King maker
-
అది కింగ్‌మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారికి ‘మాల్వా-నిమాడ్’ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రాంతం ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని చెబుతుంటారు. మాల్వా-నిమాడ్ ప్రాంతంలోని 15 జిల్లాల్లో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మాల్వా-నిమాడ్ మధ్యప్రదేశ్‌లో కింగ్‌మేకర్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగురవేసిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాల్వా-నిమాడ్ ప్రాంతం కీలకంగా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మాల్వా-నిమాడ్లో విజయం సాధించడమే ప్రధాన కారణమంటారు. ఇక్కడి 35 స్థానాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 28 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోపాల్ సింహాసనాన్ని అధిష్టించేందుకు కాంగ్రెస్‌కు మాల్వా-నిమాడ్ విజయం ఎంతగానో సహాయపడింది. 2013 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మాల్వా-నిమాడ్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని ప్రకంపనలు సృష్టించింది. నాడు కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మాల్వా-నిమాడ్ సీట్లలో విజయం సాధించిన కారణంగా 2013లో బీజేపీ ప్రభుత్వం, 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే ఈసారి కూడా ఈ ప్రాంతంపై రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. ఇది కూడా చదవండి: అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం! -
ఎన్నికల చిత్రం మారుతోంది.. ప్రధాన కారణం అదేనా?
మన దేశంలో ఎన్నికల తీరుతెన్నులను 2014కు ముందు, తర్వాత అని స్పష్టంగా ఒక విభజన రేఖ గీయొచ్చు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో విభిన్నమైన ధోరణులు కనిపించాయి. ఒకప్పుడు వివిధ రాష్ట్రాల్లో బహుముఖ పోరు ఉంటే, ఇప్పుడు రెండు పార్టీలే నేరుగా తలపడుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం , రాష్ట్రాల్లో మొదటి, రెండు స్థానాల్లో ఉండే కీలక పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపిస్తూ ఉండడంతో ఎన్నికల ట్రెండ్స్ మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంటుందని అందరూ భావించినప్పటికీ జేడీ(ఎస్) తన ప్రాభవాన్ని కోల్పోయి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే నేరుగా పోటీ జరగడం అతి పెద్ద ఉదాహరణ. ఇకపై ఎన్నికల్లో కింగ్మేకర్లు అన్న పదమే వినిపించేలా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ► హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పిలుచుకునే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకప్పుడు ముఖాముఖి పోరు నెలకొని ఉండేది. ఇప్పుడు ఎన్నికల తీరుతెన్నుల్ని చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు నెలకొని ఉంది. గుజరాత్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య పోరు ఉంటే, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పార్టీల మధ్య బహుముఖ పోరాటం నెలకొంది. ► కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి ఢిల్లీ తీసుకుంటే 2014కి ముందు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు ఉండేది. కానీ కాలక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం, కాంగ్రెస్ బలహీనపడడం మొదలైంది. దీంతో దేశరాజధానిలో ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. మరోవైపు హరియాణాలో బీజేపీ బలం పుంజుకోవడంతో అక్కడ ముఖాముఖి పోరు కాస్త బహుముఖ పోరుగా మారింది. బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ల మధ్య ఎన్నికల్లో రసవత్తరంగా పోరు నడుస్తోంది. ► కొన్ని రాష్ట్రాల్లో పోలయిన ఓట్లను విశ్లేషిస్తే రెండు ప్రధాన పార్టీలకే ఓట్లు వేసే ధోరణి కనిపిస్తుంది. ఒకటి, రెండు స్థానాల్లో ఉండే పార్టీలే అత్యధిక ఓటు షేర్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి చెందిన బీఎస్పీ, కర్ణాటకలో జేడీ(ఎస్), బెంగాల్లో వామపక్ష పార్టీలకు ఓట్లు వేసినా ఉపయోగం లేదన్న భావన ఓటర్లలో వచ్చింది. అందుకే రెండు పార్టీల్లో ఏదో ఒకదానిపైనే మొగ్గు చూపించే రోజులొచ్చాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల అసెంబ్లీలలో కమలనాథులు పట్టు బిగిస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఒడిశా, త్రిపుర రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తూ ఇతర పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం వల్ల ఎన్నికల తీరు మారిపోయి రెండు పార్టీల మధ్య పోరు నెలకొంది. -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
గవర్నర్లు.. కింగ్మేకర్లు!
