labour minister
-
ఐటీ కంపెనీలకు కార్మిక శాఖ మంత్రి కీలక సూచనలు
ఉద్యోగ భద్రత, ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఐటీ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ కీలక సూచనలు చేశారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తాజా ఇంటర్వ్యూలో ఆయన ఐటీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన బెంగళూరు సహా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీ సంస్థలకు ఇప్పటివరకూ ఉన్న మినహాయింపులు తొలగించి వాటిని తమ పరిధిలోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఆలోచిస్తోంది. ఈ ఆలోచన ఇప్పుడు ఏ స్థితిలో ఉందని ప్రశ్నించినప్పుడు దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ-బీటీ, పరిశ్రమలతో సహా సంబంధిత మంత్రులతో మాట్లాడుతామని సంతోష్ లాడ్ బదులిచ్చారు. ఆ వైఖరి మానుకోవాలి ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వ్యవహరించే విధానాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. తమ కంపెనీలు రాత్రిపూట ఈ-మెయిల్ ఐడీలను బ్లాక్ చేయడం, తోటి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయకుండా ఆపడం వంటివి చేస్తున్నాయని చాలా మంది ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కానీ వారికి సహాయం చేసే యంత్రాంగం ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Wipro Rule: విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన కంపెనీలపై అజమాయిషి చూపించడం తమ ఉద్దేశం కాదని, కార్మిక చట్టాలు ముఖ్యమని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ వైఖరి మారాలని సూచించారు. పని వేళల గురించి.. ఐటీ కంపెనీలు గ్రాట్యుటీ, కనీస వేతనాలతో సహా అన్ని ఇతర నిబంధనలకు కట్టుబడి ఉంటున్నాయని, తమ ఆందోళన అంతా ఉద్యోగులను తొలగిస్తున్న విధానాలపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక పనివేళల గురించి మాట్లాడుతూ ఉద్యోగులకు కొన్నిసార్లు ఎక్కువ పని ఉంటుంది.. కొన్నిసార్లు తక్కువ పని ఉంటుంది. దీనిపై పెద్దగా అభ్యంతరం లేదని, ఉద్యోగుల సామాజిక భద్రతపైనే తాము దృష్టి పెట్టినట్లు మంత్రి సంతోష్ లాడ్ వివరించారు. -
మల్లారెడ్డి వర్సెస్ ఐటీ శాఖ.. కంచికి చేరని ల్యాప్‌టాప్ కథ!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్లో బోయిన్పల్లి ఠాణాకు చేరిన ల్యాప్‌టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాలని యోచిస్తున్నారు. మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్పల్లి ఠాణాలో రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్‌టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో పోలీసులు మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్‌టాప్ మాత్రం బోయిన్పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తామే ఆ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్‌టాప్‌ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రంతా నాటకీయ పరిణామాలు రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్టాప్ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్‌టాప్‌ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్‌టాప్‌ను ఠాణాలో భద్రపరిచారు. ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి -
దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు: కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో జరిపిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయం స్పష్టం అయినట్లు చెప్పారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పెన్షన్ పథకం కింద డిసెంబర్ 9నాటికి దేశంలో 45.83 లక్షల మంది కార్మికులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ళ వయసు కలిగి ఉండి నెలసరి ఆదాయం 15 వేల రూపాయలు లోబడి ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎన్పీఎస్ వంటి ప్రభుత్వ పథకాలలో సభ్యులుకాని వారు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పెన్షన్ పథకంలో చేరేందుకు ఆర్హులని మంత్రి వివరించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు నమోదైన 45 లక్షల మంది కార్మికులలో 31 లక్షల మంది కార్మికుల అకౌంట్లను ఆటో డెబిట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌తోపాటు ప్రపంచం అంతా ప్రభావితమైనందున ఈ పథకం కింద కార్మికుల నమోదు కూడా మందగించిందని అన్నారు. కార్మికులకు ఊరట కల్పించేందుకు కోవిడ్ కాలంలో ప్రీమియం చెల్లించని వారికి పెనాల్టీని ఎత్తివేసినట్లు చెప్పారు. చదవండి: సీఎం జగన్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు ఏపీలో 32 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు భారత వాతావరణ విభాగం ఆంధ్రప్రదేశ్‌లో 32 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, 61 ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేసినట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 974 కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు తీరప్రాంతంలోనే ఉన్నాయి. ఉష్ణమండల తుపాన్లతో కోస్తా ప్రాంతం ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. పెనుతుపాన్లు, ప్రచండమైన గాలులతో ఏర్పడే జలవిలయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో తరచుగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని మంత్రి అన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం తుపాను సంబంధించిన విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ల ముప్పు తప్పడం లేదని వివరించారు. చదవండి: ఏపీ లాసెట్: అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల -
5 లక్షల కంపెనీలు వ్యాపారం వదిలి వెళ్లిపోయాయ్
న్యూఢిల్లీ: గడిచిన ఆరేళ్ల కాలంలో నికరంగా 2 లక్షల కంపెనీలు దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి రావు ఇందరజిత్‌సింగ్ లోక్‌సభకు సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన ఆరేళ్లలో 5,00,506 కంపెనీలు మూతపడ్డాయి. ఇదే సమయంలో 7,17,049 కంపెనీలు కంపెనీల చట్టం 2013 కింద కొత్తగా నమోదయ్యాయి. ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ సమాచారం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22,557 కంపెనీలు మూతపడగా, 1,09,098 కంపెనీలు కొత్తగా నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం వారీగా చూస్తే.. 2016–17లో 12,808 కంపెనీలు, 2017–18లో 2,36,262 కంపెనీలు, 2018–19లో 1,43,233 కంపెనీలు, 2019–20లో 70,972 కంపెనీలు, 2020–21లో 14,674 కంపెనీలు మూతపడ్డాయి. 2018–19లో 1,23,938 కంపెనీలు, 2019–20లో 1,22,721 కంపెనీలు, 2020–21లో 1,55,377 కంపెనీలు కొత్తగా వచ్చాయి. -
పెట్రో నిరసన; 38 కి.మీ సైకిల్ తొక్కిన మంత్రి
కోల్‌కతా: పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.100 మార్కును చేరినందుకు నిరసనగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఒకరు 38 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు. కార్మిక శాఖ మంత్రి బేచారాం మన్నా హుగ్లీలోని తన నివాసం నుంచి బుధవారం ఉదయం 8 గంటలకు సైకిల్‌పై బయలు దేరి, మధ్యాహ్నం 12.30గంటలకు కోల్‌కతాలోని అసెంబ్లీ భవనం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట కొందరు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాల్లో పెట్రో ధరలు పెరగడం కూడా ఒకటి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరుకుంది. దీనిపై మేం నిరసన తెలిపాం’ అని తెలిపారు. సింగూర్ నుంచి టీఎంసీ తరఫున ఎమ్మెల్యే అయిన మన్నా..టాటా నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 2000వ సంవత్సరం లో చేపట్టిన నిరసనలతో వార్తల్లోకెక్కారు. -
కేంద్రమంత్రి కుటుంబంలో కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ (71) కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. మంత్రి భార్యకు, ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఆరుగురికి అక్టోబర్ 31, శనివారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన పార్లమెంటు సభ్యుడు గంగ్వార్ విలేకరులతో మాట్లాడుతూ తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ తన ఫ్యామిలీలో మరో ఏడుగురికి కరోనా సోకినట్టు వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు ఇటీవల ఢిల్లీ వెళ్లారని, బహుశా అక్కడే వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నానన్నారు. వీరంతా ఫరీదాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. తమ ఫ్యామిలీ వంటమనిషి కూడా అస్వస్థతకు గురి కావడంతోముందు జాగ్రత్తగా మరో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే తన మంత్రిత్వ శాఖలో కొందరు అధికారులకు కరోనా వైరస్ సోకిందని, వారినందరినీ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని ఆయన చెప్పారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 1,21,641 గా ఉంది. -
'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'
సాక్షి,వెలగపూడి : కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని 3వ బ్లాక్‌లో కర్మాగారాల శాఖ సంచాలకులు బాలకిషోర్ ఆధ్వర్యంలో 13 జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై మంత్రి సమీక్షించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగార యజమానులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అనధికార కర్మాగారాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులనుద్దేశించి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో విధులను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కర్మాగారాల యజమానులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. -
