లేదు. పులులు సంచరించే అభయారణ్యంలోని ప్రధాన అటవీ ప్రాంతం (కోర్ ఏరియా)లోని గ్రామాల నుంచి స్థానికులను కదిలించే ప్రక్రియ విఘ్నాలను ఎదుర్కొంటోంది. అక్కడినుంచి ఇరవై గ్రామాలను తరలించాలని తొలుత నిర్ణయించారు.దీనిపై మెజారిటీ గ్రామాల వారు వ్యతిరేకించారు. ఆ తర్వాత పూర్తిగా అడవిలోనే ఉన్న నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి, ఆ ప్రక్రియను ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల కృషి ఫలితంగా రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఊళ్లు ఖాళీ చేయడానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. కేంద్రం నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వ ‘ప్రాజెక్టు టైగర్’ పథకంలో భాగంగా ‘కేటీఆర్’లోని పై రెండు గ్రామాల్లోని 142 కుటుంబాల తరలింపునకు మొత్తం రూ. 14.20 కోట్లు వ్యయం కానుంది.ఇందులో కేం ద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తుంది. ఈనేపథ్యంలో 2018 అక్టోబర్ 22న కేంద్ర అటవీశాఖ తన వంతుగా రూ.8.52 కోట్లు విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నిరాసక్తతను ప్రదర్శించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన అటవీ శాఖ సమావేశంలోనే నిర్మల్ జిల్లాలోని మైసంపేట, రాంపూర్ గ్రామస్తులను తరలించేందుకు 112 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. అది పురోగతి లేకపోవడంతో మళ్లీ తాజాగా ఈనెల ఒకటిన జరిగిన రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశంలోనూ డీనోటిఫై ప్రతిపాదనపై మరోసారి ఆమోదముద్ర వేయాల్సిన స్థితి ఏర్పడింది. పునరావాసం కల్పిస్తే వెళ్లిపోయేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినా తమను తరలించడం లేదని ఆ గ్రామాల్లోని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదీగాకుండా ఇటీవల నిర్మ ల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఈనెల 3న కొత్త కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖి వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగంలో వచ్చిన మార్పు కూడా తరలింపుపై ప్రభావం పడనుంది. పునరావాసానికి రెండు ఆప్షన్లు ఈ గ్రామాల పునరావాసం కోసం...అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల వంతున ఒకేసారి నగదు అందజేయడం మొదటిదికాగా, విడిగా పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఇళ్లు, భూములు ఇచ్చి, ఇతర సౌకర్యాలను కల్పించి ఇవ్వాలనేది రెండో ప్రతిపాదన, వీటిలో 48కుటుంబాలు మొదటి ఆప్షన్‌ను, 94కుటుంబాలు రెండో ఆప్షన్‌ను ఎంపికచేసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోగా, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉండేవారు వెదురు తడకల అల్లికతో జీవనోపాధిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూములున్నా సాగునీటికి ఇబ్బందిగానే ఉంది. ఈ కారణాలతో వారు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు. ఊరును, ఇళ్లను ఇడిసిపెడతం.. మా మైసంపేట ఊరు మొత్తం అడివిలనే ఉంటది. సుట్టూ జంగలే. సాగు చేసుకుందమన్నా ఇబ్బందే. అధికారుల సూచన మేరకు మా గ్రామస్తులం పులుల కోసం ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టి వస్తున్న మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నం. – పెంద్రం లచ్చు, గ్రామపటేల్, మైసంపేట్ అందరం ఒప్పుకున్నం.. అటవీ అధికారులు చెప్పిన తర్వాత ఊళ్లే అందరం ఇక్కడి నుంచే పోతందుకు ఒప్పుకున్నం. సార్లు చెప్పినట్లు మేం ఉన్న ఊరిని ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. సా గు కోసం ఇబ్బంది లేకుండా చూడాలి. ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నం. – అమృత్‌రావు, గ్రామస్తుడు, మైసంపేట్ తరలింపు కోసం ఏర్పాట్లు.. నిర్మల్‌జిల్లాలో గల కవ్వాల్ పులుల అభయారణ్యంలో నుంచి రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా తరలించి, పునరావాసం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు గ్రామసభ తీర్మానం ద్వారా పునరావాసానికి ఒప్పుకున్నారు. అదే మండలంలోని కొత్తమద్దిపడగ, నచ్చన్ ఎల్లాపూర్ గ్రామాల మధ్య గల అటవీశాఖకు చెందిన ప్రాంతానికి తరలించనున్నాం. పునరావాసానికి 112హెక్టార్ల భూమిని కేటాయించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, అధికారులతో డీఎల్సీ(డిస్ట్రిక్ట్ లెవల్ కో–ఆర్డినేషన్) మీటింగ్ నిర్వహించి, తదుపరి ప్రక్రియ చేపడతాం. – ఎస్పీ.సుధన్, డీఎఫ్ఓ, నిర్మల్ -
అటవీశాఖలో డాగ్ స్క్వాడ్!
