line clear
-
ఇలాగైతే ఎప్పటికయ్యేనో?
సాక్షి, హైదరాబాద్: ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్ ఈనెల 9వ తేదీ(శనివారం) తర్వాత కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్‌లో కేవలం 31 శాతం దరఖాస్తులు మాత్రమే క్లియర్ అయిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కార్యాచరణ కొనసాగుతుందని రెవెన్యూ, ధరణి పునర్మి ర్మాణ కమిటీ వర్గాలు చెపుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న 2,46,536 దరఖాస్తులకు గాను ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను క్లియర్ చేయగా, మరో 1,70,154 దరఖాస్తులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, 9 రోజుల తర్వాత పెండింగ్‌లో ఒక్క దరఖాస్తు కూడా ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండడం, రికార్డుల పరిశీలనలో జాప్యం జరుగుతుండడంతో పాటు 8, 9 తేదీల్లో సెలవులు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఈనెల 9 తర్వాత కూడా ఈ డ్రైవ్‌ను కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 6 శాతం.... 85 శాతం జిల్లాల వారీగా పరిశీలిస్తే పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంలో జగిత్యాల ముందంజలో ఉంది. ఇక్కడ 85 శాతం దరఖాస్తులపై రెవెన్యూ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 69 శాతం దరఖాస్తులు క్లియర్ అయ్యాయి. నారాయణపేట (65), పెద్దపల్లి (65), భద్రాద్రి కొత్తగూడెం (62), వరంగల్ (56), జనగామ (56), రాజన్న సిరిసిల్ల (52), సిద్ధిపేట, హనుమకొండ (51) జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇక, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 6 శాతమే పరిష్కారం కాగా, కరీంనగర్లోనూ 6 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7, రంగారెడ్డిలో 9 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మాడ్యూళ్ల వారీగా చూస్తే కీలకమైన రెండు మాడ్యూళ్లలో దరఖాస్తుల క్లియరెన్స్ నత్తనడకనే సాగుతున్నట్టు అర్థమవుతోంది. టీఎం15 కింద ల్యాండ్ మ్యాటర్స్ సమస్యల పరిష్కారానికి గాను 40,605 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 43 శాతం అంటే 17,372 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 23,233 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరో కీలకమైన టీఎం 33 మాడ్యూల్లో 1,01,132 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 27,047 దరఖాస్తులు పరిష్కారం చేయగా, 74,085 పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ఇది నిరంతర ప్రక్రియ: ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి ‘ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఆగదు. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నాం. ఈనెల 9వ తేదీ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ వచ్చినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కొందరు ధరణి దరఖాస్తుల పరిశీలనలో పాలు పంచుకుంటారు. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు లైన్‌క్లియర్?
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈనెల 31న జరిగే మంత్రివర్గ సమావేశ ఎజెండాలో ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలను చేర్చటంతో ఈ చర్చ జరుగుతోంది. 44 శాతం ఫిట్మెంట్తో... 2013 సంవత్సరానికి సంబంధించి 2015లో ప్రభుత్వం వేతన సవరణ చేసిన విషయం తెలిసిందే. 30 శాతం మేర ఫిట్మెంట్ ప్రకటిస్తారని కార్మిక సంఘాలు భావించగా, ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో ఆర్టీసీపై రూ.850 కోట్ల వార్షికభారం పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం తర్వాత వేతన సవరణల జోలికి పోలేదు. వేతన సవరణ 2017లో చేయాల్సి ఉండగా.. 2017లో వేతన సవరణ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో అప్పట్లో కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. వేతనసవరణ రూపంలో పడే భారాన్ని తట్టుకునే పరిస్థితి లేక, మధ్యంతర భృతితో సరిపెట్టింది. 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ ఇవ్వగా, ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 2021లో ఇవ్వాల్సిన వేతన సవరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే 16 శాతాన్ని ఖాయం చేస్తే రూ.40 కోట్ల భారం ప్రస్తుతం 2017కు సంబంధించిన 16 శాతం మధ్యంతర భృతి కొనసాగుతోంది. అంతే శాతాన్ని ఫిట్‌మెంట్‌గా మారిస్తే నెలవారీ భారం ఏకంగా రూ.40 కోట్లుగా ఉంటుందని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యంతర భృతికి అదనంగా ఒక్కశాతం అదనంగా ఫిట్మెంట్ ప్రకటించినా ప్రతినెలా రూ.3 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. 18, 20, 22, 24 శాతం లెక్కలను కూడా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. -
పులికేసికి లైన్ క్లియర్?