సాక్షి, ముంబై: దేశంలో గత మూడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు పోషించిన పాత్ర వివాదాస్పదం అయింది. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ కోసం గేమ్ చేంజర్లుగా మారారు. 2017లో... గోవాలో 2017 ఎన్నికల్లో అసెంబ్లీలోని 40 స్థానాలకు 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, గవర్నరు మృదులా సిన్హా ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకే అవకాశమిచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో గవర్నర్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు, 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 21 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ, గవర్నర్ కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చాన్సివ్వడంతో కమలదళం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 2018లో... కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం గవర్నర్ వజూభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అయితే, బలపరీక్షలో బీజేపీ ఓడిపోయింది. సీఎం యడియూరప్పరాజీనామా చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో అధికార కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆపై మళ్లీ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్– జేడీఎస్ వాదనలను గవర్నర్ వినిపించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను 21 స్థానాలతో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, దాని మిత్రపక్షం 19 సభ్యులున్న ఎన్పీపీని ఆహ్వానించడం వివాదాస్పదమైంది. -
టార్గెట్ 15... బీజేపీ వేట ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ వేట ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15కి పైగా స్థానాల్లో గెలవాలనే వ్యూహంతో పావులు కదుపుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాని పక్షంలో తాము గెలిచే స్థానాలతో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని భావిస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న సీట్లపై మరింతగా దృష్టి సారించింది. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ ప్రచార వ్యూహాలను రూపొందించడంతోపాటు అభ్యర్థులకు సల హాలు, సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం మరో నలుగురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు. ‘2, 3 స్థానాల’ సీట్లపై దృష్టి.. బీజేపీ సిట్టింగ్ స్థానాలైన ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, ఉప్పల్, గోషామహల్‌తోపాటు గత ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏడు చోట్ల రెండో స్థానంలో నిలవగా.. ప్రస్తుతం వాటిలోని రెండు చోట్ల అప్పటి అభ్యర్థులు లేరు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతోపాటు మిగిలిన స్థానాల్లో కచ్చితంగా గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, కల్వకుర్తి, ముధోల్, మల్కాజిగిరిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని విస్తృతం చేసి, బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. వాటితోపాటు గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన నిజమాబాద్ అర్బన్, మహబూబ్‌నగర్, సూర్యాపేట్, మునుగోడు, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, వేములవాడ, దుబ్బాక, ఆంధోల్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆర్మూర్ తదితర స్థానాల్లోనూ కాషాయజెండా ఎగురేసేందుకు వ్యూహాలు ముమ్మరం చేసింది. హోరెత్తనున్న ప్రచారం.. రాష్ట్రంలో తమ అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే మూడుసార్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేశారు. అలాగే యువ సమ్మేళనంలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర, అస్సాం సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరై రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇక ప్రధాని నరేంద్రమోదీతోపాటు యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించనుంది. పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు అవకాశమున్న నియోజకవర్గాల్లో మోదీ, అమిత్‌షా, ఇతర ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాలు ఉండేలా షెడ్యూల్ రూపొందించింది. ఈనెల 27న, వచ్చేనెల 3న ప్రధాని సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అమిత్‌షా ఈనెల 25, 28, వచ్చేనెల 2వ తేదీల్లో 10 సభలు, మూడు రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఇటీవలే బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద సేవలను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటోంది. ఆయన ఈనెల 22 నుంచి 48 నియోజవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. రిజర్వుడ్ స్థానాలే కాకుండా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. పేదలకు రూ.5 లక్షల విలువైన వైద్య సహాయం అందించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ప్రజలకు అందకుండా, దాని అమలుకు ససేమిరా అంటున్న టీఆర్ఎస్ వ్యవహారాన్ని, ఆ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కాషాయదళం భావిస్తోంది. తద్వారా ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాలు గెలిచి కింగ్ మేకర్ పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది. -
రసకందాయంలో కర్ణాటకం
