kottapalli subbarayudu
-
చంద్రబాబు నన్ను మోసం చేశాడు..
సాక్షి, నర్సాపురం : పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామం. మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం ఆయన రాజీనామా పత్రాలపై తన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నన్ను, నా ప్రజలను నమ్మించి మోసం చేశాడు. కనీసం నన్ను సంప్రదించకుండా నర్సాపురం సీటు కేటాయించడం చాలా బాధాకరం. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధలేదు. కానీ నమ్మకద్రోహం చేయడం నా ప్రజలు ఆవేదన చెందారు. నాతో పాటు పదిమంది కౌన్సిలర్లు, వేలాదిమంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేస్తున్నాం. చదవండి...(వైఎస్ జగన్‌ను కలిసిన కొత్తపల్లి సుబ్బారాయుడు) వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. నా ప్రతాపం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో చూపిస్తాను. రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తా.’ అని స్పష్టం చేశారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్న (ఆదివారం) వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన విషయం విదితమే. -
వైఎస్ జగన్‌తో కొత్తపల్లి, వంటేరు భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. తాము అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, ఒక మంచి వాతావరణంలో చర్చించుకుని తామిద్దరమూ ఒక అవగాహన, ఆలోచనకు వచ్చామని కొత్తపల్లి మీడియాకు వెల్లడించారు. జగన్ చెప్పిన మాటలతో తాను 100 శాతం ఏకీభవించానన్నారు. ఈ నెల 28న జగన్ తమ జిల్లాలో పర్యటించనున్నందున అప్పుడు పార్టీలో చేరడమా.. లేక అంతకు ముందుగానే చేరడమా అనేది తర్వాత చెబుతాననని అన్నారు. మరోవైపు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా ఆదివారం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న తాను వి.విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల ప్రోద్భలంతో ఇకపై క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇదే విషయం జగన్‌కు తెలియజేశానన్నారు. పార్టీలో చేరిన గిరిజన నేత శంకర్‌నాయక్ గిరిజన సంక్షేమ సంఘం నేత వడిత్యా శంకర్‌నాయక్ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత ఐదేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలనలో రాష్ట్రంలో గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు అన్యాయమై పోయారని శంకర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మచిలీపట్నంకు చెందిన వైద్యురాలు, ఏపీసీసీ మాజీ కార్యదర్శి బల్లెం రాధికా మాధవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే దేవినేని చేరిక సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రేపల్లె ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఆదివారం పార్టీలో చేరారు. రేపల్లె నియోజకవర్గంలోని రావిఅనంతవరం గ్రామం నుంచి వేలాది మందితో ర్యాలీగా వచ్చి, జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీడీపీ కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. వీరికి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మోపిదేవి వెంకట రమణరావు పార్టీలోకి ఆహ్వానం పలికారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన కొత్తపల్లి
సాక్షి, హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ... వైఎస్ జగన్‌తో ఏకాభిప్రాయం కుదిరింది. నరసాపురం కార్యకర్తల సమక్షంలో నా నిర్ణయం ప్రకటిస్తా. మేము మాట్లాడుకున్న విషయాలను కార్యకర్తల మధ్యలో చెబితేనే బాగుటుంది. మా నియోజకవర్గంలో మా కార్యకర్తలు, నాయకులకు సమక్షంలో తెలియచేస్తాను’ అని తెలిపారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నరసాపురం అసెంబ్లీ టికెట్ ఇస్తానని చివరి వరకూ నమ్మించి మోసం చేశారు. దీంతో ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు, టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌తో కొత్తపల్లి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, గిరిజన నాయకుడు శంకర్ నాయక్, మచిలీపట్నంకు చెందిన మాధవిలతా తదితరులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
కొత్తపల్లి ప్రమాణ స్వీకారానికి జనం ఝలక్
-
నవంబర్‌లో 'పశ్చిమ'కు వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం నేతలకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. త్వరగా గ్రామ కమిటీలను పూర్తి చేయాలని వైఎస్ జగన్ సూచించారు. సమావేశం అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తామని అన్నారు. పామాయిల్ రైతులు గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతున్నారని, రైతుల సమస్యలపై జిల్లాలో పర్యటించాలని వైఎస్ జగన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. నవంబర్ మొదటి వారంలో వైఎస్ జగన్ జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఉద్యమాలు ఉధృతం చేస్తామని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. -
నవంబర్‌లో 'పశ్చిమ'కు వైఎస్ జగన్
-
బాబు మాటలన్నీ ముడుపులకోసమే
- వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, కొత్తపల్లి ధ్వజం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చడానికీ, తన అవినీతి అంశాలను మరుగుపరచడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడులు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం తాజాగా ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొస్తానని ప్రకటనలు చేశారని, అదెలా సాధ్యమని పార్థసారథి ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుల ద్వారా సాగులోకి తెచ్చిన 69 లక్షల ఎకరాలేనన్నారు. వీటిలో 20-25 లక్షల ఎకరాలు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాగులోకి తెచ్చినవేనని తెలిపారు. ఇప్పుడు ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెస్తాననడం ప్రజలను మభ్యపెట్టడానికి కాక మరేంటని ఆయన దుయ్యబట్టారు. చెరువు మట్టిని అమ్ముకుంటున్నారు.. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని టీడీపీ నేతలు, కార్యకర్తలు రియల్ఎస్టేట్, ఇతర వ్యాపార అవసరాలకు అమ్ముకోవడం కోసమే నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. పోలవరం, పట్టిసీమ, గోదావరి జలాలపై బహిరంగ చర్చకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని ఆయన సవాలు విసిరారు. ఏడాదిలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ పని చే శారు? ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అవకాశాలు పెరగాలంటే ఒక్క పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఏడాదికాలంలో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారు? కొత్తగా ఎంత పని పూర్తిచేశారో శ్వేతపత్రం ద్వారా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. -
నరసాపురం.. రసవత్తరం
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: నరసాపురం మునిసిపల్ ఎన్నికల పోరు హోరాహోరీ కానుంది. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే విశ్లేషణలతో ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా మారింది. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీలో చేరడంతో మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా అయిదేళ్లుగా పట్టణంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టోంది. పట్టణంలో సరైన నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారిం దట. పట్టణంలోని 31 వార్డులకు గాను అత్యధిక వార్డుల్లో వైసీపీ పట్టు బిగించింది. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య ఉన్నా 16 వార్డుల్లో వైసీపీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులను ముందుగా ప్రకటించినా ఆర్థికంగా బలమైన వారు కాకపోవడం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. దీంతో స్వతంత్ర అభ్యర్థులపై గేలం వేయడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం. నువ్వా..నేనా.. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రత్యర్థి పార్టీని తలదన్నేవారిని వార్డు అభ్యర్థులుగా ఎంపిక చేశారని, దీంతో విజయం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 31 వార్డులకు గాను 29 వార్డుల్లో వైసీపీ, టీడీపీ తలపడుతున్నాయి. 13, 16 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు. 16 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 11 వార్డుల్లో టీడీపీ, నాలుగు వార్డుల్లో ఇరుపార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. వైసీపీకు మత్స్యకారుల మద్దతు వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ద్వార సత్యశివప్రసాదరావు (సాయినాథ్‌ప్రసాద్) 14 వార్డు నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ మత్స్యకార ఓటర్లే కీలకం. మత్స్య కార సంఘ పట్టణ అధ్యక్షుడు అద్దంకి వెంకటేశ్వరరా వు మద్దతు తెలపడంతో సాయినాథ్‌ప్రసాద్ గెలుపు తథ్యమని నాయకులు భావిస్తున్నారు. 7 వార్డులో టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పసుపులేటి రత్నమాల పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమె స్వతంత్ర అభ్యర్థి చెన్నా వెంకట రామయ్య(రమేష్) నుంచి గట్టిపోటీని ఎదుర్కోనున్నారు. రమేష్ ఎమ్మెల్యే కొత్తపల్లి అనుచరుడిగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఆయనకు ప్రజల మద్దతు మెండుగా ఉంది. ఈ వార్డులో తమ అభ్యర్థిని బరిలో దింపకుండా రమేష్‌కు వైసీపీ మద్దతు ప్రకటించింది. -
జన బలం ఉన్న నేత జగన్
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : దేశంలో ప్రజాబలం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక 14వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కొత్తపల్లి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాదరాజుతో కలిసి మాట్లాడారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారన్నారు. నరసాపురం మునిసిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా సాయినాథ్ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. 31 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏడాదిలోనే వశిష్ట వంతెన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాదిలోనే నరసాపురం వశిష్ట వంతెన నిర్మాణం జరుగుతుందని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. వంతెన ప్రాధాన్యతను, ఇక్కడి ప్రజల కోరికను జగన్మోహన్రెడ్డి అర్థం చేసుకున్నారన్నారు. పట్టణంలో పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే వైసీపీని అధికారంలోకి తేవాలన్నారు. జిల్లాలోని అత్యధిక మునిసిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందన్నారు. చైర్మన్ అభ్యర్థి సాయినాథ్ ప్రసాద్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, పార్టీ సీనియర్ నేతలు పీడీ రాజు, పాలంకి ప్రసాద్, ఏడిద కోట సత్యనారాయణ (వైకేఎస్), దొంగ గోపి, కూనపరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఆయన నరసాపురం చేరుకుంటారు. ఈలోపు గన్నవరం రోటరీ క్లబ్బులో వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం సాయంత్రం నరసాపురం స్టీమర్ రోడ్డులో వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.