Loan system
-
భారీ వృద్ధిపై గోద్రేజ్ క్యాపిటల్ కన్ను
చెన్నై: బ్యాంకింగేతర ఆర్థిక సేవల్లోని గోద్రేజ్ క్యాపిటల్ తన రుణ పుస్తకాన్ని భారీగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 2028 నాటికి రుణ పుస్తకాన్ని రూ.50,000 కోట్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా ప్రకటించారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నూరు శాతం అనుబంధ సంస్థగా గోద్రేజ్ క్యాపిటల్ 2020లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్రేక్ఈవెన్ సాధించినట్టు (లాభ, నష్టాల్లేని స్థితి) మనీషా తెలిపారు. 2028 నాటికి రూ.50,000 కోట్ల రుణ ఆస్తులను చేరుకునేందుకు వీలుగా తమకు అదనంగా రూ.4,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని చెప్పారు. ‘‘2020 అక్టోబర్‌లో లైసెన్స్ లభించింది. 2028 నాటికి ఏయూఎంను రూ.50,000 కోట్లకు చేర్చాలని అనుకుంటున్నాం. 2024 మార్చి నాటికి ఏయూఎం రూ.10,000 కోట్లను చేరుతుంది. హోల్డింగ్ కంపెనీ (గోద్రేజ్ ఇండస్ట్రీస్) నుంచి రూ.2,000 కోట్లు అందుకున్నాం. రూ.50,000 కోట్ల పుస్తకాన్ని చేరుకునేందుకు ఏటా రూ.1,000 కోట్ల చొప్పున నిధులు అవసరం అవుతాయి’’అని చెన్నైలో మీడియా ప్రతినిధులకు షా తెలిపారు. 2026 నాటికి రూ.30,000 కోట్ల ఏయూఎంకు చేరుకుంటామన్నారు. ఎంఎస్ఎంఈ, గృహ రుణాలు తమ ప్రాధాన్య విభాగాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.7,700 కోట్ల రుణాల్లో ఎంఎస్ఎంఈలకు ఇచ్చినవి రూ.4,000 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. మిగిలిన మొత్తం గృహ రుణాలుగా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రుణ ఆస్తుల్లో రూ.5–50 కోట్ల మధ్య ఆదాయం కలిగినవి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని సమగ్రంగా వృద్ధి చేసుకునేందుకు వీలుగా త్వరలోనే ‘నిర్మన్’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్టు షా ప్రకటించారు. నిర్మన్ సేవల కోసం అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్, ఆన్‌ష్యూరిటీ, జోల్‌విట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చెప్పారు. తద్వారా ఎంఎస్ఎంఈలకు ఆన్లైన్ మార్కెట్ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. -
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, తాడేపల్లి: లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే, బుధవారం రోజున రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ(2)లు అనాధలుగా మిగిలారు. అయితే ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5లక్షల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలతకి ఆదేశాలిచ్చారు. చదవండి: (న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య) -
న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: కుటుంబ అవసరాల కోసం లోన్ యాప్‌లో రుణం తీసుకున్న దంపతులు నిర్వాహ కుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: లోన్‌యాప్స్ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెందారు. తరచూ లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 5న పిల్లలను ఇంటిలో వదిలేసి బయటకు వచ్చిన దంపతులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి గట్టుపై అదే రోజు రాత్రి ఒక లాడ్జిలో దిగారు. కొద్ది సమయం తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. బం«ధువులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని చెప్పారు. విషయం తెలిసిన బంధువులు అదే రోజు అర్ధరాత్రి సమయానికి లాడ్జి వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాల్లో 21.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాల్లో మంచి వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రుణ పుస్తకం 21.5 శాతం వృద్ధితో రూ.13,95,000 కోట్లకు చేరినట్టు బ్యాంకు ప్రకటించింది. అంతక్రితం ఏడాది జూన్ చివరికి రుణ పుస్తకం రూ.11,47,700 కోట్లుగా ఉంది. డిపాజిట్లు రూ.16,05,000 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది జూన్ నాటికి డిపాజిట్లు రూ.13,45,800 కోట్లతో పోలిస్తే 19.3 శాతం వృద్ధి నమోదైంది. మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో గృహ రుణ ఒప్పందం కింద జూన్ త్రైమాసికంలో రూ.9,553 కోట్ల రుణాలను కొనుగోలు చేసినట్టు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ విలీనం కానుండడం తెలిసిందే. విలీనం అనంతరం ఏర్పడే హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.18 లక్షల కోట్ల రుణ ఆస్తులతో ఉండనుంది. విలీనం మరో ఏడాదికి పైగా పట్టే అవకాశాలున్నాయి. -
లోన్ యాప్ దుర్మార్గం
