పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను పీఎఫ్ వడ్డీ రేటును 8.71 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాతపూర్వక సమాధానంలో సోమవారం లోక్ సభలో ప్రకటించారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపినట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2016 లో సమావేశంలో 8.8 శాతం ప్రతిపాదనలకు భిన్నంగా వడ్డీ రేటును నిర్ణయించడం మరో వివాదానికి దారితీయనుంది.
మధ్యంతర ఉత్తర్వులపై ప్రశ్నించగా దీనిపై పురాలోచించే ఆలోచన లేదని దత్రాత్రేయ స్పష్టం చేశారు. సెవెన్త్ పే కమిషన్, దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తదుపరి సమీక్ష ఉంటుందన్నారు. మరోవైపు మంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సీబీటీ కమిటీ ప్రతిపాదించిన 9శాతం పెంపును కూడా వెనక్కి పెట్టి, మరింత తగ్గించడం అన్యాయమని విమర్శించాయి.
మరోవైపు బంగారు ఆభరణాలపై విధించిన 1 శాతం పన్ను విషయంలో ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. ఒక శాతం తగ్గించే ఆలోచన లేదని మంత్రిత్వ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. కాగా ప్రభుత్వం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.