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ మాదిరిగానే తెలంగాణ అటవీశాఖలోనూ డాగ్ స్క్వాడ్‌ను ప్రవేశపెట్టారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరకడం, వన్యమృగాల వేట వంటి నేరాల నియంత్రణకు ఈ స్క్వాడ్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ స్క్వాడ్‌లో భాగంగా మన రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన మొదటి జర్మన్ షెపర్డ్ జాతి శునకం ‘ఛీతా’ను ముందుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో అటవీ పరిరక్షణ సేవలకు ఉపయోగిస్తున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటర్లో 9 నెలలపాటు శిక్షణ పొందిన అనంతరం ఛీతా సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఛీతాతో పాటు ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు (ఎఫ్బీఓ) కూడా గ్వాలియర్లోనే 9 నెలల పాటు శిక్షణనిచ్చారు. అడవుల్లో నేరాలకు పాల్పడే వారి వాసన పసిగట్టడం ద్వారా వారి గుట్టును కనిపెట్టవచ్చని, వాటి ఆధారంగా అరెస్టులు కూడా చేయొచ్చని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కె.రవీందర్ సాక్షికి తెలిపారు. కవ్వాల్‌లో సంచరించే పులులు, ఇతర వన్యప్రాణులు, మృగాలు సంచరించిన స్థలాల్లో వాటి వాసనను కనిపెట్టి వాటి గమనం, సంచారం ఎటువైపు ఉందో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మేలురకం శునకాలను ఎంపిక చేసి వాటికి కూడా ఇద్దరు ఎఫ్‌బీఓల ద్వారా శిక్షణనిచ్చి డాగ్ స్క్వాడ్లను విస్తరించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని రవీందర్ తెలిపారు. -
కవ్వాల్’ నుంచి 2 గ్రామాల తరలింపు!