కావలి: లోన్ యాప్ యాజమానుల దుర్మార్గాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా అప్పు చెల్లించలేదని శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ మహిళ ఫొటోను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి పంపించి వేధింపులకు గురి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఈ మేరకు కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ పి.ఆదిలక్ష్మి కథనం మేరకు.. కావలిలోని కచ్చేరిమిట్టకు చెందిన పసుపులేటి మౌనికను భర్త వదిలేశాడు. ఆమె తన ముగ్గురు కుమార్తెలను ఉపాధి పనులు చేసుకుంటూ పోషించుకుంటోంది. ప్రస్తుతం ఒక హోటల్లో దినసరి కూలీగా పని చేస్తోంది. అయితే, ఆరు నెలల క్రితం ఆన్లైన్లో ‘స్పీడ్’ అనే యాప్‌లో రూ.5,000 అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె అకౌంట్లో రూ.2,500 నగదు జమ అయింది. అప్పటి నుంచి ఆమెను యాప్‌కు సంబంధించిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ రూ.70 వేల వరకు నగదు ఆమె వద్ద నుంచి కట్టించుకున్నారు. అయినా ఇంకా బాకీ ఉందని వేధిస్తుండడంతో, ఆమె తనకు ఆర్థిక స్థోమత లేదని చెప్పింది. దీంతో ఆమె ఫొటోను నగ్న చిత్రంతో మార్ఫింగ్ చేసి ‘స్పీడ్’ యాప్ ద్వారా ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారందరికీ పంపారు. బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్థలం కొనుగోలుకు రుణం.. ఇల్లు కట్టుకునే వారికి ప్లాట్ రుణాలు
ఆకర్షణీయమైన ధరకు ప్లాట్ (స్థలం) విక్రయానికి ఉందని తెలిసినప్పుడు.. అందుబాటులో డబ్బు ఉండకపోవచ్చు. అటువంటి అవకాశం మళ్లీ రాదనుకుంటే, కొనుగోలుకు అప్పు తీసుకోవడం ఒక్కటే మార్గం. తెలిసిన వారి దగ్గర బదులు తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆశ్రయించాలా? లేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) తలుపు తట్టాలా? అసలు స్థలం కొనుగోలుకు రుణం లభిస్తుందా? ఎన్నో సందేహాలు వస్తాయి. ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కడదామనుకునే వారు.. పెట్టుబడి కోణంలోనూ ప్లాట్‌ను కొనుగోలు చేసేవారూ ఉన్నారు. వీరి కల సాకారం కోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలియజేసే కథనమే ఇది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్లాట్ కొనుగోలుకు రుణాలను (ప్లాట్ లోన్స్) ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఆ ప్లాట్ ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్నదై ఉండాలి. పెట్టుబడి కోణంలో ప్లాట్ కోసం రుణం తీసుకోవాలంటే వేరే మార్గాలను వెతుక్కోవాల్సిందే. ఇంటి కొనుగోలు కోసమే ప్లాట్‌ను సమకూర్చుకునే వారికి రుణం సులభంగానే లభిస్తుంది. నివాస యోగ్యమైన ప్లాట్‌ను రుణంపై కొనుగోలు చేసుకుంటే.. ఆ తర్వాత రుణ ఒప్పందం మేరకు 1–3 ఏళ్లలోపు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటినే ప్లాట్ లోన్స్గా చెబుతారు. రుణం తీసుకుని నివాస యోగ్యమైన ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత ఇల్లు కట్టలేదనుకోండి. కావాలని ఇల్లు కట్టకుండా వదిలేసే వారు ఉంటారు. పలు రకాల కారణాల వల్ల ఇల్లు కట్టడానికి వీలు పడని పరిస్థితులూ ఉండొచ్చు. నిజానికి ప్లాట్ లోన్ తక్కువ వడ్డీ రేటుపై లభిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణం. రుణ ఒప్పందంలో పేర్కొన్న కాల వ్యవధిలోపు ఇంటిని నిర్మించి, పూర్తయినట్టు సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించకపోతే.. అప్పుడు ఆ రుణం సాధారణ రుణంగా మారుతుంది. బ్యాంకులు అదనపు వడ్డీరేటును వసూలు చేస్తాయి. ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రుణంపై 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అమలు చేసే స్వేచ్ఛ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంటుంది. దీనివల్ల అదనపు వడ్డీ భారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలవ్యవధి ముగిసిన తర్వాత కూడా రుణ గ్రహీత బ్యాంకులను సంప్రదించని పరిస్థితుల్లో.. బ్యాంకులే కస్టమర్లకు సందేశం పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే అప్పుడు సాధారణ రుణంగా వర్గీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాయి. అదనపు వడ్డీ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంటేనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించకుండా ఉండొచ్చన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లాట్ లోన్ అర్హతలు 18–70 ఏళ్ల వారు ప్లాట్ లోన్‌కు అర్హులు. సిబిల్ స్కోరు కనీసం 650కు పైన ఉండాలి. గరిష్టంగా 15 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్లాట్ లోన్ మంజూరవుతుంది. రుణం ఇచ్చే ముందు.. ఆ ప్లాట్ కొనుగోలు ప్రదేశం, ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణాల చెల్లింపుల చరిత్ర ఇలా ఎన్నో అంశాలను బ్యాంకులు చూస్తాయి. లోన్ టు వ్యాల్యూ లోన్ టు వ్యాల్యూ అన్నది ప్రాపర్టీ విలువలో లభించే రుణంగా అర్థం చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో గరిష్టంగా 85–90 శాతం వరకు రుణాన్ని (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే ప్లాట్ కోసం అయితే ఎల్టీవీ 60–70 శాతం మధ్యే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారులు స్వయంగా సమకూర్చుకోవాలి. సేల్‌డీడ్‌లో పేర్కొన్న విలువను ప్లాట్ విలువగా బ్యాంకులు పరిగణిస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు విచారిస్తే ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. పైగా కొన్ని బ్యాంకులు సేల్డీల్ వ్యాల్యూ లేదా మార్కెట్ వ్యాల్యూలో రుణాన్ని 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. సమాచార