మేకర్ ఏంది లోకేష్ బాబూ!! కింగ్ అనలేవా..? | what is the maker lokesh babu!! you dont told king | Sakshi
Sakshi News home page

మేకర్ ఏంది లోకేష్ బాబూ!! కింగ్ అనలేవా..?

Published Sun, Jan 24 2016 3:36 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

మేకర్ ఏంది లోకేష్ బాబూ!!  కింగ్ అనలేవా..? - Sakshi

మేకర్ ఏంది లోకేష్ బాబూ!! కింగ్ అనలేవా..?

‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటి కింగ్ మేకర్ అవుతుంది’ - ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఉవాచ. జీహెచ్‌ఎంసీ టీడీపీ అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చే యిస్తూ శుక్రవారం ఆయన కింగ్‌మేకర్ ప్రకటన చేశారు.

ఒకవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆపార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, రమణ వంటి వాళ్లు మీడియా మైకుల ముందు బల్లగుద్ది మరీ చెబుతుంటే... ఏకంగా పార్టీ అధినేత తనయుడే ‘కింగ్ మేకర్’ అవుతాం అనడాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కింగ్ ఎవరు అనేది నిర్ణయించేది కింగ్ మేకర్. అంటే  మేయర్ ఎవరో నిర్ణయించేది తెలుగుదేశం అని లోకేష్ చె పుతున్నారు అంటే మేయర్ సీటును గెలిచే సీను తెలుగుదేశం పార్టీకి లేదని ఆయనే స్వయంగా అంగీకరించారన్న మాట.

దీనిపై తెలుగుదేశంకు చెందిన ఓ నాయకుడు స్పందిస్తూ ‘మా లోకేష్ బాబు చిన్న పిల్లోడు. ట్విట్టర్‌లో ట్వీట్ చేయడమొక్కటే ఆయనకు తెలుసు. ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే కామెంట్ చేశారు. ఇప్పుడే విమర్శలు చేస్తే ఎలా ?’ అని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవాలు దాచుకోలేక అప్పుడప్పుడు బయటపడుతుంటారని, లోకేష్ కూడా అదే చేశారని సన్నాయి నొక్కులు నొక్కాడా నేత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement