Kumari Srimathi Movie
-
అలా ఆలోచించే వాడు దొరికితే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్
నిత్యా మీనన్.. ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగని ఏ పాత్ర పడితే ఆ పాత్రను ఒప్పుకోదు. నటనకు మాత్రమే అవకాశం ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ వెబ్ స్క్రీన్ మీదా అభినయిస్తున్న ఆమె గురించి కొన్ని వివరాలు.. నిత్యా మీనన్ వాళ్లది బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబం. ఎనిమిదేళ్ల వయసులోనే.. ఫ్రెంచ్–ఇండియన్ ఆంగ్ల చిత్రం ‘హనుమాన్’లో నటించింది. ‘స్టార్క్ వరల్డ్ కేరళ’ అనే టూరిజం మ్యాగజైన్లో నిత్యా ఫొటో చూసిన మోహన్ లాల్.. ఆమెకు ‘ఆకాశ గోపురం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చి మలయాళ చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘జోష్’తో కన్నడంలో, ‘అలా మొదలైంది’ తో తెలుగులో, ‘నూట్రన్ బదు’ తో తమిళంలో, ‘మిషన్ మంగళ్’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అన్నీ భాషల్లోనూ సహజ నటిగా పేరొందింది నిత్యా. ఎన్నో అవార్డులూ అందుకుంది. పలు సినిమాల్లో పాటలు కూడా పాడి తన గాన ప్రతిభనూ చాటింది. సినిమాల్లోనే కాదు.. సిరీస్, టీవీ షో ల్లోనూ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ‘బ్రీత్: ఇన్ టు ద షాడోస్’, ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయంగా వెబ్ వీక్షకులను అబ్బురపరచింది. తెలుగులో ఇండియన్ ఐడల్ షోకి హోస్ట్‌గానూ వ్యవహరించింది. ‘స్కైలాబ్’ అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ఈ మధ్యనే ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించి యూట్యూబ్ వరల్డ్‌లోకీ ఎంటర్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌తో అలరిస్తోంది. ఆమె ప్రధాన భూమిక పోషించిన మలయాళ వెబ్ సిరీస్ ‘మాస్టర్ పీస్’ కూడా స్ట్రీమింగ్కి రెడీగా ఉంది. నేను పక్కా ట్రేడిషనల్. మన సంస్కృతిని చాలా గౌరవిస్తా. కానీ పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉంది. పెళ్లి.. సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. – నిత్యా మీనన్ -
ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు ఉన్న మలయాళ కుట్టి నిత్యా మేనన్ సింగర్‌గా, హీరోయిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ నిత్యామీనన్ పెళ్లి గురించి ఏడాది నుంచి పలు రూమర్లు వస్తూనే ఉన్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను నిత్యా మేనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఏలాంటి నిజం లేదని చెప్పింది ఈ బ్యూటీ. (ఇదీ చదవండి: ఫోన్ ఇచ్చేస్తా అంటూ హీరోయిన్‌కు కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి) సౌత్ ఇండియాలో విభిన్నమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా పెళ్లి గురించి తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రముఖ మలయాళ నటి పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్నం, గృహహింస వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకుందని.. ఈ భయమే నిత్యా మేనన్‌ను వెంటాడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఇంట్లోని వారందరూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఈ బలమైన కారణం వల్ల ఆమె పెళ్లికి నో చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటే తాను కూడా గృహహింస భారిన పడాల్సి వస్తుందని ఆమె భావిస్తోందని చెప్పాడు. ఆమె అధిక బరువు కారణంగా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు రంగనాథన్ తెలిపాడు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. తాజాగా నిత్యా మీనన్ 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు
శుక్రవారం వస్తుందంటే చాలు చిల్ అవ్వాలి, సినిమాలు చూడాలి అని అందరూ ఫిక్సయిపోతారు. ఈసారి థియేటర్లలో 'స్కంద', 'చంద్రముఖి 2', 'పెదకాపు' లాంటి చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో అయితే ఏకంగా ఒక్కరోజే 37 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. (ఇదీ చదవండి: మీదకొచ్చిన శివాజీ.. చాలా ఇబ్బందిపడ్డ లేడీ కంటెస్టెంట్!) సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు-సిరీసులు ఉన్నాయి. వాటిలో వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ కాగా, కొత్తగా మరికొన్ని మూవీస్- వెబ్ సిరీసులు వచ్చి చేరాయి. అలా ఓవరాల్‌గా ఈ వారాంతంలోనూ 37 వరకు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. దిగువ జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురవారం రిలీజైనట్లు. మిగతావన్నీ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతున్నాయని అర్థం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ జెన్ వీ - ఇంగ్లీష్ సిరీస్ హూజ్ యువర్ గైనక్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) డోబుల్ డిస్కోర్షో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్) కుమారి శ్రీమతి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఆహా దోచేవారెవరురా - తెలుగు సినిమా పాపం పసివాడు - తెలుగు సిరీస్ డర్టీ హరి - తమిళ చిత్రం హర్కరా - తమిళ సినిమా (అక్టోబరు 01) హాట్‌స్టార్ కిక్ - తమిళ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) కింగ్ ఆఫ్ కొత్త - తెలుగు డబ్బింగ్ సినిమా లాంచ్ ప్యాడ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ తుమ్ సే నా హో పాయేగా - హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్ డునాట్ డిస్ట్రబ్ - టర్కీష్ మూవీ ఫెయిర్ ప్లే - ఇంగ్లీష్ సినిమా చూనా - హిందీ సిరీస్ నో వేర్ - స్పానిష్ సినిమా రెప్టైల్ - ఇంగ్లీష్ మూవీ ద ర్యాట్ క్యాచర్ - ఇంగ్లీష్ చిత్రం పాయిజన్ - ఇంగ్లీష్ మూవీ (సెప్టెంబరు 30) ఖుషి - తెలుగు సినిమా (అక్టోబరు 01) స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ - ఇంగ్లీష్ సినిమా (అక్టోబరు 01) ద ఆస్కార్స్ ఫాంటసీ - తగలాగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద స్వాన్ - ఇంగ్లీష్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్) ద డార్క్నెస్ వితిన్ లా లెజ్ డెల్ ముండో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్) ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ - ఇంగ్లీష్ చిత్రం (ఇప్పటికే స్ట్రీమింగ్) సోనీ లివ్ అడియై! - తమిళ సినిమా ఏజెంట్ - తెలుగు మూవీ జీ5 అంగ్షుమాన్ MBA - బెంగాలీ సినిమా ఐ కిల్డ్ బాపూ - హిందీ మూవీ లయన్స్ గేట్ ప్లే సింపతీ ఫర్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా ద కమెడియన్ - హిందీ షార్ట్ ఫిల్మ్ బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ - పంజాబీ షార్ట్ ఫిల్మ్ (సెప్టెంబరు 30) బేబాక్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 01) బుక్ మై షో బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా స్కూబీ డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ మూవీ సైనా ప్లే ఎన్నీవర్ - మలయాళ చిత్రం (ఇదీ చదవండి: హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు
అందరూ వినాయక చవితి హడావుడిలో బిజీగా ఉన్నారు. ఓవైపు అన్నదానాలు, మరోవైపు నిమజ్జనాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారంలోపు దాదాపు నిమజ్జనాలన్నీ అయిపోతాయి. దీంతో మళ్లీ బిజీ లైఫ్. మరోవైపు ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకోసమా అన్నట్లు ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: తప్పు ఒప్పుకోని శివాజీ.. ఎలిమినేట్ అయిన దామినితో వాదన!) గత కొన్నివారాలతో పోలిస్తే.. ఈసారి మాత్రం లిస్టు చాలా పెద్దగా ఉంది. ఇందులో తెలుగు హిట్, యావరేజ్ సినిమాలతో పాటు పలు తెలుగు వెబ్ సిరీసులు కూడా ఉన్నాయండోయ్. మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఖుషి, ఏజెంట్ చిత్రాలతో పాటు కుమారి శ్రీమతి, పాపం పసివాడు లాంటి సిరీసులు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీ చిత్రాలు (సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 01) నెట్‌ఫ్లిక్స్ లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25 ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 26 ఫర్గాటెన్ లవ్ (పోలిష్ సినిమా) - సెప్టెంబరు 27 ఓవర్‌హౌల్ (పోర్చుగీస్ మూవీ) - సెప్టెంబరు 27 స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్ చిత్రం) - సెప్టెంబరు 27 ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27 క్యాజల్వేనియా: నోక్ట్రన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 27 ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 28 లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28 ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29 చూనా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 29 నో వేర్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 29 రెప్టైల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 29 ఖుషి (తెలుగు సినిమా) - అక్టోబరు 01 స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 01 అమెజాన్ ప్రైమ్ ద ఫేక్ షేక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26 హాస్టల్ డేజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27 డోబుల్ డిస్కోర్షో (స్పానిష్ చిత్రం) - సెప్టెంబరు 28 కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 28 జెన్ వీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29 హాట్‌స్టార్ ఎల్-పాప్ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 27 ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 27 కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 29 లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29 తుమ్ సే నా హో పాయేగా (హిందీ సినిమా) - సెప్టెంబరు 29 ఆహా పాపం పసివాడు (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 29 డర్టీ హరి (తమిళ చిత్రం) - సెప్టెంబరు 29 సోనీ లివ్ చార్లీ చోప్రా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27 అడియై! (తమిళ సినిమా) - సెప్టెంబరు 29 ఏజెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 29 జీ5 అంగ్షుమాన్ MBA (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 29 బుక్ మై షో బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29 సైనా ప్లే ఎన్నీవర్ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు లయన్స్ గేట్ ప్లే సింపతీ ఫర్ ద డెవిల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29 జియో సినిమా ద కమెడియన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - సెప్టెంబరు 29 బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్) - సెప్టెంబరు 30 బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 01 (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీల్లోకి ఆ రెండు మూవీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
జనాలకు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో కంటే వీటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఒకప్పుడు చోటామోటా యాక్టర్స్ ఓటీటీల కోసం మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా స్టార్స్ నటించిన సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీసులు కావొచ్చు నేరుగా ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలా స్టార్ హీరోయిన్స్ నటించిన ఓ మూవీ, ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: తెలుగు యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) మలయాళ బ్యూటీ నిత్యామేనన్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కమ్ సింగర్ అయిన ఈమె.. క్యూట్ యాక్టింగ్‌తో పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. అయితే ఈమెకు రానురాను తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఓటీటీల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. అలా ఈమె ప్రధాన పాత్రలో నటించి 'కుమారి శ్రీమతి'.. ఈ సెప్టెంబరు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. Get ready to laugh, cry and cheer as Srimathi takes on life’s challenges head-on. 🏡#KumariSrimathiOnPrime streaming from September 28th on @PrimeVideoIN.#KumariSrimathi @MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye @iamThiruveer @PatnaikPraneeta @ItsActorNaresh… pic.twitter.com/EzHzY648rE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2023 తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో, ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తీసిన హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. దీన్ని త్వరలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వినాయక చవితి సందర్భంగా ప్రకటించిన ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్ మూవీ/వెబ్ సిరీస్ కావడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) So excited for this one..My next release#Mansion24 Watch at your own risk ⚠️#Mansion24OnHotstar coming soon..!!#DisneyPlusHotstar. @avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie @mgabhinaya… pic.twitter.com/uWRdqFwbRo — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) September 18, 2023 -
ఓటీటీ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ
ఆమె స్టార్ హీరోయిన్.. దక్షిణాదిలో కన్నడ తప్పించి అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ గత కొన్నాళ్ల నుంచి రూట్ మార్చేసింది. ఓటీటీల్లో దాదాపుగా మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) పైన చెప్పిందంతా కూడా నిత్యామేనన్ గురించి. 'అలా మొదలైంది' మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి. మరోవైపు ఈమె బరువు కూడా పెరగడంతో ఛాన్సులు క్రమంగా తగ్గిపోయాయి. మరోవైపు ఓటీటీ అవకాశాలు తలుపుతట్టాయి. 'బ్రీత్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీసులో నటించిన నిత్యామేనన్.. ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలా 'మాస్టర్ పీస్' అనే డబ్బింగ్ సిరీస్ తో త్వరలో రాబోతున్న ఈమె నుంచి మరో స్ట్రెయిట్ ఓటీటీ మూవీ కూడా రెడీ అయిపోయింది. 'శ్రీమతి కుమారి' పేరుతో తీస్తున్న ఈ తెలుగు చిత్రాన్ని త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తుంటే నిత్యామేనన్.. బిగ్ స్క్రీన్ కంటే ఓటీటీలకే ఓటేస్తుందని అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ)