madhu babu
-
ఇంట్రస్టింగ్‌గా అనంత టీజర్
ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అనంత. ఈ చిత్రానికి మధు బాబు దర్శకత్వం వహిస్తుండగా ఏ ప్రశాంత్ నిర్మిస్తున్నారు. అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ జే గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ముఖ్యపాత్రలు పోషిస్తుండగా ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందిస్తున్నారు. సిద్దు సోమిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో సినిమా సోల్ ఏంటనేది స్పష్టమయ్యేలా ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ఈ టీజర్ చూసిన డైరెక్టర్ చంద్ర సిద్దార్థ.. సినిమా చాలా బాగా వచ్చిందని అర్థమవుతోందని అన్నారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ సినిమా కాదని, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ ఈ అనంత రూపొందించారని తెలుస్తోందన్నారు. చిత్ర దర్శకులు మధు బాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాం. కథ వినగానే ప్రశాంత్ ముందుకొచ్చి ఈ సినిమా చేశారు. ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు నాలెడ్జ్ పంచుతుంది. ఇది గ్లోబల్ సబ్జెక్టుతో రాబోతోంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. చదవండి: విషాదం, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ నటుడు మృతి -
ఎక్కడకు వెళ్లినా సాకేత్ అనే పిలుస్తారు
‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్లో సాకేత్‌గా బుల్లితెరకు పరిచయం అయిన గుడిబోయిన మధుబాబు అతి త్వరలోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’... ఇలా వరుస సీరియల్స్‌తో ఏడేళ్లుగా బుల్లితెర నటుడిగా బిజీ బిజీగా ఉన్న మధుబాబు తన గురించి పంచుకున్న ముచ్చట్లివి. ‘‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్ వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌లో నటించాను. ఆ తర్వాత అభిషేకం సీరియల్ మూడువేలకు పైగా దాటింది. దీంతోపాటు జీ టీవీలో వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, జెమినీలో వచ్చే రెండు రెళ్లు ఆరు సీరియల్స్‌లో నటిస్తున్నాను. అన్ని సీరియల్స్ టాప్ రేటింగ్‌లో నన్ను నిలబెట్టాయి. ఇంతగా బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా నా అసలు పేరుకన్నా సాకేత్ అని పిలిచేవారు. ఆ పేరుతోనే ఇప్పటికీ పిలిచేవారున్నారు. బీటెక్ చేస్తూ.. పుట్టి పెరిగింది వరంగల్‌లోని హన్మకొండలో. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. స్కూల్, కాలేజీల్లో ఏ చిన్న సందర్భం వచ్చినా డ్యాన్స్‌లో ముందుండేవాడిని. హైదరాబాద్‌లో బీటెక్ చేశాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ, ఈ ఇండస్ట్రీకి రావాలని ఆలోచనా ఎక్కువ ఉండేది. దానికితోడు స్నేహితుల ప్రోత్సాహం నన్ను ‘యంగ్ ఇండియా’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేలా చేసింది. సెలక్ట్ అయ్యాను. ఆ తర్వాత ‘పవనిజం’ సినిమా చేశాను. ఇప్పుడు ‘సత్యాగ్రాహి’ సినిమాలోనూ నేనే హీరోని. డ్యాన్స్ బాగా వచ్చినా నటన కోసం రెండు నెలల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నా. ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్లో... ఉద్యోగం చేయకపోయినా ఏమీ అనలేదు హైదరాబాద్‌కి వచ్చి పన్నెండేళ్లు అయ్యింది. నేను బీటెక్ చదువుకుని ఉద్యోగం చేయకుండా ఈ ఫీల్డ్కి వచ్చినందుకు మా ఇంట్లో వాళ్లు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. పిల్లల ఇష్టాలకే వదిలేశారు. మా తమ్ముడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. యానిమేషన్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు. మాకు ఒక చెల్లి. తను ఇప్పుడు కెనడాలో ఉంటోంది. మా బావ, తను ఇద్దరూ ఫిజియో థెరపిస్ట్‌లు. వాళ్లన్నా, వాళ్ల బాబు లక్కీ అన్నా నాకు చాలా ఇష్టం. మద్యం తెచ్చిన ముప్పు మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. జాలి గుండె. మా నాన్న మందుకు బానిసవడంతో కుటుంబం మొత్తం చాలా సఫర్ అయ్యాం. ఆ సమయంలో కొండంత అండగా నిలిచి మా బాగోగులు చూసుకున్న దేవతలాంటి మా అమ్మమ్మ మూడేళ్ల క్రితం దేవుడి దగ్గరకు వెళ్లిపోవడంతో ఆమెను బాగా చూసుకోవా లనుకున్న నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న తాగుడు వ్యసనం మూలంగా మా బంధువులు మమ్మల్ని చులకనగా చూసేవారు. అలాంటి తండ్రి మీద ఆశ వదిలేసుకోమనేవారు. కానీ, వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ, విరుగుడు మందులు వాడుతూ ఆ మద్యం చెర నుంచి విడిపించి హైదరాబాద్ తీసుకువచ్చాను. మంచి ప్లాట్ కొనుక్కొని అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అమ్మానాన్నలు నా సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్నలో వచ్చిన ఈ మార్పు చూసి మా బంధువులంతా ఆశ్చర్యపోతుంటారు. గతంలో వెలివేసినట్టుగా చూసిన వారే ఇప్పుడు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. వాళ్లు అప్పుడు మమ్మల్ని అలా నిరుత్సాహపరచడం వల్లే మేము పట్టుదలతో ఎదిగాం అనిపిస్తుంది. చాలా నిరుత్సాపడ్డాను టీవీ సీరియల్స్ ద్వారా ఇంత పేరు వస్తుందని మొదట్లో అనుకోలేదు. సినిమాలో నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశాను. కానీ, కొన్ని సినిమాలు సగం షూటింగ్‌తోనే ఆగిపోయి చాలా నిరుత్సాహపడ్డాను. ముందుగానే అనుకున్న సీరియల్ ఆఫర్ ఆగిపోయింది. అవకాశాలు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను. ఓర్పు వహించాను. ఆ తర్వాత ఒకటొకటిగా అవకాశాలు వచ్చాయి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఆ ప్రయత్నాలూ మానుకోలేదు. పవనిజం తర్వాత ఇప్పుడు సత్యాగ్రాహి సినిమా చేస్తున్నాను. సంతోషమే బలం ఇప్పుడు ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాం. మా అమ్మ జీవితంలో చాలా బాధలు పడింది. ఆమెను సంతోషంగా చూసుకోవాలి. మా కుటుంబాన్ని అర్ధం చేసుకుని మాతో ఫ్రీగా కలిసిపోయే అమ్మాయి భార్యగా రావాలనుకుంటున్నాను. వస్తున్న అవకాశాలు అందుకుంటూ ఇలా సీరియల్స్, సినిమాలు చేసుకుంటూ రోజులు హ్యాపీగా గడిపేయాలనుకుంటున్నాను.’’ – సంభాషణ: నిర్మలారెడ్డి -
తప్పిపోయిన చిన్నారి చైల్డ్ ప్రొటెక్షన్‌కు అప్పగింత
