నగరంలో అల్ప, మధ్యాదాయ వర్గాలే అధికం...
రూ.5 వేల లోపు... 34.3%
రూ.5-10 వేలు 37.1%
రూ.10-15 వేలు 12.5%
రూ.15-20 వేలు 7.3%
రూ.20-40 వేలు 7%
రూ.40-60 వేలు 1.2%
రూ.60వేలు - లక్ష 0.4%
రూ. లక్షకుపైగా 0.1%
మహానగరం పరిధిలో అల్పాదాయ, మధ్యాదాయం పొందేవారే అత్యధికంగా ఉన్నారు. నెలకు రూ.5 వేల లోపు సంపాదించే వారు 34.3 శాతం మంది ఉన్నారు. ఇక 5 నుంచి 10 వేల లోపు ఆదాయం పొందేవారు 37.1 శాతం, 15-20 వేల లోపు ఆర్జించేవారు 7.3 శాతం మంది ఉన్నారు. నెలకు లక్షకు పైగా సంపాదించేవారు కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే నగరంలో అల్పాదాయ, మధ్యాదాయ వేతన జీవులు, దినసరి కూలీలు, శ్రామికులే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇక అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు సగటున నెలకు సుమారు రూ.20,200 ఆర్జిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారి కుటుంబ ఆదాయం నెలకు సగటున రూ.13,600 ఉన్నట్లు లెక్కగట్టారు. మురికివాడల్లో నివసించేవారి కుటుంబ ఆదాయం నెలకు రూ.9800 మాత్రమే.