తమిళసినిమా: ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రానికి లైన్‌క్లియర్ అయ్యిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేసి స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి.శంకర్ శిష్యు డు శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో వడివేలుకు హీరోగా అవకాశాలు వచ్చేశాయి. అయితే ఆ తరువాత నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. అదే సమయంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న వడివేలు నటనకు దూరం అయ్యారు. చాలా గ్యాప్ తరువాత దర్శకుడు శంకర్ మరోసారి వడివేలుకు అవకాశం కల్పించి ఇంసై అరసన్‌కు సీక్వెల్‌గా ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు. అయితే చిత్రం సగంలోనే ఆగిపోయింది. కారణం వడివేలు కాల్షీట్స్ కేటాయించకపోవడమే. దీంతో శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కొంత కాలంగా సాగుతూ వస్తోంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వడివేలుతో సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారు. అయినా వడివేలు తన కాల్షీట్స్ను ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర యూనిట్ సరిగా వాడుకోకుండా వృథా చేశారని, ఇంకా ఆ చిత్రానికి డేట్స్ కేటాయించలేనని చెప్పేశారు. తాను మళ్లీ ఆ చిత్రం చేయాలంటే అదనంగా పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో శంకర్ తరఫున తాము ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి కొంత భాగం చిత్రీకరించడంతో సుమారు రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు, ఆ మొత్తాన్ని వడివేలు తమకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలిని కోరారు. ఇదే విషయాన్ని వడివేలుకు నిర్మాతల మండలి ఆదేసించింది. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి చిత్రాన్ని పూర్తి చేసే తీరాల్సిన పరిస్థితి నెలకొందని సినీ వర్గాల సమాచారం. అదే విధంగా ఆయన చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్లు తాజా టాక్. ఇదే గనుక నిజం అయితే ఇంసైఅరసన్ 24ఆమ్ పులికేసి త్వరలోనే మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందన్నమాట. -
‘లైన్’ క్లియర్
- అనంత- అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు రూ.29 వేల కోట్లు - ప్రకటించిన కేంద్రం – జిల్లాలో 74.750 కి.మీ మేర రహదారి నిర్మాణం అనంతపురం అర్బన్ : అనంతపురం నుంచి రాజధాని అమరావతికి ‘గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే’ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. అమరావతి వరకు 598.78 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.29 వేల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 23 గ్రామాల మీదుగా 74.750 కిలోమీటర్ల మేర మలుపులు లేని రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 1,354 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. రహదారి నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఇప్పటికే పెగ్ మార్కింగ్ ప్రక్రియను చేపట్టింది. 44 నంబర్ జాతీయ రహదారి (హైదరాబాద్– బెంగళూరు)లోని రాప్తాడు మండలం మరూరు గ్రామ పరిధిలో ఈ రహదారి ప్రారంభమవుతుంది. రాప్తాడు మండలంలో రెండు గ్రామాలు, అనంతపురం రూరల్ పరిధిలో మూడు, బుక్కరాయసముద్రం మూడు, నార్పల నాలుగు, పుట్లూరు నాలుగు, తాడిపత్రి మండలంలో ఏడు గ్రామాల మీదుగా వెళుతుంది. తాడిపత్రి మండలం ఊరిచింతల గ్రామం మీదుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా అమరావతికి వెళుతుంది. ఈ రహదారిని మూడు ఫీడర్లుగా విభజించారు. అనంతపురం ఫీడర్లో 371.03 కిలోమీటర్లు, కర్నూలు 123.7 కి.మీ, కడప ఫీడర్లో 104.05 కి.మీ ఉంటుంది. 391.38 కి.మీ నాలుగు లేన్లతో, 207.4 కి.మీ ఆరు లేన్లలో నిర్మిస్తారు. అలాగే 43 మేజర్ బ్రిడ్జిలు, ఆరు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, 28 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించనున్నారు. -
రాజకీయ ప్రక్రియ మొదలు పెట్టండి