సాక్షి, హైదరాబాద్: పులుల సంరక్షణ అభయారణ్యాల నుంచి గ్రామాల తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని రెండు గ్రామాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రెండు గ్రామాలకు కల్పించాల్సిన పునరావాసంపై సచివాలయంలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పునరావాస అమలు రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. నిర్మల్ జిల్లా రాంపూర్, మైసంపేటలకు చెందిన రూ. 14.20 కోట్ల విలువైన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. తొలుత రాంపూర్, మైసంపేట్.. మానవ సంచారంతో పులులు కావ్వాల్లో స్థిరంగా ఉండలేకపోతున్నాయని, అత్యవసరంగా ఆదివాసీ గ్రామాలను తరలించాలని అటవీ అధికారులు సీఎస్‌కు వివరించారు. కవ్వాల్ రిజర్వ్ కోర్ ఏరియాలో మొత్తం 23 గ్రామాలుండగా ప్రస్తుతం నిర్మల్ జిల్లా రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు పునరావాసం పొందేందుకు ముందుకు వచ్చిన ట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణ జాతీయ అథారిటీ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు చెప్పా రు. ఆ ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, లేదా అదే డబ్బుతో అటవీ శాఖ పునరావాసం కల్పించే ప్రతిపాదనను తీసుకొచ్చారు. పునరావాసానికి అయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భరిస్తాయని పులుల సంరక్షణ జాతీయ అథారిటీ ఇన్స్పెక్టర్ జనరల్ సోమశేఖర్ వివరించారు. పులుల అభయారణ్యం నుంచి తరలించే గ్రామాల వారికి మెరుగైన పునరావాసం కల్పించాలని అటవీ శాఖను చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ ఆదేశించారు. -
కవ్వాల్కు వెయ్యి జింకలు
సాక్షి, హైదరాబాద్: పులులకు సమృద్ధిగా ఆహారం సమకూర్చటంతోపాటు అటవీ ఆవరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు వీలైనంత త్వరగా వెయ్యి జింకలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని మృగవని జింకల పార్కుతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు కృష్ణా తీర ప్రాంతం నుంచి జింకలను తరలించాలని నిర్ణయించారు. ‘కవ్వాల్ పులికి ఫుడ్డు సవ్వాల్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఫారెస్టు అధికారులు స్పందించారు. అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా, వన్యప్రాణి సంరక్షణ ప్రధాన అధికారి మనోరంజన్ భాంజా, ప్రత్యేక అధికారి శంకరన్‌లు సమావేశమయ్యారు. ఈ నెలలోనే పులుల గణన ఉన్న నేపథ్యంలో విధివిధానాలతోపాటు ‘సాక్షి’ కథనంపై చర్చించారు. కవ్వాల్‌లో పులి ఆవాసాల్లో శాకాహార జంతువులు ఉండాల్సిన నిష్పత్తిలో లేవని అంచనాకు వచ్చారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి కవ్వాల్కు వస్తున్న పులులు.. ఆహారం లేకనే తిరిగి వెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా మృగవని జింకల పార్కుల్లో ఎక్కువ సంఖ్యలో జింకలు ఉన్నాయని, వాటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా తీరంలో జింకలు పంటచేలపై దాడి చేస్తున్న ఘటనలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ జింకలను కవ్వాల్కు తరలించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పీకే ఝా ‘సాక్షి’తో మాట్లాడారు. జింకల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వాటిని తీసుకెళ్లి కవ్వాల్ టైగర్ షెల్టర్ జోన్లో వదిలేస్తామని చెప్పారు. అటవీ మధ్యలో నివాస గ్రామాల వల్ల కూడా పులులు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ నివాస గ్రామాల తరలింపుపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతి ఆదివాసీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 17 తర్వాత ఆదివాసీ గ్రామాల తరలింపునకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ నెల 22 నుంచి పులుల గణన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు. -
‘అరణ్య’ రోదన!