ఈఎస్ఐలో రూ.300 కోట్ల అవినీతిపై విచారణకు మంత్రి ఆదేశం
-
ఈఎస్ఐ అవినీతిపై విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి : ఈఎస్ఐలో జరిగిన రూ.300 కోట్ల మేర అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రుల అండదండలతో మందులను సరఫరా చేయకుండానే బిల్లులను నమోదు చేసి పెద్ద ఎత్తున అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. అవసరంలేని, గడువు ముగిసిపోయే మందులను సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండానే కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సరఫరాదారులతో అధికారులు కుమ్మకమయ్యారు. ఈఎస్ఐ కార్యాలయం అద్దెలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును స్వాహా చేసుకున్నారని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈఎస్ఐ అవినీతిపై విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి జయరామ్ శనివారం అధికారులను ఆదేశించారు. ఈ విచారణ బాధ్యతను కార్మిక శాఖ డైరెక్టర్‌కు అప్పగించారు. -
వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ –2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వేతనాలు, బోనస్‌లకు సంబం ధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు లోక్‌సభ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదిం చిన 24 సవరణల్లో 17 సవరణలను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి గంగ్వార్ తెలిపారు. అయితే, కనీస జీవన పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమన్నారు. కార్మిక సంఘాలు, యజమానులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. అదేవిధంగా, వేతనాల విషయంలో స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్లంటూ వివక్ష ఉండబోదన్నారు. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ఉన్న వేర్వేరు కార్మిక చట్టాలు వేతనానికి 12 రకాలైన నిర్వచనాలిచ్చాయని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తాజా బిల్లుతో ఇటువంటి సమస్యలుండవన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. -
రెగ్యులర్ చేయకపోతే సమ్మె తప్పదు
► విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ► కార్మిక మంత్రికి అవగాహన లేదు ► యూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబ్రహ్మాచారి అరసవిల్లి : రాష్ట్రంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజేషన్ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యూఈఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నాగబ్రహ్మాచారీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె తప్పదని స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని అవోపా కల్యాణ మండపంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెగ్యులరైజేషన్ అంశాన్ని పెట్టి ఇప్పుడు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ, తమిళనాడు , హర్యానా రాష్ట్రాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అంగీకారం తెలుపుతూ చర్యలకు దిగాయని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అసెంబ్లీలో విరుచుకుపడటం తప్ప కార్మికుల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారనే విషయం కూడా మంత్రికి తెలియకపోవడం దారుణమన్నారు. కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారని చెప్పడం మంత్రి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై మొదటి దశ పోరాటం చేశామన్నారు. అయినా కనీసం స్పందించకపోవడంతో రెండో దశగా జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇచ్చి త్వరలోనే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని ప్రకటించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇది తక్షణమే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సంఘ జిల్లా కార్యదర్శి పి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు యోగేశ్వరరావు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరరావు, కె.వి.కృష్ణారావు, జి.సుదర్శనరావు, రమణమూర్తి, త్రినాథరావు, కుమారస్వామి, సురేష్ బాబు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈపీఎఫ్వోపై దత్తాత్రేయ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన ప్రకటన చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పెట్టుబడుల శాతాన్ని భారీగా పెంచుతున్నట్టు ప్రకటించారు. ఒక వైపు కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమ వుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలో..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) పెట్టుబడుల పరిమితిని 10 శాతానికి పెంచుతున్నట్టు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో చెప్పారు. సుమారు 13 వేల కోట్ల రూపాయల రిటైర్ మెంట్ ఫండ్ ను పెట్టుబడిగా పెట్టనున్నట్టు గురువారం ప్రకటించారు. ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ 1,500 కోట్లు మిగిలిన ఆరు నెలల్లో రూ 11,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని తెలిపారు. కార్మికులు డబ్బుల సంరక్షణకు కట్టుబడి వున్నామని , వారి సొమ్ముకు మంచి లాభాలు రాబట్టడం తమ బాధ్యత అని మంత్రి చెప్పారు. 2015-16 సంవత్సరంలో రూ. 6,577 పెట్టుబడులకు మంచి ఫలితం వచ్చిన అనుభవం ఉందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ)సమావేశంలో రెండు సార్లు దీనిపై చర్చించామని..కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ( కార్మికమంత్రిత్వ శాఖ)బోర్డుల కంటే ఉత్తమమని లేబర్ సెక్రటరీ శంకర్ అగర్వాల్ చెప్పారు. మరోవైపు కార్మిక శాఖ నిర్ణయంపై కార్మిక నాయకులు అశోక్ సింఘ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈపిఎఫ్ఓ ట్రస్టీల ఆమోదం లేకుండా "ఏకపక్ష" నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అభ్యంతరాలను లక్ష్య పెట్టకుండా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని, దీనిపై మిగతా యూనియన్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకుడు సచ్ దేవ్ హెచ్చరించారు. -
ఈక్విటీ మార్కెట్లో ఈపీఎఫ్‌వో పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన ప్రకటన చేశారు. పటిష్ఠంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పెట్టుబడి శాతాన్ని మరింత పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిధుల్లో దాదాపు 12 శాతం వరకు దీ్ర్ఘకాలిక పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈనెల 22న జరగనున్న కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) సమావేశంలో, ఈటీఎఫ్‌లలో ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలతో కూడా చర్చలు జరుపుతున్నామని, గత ఏడాది కంటే ఎక్కువగానే పెట్టుబడులు ఉంటాయని దత్తాత్రేయ స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లకు నిధులు అవసరమని వివరణ ఇచ్చారు. 5 నుంచి 15 శాతం పెట్టుబడుటు పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి తమకు అనుమతి లభచిందన్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లు నిలకడగా ఉండనున్నాయని భావించిన మంత్రి మార్కెట్ పరిస్థితులను బట్టి దీర్ఘకాల పెట్టుబడి 10 నుంచి12 శాతానికి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. జూన్ 30 వరకు రెండు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లలో ఈపీఎఫ్ఓ రూ.7,468 కోట్లు పెట్టుబడి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ పెట్టుబడుల విలువ 7.45 శాతం పెరిగి రూ.8,024 కోట్లకు చేరిందని దత్తాత్రేయ తెలిపారు. సంస్థ నికర ఆదాయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టామని వాటిల్లో ఇది కూడా ఒకటని తెలిపారు. ఈ సంవత్సరం, మదుపు ఆదాయం రూ 1.35 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు చందాదార్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈపీఎఫ్ఓ జోన్లను పెంచుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ప్రస్తుతం 10 జోన్ల సంఖ్యను 21కి పెంచుతున్నట్టు తెలిపారు. ఆయా సంస్థల అలాగే గ్రామీణ, పట్టణ శివారు, అసంఘటిత రంగ, కాంట్రాక్టు కార్మికులను కూడా ఈపీఎఫ్ఓ పరిధిలోకి తెస్తున్నందున పీఎఫ్ చందాదార్ల సంఖ్య ప్రస్తుత 6 కోట్ల నుంచి 9 కోట్లకు చేరుతుందని మంత్రి వివరించారు. ఇందుకోసం పార్లమెంట్ లోప్రతిపాదించిన ఈపీఎఫ్ చట్ట సవరణను కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సి ఉందన్నారు. -
సింగరేణికి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు సింగరేణి సంస్థకు దక్కింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా సీఎండీ ఎన్.శ్రీధర్ అవార్డు అందుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. అలాగే బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి పాత రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సీఎండీ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. సింగరేణీయులు అందించిన సహకారం వల్లే సంస్థ అభివృద్ధి సాధించగలిగిందని ప్రశంసించారు. కార్మిక సంఘాల సహకారంతో సమ్మెలు లేని సంస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను పీఎఫ్ వడ్డీ రేటును 8.71 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాతపూర్వక సమాధానంలో సోమవారం లోక్ సభలో ప్రకటించారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపినట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2016 లో సమావేశంలో 8.8 శాతం ప్రతిపాదనలకు భిన్నంగా వడ్డీ రేటును నిర్ణయించడం మరో వివాదానికి దారితీయనుంది. మధ్యంతర ఉత్తర్వులపై ప్రశ్నించగా దీనిపై పురాలోచించే ఆలోచన లేదని దత్రాత్రేయ స్పష్టం చేశారు. సెవెన్త్ పే కమిషన్, దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తదుపరి సమీక్ష ఉంటుందన్నారు. మరోవైపు మంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సీబీటీ కమిటీ ప్రతిపాదించిన 9శాతం పెంపును కూడా వెనక్కి పెట్టి, మరింత తగ్గించడం అన్యాయమని విమర్శించాయి. మరోవైపు బంగారు ఆభరణాలపై విధించిన 1 శాతం పన్ను విషయంలో ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. ఒక శాతం తగ్గించే ఆలోచన లేదని మంత్రిత్వ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. కాగా ప్రభుత్వం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఒంటరవుతున్న అచ్చెన్న