మేడిగడ్డ, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై రాష్ట్రానికి మహారాష్ట్ర సూచన సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, తమ్మిడిహెట్టి బ్యారేజీల నిర్మాణాలకు మహారాష్ట్ర లైన్ క్లియర్ చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా వీటిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బ్యారేజీ నిర్మాణాలపై అధికారుల స్థాయిలో జరగాల్సిన ప్రక్రి య పూర్తయింది. బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తమకున్న అన్ని రకాల అనుమానాలు నివృత్తి అయిన దృష్ట్యా తమవైపు నుంచి పూర్తి అంగీకారాన్ని తెలుపుతున్నామని, ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ మాత్రమేనని మహారాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బ్యారేజీలపై అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రక్రియను వేగిరం చేసుకోవాలని మహారాష్ట్ర అధికారులు తాజా గా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అన్ని అనుమతులకూ ఓకే.. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత విషయమై కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వం హైడ్రాలజీ సర్వేలు చేస్తోంది. అన్ని అంశాలను క్రోడీకరించుకున్నాక దీనికి మూడు రోజుల కిందటే క్లియరెన్స్ ఇచ్చింది. ఇక తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో తమ ప్రాంతంలో ఎలాంటి ముంపు లేనందున దానికి సమ్మ తం తెలిపింది. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సం బంధించిన డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై మహారాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) అధికారులతో 20రోజులుగా నాసిక్ కేంద్రంగా జరిగిన చర్చలు సైతం ఫలప్రదమయ్యాయి. రెండు నెలల కిందట జరిగిన సమావేశంలో మహారాష్ట్ర 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డను అంగీకరిస్తూనే, జాయిం ట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు అంగీకరిస్తామని తెలిపింది. దానికి అనుగుణంగా సర్వే చేసిన అధికారులు 102 మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున వీటిని పరిశీలించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో నిర్ణయం చేయాల్సి ఉందని మహారాష్ట్ర అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పెనుగంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరాటకు సంబంధించిన అటవీ, మైనింగ్, పర్యావరణ అనుమతులకు సైతం మహారాష్ట్ర ఇదివరకే క్లియరె న్స్‌లు ఇచ్చింది. సీఎంతో హరీశ్ చర్చలు ఒప్పందాలపై రాజకీయ ప్రక్రియ మొదలు పెట్టాలన్న మహారాష్ట్ర సూచన మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఈ అంశమై సీఎం కేసీఆర్‌తో చర్చించారు. రూ.5,813 కోట్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల టెండర్లు ఖరారు కావడం, వీటి మధ్య పంప్‌హౌస్‌ల నిర్మాణం, హైడ్రో మెకానికల్ పనులకు రూ.7,998 కోట్లతో టెండర్ల ప్రక్రియ సోమవారం ముగియనున్న దృష్ట్యా ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, ఒప్పందాల ప్రక్రియ తేదీలను నిర్ణయించాలని కోరారు. మహా రాష్ట్ర సీఎం ఇచ్చే సమయం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరుగనుంది. -
బాబు గృహ నిర్మాణానికి లైన్‌క్లియర్
రివైజ్డ్ ప్లాన్‌కు అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల ఇంటి నిర్మాణానికి సంబంధించి రివైజ్డ్ ప్లాన్‌తో తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో జీహెచ్ఎంసీ అనుమతి మంజూరు చేసింది. నగరంలో చంద్రబాబు నిర్మించే ఇంటికి అనుమతివ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమోదిత లేఔట్ డెమైన్షన్, భవనం ఎత్తు, సెట్‌బ్యాక్స్ నిబంధనల్లో అతిక్రమణలు ఉన్నందువల్లే దరఖాస్తును తిరస్కరించామని అప్పట్లోనే అధికారులు వివరణ ఇచ్చారు. తాజాగా వాటిని సవరించి రివైజ్డ్ ప్లాన్‌ను సమర్పించడంతో తిరిగి చంద్రబాబు ఇంటికి అనుమతులిచ్చారు. 1893.69 చ.మీ.ల బిల్టప్ ఏరియాకు ఆమోదం తెలుపుతూ అనుమతి మంజూరు చేశారు. ఇందుకుగాను రూ. 6,67,475 ఫీజును జీహెచ్ఎంసీకి చెల్లించగా, ఈనెల 17 వ తేదీతో అనుమతి జారీ అయింది. -
ఈ-పంచాయతీలకు లైన్ క్లియర్