లోపం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వొచ్చు. ప్లాట్ రుణం తీసుకుని, అందులో ఇల్లు కట్టకపోయినా ఫర్వాలేదు? అన్న మాట వినిపిస్తే అది నిజం కాదని గుర్తించాలి. వారు తమ స్వప్రయోజనాల కోసమే అలా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతకీ అనుమానం ఉంటే లోన్ డాక్యుమెంట్‌ను ఒక్కసారి సమగ్రంగా చదవాలి. ప్రతి ఒక్కరికీ ఆవాసం కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే తక్కువ రేటుపై ప్లాట్ రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అలాకాకుండా రుణం తీసుకుని కొనే ప్లాట్.. భవిష్యత్తులో లాభం కోసం విక్రయించేది అయితే అందుకు తక్కువ వడ్డీ రేటుపై రుణాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలుసుకోవాలి. ఇంటిని నిర్మించేట్టయితే బ్యాంకులకు రుణం చెల్లింపులపై భరోసా లభించడం కూడా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒక కారణం. పైగా ఇంటి నిర్మాణం చేస్తే దానిపై ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. లేదంటే అందులో నివాసం ఉంటే రుణ గ్రహీత ఇంటి అద్దె రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని రుణ ఈఎంఐల చెల్లింపునకు వెసులుబాటుగా బ్యాంకులు చూస్తాయి. ఒక్కటే రుణం? కొన్ని బ్యాంకులు ప్లాట్ కొనుగోలుకు, తర్వాత అందులో ఇంటి నిర్మాణానికీ రుణం ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు చేసిన 2–3 ఏళ్ల తర్వాత గృహ రుణాన్ని జారీ చేస్తోంది. కానీ, ఈ రెండు రుణాలకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. వడ్డీ రేటులోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు ఒక్కటే రుణం ఇచ్చేందుకూ ముందుకు వస్తున్నాయి. ఒప్పందంలో ఇందుకు సంబంధించి వివరాలు ఉంటాయి. మంజూరు చేసే రుణంలో ప్లాట్‌కు ఎంత, ఇంటి నిర్మాణానికి ఎంతన్న వివరాలు కూడా ఉంటాయి. పన్ను ప్రయోజనాలు ప్లాట్ కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లే వు. పన్ను ప్రయోజనం కావాలనుకుంటే ఒక్కటే రుణంగా (ప్లాట్, ఇల్లు) తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం. అప్పుడు అసలు, వడ్డీ చెల్లింపులపై ఒక ఏడాదిలో రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని గుర్తుంచుకోవాలి.. ► ప్లాట్‌లో ఇంటిని నిర్మించేట్టు అయితేనే రుణం తీసుకోవాలి. ► ప్లాట్, ఇంటి నిర్మాణానికి కలిపి ఒక్కటే రుణం మంజూరు చేస్తుంటే.. ముందు ప్లాట్ కోసం ఒక పర్యాయం, ఇంటి నిర్మాణ సమయంలో మిగిలిన భాగాన్ని బ్యాంకులు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి కూడా ముందుగానే రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ► ఒకవేళ రుణంపై ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఏడాది లేదా రెండేళ్లకు ఇల్లు కట్టకుండానే విక్రయించారనుకోండి. అప్పుడు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో విచారించాలి. అటువంటప్పుడు వాటిని సాధారణ/పర్సనల్ లోన్‌గా పరిగణించి అదనపు వడ్డీ, చార్జీలు వసూలు చేయవచ్చు. ► ప్లాట్ లొకేషన్ కూడా కీలకం. మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొనుగోలు చేస్తున్న ప్లాట్ ఉండాలి. గ్రామాల్లో ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు కాదు. ► అలాగే, పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్‌కు, వ్యవసాయానికి వినియోగించే ప్లాట్‌కు కూడా రుణం మంజూరు కాదు. ► ఇంటి కోసం రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధిపైనా తీసుకోవచ్చు. అదే ప్లాట్ రుణం 15–20 ఏళ్లకే పరిమితం అవుతుంది. ► ప్లాట్ రుణానికి గరిష్ట పరిమితి కూడా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకులు పరిమితులు విధిస్తున్నాయి. ► రుణాన్ని ముందుగా చెల్లిస్తే అదనపు చార్జీలు చెల్లించాలేమో విచారించుకోవాలి. ఈ చార్జీలపై అధికారులను అడిగి తెలుసుకోవాలి. ► కొనుగోలు చేస్తున్న ప్లాట్‌కు రుణం వస్తుందా? లేదా? ముందే స్పష్టం చేసుకోవాలి. పెట్టుబడి కోసం అయితే..? ఇంటి నిర్మాణానికి కాకుండా పెట్టుబడి కోణంలో ప్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే.. అందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుంది. అప్పటికే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే.. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఏపీ)ని తీసుకోవచ్చు. నివాస, వాణిజ్య ప్రాపర్టీలను బ్యాంకులకు హామీగా ఉంచితే, రుణం లభిస్తుంది. ఇలా తీసుకునే రుణా న్ని ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకు ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధిపై ఈ రుణం లభిస్తుంది. ప్రాపర్టీ ఏమీ లేని వారు.. బంగారం ఉంటే దాన్ని తనఖా ఉంచి రుణాలను తీసుకోవచ్చు. బ్యాం కులు బంగారం రుణాలను 7.2–7.8శాతానికే ఆఫర్ చేస్తున్నా యి. వీటి కాల వ్యవ« ది 1–3 ఏళ్లే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత చెల్లించే వెసు లుబా టు లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గం లేకపోతే, ప్లాట్ చౌకగా వస్తుంటే చివరిగా వ్యక్తిగత రుణం కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే 10–12శాతం వరకు వడ్డీ రేటు భరించాల్సి ఉంటుంది. -
‘స్కోర్’ బాగుంటే రుణం ఈజీ!