కర్ణాటకలో విధానసభ ఎన్నికలు ముగియడంతో రాజకీయం వేడెక్కింది. దీనికితోడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాదని చెప్పడంతో దేశం యావత్తు కర్ణాటకాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఎవరితో ఎవరు జతకడతారు? ఎవరు సీఎం అవుతారన్న చర్చ జోరందుకుంది. తామే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.హంగ్ వస్తే ఏం చేయాలనేదానిపై బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకే కుమారస్వామి విదేశీ పర్యటనకు వెళ్లినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇన్నిరోజులు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానే అని చెప్పుకున్న సిద్దరామయ్య.. పార్టీ ఆదేశిస్తే సీఎం పదవిని త్యాగం చేస్తానని చెప్పి అందరినీ విస్మయానికి గురిచేశారు. సీఎంగా దళితుడిని ఎంపిక చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే తమకు 125–130 సీట్లు ఖాయమని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఓట్ల కౌంటింగ్ కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పిన నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సింగపూర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జేడీఎస్ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుందని మీడియా అంచనాల వేళ శనివారం రాత్రి ఆయన సింగపూర్‌కు వెళ్లడం పలు ఊహాగానాలకు తెరలేపింది. కర్ణాటకలో హంగ్ వస్తే ఏం చేయాలనేదానిపై బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకే కుమారస్వామి విదేశీ పర్యటన వెళ్లినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కుమారస్వామితో సన్నిహితంగా ఉందని ఆయన ప్రధాన అనుచరుడు ఒకరు పేర్కొన్నారు. కాగా వైద్య చికిత్సల కోసమే తాను సింగపూర్ వెళ్లానని, ఓట్ల లెక్కింపు జరిగే 15న బెంగళూరు తిరిగి వస్తానని కుమారస్వామి చెప్పడం గమనార్హం. మద్దతిచ్చే పక్షంలో షరతులపై బీజేపీని కుమారస్వామి గట్టిగా డిమాండ్ చేసే అవకాశముంది. 2006లో బీజేపీ– జేడీఎస్ సంకీర్ణ కూటమి సర్కారులో కుమారస్వామి సీఎంగా పనిచేశారు. ఏడాదిన్నర అనంతరం ఒప్పందానికి అనుగుణంగా బీజేపీకి అధికారం అప్పగించేందుకు కుమారస్వామి నిరాకరించడంతో బీజేపీ మద్దతు ఉపసంహరించింది. ఆ పరిణామాల నేపథ్యంలో బీజేపీ– జేడీఎస్‌లు మళ్లీ కలిసి పనిచేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దేవెగౌడ, కుమారస్వామిలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సిద్దరామయ్యకు గుణపాఠం చెప్పాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: అమిత్‌షా పణజి: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. పణజిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రచారానికి కొందరు ప్రముఖులు దూరం నువ్వానేనా అన్నట్లు సాగిన కర్ణాటక ఎన్నికల పోరులో అతిరథమహారథులు తరలివచ్చి ప్రచారంలో పాల్గొనగా, కొందరు ప్రముఖ నేతలు మాత్రం దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి, సినీనటి రమ్యను ప్రచారానికి ఆహ్వానించినా.. ఆసక్తి చూపలేదని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఆమ్ ఆద్మీ అభ్యర్థుల తరఫున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సిఉన్నా బిజీగా ఉండడంతో గైర్హాజరయ్యారు. సంపూర్ణ మెజారిటీతో అధికారం: యడ్యూరప్ప కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 125–130 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 70 స్థానాలకు, జేడీఎస్ 24–25 సీట్లకు పరిమితమవుతాయని జోస్యం చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేశారు. తన అంచనాలు ఎన్నడూ తప్పలేదనీ, ఈసారి కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. ఓడిపోతానన్న భయంతోనే సీఎం సిద్దరామయ్య తనపై విమర్శలు చేస్తున్నారని యడ్యూరప్ప ఆరోపించారు. మే 15న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. దళితుడిని సీఎం చేస్తే సమ్మతమే: సిద్దరామయ్య బెంగళూరు/మైసూరు: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. దళితుడ్ని అధిష్టానం ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తనకు ఆమోదయోగ్యమేనని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సహా అందరూ సమ్మతిస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం సముచితమన్నారు. మైసూర్‌లోని ఆయన మాట్లాడుతూ.. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రావడంపై స్పందిస్తూ.. ‘అవి రెండ్రోజుల పాటు సాగే వినోదం మాత్రమే. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ట్వీట్ చేశారు. రికార్డు స్థాయి ఓటింగ్ కర్ణాటకలో శనివారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.13శాతం ఓటింగ్ నమోదైంది. 1952 సాధారణ ఎన్నికల తర్వాత ఇదే అత్యధికమని ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్‌కుమార్ తెలిపారు. మహిళలు, యువత ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకోవటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2013 ఎన్నికల్లో 71.45శాతం ఓటింగ్ రికార్డు కాగా, ఈసారి అంతకంటే ఎక్కువ నమోదు కావటం విశేషమన్నారు. ఈ ఎన్నికల్లో రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.24.78 కోట్ల విలువైన మద్యం, రూ.66 కోట్ల విలువైన వాహనాలు, దుస్తులు, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. భారీగా నకిలీ ఓటరు కార్డులు లభ్యం కావటంతో నిలిచిన రాజరాజేశ్వరి నియోజకవర్గ ఎన్నికలను ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హంగే అంటున్నారు..!