- జూన్ 9 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయం హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఈ-పంచాయత్ వ్యవస్థల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ-పంచాయిత్ వ్యవస్థలను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఈ-పంచాయత్‌లను మార్చిలోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా (ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు తదితర) అవాంతరాలు వచ్చిపడటంతో ఆ కార్యక్రమం అమల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ పనులు పూర్తికాకపోవడం కూడా మరో కారణంగా అధికారులు చె బుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ పనులు పూర్తయినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ-పంచాయత్‌ల వ్యవస్థల ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ- పంచాయత్ వ్యవస్థను అమలు చేసి వచ్చిన ఫలితాలను బట్టి దశల వారీగా మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. పని సౌలభ్యం మేరకు రాష్ట్రంలోని 8,892 గ్రామాలను 5,232 క్లస్టర్ గ్రామాలుగా అధికారులు విభజించారు. చిన్నచిన్న గ్రామ పంచాయతీలను సమీపంలోని పెద్ద గ్రామ పంచాయితీ (క్లస్టర్)లకు అనుసంధానం చేశారు. తొలిదశలో 2,440 గ్రామ పంచాయతీల్లో, రెండోదశలో 2,792 గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయత్ వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
రైల్వే జోన్‌కు లైన్ క్లియర్
రైల్వే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష వీగిన ఒడిశా వాదన విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు! అన్నీ విశాఖ జోన్లోనే.. విశాఖపట్నం సిటీ : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది. హైదరాబాద్‌లో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైల్వే ఉన్నతాధికారుల సమీక్షలో రైల్వే జోన్ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. రైల్వే జోన్‌కు అవసరమైన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయని గుర్తించారు. దీంతో కొత్త రైల్వే జోన్ల కోసం ఏర్పాటైన కమిటీ పని సులువైంది. ఇక జోన్ ప్రకటనే ఆలస్యం. ఈ నెల 15వ తేదీతో ప్రత్యేక రైల్వే జోన్ కమిటీ నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంది. దీంతో కమిటీ తన పనిని వేగవంతం చేస్తోంది. త్వరలోనే విశాఖను నవ్యాంధ్రకు రైల్వే జోన్‌గా ప్రకటించేందుకు మార్గం సుగమమయింది. ఫలించిన సుదీర్ఘ పోరాటం! : రాష్ట్ర పునర్విభజన బిల్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతకు ముందు నుంచే దశాబ్దాల కాలంగా విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఒడిశా రైల్వే అధికారుల పెత్తనం కారణంగానే ఈ డిమాండ్ స్థానికుల్లో బలంగా నాటుకుపోయింది. విశాఖకు వచ్చే పలు రైళ్లను భువనేశ్వర్‌కు పొడిగించుకుపోవడంతో పాటు బెర్తుల్లో కోటాను ఆక్రమించేస్తుండడంతో విశాఖ వాసులు ఈ పోరాటాన్ని సుదీర్ఘకాలం నుంచి చేస్తున్నారు. కానీ రైల్వే జోన్ కోసం విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు పోటీపడ్డాయి. రాష్ట్ర రాజధాని ఉన్నచోటే రైల్వే జోన్ ఉండాలని ఆ ప్రాంతీయులు డిమాండ్ చేశారు. కానీ మొదటి నుంచి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు బీజేపీ సుముఖంగా ఉంది. మొదటి నుంచి విశాఖలోనే రైల్వే జోన్ అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ప్రకటించారు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడ పేరునే ప్రకటించినా పాలన వికేంద్రీకరణ నేపథ్యంలో జోన్ విశాఖనే వరించనుంది. నాలుగు డివిజన్లు! : విశాఖ కేంద్రంగా ఏర్పడే నూతన రైల్వే జోన్లో నాలుగు డివిజన్లు ఉంటాయి. వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లను కలిపి ఒకే జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. తూర్పు కోస్తా రైల్వేలో ఉన్న వాల్తేరు డి విజన్‌ను విడదీసి కొత్త జోన్లో విలీనం చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లకు ఇక విశాఖ కేంద్రం కానుంది. వాల్తేరు జోన్‌ను వదులుకోలేమంటూ ఇప్పటి వరకూ అడ్డుకున్న ఒడిశా రైల్వే ఉన్నతాధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జోన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలాలు, క్రీడా మైదానాలు, ఆస్పత్రులు, కార్యాలయాలన్నీ విశాఖలోనే భారీగా ఉండడంతో కమిటీ విశాఖను ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. -