ఏలూరు టౌన్ : ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని ఒక వ్యక్తి చేరదీసి బంధువుల కోసం ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవటంతో ఆ బాలుడిని ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. బంధువుల సమాచారం తెలియకపోవటంతో బాలుడిని శిశు గృహకు తరలించారు. ఏలూరు పాత బస్టాండ్‌లో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాలుగేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. ఏలూరు మరడాని రంగారావు కాలనీకి చెందిన కాటూరి వెంకన్న ఆ బాలుడిని గమనించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బుధవారం ఉదయం మళ్లీ పాతబస్టాండ్‌కు తీసుకు వచ్చి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశించాడు. రాత్రి వరకూ చూసినా ఎవరూ రాకపోవటంతో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి సీఐ జి.మధుబాబుకు అప్పగించారు. వెంటనే ఆయన ఐసీడీఎస్ పీడీకి సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేష్ పోలీస్‌స్టేషన్‌కు రాగా, ఆ బాలుడిని సీఐ మధుబాబు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. బాలుడి చిరునామా తెలిసిన వారు ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ మధుబాబు కోరారు. -
‘నేను త్రివిక్రమ్‌కు కథ ఇవ్వలేదు’
జై లవ కుశ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రముఖ రచయిత మధుబాబు నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రచయిత మధుబాబు క్లారిటీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధు బాబు స్పందించారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు తాను కథ అందిస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అసలు త్రివిక్రమ్ తనను కథ విషయంలో సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అవకాశం వస్తే సినిమాలకు కథ అందించేందుకు సిద్ధమని మధుబాబు తెలిపారు. -
పేట్రేగుతున్న బ్లేడ్ బ్యాచ్
విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం పెనమలూరు : బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగాయి. ఇప్పటివరకు దాడులకు పాల్పడుతున్న వారు ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్నాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన డిగ్రీ విద్యార్థి పరిమి మధుబాబు (22) విజయవాడలోని అమ్మమ్మ ఇంటికి కొద్ది రోజుల కిందట వచ్చాడు. మేనత్త వద్ద రూ.3 వేలు తీసుకుని తిరిగి తణుకుకు సోమవారం రాత్రి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను విజయవాడ బస్టాండ్ వద్ద బీరు తాగాడు. ఆ తరువాత ఆటో అతనిని పిలిచి మంచి హోటల్‌కు తీసుకెళ్లమన్నాడు. ఆటో బయలుదేరుతుండగా అందులో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఎక్కారు. వారు మధుబాబును బెదిరించి ఆటోను పెదపులిపాక కరకట్ట వద్దకు తీసుకువచ్చారు. అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్, సొమ్మును దౌర్జన్యంగా లాక్కున్నారు. జేబులో నుంచి బ్లేడ్లు తీసి చంపుతామని బెదిరించారు. భయాందోళనకు గురైన మధుబాబు వారితో పెనుగులాడి తప్పించుకుని సమీపంలోని పంట పొలాల్లోకి పారిపోయి దాక్కున్నాడు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు అతని కోసం చీకట్లో గాలించి దొరకకపోవడంతో ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఆటోలో వచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్ పెనుగులాటలో కిందపడి పోయింది. దీనిని మధుబాబు తీసుకుని పోలీసులకు అప్పగించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. పెనమలూరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. -
కన్నవారే.. కాదన్నారు !