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచి్చతంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం... ఎలా లెక్కిస్తారంటే.. రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిరీ్ణత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కలి్పస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కలి్పస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడమే స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రాథమిక సూత్రం. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల, మర్చిపోవడం కారణంగానే వాయిదా రోజున చెల్లింపులు చేయలేకపోతే.. కంపెనీ నుంచి మీ కాల్ వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆ వాయిదాను చెల్లించేయాలి. రీపేమెంట్లో ఎలాంటి జాప్యం చేసినా సరే రుణదాతలు దీన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తుంటారు. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచి్చన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచి్చన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మీ స్కోర్‌ను పెంచుకోవాలంటే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు లేకపోతే దాన్ని తీసుకుని పరిమిత వినియోగంతోపాటు సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్‌ను పెంచుకోవచ్చు. -
ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు
‘హలో... చెప్పండి?’ బదులిచ్చాడు అవతలి ‘హలో’కి ఈశ్వర్. ‘ఏంది చెప్పేది? పుణ్యానికి పైసల్ దీసుకున్నప్పుడు టైమ్‌కి కట్టాల్నని తెల్వదా?’ కటువుగా అవతలి స్వరం. ‘కొంచెం టైమ్ కావాలి..’ నెమ్మదిగా ఈశ్వర్. ‘నక్రాలు చేయొద్దు.. రేపటి లోపు అకౌంట్లో డబ్బులు పడాలి’ హెచ్చరించింది అవతలి స్వరం. ‘ఏందీ పడేది? నాకింకా టైమ్ కావాలి? అయినా నేను తీసుకున్నదానికంటే ఎక్కువే కట్టేసినా ఇప్పటిదాకా!’ ఉక్రోషంగా ఈశ్వర్. ‘అట్లనా? సరే..’ అంటూ ఫోన్ కట్ చేసింది అవతలి స్వరం. రెండు గంటల్లో ఈశ్వర్ వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా అతని ఫోన్లో ఉన్న చాలా కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు వెళ్లాయి.. బూతులు తిడుతూ. హాహాకారాలతో వాళ్లంతా ఈశ్వర్‌కు ఫోన్ చేసి తిట్టారు.. ‘నువ్వు అప్పు తీసుకొని కట్టకపోతే మాకు ఈ గోలేంటి? ఆ తిట్లేంటి? ఆ బూతులేంటి?’ అని. కొంతమందైతే తమకు అలాంటి మనోవేదన కలిగించినందుకు ఈశ్వర్ మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తామనీ బెదిరించారు. భయపడిపోయాడు ఈశ్వర్. ఓ అరగంట తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది ‘ఇంకా టైమ్ కావాలా?’ అంటూ. ‘కడ్తానని చెప్పిన కదా.. ఎందుకు ఇట్ల సతాయిస్తున్నరు?’ అన్నాడు దాదాపు ఏడుస్తున్నట్టుగా ఈశ్వర్. ‘పైసలు రాలేదనుకో.. నీ ఫోటోలు, వీడియోలు అన్నీ వైరల్ అయితయ్..’ అంటూ ఫోన్ పెట్టేశారు. తలకు చేతులు పట్టుకొని ఉన్న చోటే కూర్చుండిపోయాడు ఈశ్వర్ ‘ఎరక్కపోయి తీసుకున్నాన్రా బాబూ ఈ లోన్ ’ అనుకుంటూ. ఏమి ఆ లోన్? ఏంటి ఆ కథ? ఈశ్వర్ .. కూరగాయలను పండించే రైతు. వాటిని తనే మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యాపారిగానూ మారాడు. దానికోసం తీసుకున్న లోనే అది. అదో వెంటాడే బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌గా ఎలా మారింది? ఈశ్వర్ కాస్త చదువుకున్నవాడు. టెక్నాలజీ ఉపయోగం తెలిసినవాడు. అందుకే స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడు. ఇన్స్టంట్ లోన్ యాప్స్ గురించి విన్నాడు. ఆరాలు, తనిఖీలు లేకుండా లోన్స్ ఇస్తాయని, ఇలా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అలా ప్రెస్ చేస్తే చాలు.. లక్ష రూపాయల లోనైనా ఇట్టే అకౌంట్లో పడిపోతుందని. ‘కాగితాలు పట్టుకొని బ్యాంక్‌ల చుట్టూ తిరిగే కంటే ఇది నయం కదా’ అనుకున్నాడు. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇరవై వేలు లోన్ తీసుకున్నాడు ఈశ్వర్. వడ్డీ కింద కొంత కట్ చేసి మిగిలిన రొక్కాన్ని వెంటనే ఈశ్వర్ అకౌంట్లో వేసేశారు. వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించే షరతుతో. అంతకుముందే తెలిసినవాళ్ల దగ్గర అప్పు అడిగి ఉన్నాడు ఈశ్వర్. కాబట్టి వారం రోజుల్లో ఆ డబ్బును ఇటు సర్దుబాటు చేయొచ్చనే ధీమాతో ఉన్నాడు. కాని ఆ డబ్బు అందలేదు. సరిగ్గా వారం తర్వాత లోన్ రికవరీ నుంచి ఫోన్లు మొదలయ్యాయి. ముందు మర్యాదగా.. తర్వాత బెదిరింపులతో. ఆనక వాళ్లే ఇంకో మార్గం సూచించారు. మరో ఇన్స్టంట్ లోన్ తీసుకొని ఈ లోన్ తీర్చొచ్చని. ఓకే అన్నాడు ఈశ్వర్ ఆ గండం గట్టెక్కడానికి. దాన్నీ అనుకున్న సమయంలో తీర్చలేకపోయాడు. అలా ఆ రొటేషన్‌లో 20వేల ఆ అప్పు 2 లక్షలై ఇన్స్టంట్ లోన్ బాధితుడిగా మిగిలాడు ఈశ్వర్. దీన్నే ఇన్స్టంట్ లోన్ ఫ్రాడ్స్ అంటున్నారు సైబర్‌క్రైమ్ భాషలో. తెలుసుకోవాల్సినవి.. ఇలాంటి ఇన్స్టంట్ లోన్ యాప్స్‌కి లైసెన్స్ వివరాలు, వెబ్సైట్ అడ్రస్‌లు ఉండవు. లైసెన్స్, కంపెనీ గురించి ఎలాంటి సమాచారం లేకుండా కేవలం ప్లేస్టోర్‌లోనే దర్శనమిస్తాయి. కొన్ని మాత్రం ఈ మెయిల్, ఫోన్ నంబర్లను ఇస్తాయి. శాలరీ అడ్వాన్స్ లోన్స్, ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ అని రెండురకాలుగా ఉంటాయివి. 60 రోజుల కంటే తక్కువ గడువు ఉన్న లోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ అనుమతించదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అలాంటి యాప్స్ ఏవైనా ఉంటే వాటిని గూగుల్ ప్లే స్టోర్ తిరస్కరిస్తుంది. దాంతో ఈ దొంగ యాప్‌లో పేర్లు మార్చుకొని మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో జొరబడే ప్రయత్నం చేస్తాయి. ఈ రకమైన యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మీ పర్సనల్ డేటా యాక్సెస్‌ను అవి తీసుకోకుండా నివారించలేమన్నది గుర్తుంచుకోవాలి. చెక్కులు, సిబిల్ స్కోర్ వంటివి లేకుండా, చూడకుండానే ఇచ్చే ఈ లోన్స్ లిమిటెడ్ ఆఫర్స్ అంటూ వినియోగదారులను ఊరిస్తుంటాయి. ఆరుదశల్లో లోను మంజూరు చేస్తాయివి. 1. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేయడం. 2. డౌన్లోడ్ అయ్యాక వంద శాతం రీడ్ యాక్సెస్‌ను డిమాండ్ చేస్తుంది మీ ఫోన్లోని ఫొటోగ్రాప్స్, ఫోన్ బుక్, లొకేషన్ సర్వీసెస్ సహా. 3. మీ ఫోటో ఐడీ, ఆధార్ నంబర్, సెల్ఫీని అప్లోడ్ చేయమంటాయి రిజిస్టర్ ఫోన్ నంబర్ నుంచి. 4. ఎలక్ట్రానిక్ అథెంటికేషన్ అయిపోయాక లోన్ మంజూరు అవుతుంది. 5. ఈ లోన్ రు.500 నుంచి రు.50 వేల వరకు ఉంటుంది. మంజూరు సమయంలోనే వడ్డీ కట్ చేసుకుంటారు. అసలు మీద 40 నుంచి 50 శాతం వడ్డీ ఉంటుంది. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ అన్నీ కలుపుకొని. సకాలంలో ఈ లోన్ చెల్లించకపోతే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్‌కు దిగుతారు.. మీతోపాటు మీ ఫోన్‌బుక్‌లో ఉన్న నంబర్లన్నిటికీ ఫోన్ చేసి మరీ. వేరే వేరే నంబర్ల నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా రోజుకి కనీసం వందసార్లు ఇలా ఫోన్లు చేసి హింసిస్తుంటారు. పేరున్న బ్యాంకులేవీ ఇలాంటి లోన్స్ ఇవ్వవు. ఇన్స్టంట్ లోన్ యాప్స్‌ను గుడ్డిగా అనుసరించకుండా వాటి కాంటాక్ట్ నంబరు, వెబ్సైట్ సమాచారం, చిరునామాను చెక్ చేసుకోండి. వాటి రివ్యూను చూసుకోండి. అలాగే డౌన్లోడ్ సమయంలో మీ లొకేషన్, గ్యాలరీ, ఫోన్‌బుక్ వంటి వాటికి యాక్సెస్ ఇచ్చేముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి. – అనిల్ రాచమల్ల, ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్నౌఫౌండేషన్ -
అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్రక సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు లేవు. 1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ(వన్ కార్డ్, వన్ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్ రంగం వంటివి)కు 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చు’అని ఆ అధికారి వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
యాప్‌తో అప్పులు.. తీర్చేందుకు తప్పులు!