జీవనాధారమైన అడవి నుంచి ఆదివాసీల గెంటివేత పోడు చేసుకుని బతుకుతున్న గిరిజనులపై సర్కారు కేసులు అవి అటవీ భూములని.. వాటిలో పోడు చేయొద్దని హుకుం బలవంతంగా లాక్కుని మొక్కలు నాటే యత్నం రేషన్ కార్డులు రద్దు.. నిత్యావసరాల పంపిణీ నిలిపివేత మరో దారిలేక గిరిజనులు వలస పోతారనే వ్యూహం వరంగల్‌లో పోడు బావులను మూసేసే యత్నం కవ్వాల్ టైగర్ రిజర్వు పేరుతో గూడేలకే ఎసరు పోడు లేక.. రేషన్ రాక గిరిపుత్రుల ఆకలికేకలు ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలంటూ ఆవేదన గిరిపుత్రులను వారి జీవనాధారమైన అడవి తల్లి నుంచి దూరం చేస్తున్నారు. పోడు కొట్టుకుని సాగు చేసుకునే అడవి బిడ్డల పొట్టకొడుతున్నారు. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ ఆదివాసీలపైనే కేసులు పెడుతున్నారు. తరతరాలుగా వారు సాగుచేసుకుంటున్న భూమిని లాగేసు కుంటున్నారు. ఎలాగైనా అడవి నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా వారి రేషన్ కార్డులను, ఆధార్ కార్డులనూ రద్దు చేస్తున్నారు. అటు పోడు సాగూ లేక.. ఇటు రేషన్ సరుకులూ అందక ఆకలితో అలమటిస్తున్నారు. పుట్టిన గడ్డ నుంచే తమను గెంటేస్తే ఎక్కడికెళ్లి బతకాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోడు తప్ప మరే పనీ తెలియని తాము బతికేదెలాగన్న వారి ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. అధికారుల తీరుతో.. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వేలాది మంది గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి నెట్వర్క్ అటవీ డివిజన్ల పరిధిలో పోడు కొట్టుకుని వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు అందించారు.2005 డిసెంబర్ 31 నాటికి పోడు చేస్తున్న భూములకు ఈ పత్రాలను అందించారు. అయితే.. అనంతర ప్రభుత్వాలు ఈ పత్రాల జారీని విస్మరించాయి. దశాబ్దాల పాటు పోడు చేసుకుంటున్న చాలా మంది గిరిజనులకు హక్కు పత్రాలు అందలేదు. ఆ తర్వాతి కాలంలోనూ చాలా గిరిజన కుటుంబాలు తమ జీవనాధారం కోసం అర ఎకరా, ఎకరా పోడు కొట్టుకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం వారికి హక్కు పత్రాలు ఇవ్వకపోగా.. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ వారిపై కేసులు నమోదు చేస్తోంది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ గిరి జనులకు, గొత్తి కోయలకు రేషన్ కార్డులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయాన్నీ నిలిపివేస్తున్నారు. దీంతో అటు పోడు చేసుకుని కుటుంబ పోషణకు ఏమైనా తెచ్చుకోవడానికి భూమీ లేక.. ఇటు ఇంట్లో రేషన్ కార్డుపై బియ్యం, నిత్యావసర సరుకులూ అందక.. చాలా రోజులుగా గిరిజనుల కుటుంబాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. భూముల్లో సాగు చేసుకోనివ్వకుండా.. ప్రభుత్వ సదుపాయాలను నిలిపివేయటం ద్వారా.. గిరిజనులను ఏకంగా వారి నివాస ప్రాంతాల నుంచే పంపించేయాలనేది అధికారుల వ్యూహంగా చెప్తున్నారు. ఈ పరిస్థితులపై గిరిజన సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. వారికి అనేక రాజకీయపక్షాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. గిరిజనులపై కేసులు.. కార్డుల రద్దులు... ఖమ్మం అటవీ డివిజన్లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం 1,51,350 హెక్టార్లు ఉంది. వీటిలో 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం 8,561 మంది గిరిజనులకు 13,921 హెక్టార్లకు హక్కులు కల్పించారు. ఇవికాక ప్రస్తుతం సుమారు 8,000 ఎకరాల అటవీ భూమిలో పోడు సాగు చేస్తున్నారని చెప్తున్న అధికారులు.. ఆ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో మొక్కలు నాటేందుకు ఉద్యుక్తులయ్యారు. పోడు వ్యవసా యం చేస్తున్న గొత్తి కోయలకు రేషన్‌కార్డులు, ఆధార్, ఓటరు కార్డులు రద్దు చేశారు. కొత్తగూడెం మండలం పెనగడప పంచాయతీ చండ్రుపట్లలో 200 మంది గొత్తి కోయలకు ఇలా గుర్తింపు కార్డులన్నీ రద్దుచేశారు. భద్రాచలం నార్త్ డివిజన్ పరిధిలో పోడు కొట్టిన 226 మంది గిరిజనులపై అధికారులు కేసులు నమోదు చేశారు.