⇒ క్యాన్సర్‌తో మరణానికి చేరువవుతున్న భర్త.. పిల్లలతో కలసి అత్తింటివారిని ఆశ్రయం కోరిన కోడలు ⇒ ఇంట్లోకి రానీయని అత్తమామలు ⇒ రాత్రికి రాత్రే తాళం వేసి మాయమైన వైనం ⇒ అదే ఆవరణలో తుదిశ్వాస విడిచిన కొడుకు విజయవాడ (రామవరప్పాడు) : కష్టాల్లో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నవారే కాదన్నారు.. తమ బిడ్డకు ప్రాణాంతక వ్యాధి సోకిందన్న ఇసుమంత బాధ కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తించారు.. మంచానికే పరిమితమైన భర్తతో అతని అర్ధాంగి దిక్కుతోచక మెట్టింటివారి సహాయం కోసం ఆత్రుతతో వస్తే ఇంట్లోకి రానీయలేదు.. బాధితుడి తల్లి, తండ్రి, సోదరుడు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి మాయమయ్యారు. దీంతో మరణానికి దగ్గరగా ఉన్న భర్తతో పాటు తన ఇద్దరు కూతుళ్లతో ఆ అభాగ్యురాలు మెట్టింటి ఆరు బయటే వేచి ఉంది. అయితే ఆదివారం రాత్రి పదిగంటల సమయానికి మధుబాబు అక్కడే తుది శ్వాస విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన ప్రసాదంపాడులో ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రసాదంపాడు గ్రామానికి చెందిన కొండూరి కోటేశ్వరరావు, కృష్ణకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు కొండూరి మధుబాబు, రెండో కొడుకు ప్రేమ్‌బాబు. మధుబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఇదే గ్రామానికి చెందిన మాధవిని 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు సుచిత్ర, స్రవంతి. వీరంతా కలిసే ఉండేవారు. ఇటీవల మధుబాబుకు నోటి క్యాన్సర్ సోకింది. ఆదుకోవాల్సిన కుటుంబసభ్యులే పట్టించుకోకపోవడంతో గ్రామంలోనే వేరు కాపురం పెట్టారు. మరోపక్క నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుపై శస్త్ర చికిత్స చేయించారు. కానీ వ్యాధి తిరగబెట్టడంతో నోటి నుంచి శరీరం లోపలి వరకు పాకింది. దీంతో రెండోసారి శస్త్ర చికిత్స చేయిస్తే ప్రాణానికి ప్రమాదమని సాహసించలేకపోయారు. ఇంటి యజమాని ఖాళీ చేయమన్నారు... వ్యాధి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇంటి యజమాని తమ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, ఖాళీ చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో మరణానికి దగ్గరగా ఉన్న భర్తతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని మాధవి మెట్టింటి వారికి తన బాధ మొరపెట్టుకుంది. ఇంటిని ఖాళీ చేయంటున్నారని, మీరు అనుమతిస్తే ఇక్కడికి వస్తామని బతిమాలుకుంది. అందుకు అంగీకరించిన మధుబాబు తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి మాయమయ్యారు. దీంతో చేసేదేమీ లేక తన ఇద్దరు కూతుళ్లు, భర్త మధుబాబుతో మెట్టింటి ఆరు బయటే ఉన్న మాధవి చివరికి అతని ప్రాణాలు పోవటంతో శోకసంద్రంలో మునిగిపోయింది. మా కొడుకే కాదు పొమ్మన్నారు నా భర్తకు క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆయన పరిస్థితి దారుణంగా తయారై మంచానికే పరిమితమయ్యాడు. వైద్యులు కూడా కాపాడలేమంటూ చేతులెత్తేశారు. మెట్టింటి వారు ఇంట్లోకి రానీయడం లేదు. అసలు మధుబాబు మా కొడుకే కాదని పొమ్మన్నారు. అద్దె ఇల్లు ఖాళీ చే సి మెట్టింటికి వస్తే లోపలికి రానీయకుండా తాళం వేశారు. - మాధవి, మధుబాబు భార్య -
చరిత్ర చెప్పిన... ‘రుద్రమదేవి’కథ
మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పాలించిన ఆమె గురించి చరిత్రలో చాలా వివరాలున్నాయి. దర్శక - నిర్మాత గుణశేఖర్ తన రీసెర్చ్ బృందం సాయంతో, చరిత్రను జాగ్రత్తగా పరిశీలించి ‘రుద్రమదేవి’ సినిమా తీశారు. ప్రముఖ చారిత్రక పరిశోధకులు - పండితులు ముదిగొండ శివప్రసాద్ సారథ్యంలో రచయితలు విపంచి (తోట ప్రసాద్), ఎమ్బీయస్ ప్రసాద్, మధుబాబు తదితరులు పురాతన గ్రంథాలు, శాసనాల ఆధారంగా స్క్రిప్టు రచనకు సహకరించారు. అక్కడక్కడా సినిమాకు కావాల్సిన స్వాతంత్య్రం తీసుకున్నా... ప్రధానంగా చరిత్రకు కట్టుబడే ఈ సినిమాను తీసినట్లు గుణశేఖర్ ప్రకటించారు. ఇంతకీ చరిత్రలో ఏముందంటే... తెలుగుదేశ చరిత్రలోనే కాదు... యావత్ దక్షిణదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ ఘట్టం - కాకతీయ యుగం. మన తెలుగు జాతి చరిత్రను గమనిస్తే - కాకతీయ సామ్రాజ్యం, కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం. శాతవాహనుల తరువాత తెలుగు దేశాన్నీ, జాతినీ ఒక్క తాటి మీదకు తెచ్చిన రాజవంశీయులు కాకతీయులు. సుమారు మూడు శతాబ్దాలు వారు తెలుగునాడు మొత్తాన్నీ ఒకే పరిపాలన కిందకు తెచ్చి, పటిష్ఠమైన పాలన అందించి, ప్రాంతీయ, రాజకీయ అభిమానాల్ని తొలగించారు. ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల లాగా, దక్షిణ భారతంలో హైందవ సంస్కృతీ పరిరక్షణకు ప్రాణాలొడ్డింది వారే. తమ తరువాత వచ్చిన రెడ్డి రాజులకూ, విజయనగర పాలకులకూ వారే మార్గదర్శకులు. అప్పట్లో ‘ఆంధ్రనగరి’గా పేరొందిన ఓరుగల్లు (ఇప్పటి వరంగల్) రాజధానిగా ఒరిస్సా నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ దాకా కాకతీయుల పాలన విస్తరించింది. అలాంటి కాకతీయ సామ్రాజ్యంలో పేరున్న పరిపాలకురాలు - రుద్రమదేవి. రుద్రమదేవికి ముందు... రుద్రమదేవికి ముందు ప్రసిద్ధులైన కాకతీయుల్లో మహాప్రరాక్రమశాలి, రాజనీతిజ్ఞుడు రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 1195) మొదటివాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని నిజంగా స్థాపించింది ఆయనే. పల్నాటి యుద్ధంలో నలగామునికి సాయం చేసింది ఈ కాకతి రుద్రుడే. ఆయన విజయయాత్రల వల్లే మొత్తం తెలంగాణ, కోస్తా ఆంధ్ర దేశమంతా కాకతీయుల వశమైంది. రుద్రదేవుడికి పిల్లలు లేకపోవడం వల్ల సోదరుడు మహదేవుడు రాజయ్యాడు. కానీ, నాలుగేళ్ళకే మరణించాడు. అటు తరువాత మహదేవుడి కుమారుడు గణపతి దేవుడు (క్రీ.శ. 1199 - 1262) రాజయ్యాడు. విపత్కర పరిస్థితుల్లో రాజ్యాధికారం సంక్రమించిన గణపతిదేవుడు మహావీరుడు, రాజనీతిపరుడు. దాయాదుల దండయాత్రతో అధికారం కోల్పోయిన నెల్లూరు తెలుగు చోడరాజ్యాధిపతి మనుమసిద్ధి అప్పట్లో గణపతిదేవుని సాయం కోరాడు. ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజిని రాయబారిగా పంపాడు. అప్పుడు గణపతిదేవుడే స్వయంగా సైన్యంతో వెళ్ళి, శత్రువుల్ని ఓడించి, మనుమసిద్ధిని సింహాసనం ఎక్కించాడు. అధికారం చేపట్టిన తొలి మహిళ తెలుగు రాజ్య సమైక్యతను సాధించిన గణపతిదేవుడికి కుమారులు లేరు. దాంతో, రెండో కూతురైన రుద్రమదేవికి వీరోచిత విద్యలు నేర్పి, వారసురాలిగా ప్రకటించాడు. ఆ ఏర్పాటు రాజవంశీకులకు నచ్చలేదు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. అయినా, రుద్రమదేవి రాజ్యాధికారం స్వీకరించింది. మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. ఆమె కష్టాలకు అదే కారణమైంది. ఈ ఆధునిక 21వ శతాబ్దంలోనే మహిళలకు రాజ్యాధికారం ఇవ్వడానికీ, ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కు