కన్నడనాట హంగ్ తప్పదా? ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 స్థానాలను ఏ పార్టీ అందుకోలేదా? ముందునుంచీ అనుకుంటున్నట్టు జేడీఎస్ కింగ్‌మేకర్ అవబోతోందా? ఎగ్జిట్ పోల్స్ ఇదే చెబుతున్నాయి. కొన్ని చానళ్లు బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుందని తేల్చగా..మరికొన్ని కాంగ్రెసేనని పేర్కొన్నాయి. బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ప్రీపోల్స్ సర్వేల్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ తప్పదనే సంకేతాలిచ్చాయి. శనివారం సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 70% ఓటింగ్ నమోదైంది. దీని ఆధారంగా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ వివరాల సగటు ప్రకారం బీజేపీ 103 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలుండగా.. 86 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో, జేడీఎస్ 31 సీట్లతో మూడో స్థానంలో నిలువనుంది. ఈ వివరాల ప్రకారం ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాల మేజిక్ ఫిగర్‌ను చేరుకోవటం లేదు. దీంతో జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారటం ఖాయంగా కనబడుతోంది. విడుదలైన అన్ని సర్వేల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లశాతంలో తేడా పెద్దగా లేదు. 2–3 శాతం తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే ఈ తేడాయే కనీసం 10కిపైగా సీట్లను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఏడు ప్రధాన సర్వే సంస్థల్లో ఐదు బీజేపీ, రెండు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నాయి. బీజేపీ వైపు కాస్త మొగ్గు వివిధ వార్తాసంస్థలు పలు సర్వే గ్రూపులతో కలిసి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో (కాంగ్రెస్‌కు 112 సీట్లు) తప్ప మిగిలిన అన్నింటిలోనూ బీజేపీకే మెజారిటీ రానుందని వెల్లడవుతోంది. టైమ్స్‌నౌ గ్రూప్ కూడా రెండు సర్వే సంస్థలతో కలిసి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించింది. ఇందులో వీఎంఆర్తో కలిసి చేసిన సర్వే బీజేపీ 94 స్థానాల్లో, కాంగ్రెస్ 97 స్థానాల్లో, జేడీఎస్ 28 చోట్ల గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే టుడేస్ చాణక్యతో జరిపిన సర్వే మాత్రం బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావొచ్చని తెలిపింది. బీజేపీ 120 స్థానాల్లో.. కాంగ్రెస్ 73 సీట్లలో గెలిచే అవకాశముందని ఈ సర్వే పేర్కొంది. అయితే మిగిలిన సర్వేల ప్రకారం బీజేపీ పెద్ద పార్టీగా నిలుస్తున్నప్పటికీ జేడీఎస్ కింగ్‌మేకర్ కానుందని వెల్లడైంది. చివర్లో ప్రధాని మోదీ చేసిన సుడిగాలి ప్రచారం ఫలితంగానే బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే బీజేపీ తన సీట్ల సంఖ్యను కొంతమేర పెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీకి..! సాయంత్రం ఆరున్నర గంటలకు ఎన్నిక పూర్తవగానే టైమ్స్‌నౌ–సీఓటర్ మొదటగా సర్వే వివరాలు వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లొస్తాయని వెల్లడైంది. అయితే.. కాసేపటికే మిగిలిన సంస్థలు ఒక్కొక్కటిగా తమ సర్వే వివరాలు వెల్లడించాయి. వాటిలో రిపబ్లిక్ టీవీ, జన్‌కీ బాత్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే.. బీజేపీకి 105, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 సీట్లు రావొచ్చని పేర్కొంది. అయితే.. ఇండియాటుడే యాక్సిస్ సర్వే మాత్రం.. కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది. బీజేపీకి 85 సీట్లు ఇచ్చిన ఈ సర్వే.. కాంగ్రెస్ 112 చోట్ల గెలుస్తుందని, జేడీఎస్ 26 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. టుడేస్ చాణక్యతోపాటు న్యూస్ నేషన్, న్యూస్ఎక్స్–సీఎన్ఎక్స్, ఏబీపీ–సీఓటర్, రిపబ్లిక్ సర్వేలు బీజేపీ 100 సీట్ల మార్కును దాటుతుందని తెలిపాయి. టుడేస్ చాణక్య తన సర్వేలో మీరు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా 47 శాతం మంది అవునని, 40 శాతం మంది సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుతో సంతృప్తికరంగానే ఉన్నామని పేర్కొన్నారు. కాగా, ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సంస్థ 70,500 శాంపిల్స్‌తో సర్వే చేసినట్లు వెల్లడించింది. మంగళవారం (మే 15న) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. పాత మైసూరులో కాంగ్రెస్! బాంబే కర్ణాటక, సెంట్రల్, కోస్తా కర్ణాటకల్లో బీజేపీ గత ఎన్నికల కన్నా బలం పుంజుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటి కారణంగానే కాంగ్రెస్ కన్నా ఎక్కువసీట్లు సంపాదించనున్నట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం కనబర్చనుంది. 50 సీట్లలో 28–30 సీట్లు ఈపార్టీకి వస్తా యని సర్వేలు పేర్కొన్నాయి. ముస్లిం, దళిత ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటకలో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ తప్పేట్లు లేదు. ఏ ప్రాంతంలో ఎవరికెన్ని..? బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రాంతాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవొచ్చనే విషయాన్ని గమనిస్తే.. కోస్తా కర్ణాటక: ఈ ప్రాంతంలో మొత్తం 21 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 13 చోట్ల గెలిచింది. కానీ ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ అత్యధికంగా 14–16 స్థానాలు గెలిచే అవకాశం ఉందని.. కాంగ్రెస్ 5–7 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కాంగ్రెస్ హయాంలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటాన్ని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామనీ ప్రకటించింది. ఇది బీజేపీకి అనుకూలంగా మారినట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బాంబే కర్ణాటక: ఇక్కడ 50 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమానస్థాయిలో 25–26 సీట్లు రావచ్చు. మహదాయి నదీ నీటి పంపకం విషయంలో మహారాష్ట్ర, గోవాతో కర్నాటకకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మోదీ ప్రచారంలో ప్రస్తావించారు. మహదాయినదీ వివాద పరిష్కారంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, ఆ సమస్యను తాము పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ ప్రభావం చూపింది. పాత మైసూర్: ఇక్కడ 55 స్థానాలు ఉన్నాయి. వక్కలిగ సామాజికవర్గం ఈ ప్రాంతంలో బలంగా ఉంటుంది. జేడీఎస్ అత్యంత బలంగా ఉన్న ప్రాంతం ఇదే! ఇక్కడ కాంగ్రెస్ 27–29 స్థానాలు, జేడీఎస్ 19–21, బీజేపీ 4–6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ వక్కలిగలకు కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎక్కువ స్థానాలు కేటాయించాయి. దేవెగౌడపై మోదీ సానుకూల వ్యాఖ్యలు చేసినా అది బీజేపీకి ఓట్లు సంపాదించిపెట్టలేక పోయిందని ఈ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ కర్ణాటక: ఇక్కడ మొత్తం 31 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ 15–17, కాంగ్రెస్ 14–16లు గెలిచే అవకాశం ఉంది. జేడీఎస్ ఒకస్థానానికి పరిమితం కావొచ్చు. బీదర్, గుల్బర్గా, రాయచూర్, యాదగిరి, కొప్పల్ జిల్లాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ మౌలిక వసతుల కల్పన, నీటి వనరుల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయి. దీంతోనే ఏ పార్టీకి ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వరు. సెంట్రల్ కర్ణాటక: ఈ ప్రాంతంలో 35 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ చిత్రదుర్గ, దావణగిరి, హవేరి, బళ్లారి జిల్లాలో శ్రీరాములు బలమైన నేతగా ఉన్నారు. అలాగే ఇక్కడ రెడ్డిబ్రదర్స్ ప్రభావం కూడా ఎక్కువ. ఈ ఎన్నికలను శ్రీరాములుతో పాటు రెడ్డిబ్రదర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ 22–24, కాంగ్రెస్ 9–11 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. జేడీఎస్‌కు 1–3 స్థానాలు దక్కొచ్చు. గ్రేటర్ బెంగళూరు: బెంగళూరు రీజియన్‌లో 30 స్థానాలున్నాయి. బీజేపీ 18–20, కాంగ్రెస్ 8–10, జేడీఎస్ 2 స్థానాలు గెలవచ్చు. నగరంలో పారిశుద్ధ్యం లేకపోవటంతో పాటు నేరాలు పెరగటం, మహిళల భద్రతపై అనుమానాలు బీజేపీకి వరంగా మారాయి. దీంతోపాటు ట్రాఫిక్, కాలుష్యం సిటీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ నెల 17న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తా. 