కళా చుట్టూ నేతల ప్రదక్షిణ సమాచారం వెళ్ళినా మంత్రి మౌనం శ్రీకాకుళం : జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఒంటరవుతున్నారు. ఏడాదిన్నరపాటు జిల్లాలో హవా కొనసాగించిన ఆయన ఇపుడిపుడే కార్యకర్తల నుంచి దూరం అవుతున్నారు. కొన్నాళ్ళుగా అమరావతి శంకుస్థాపన పనిలో ఉన్న మంత్రికి ఇక్కడిసమాచారం తెలియడం లేదు. ఫోన్లో తాజా పరిస్థితిని నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకూ వెంట తిరిగి పనులు చేయించుకున్న దిగువశ్రేణి నేతలు కూడా ఇపుడు రూటు మారుస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం సొంత పనుల కోసం పక్కచూపులు చూస్తున్నారు. తాజా పరిణామాలతో మంత్రి కుటుంబ సభ్యులు అవాక్కవుతున్నారు. క్యాబినెట్లో సీటు పొంది అసెంబ్లీలో నోరుపారేసుకుని, రాష్ట్ర ప్రథమపౌరుడ్ని పరుషజాలంతో మాట్లాడిన మంత్రి పరిస్థితి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. నిన్న మంత్రి వెంట... నేడు కళా చెంత... జిల్లాలోని మంత్రి వెంటే తిరిగిన నేతలు సైతం ఇపుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కేవలం ఎచ్చెర్ల నియోజకవర్గానికే పరిమితమైన కళాకు ఇపుడు రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కడంతో పనుల కోసం ఆయన వెంట ప్రదక్షిణలు చేస్తున్నారు. పాలకొండ కోటదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన కళా చుట్టూ అక్కడి కాపునేతలంతా చేరిపోయారు. తాజాగా శుక్రవారం శ్రీకాకుళం పట్టణాధ్యక్షుడు మాదారపు వెంకటేష్ సహా 30మంది ప్రత్యేక వాహనాల్లో రాజాం వెళ్ళి కళాను కలుసుకున్నారు. బుధవారం జరిగిన కళా అభినందన సభను బహిష్కరించిన వీళ్ళంతా నాటి సంఘటనకు కారణాలను వివరించి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకే రాజాం వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా వెళ్ళినవారంతా శ్రీకాకుళం ఎమ్మెల్యే అనుచరులే కావడం విశేషం. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రి వెంటే తిరిగిన ఎమ్మెల్యే ఇపుడు రూటు మార్చినట్టు తమ్ముళ్ళే ప్రచారం చేస్తున్నారు. జిల్లా అధిష్టానంపైనా ఫిర్యాదు ఇదిలా ఉంటే జిల్లా అధిష్టానంపై దిగువశ్రేణి నేతలు కొంతమంది శుక్రవారం కళాకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. బుధవారం నాటి కార్యక్రమం విఫలమైన నేపధ్యంలో జిల్లా అధ్యక్షురాలు శిరీష, పలాస ఎమ్మెల్యే శివాజీల మొండి వైఖరే కారణమని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి సన్మాన కార్యక్రమానికి పట్టణాధ్యక్షున్ని వేదికపైకి పిలవాలని కోరితే శివాజీ మాత్రం ఒకరిని పిలిస్తే మండల నాయకులను సైతం పిలవాల్సి వస్తుందని ఘీంకరించారని, జిల్లా అధిష్టానంపై చర్య తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కొన్నాళ్ళుగా శివాజీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే ఈ చర్యలకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులో కళా ప్రమాణస్వీకారం చేసినపుడు, కళా తొలిసారి జిల్లాకు వచ్చినపుడు కలవని నేతలు ఇన్నాళ్ళ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి అభినందించడంపైనా చర్చ జరుగుతోంది. ఇదంతా జిల్లా మంత్రిని ఒంటరిని చేసేందుకేనన్న ప్రచారమూ ఉంది. -
మెడికల్ రిప్స్‌ను హైస్కిల్డ్ వర్కర్స్‌గా గుర్తించాలి
ఒంగోలు టౌన్ : మెడికల్ రిప్రజంటేటివ్స్‌ను హైస్కిల్డ్ వర్కర్స్‌గా గుర్తించి న్యాయమైన వేతనం చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ.గిరి మాట్లాడుతూ కొంతకాలంగా తమ కంపెనీల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని చెప్పారు. కార్మిక శాఖ మంత్రి నుంచి కలెక్టర్ వరకు చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మెడికల్ రిప్రజంటేటివ్స్‌కు సంబంధించిన స్పెషల్ యాక్ట్ 1976ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేడేను సెలవు దినంగా అన్ని కంపెనీలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేల్స్ ప్రమోషనల్ ఎంప్లాయీస్ అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని గిరి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రసాద్, కృష్ణమోహన్, అచ్యుత్, వేణు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.