దిక్కూ దివాణం లేకపోతే, దాదాపు 750 ఏళ్ళ క్రితం పురుషాధిక్యతకు ఎదురే లేని ఆ కాలంలో ఆమె ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె పాలనా కాలమంతా ప్రధానంగా యుద్ధాలతో గడిచిపోయింది. పలువురు సామంతులు తిరుగుబాటు చేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడాన్ని దాయాదులైన హరహర, మురారిదేవులు ప్రతిఘటించారు. తిరుగుబాటు చేశారు. కానీ, విశ్వాసపాత్రులైన రేచర్ల ప్రసాదిత్యుడు, కాయస్థ జన్నిగదేవుడు, గోన గన్నారెడ్డి మొదలైన సేనానుల సాయంతో తిరుగుబాటును ఆమె అణచివేసింది. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు (ఆనాటి నిరవద్యప్రోలు) పాలకుడైన చాళుక్య వీరభద్రుడికీ, రుద్రమదేవికీ వివాహం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. విదేశీయులూ మెచ్చిన పాలన! నిరంతరం యుద్ధాల్లో మునిగితేలినా, పరిపాలనను రుద్రమదేవి నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లును శత్రు దుర్భేద్యం చేయడానికి మట్టి కోటకు కందకాలు, బురుజులు నిర్మించింది. రాతికోటను పటిష్ఠం చేసింది. ఇటలీ దేశ నౌకా యాత్రికుడైన మార్కోపోలో ఆమె పాలనా కాలంలోనే తెలుగునాడును సందర్శించాడు. దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందనీ, పరిశ్రమలు - వాణిజ్యం ఉన్నత స్థితిలో ఉన్నాయనీ, దేశం సుభిక్షంగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా, రుద్రమదేవిని గొప్ప వ్యక్తిగా కీర్తించాడు. మహమ్మదీయ చరిత్రకారులైన అమీర్ ఖుస్రూ, బర్నీ రచనలు కూడా కాకతీయుల కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తాయి. రుద్రమదేవితరువాత... రుద్రమదేవికి కూడా ముగ్గురూ కుమార్తెలే. మూడో కుమార్తె ముమ్మిడమ్మకూ, మహదేవరాజుకూ కలిగిన బిడ్డ - ప్రతాపరుద్రుడు. ఆ బాలుణ్ణి రుద్రమదేవి దత్తత తీసుకుంది. ఆమె అనంతరం యువరాజు ప్రతాపరుద్రుడే రాజయ్యాడు. అతని పాలనలో కాకతీయ రాజ్యం ఉన్నత స్థితికి చేరింది. ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ వంశం అంతరించింది. తెలుగునేల తురుష్కుల పాలనలోకి వచ్చింది. ‘ఆంధ్రనగరి’గా పేరున్న ఓరుగల్లు కాస్తా సుల్తాన్పూర్గా మారింది. ప్రసిద్ధ నిర్మాణాలు.. ప్రముఖమైన రచనలు... రాయచూరు, రాచకొండ, గోల్కొండ, దేవరకొండ దుర్గాలు, మూడు రక్షణ శ్రేణులతో కూడిన ఓరుగల్లు కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి నిదర్శనం. హనుమకొండలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు ప్రతిష్ఠితులై, త్రికూటాలయంగా విలసిల్లిన వేయిస్తంభాల గుడి, వివిధ శిల్పాలతో అలంకరించిన స్తంభాలు, (కాకతీయుల) తోరణ స్తంభాలు వారు కట్టించినవే. రామప్ప చెరువుతో సహా వాళ్ళు తవ్వించిన తటాకాలు ఎన్నో. అలాగే, విజయనగర రాజుల కాలం నాటి తెలుగు సాహిత్య స్వర్ణయుగానికి కాకతీయుల కాలంలోనే పునాది పడింది. మొదట జైన మతం, ఆ తరువాత వీరశైవం, వైష్ణవమతం అభివృద్ధి చెందిన ఆ రోజుల్లోనే శైవ కవులైన పండితారాధ్యుడు, పాల్కురికి సోమన తెలుగులో రచనలు చేశారు. కేతన రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం ‘ఆంధ్ర భాషా భూషణం’, బద్దెన రాసిన సుమతీ శతకం, తిక్కన మహాభారత అనువాదం, వినుకొండ వల్లభరాయుడి ‘క్రీడాభిరామం’ లాంటివన్నీ అప్పుడు వచ్చిన రచనలే. అలా తెలుగుభాషాభివృద్ధికి కాకతీయులు చేసిన సేవ విశిష్టమైనది. -రెంటాల జయదేవ