15న ఢిల్లీకి వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తా. మా పార్టీ 140– 150 సీట్లు గెలుపొందుతుంది. – బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని యడ్యూరప్ప చెప్పడాన్ని చూస్తే ఆయన మతి భ్రమించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితి లేదు. మేమే మళ్లీ అధికారం చేపడతాం. 120కి పైగా స్థానాల్లో గెలుస్తాం. బీజేపీకి 60–65 స్థానాలు కూడా దక్కవు. – కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శివమొగ్గ జిల్లా శికారిపురలో ఓటేసిన యడ్యూరప్ప మైసూరు జిల్లాలో కుమారుడు యతీంద్రతో సిద్దరామయ్య రామ్‌నగర్‌లో ఓటేసిన కుమారస్వామి, ఆయన భార్య అనిత -
ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం
♦ పూర్తి వాటా విక్రయించిన ఐటీసీ ♦ డీల్ విలువ రూ.160 కోట్లు న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ తన అమెరికా పూర్తి అనుబంధ సంస్థ, కింగ్ మేకర్ మార్కెటింగ్‌లో పూర్తి వాటాను విక్రయించనున్నది. ఈ వాటాను రూ.160 కోట్లకు విక్రయించనున్నామని ఐటీసీ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నమోదైన కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ.. ఐటీసీ తయారు చేసిన సిగరెట్లను అమెరికాలో పంపిణి చేస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీలో పూర్తి వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనను తమ కార్పొరేట్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని ఐటీసీ వివరించింది. దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఈ నెల 8న జరిగిందని, ఈ విక్రయానికి అమెరికాలోని వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. ఏస్, చక్కర్స్, హై-వాల్, గోల్డ్ క్రెస్ట్బ్రాండ్లను కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ పంపిణి చేస్తోంది. ఈ విక్రయం పూర్తయిన తర్వాత కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ తమ అనుబంధ కంపెనీగా కొనసాగదని ఐటీసీ స్పష్టం చేసింది. ఈ వాటా విక్రయ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీసీ షేర్ అర శాతం లాభపడి రూ.240 వద్ద ముగిసింది. -
మేకర్ ఏంది లోకేష్ బాబూ!! కింగ్ అనలేవా..?
‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటి కింగ్ మేకర్ అవుతుంది’ - ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఉవాచ. జీహెచ్ఎంసీ టీడీపీ అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చే యిస్తూ శుక్రవారం ఆయన కింగ్‌మేకర్ ప్రకటన చేశారు. ఒకవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆపార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, రమణ వంటి వాళ్లు మీడియా మైకుల ముందు బల్లగుద్ది మరీ చెబుతుంటే... ఏకంగా పార్టీ అధినేత తనయుడే ‘కింగ్ మేకర్’ అవుతాం అనడాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కింగ్ ఎవరు అనేది నిర్ణయించేది కింగ్ మేకర్. అంటే మేయర్ ఎవరో నిర్ణయించేది తెలుగుదేశం అని లోకేష్ చె పుతున్నారు అంటే మేయర్ సీటును గెలిచే సీను తెలుగుదేశం పార్టీకి లేదని ఆయనే స్వయంగా అంగీకరించారన్న మాట. దీనిపై తెలుగుదేశంకు చెందిన ఓ నాయకుడు స్పందిస్తూ ‘మా లోకేష్ బాబు చిన్న పిల్లోడు. ట్విట్టర్లో ట్వీట్ చేయడమొక్కటే ఆయనకు తెలుసు. ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే కామెంట్ చేశారు. ఇప్పుడే విమర్శలు చేస్తే ఎలా ?’ అని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవాలు దాచుకోలేక అప్పుడప్పుడు బయటపడుతుంటారని, లోకేష్ కూడా అదే చేశారని సన్నాయి నొక్కులు నొక్కాడా నేత. -
తెలంగాణాలో కింగ్ మేకర్‌గా వైసీపీ: గట్టు