రివైజ్డ్ ప్లాన్‌కు అనుమతిచ్చిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల ఇంటి నిర్మాణానికి సంబంధించి రివైజ్డ్ ప్లాన్‌తో తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో జీహెచ్‌ఎంసీ అనుమతి మంజూరు చేసింది. నగరంలో చంద్రబాబు నిర్మించే ఇంటికి అనుమతివ్వకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమోదిత లేఔట్ డెమైన్షన్, భవనం ఎత్తు, సెట్‌బ్యాక్స్ నిబంధనల్లో అతిక్రమణలు ఉన్నందువల్లే దరఖాస్తును తిరస్కరించామని అప్పట్లోనే అధికారులు వివరణ ఇచ్చారు.
తాజాగా వాటిని సవరించి రివైజ్డ్ ప్లాన్‌ను సమర్పించడంతో తిరిగి చంద్రబాబు ఇంటికి అనుమతులిచ్చారు. 1893.69 చ.మీ.ల బిల్టప్ ఏరియాకు ఆమోదం తెలుపుతూ అనుమతి మంజూరు చేశారు. ఇందుకుగాను రూ. 6,67,475 ఫీజును జీహెచ్‌ఎంసీకి చెల్లించగా, ఈనెల 17 వ తేదీతో అనుమతి జారీ అయింది.
బాబు గృహ నిర్మాణానికి లైన్‌క్లియర్
Published Tue, Aug 25 2015 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement
Advertisement