సాక్షి, హైదరాబాద్ : యుక్త వయసు పిల్లలు డబ్బులడిగితే.. మధ్యతరగతి తల్లిదండ్రులు వంద ఆరాలు తీస్తారు. వివిధ రుణసంస్థలు తామిచ్చే అప్పు తీర్చగలరా? లేదా? అనేది రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితిని బట్టి అంచనా వేస్తాయి. అయితే, ఇవేమీ లేకుండానే స్టూడెంట్స్ లోన్ యాప్స్ యువకులకు ఎడాపెడా ఆన్లైన్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి. అడ్డగోలుగా వడ్డీలు పిండుతూ, బెదిరింపులకూ దిగుతున్నాయి. ఫలితంగా పలువురు యువకులు ఒత్తిడికి గురై, అప్పులు తీర్చేందుకు దారితప్పుతున్నారు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ స్టేషన్లో నమోదైన బీటెక్ విద్యార్థి ఉదంతమే దీనికి ఉదాహరణ. ఎం–పాకెట్ యాప్‌లో అప్పు తీసుకున్న ఇతడు దాన్ని తీర్చడానికి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. అన్నీ ఆన్లైన్లోనే.. విద్యార్థులకు రుణాలిచ్చే ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్‌పే, ఉదార్ కార్డ్, రెడ్‌కార్పెట్ వంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఎదుటి వారిని నేరుగా కలవకుండానే ఇవి రుణాలు ఇచ్చేస్తుంటాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే విద్యార్థి తన ఆధార్ కార్డు, టెన్త్ మెమో లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టూడెంట్ ఐడీ అప్లోడ్ చేయాలి. ఈ యాప్స్ రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణం ఇస్తున్నాయి. ఆ మేరకు విద్యార్థి కోరుకున్న మొత్తం కొన్ని గంటల్లోనే అతనికి చెందిన పేటీఎం, గూగుల్ పే వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. వడ్డీ, పెనాల్టీ కలిపి నెలకు 5 నుంచి 10 శాతం వరకు అవుతోంది. రూ.2 వేలు అప్పు తీసుకుంటే మొదటి నెల పూర్తయ్యేలోపు రూ.2,114, రెండో నెలలో రూ.2,225, మూడో నెలలో రూ.2,450 వరకు చెల్లించాలి. అప్పు చెల్లింపు గడువుకు వారం ముందు యాప్ నుంచి సందేశం వస్తుంది. అందులో ఉన్న లింకు క్లిక్‌చేస్తే ఆన్లైన్లోనే చెల్లింపు జరిగిపోతుంది. అప్పు తీరుస్తారా? అందరికీ చెప్పాలా? స్టూడెంట్లోన్ యా ప్స్‌ను ప్లేస్టోర్స్ నుం చి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు.. కాంటాక్ట్స్, ఫొటో స్, లొకేషన్ యాక్సెస్ కోసం అ నుమతి కోరుతుంది. దీన్ని యా క్సెప్ట్ చేస్తేనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. విద్యార్థులకు రుణాలిస్తు న్న ఈ యాప్స్ తమకున్న యా క్సెస్ ద్వారా సదరు విద్యార్థి ఫోన్ లోని కాంటాక్ట్స్ లిస్ట్‌ను ముందే కాపీచేసి పెట్టుకుంటున్నాయి. రు ణం చెల్లించకున్నా, తమ ఫోన్లకు స్పందించకపోయినా వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తమ వద్ద మీ కాంటా క్ట్ లిస్ట్ ఉందని చెబుతూ.. మచ్చు కు కొన్ని కాంటాక్ట్స్‌ను పేస్ట్ చేస్తు న్నారు. తక్షణం డబ్బు చెల్లించకపోతే మీ కుటుంబసభ్యులు, స్నే హితులకు ఫోన్లుచేసి చెబుతామ ని బెదిరిస్తున్నారు. ఆపై అప్పు చె ల్లింపునకు గంట గడువిస్తున్నా రు. అప్పటికీ చెల్లించకుంటే ఫోన్‌కాల్స్ మొదలవుతాయి. బయటపడనివి మరెన్నో.. ఇటీవలే లెండ్ కరో యాప్ బ్లాక్‌మెయిలింగ్‌పై ట్విట్టర్ ద్వారా మా దృష్టికొచ్చింది. స్టూడెంట్స్ లోన్ యాప్స్ కారణంగా పెడదారి పడుతున్న విద్యార్థులు మరెందరో ఉండొచ్చు. దీన్ని సీరియస్‌గా తీసుకుని అప్పులు ఇచ్చే యాప్స్‌పై విచారణ చేస్తున్నాం. వీటికి సరైన అనుమతులు ఉన్నాయా? ఏ మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి? ఏ తరహా బ్లాక్మెయిలింగ్స్కు పాల్పడుతున్నాయి? వంటివి ఆరా తీస్తున్నాం. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్లను చెక్‌చేస్తూ ఏయే యాప్స్ ఉన్నాయో పరిశీలించాలి. – సిటీ పోలీసు ఉన్నతాధికారి బీటెక్ విద్యార్థి ఉదంతంతో వెలుగులోకి.. నగరంలోని బీరంగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మూడు నెలల క్రితం ఎంపాకెట్ యాప్ నుంచి రూ.2,000 అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి రూ.2,450 అయ్యింది. ‘యాప్’ నుంచి ఒత్తిడి పెరగడంతో కట్టుతప్పాడు. పరీక్ష రాయడానికి వెళ్లిన ఇతగాడు ఎగ్జామ్‌హాల్ బయట ఉన్న ఓ యువతి బ్యాగ్ నుంచి సెల్‌ఫోన్ తస్కరించాడు. అందులో ‘సే హాయ్’ చాటింగ్ యాప్ డౌన్లోడ్ చేశాడు. అందులోని వివరాల ఆధారంగా సదరు యువతి మాదిరిగానే ఈ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తనతో చాటింగ్ చేయాలన్నా, తన ఫొటోలు కావాలన్నా కొంత మొత్తం చెల్లించాలంటూ తన పేటీఎం వాలెట్ నంబర్ ఇచ్చాడు. ఈ విద్యార్థి ఇదంతా ఆ యువతి డూప్లికేట్ సిమ్ తీసుకునేలోపే, అదే సిమ్‌కార్డు వాడి ఇవన్నీ చేసేశాడు. దీంతో ఒకరిద్దరు కొంత మొత్తం ఇతడి పేటీఎంకు డబ్బు పంపారు. ఈలోపు డూప్లికేట్ సిమ్ తీసుకున్న ఆ యువతికి నగదు చెల్లించిన ఇద్దరు ఫోన్లు చేయడంతో ఆమె కంగుతిని సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి విద్యార్థిని పట్టుకున్నారు. తాను ఎంపాకెట్ నుంచి అప్పు తీసుకోవడం, అది తీర్చడానికి తప్పు చేసినట్టు విచారణలో చెప్పాడు. ఆ విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ యువతి కేసు వద్దని పోలీసులను కోరింది. దీంతో అధికారులు సోమవారం వీరిద్దరినీ రాజీపడటానికి కోర్టుకు పంపారు. బీటెక్ విద్యార్థి తండ్రి, సోదరిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది
పెళ్లి అంటే వధువు తల్లిదండ్రులకే అన్ని రకాలుగా భారం. కట్నం ఇవ్వాలి.. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి.. సంసారానికి కావాల్సిన సరంజామా సమకూర్చాలి. కానీ నేటి తరం భిన్నమైన మార్గంలో పయనిస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా లెండ్స్ సంస్థ యువత మనోగతం తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. 2018–19 సంవత్సరంలో యువతరం పెట్టుకున్న రుణాల దరఖాస్తుల్లో 20 శాతం వారి పెళ్లి కోసమేనని వెల్లడైంది. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం లాంటి పెళ్లి ఖర్చును తమ సొంత డబ్బుతోనే చేసుకోవాలన్న ఆలోచన నేటి తరంలో పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఇక యువతీ యువకుల్లో ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్న కోరిక బాగా ఉంది. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రయాణాల కోసమే 70 శాతం దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ విద్యా రుణాలు, సొంతంగా కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లో 25–30 ఏళ్ల వయసు మధ్యనున్న వారు దేని కోసం రుణాలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. ‘ఈ తరం పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకుంటున్నారు. తమ పెళ్లి కోసం రుణాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. అమ్మాయి తల్లిదండ్రులే అన్నీ చేయాలన్న ధోరణిలో బాగా మార్పు వస్తోంది’అని ఇండియాలెండ్స్ సంస్థ సీఈవో రవ్ చోప్రా చెప్పారు. ముంబైలో అత్యధికంగా 22 శాతం పెళ్లి కోసం రుణాలు తీసుకుంటే.. హైదరాబాదీల్లో 20 శాతం మంది ప్రయాణాల కోసమే లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట. -
బడ్జెట్ భారం, కేంద్రం దూరం
తెలంగాణ ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా బడ్జెట్‌కు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది అప్పులు తెచ్చుకోవడం. రెండవది భూములు అమ్ముకోవడం. మూడవది కేంద్రం నుండి సహాయం పొందడం. ఈ అంచనాలన్నీ అత్యాశగానే కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ మూడు అంశాలలో అప్పులు ఎక్కడి నుండి తెస్తారు, వాటిని తిరిగి చెల్లించే మార్గాలు ఏమిటి? మళ్లీ ప్రపంచ బ్యాంకు వంటి రుణ వ్యవస్థలకు తెలంగాణ ప్రజలను తాకట్టు పెడతారా అన్న విషయాలు రానున్న కాలంలో ఎట్లాగూ తెలుస్తాయి. డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ నెల ఐదో తేదీన సమావేశాల మొదటి రోజునే రూ. లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్‌ను రాష్ర్ట ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. రాష్ర్ట విభజన అనంతరం జూన్ 2న అపాయింటెడ్ డే నుండి తెలంగాణ రాష్ర్టం అస్తిత్వంలోకి వచ్చింది. ఆ రోజునే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి దాకా తెలంగాణ రాష్ర్టంలో భాగమైన పది జిల్లాలూ గవర్నర్ పాలన కిందనే ఉన్నాయి. ఆ కొద్దిమాసాల బడ్జెట్‌కు గవర్నర్ ఆధ్వర్యంలోనే కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ తొలి ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2014 జూన్ నుండి అంటే 10 మాసాలకు ఉద్దేశించింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టింది నవంబర్ 5 వ తేదీన. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గడిచిపోయిన 5 మాసాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలినవి 5 మాసాలే. నిధులకు మూడు మార్గాలు ఉమ్మడి రాష్ర్టంగా ఉన్ననాడే ఆంధ్రప్రదేశ్ చివరి బడ్జెట్ లక్షా 61 వేల కోట్లు. 2013లో ఉమ్మడి రాష్ర్ట చివరి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాష్ర్టం విడిపోయాక అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం చెరి లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్లు ప్రవేశపెట్టాయి. రెండు ప్రభుత్వాలూ బడ్జెట్ వ్యవహారంలో ప్రతిష్టకు పోయి, నేల విడిచి సాము చేస్తున్నాయన్న విమర్శనే ఎదుర్కొంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం తొందరగానే బడ్జెట్ సమావేశాలు ముగిం చుకున్నది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లకుండా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా బడ్జెట్‌కు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది అప్పులు తెచ్చుకోవడం. రెండవది భూములు అమ్ముకోవడం. మూడవది కేంద్రం నుండి సహాయం పొందడం. ఈ అంచనాలన్నీ అత్యాశగానే కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ మూడు అంశాలలో అప్పులు ఎక్కడి నుండి తెస్తారు, వాటిని తిరిగి చెల్లించే మార్గాలు ఏమిటి? మళ్లీ ప్రపంచ బ్యాంకు వంటి రుణ వ్యవస్థలకు తెలంగాణ ప్రజలను తాకట్టు పెడతారా అన్న విషయాలు రానున్న కాలంలో ఎట్లాగూ తెలుస్తాయి. రెండవ అంశం భూముల విక్రయం. వచ్చే నాలుగు మాసాల కాలంలోనే భూముల విక్రయం ద్వారా రూ.6,500 కోట్లు సముపార్జించే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆచరణలో అది అంత సులభం కాదన్న విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదు. సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉద్యమం జరిగిన నేపథ్యంలో భూముల క్రయవిక్రయాలు దారుణంగా పడిపోయిన విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. సరే, అది అట్లా ఉంచితే, మూడవ అంశం కేంద్ర సహాయం. కేంద్రం నుండి వీలైనంత ఎక్కువ సహాయం రాబట్టుకోవాలనే సంకల్పం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదా అన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ప్రభుత్వాల నిర్వహణ చాలా సందర్భాలలో రాజకీయ సమీకరణలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ నిమిషానికి అయితే రాష్ర్టంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ర్ట సమితికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకీ మధ్య సంబంధాలు అస్సలు బాగా లేవు. లేకపోగా రోజురోజుకూ రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితి తయారవుతోంది. కేంద్ర సాయం ఏ మేరకు సాధ్యం? పక్క రాష్ర్టం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నది. అట్లాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా చేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఇక్కడా అక్కడా ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. అటువంటి చోటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రాజకీయ స్నేహం ఏ మేరకు తన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో చెప్పే స్థితిలోలేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడుతోనూ తమ స్నేహం వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతుందో చంద్రబాబు నాయుడు చెప్పే స్థితిలో లేరు. సంకీర్ణ ధర్మం వేరు, రాజకీయంగా బలపడటం వేరు అన్న సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అమలు చేయడం మొదలు పెట్టిన బీజేపీ అక్కడ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పావులు కదపడం మొదలుపెట్టింది. రాష్ర్ట విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకు పోవడంతో ఆ పార్టీలో అంతో ఇంతో బలం ఉన్న నాయకుల ను తన పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టేసింది. ఈ విషయంలో గత అనుభవాల నుండి బీజేపీ పాఠం నేర్చుకున్నదనే భావించాలి. 1999-2004 మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంతో కలసి నడిచిన ఫలి తంగా బీజేపీ రాజకీయంగా ఎంత బలహీనపడిందో ఆ పార్టీకి అర్థం అయినట్టే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షాల జోడీ వ్యూహాలు మనం ఇటీవలే మహారాష్ర్ట ఎన్నికలలో కూడా చూశాం. భావ సారూప్యం కలిగిన శివసేనతోనే 25 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకోగలిగిన బీజేపీకి తెలుగుదేశం ఒక లెక్క కాదు కదా! ఈ వైఖరితో ఏం సాధిస్తారు? అటువంటి మోదీ, షా జోడీ తెలంగాణలో టీఆర్ఎస్ పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు పట్ల ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు పట్ల కచ్చితమైన ైవైఖరితో నిలిచిన బీజేపీ విషయంలో టీఆర్ఎస్ అధినేత అనుసరిస్తున్న ధోరణి తన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకోవడానికే అయినా, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్ట ప్రయోజ నాలకు మాత్రం ఉపయోగకరం కాదు. మహారాష్ర్ట గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు గారికి తెలంగాణ ప్రభుత్వం మొన్న ఘనంగా పౌర సన్మానం నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. గౌరవనీయులైన మహారాష్ర్ట గవర్నర్ తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలను ఒప్పించేందుకు చేసిన కృషిని కేసీఆర్ కొనియాడారు. మొన్న ఆదివారం నాడు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించిన మరో సీనియర్ బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయను కూడా ఉచితరీతిన సత్కరించుకుంటామని ఆయన ఇదే వేదిక మీద చెప్పారు. చంద్రశేఖర్‌రావు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఆ ఇద్దరు నేతలు తెలంగాణలో అంత కంటే ఎక్కువ సత్కారానికీ అర్హులే. రాష్ట్రానికి మేలు చేయని వైరం కానీ జూన్ 2న తన ప్రమాణ స్వీకారానికి మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ర్ట నాయకులు కోరినా కేసీఆర్ పట్టించుకోలేదట. తెలంగాణ రాష్ర్టం ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలో నేల కరిచి కూడా తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్, ఆంధ్ర ప్రాంత నాయకుడి కనుసన్నల్లో మెలగుతున్నారన్న దాడి ఎదుర్కొంటున్న తెలంగాణ టీడీపీ కంటే కూడా బీజేపీకే ఇక్కడ బలపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాన్ని కొట్టి పారెయ్య డానికి వీల్లేదు. తెలంగాణలో మరెవ్వరికీ ఎటువంటి స్థానం ఉండకూడదు అన్న ఈ ధోరణి టీఆర్ఎస్కు రాజకీయంగా ఏ మేరకు లాభం చేకూరుస్తుందో తెలి యదు కానీ ప్రస్తుతం అయితే రాష్ర్ట ప్రయోజనాలకు ఏ మాత్రం మేలు చెయ్య దన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిది. దేవులపల్లి అమర్