పిజీ ఈ సెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్
-
భోగాపురానికే ఛాన్స్ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించే అవకాశాల్లేకపోవడం, నక్కపల్లిలో వాతావరణ పరిస్థితులు అను కూలంగా ఉండకపోవడం వంటి అంశాలు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కలిసివస్తున్నాయి. భోగాపురంలో కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యేలా ఉంది. ప్రయాణికుల రద్దీ కన్నా, కార్గో సర్వీసులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు కేంద్రం ఆసక్తి చూపుతోంది. అందుకు తగ్గ సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పరిశీలించింది. పౌర విమానయాన శాఖ వ ర్గాలు కూడా సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్య లు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. జిల్లాకొక ఎయిర్పోర్ట్ అన్న ప్రతిపాదన మిగతా జిల్లాల్లో సాధ్యమవుతుందో లేదో గాని జిల్లాలోని భోగాపురానికి మాత్రం కాస్త సానుకూలత కన్పిస్తోంది. ఇందుకు పొరుగు జిల్లాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులే కారణం. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించేందుకు అవకాశం లేదని పౌర విమానయాన శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నక్కపల్లిలో ఏర్పా టు చేయాలన్న యోచనకు అక్కడి వాతావరణ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా విమాన రాకపోకలకు గాలులు, సంకే తాలు అనుకూలంగా ఉండవన్న అభిప్రాయానికొచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో భోగాపురమే సరైనదని భావిస్తున్నట్టు సమా చారం. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు సర్కార్ యోచిస్తోంది. అందులో భాగంగానే నక్కపల్లిలోగాని, భోగాపురంలో గాని ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతి పాదనలు పంపించింది. ఇందుకు తగ్గ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇటీవల పౌర విమానయాన శాఖాధికారులు వచ్చి వెళ్లారు. అటు నక్కపల్లి, ఇటు భోగాపురం వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత భోగాపురమే సరైనదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ ఏర్పాటు చేస్తే మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖపట్నం తీరప్రాంతానికొచ్చిన సరుకులను ఇక్కడి నుంచి కార్గో సర్వీసుల ద్వారా రవా ణా చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. పయాణికుల కంటే సరుకుల రవాణాకు ఎక్కువగా దోహద పడుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే విజ యన గరం- రాయపూర్ కనెక్టవిటీ రైల్వే లైన్ ఆధునీకరణ దశలో ఉం దని, విద్యుద్ధీకరణ జరిగితే పనులు పూర్తవుతాయని, రైల్వే లైన్ పూర్తయ్యాక రైళ్ల ద్వారా సరుకుల రవాణా పెరుగుతుందని, దానికి కనెక్టవిటీగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనికొస్తోందని విమానయాన శాఖ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే లైన్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని రైల్వే అధి కారులపై ఇప్పటికే ఒత్తి డి చేసినట్టు సమాచారం. ఇదంతా గమనిస్తుంటే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మార్గం సు గమవుతుందని స్పష్టమవుతోంది. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. నక్కపల్లిలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, భోగాపురంలో సానుకూల పరిస్థితులున్నాయని ఆయన విలేకర్ల వద్ద తెలిపారు. -
లైన్ క్లియర్
ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ‘ఔటర్’ రెడీ మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభం ప్రధాన రోడ్డుకు తుదిమెరుగులు అద్దుతున్న హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: ఎట్టకేలకు ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ అందుబాటులోకి వస్తోంది. మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన రహదారి పనులను పూర్తిచేసి రాకపోకలకు అనువుగా సిద్ధం చేయాలని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో సర్వీసు రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నా... ప్రధాన రహదారిని మాత్రం సత్వరం వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాస్తవానికి ఫిబ్రవరి 15 నుంచే ఈ మార్గంలో రాకపోకలను అనుమతించాలని భావించినా... ప్రధాన మార్గంలో పలుచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయి ఉండటంతో ఆ గడువును మార్చి రెండో వారానికి వాయిదా వేశారు. ఘట్కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు 31 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తుండటంతో వరంగల్ హైవేకు విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా వరంగల్ - విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబై ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ప్రయోజనకరంగా ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఇక పై నగరంలోకి రాకుండా ఊరు బయట నుంచే ఆయా ప్రధాన రహదారులకు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డులో 15 కి.మీ.లు తప్ప మొత్తం ఔటర్ వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. జూలైకి సర్వీసు రోడ్లు ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను జూలై నాటికి పూర్తిచేయాలని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట (31కి.మీ.) మార్గంలో జరుగుతున్న ఔటర్ రింగ్‌రోడ్డు పనులను ఇటీవల ఓఆర్ఆర్ పీడీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శంచారు. కాగా, మార్చి రెండో వారంలోగా మెయిన్ క్యారేజ్‌ను పూర్తి చేసేందుకు ఆయా పనులకు అధికారులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు అనువుగా 31కి.మీ. దూరం మెయిన్ రోడ్‌ను తీర్చిదిద్దే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 158 కి.మీ. ఓటర్కుగాను ప్రస్తుతం షామీర్పేట-కీసర (11కి.మీ), అలాగే కీసర-ఘట్కేసర్(4 కి.మీ.) వరకు 15కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా వచ్చే ఆరు మాసాల్లో పూర్తిచేయాలని అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. -
కొత్తకార్డులకు లైన్ క్లియర్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సామాన్యుల నిరీక్షణ ఫలించనుంది. రేషన్ కార్డులు లేక అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పేదల కోరిక నెరవేరే సమయం దగ్గర్లోనే ఉంది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ప్రజలు ఏడాదిన్నర కాలంగా నిరీక్షిస్తున్నారు. పదవుల పందారంలో పడిన పాలకులు మరోసారి రచ్చబండకు సిద్ధం కావడంతో ఎట్టకేలకు హామీలపై దృష్టి సారించారు. గతంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాల ని ఆదేశాలు వచ్చాయి. అయితే అధికారులు కొన్ని నెలల క్రితమే అర్హులను గుర్తించి జాబితా సిద్ధం చేశారు. అర్హులైన వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. పౌరసరఫరాల ఉన్నతాధికారులు కొత్త కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ చేయడంతో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించనుంది. గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కొత్తకార్డు లు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, కార్డుల విభజన, గులాబీ కార్డుల నుంచి తెలుపు కార్డులుగా మార్చాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా 71,432 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 64,690 దరఖాస్తులు అర్హత గలవిగా అధికారు లు తేల్చారు. అర్హులకు అందజేయడానికి ఇప్పటికే 24,726 కార్డులు సిద్ధం చేశారు. కొత్తకార్డుల కోసం 27,017, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చటానికి 16,740, కార్డుల విభజన కోసం 18076, గులాబీ నుంచి తెలుపు, తెలుపుకార్డుల నుంచి అంత్యోదయ కార్డుల కోసం వచ్చిన 48 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. 729 దరఖాస్తులు మినహాయించి మిగిలిన వివరా లు ఆన్లైన్లో పొందుపర్చారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే వీరందరికీ ప్రయోజనం కలగనుంది.