Mahalaxmi scheme
-
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్నెస్ టెస్ట్ చేస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్‌కు ఫిట్నెస్ టెస్ట్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మంత్రి పొన్నం మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. ‘మహాలక్ష్మి కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. గతంలో రెగ్యులర్‌గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే.. ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉంది. ఆటోవాళ్లకు రూ. 12 వేల హామీ ఇచ్చాం.. నెరవేరుస్తాం. ఆటోలు కొనుగోలు పెరిగింది, ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారు?. ... కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తాం. బిహార్‌లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించి ఒకొక్కరికి 150 ఇల్లు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి.. అధికారులను నియమిస్తాం. నోడల్ ఆఫీసర్‌గా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఉంటుంది. కవితకు సీబీఐ నోటీసులు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అందుకే మళ్లీ కొత్త డ్రామా’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. -
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతాం:మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బస్సు భవన్ ముట్టడికి మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్ సింఘ్(బీఎంఎస్) ఆటో కార్మికులు యత్నించారు. పలు డిమాండ్ల సాధనతో నిరసన ప్రదర్శన చేపట్టారు వాళ్లు. ఈ క్రమంలో బస్‌భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. అయితే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో.. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చింది. ఈ క్రమంలో పథకానికి వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు వాళ్లు. అలాగే.. ఓలా, ఉబర్ రాపిడోలతో ఇబ్బందులు పడుతున్నామని.. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికులు. -
పేరు మారింది...అంతే!
ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు తెలుగుదేశం పరిపాలనలో అతీగతీ లేకుండా పోయాయి. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ఆ పథకాల పేర్లు మార్చారే తప్ప వాటి అమలు కొనసాగింపు కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆ పథకాలేమయ్యాయి...అంటూ ఆవేదన చెందుతున్నారు. బంగారు తల్లి పథకం తీరిదే...దీని పేరు మాఇంటి మహలక్ష్మిగా మార్చేసి ఇక పనైపోయిందనుకున్నారు పాలకులు. ఫలితంగా ఆ పథకం లక్ష్యాలు లబ్ధిదారులకు దూరమయ్యాయి. శృంగవరపుకోట రూరల్: పుట్టిన ఆడపిల్లకు గ్రాడ్యుయేషన్ వరకు రూ.1,05,500, ఆ ఆడపిల్లల పెళ్లి సమయంలో రూ.50,000 మొత్తంగా రూ.1,55,500 మా ఇంటి మహాలక్ష్మి (‘బంగారుతల్లి’ పేరు మార్పు) పథకంలో నమోదైన ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు దశల వారీగా నగదు జమ చేసే పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం పాతరేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం బంగారుతల్లి పథకం పేరుతో చట్టం కూడా చేసి 2013 సంవత్సరం మే 1 నుంచి పుట్టిన ఆడపిల్లల తల్లుల పేరున బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా నగదును జమ చేయడం ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 జూన్–14 నుంచి ఆడపిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ నిలిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు శాఖ నుంచి బంగారుతల్లి పథకం నిర్వహణను ‘మా ఇంటి మహాలక్ష్మి’ పేరుతో ఐసీడీఎస్‌లు అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారు. కేవలం బంగారుతల్లి పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడంతోనే మిన్నకుండిపోయి పథకంలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయక ప్రభుత్వం పక్కన పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ఇలా.. పుట్టిన ఆడపిల్లలను ఏ ఒక్కరూ దరిద్రంగా భావించరాదనే ఉద్దేశంతో ఆడపిల్లలను బాగా చదివించి వారికి పెళ్లి చేసే వరకు లబ్ధిదారులుగా ఉన్న ఆడపిల్లల తల్లుల పేరున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చట్టం చేసారు. ఇందులో భాగంగా 2013 మే 1 నుంచి పుట్టిన ఆడపిల్లలకు ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ.2500, మొదటి సంవత్సరం టీకాల నిమిత్తం రూ.1000, రెండవ సంవత్సరం రూ.1000, 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఆడపిల్లలకు సంవత్సరానికి రూ.1500ల చొప్పున, 6 నుంచి 10సంవత్సరాల వయసు వరకు రూ.2వేలు, 6, 7, 8 తరగతుల వరకు రూ.2500, 9, 10 తరగతులకు రూ.3వేలు, ఇంటర్మీడియెట్ చదువుకు రూ.3500, గ్రాడ్యుయేషన్ కోర్సుకు (నాలుగు సంవత్సరాలు) రూ.4000 చొప్పున అప్పటి వరకు రూ.1,05,000 ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం, ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం రూ.50వేలు, మొత్తంగా రూ.1,55,500 నగదు జమ చేయడం బంగారుతల్లి పథకం ఉద్దేశంగా పొందుపర్చిన చట్టంలో పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో నిరాశ.. ఈ పథకం కింద జిల్లాలో 26 మండలాల్లో మొత్తం 13,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2015 జూన్ నెల వరకు వివిధ దశల్లో నగదు జమయ్యేది. తరువాత తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిలిపేసింది. పేరు మార్చిందే తప్ప ఆడపిల్లలకు అన్యాయం చేసిందని తల్లులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఇది తగదు.. బంగారుతల్లి పథకం కింద ఒక దఫా రూ.2,500 అప్పటి ప్రభుత్వంలో అందుకున్నాను. ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి ఎంతో మేలు కలిగించే విధంగా అప్పటి కాంగ్రెస్æ ప్రభుత్వం చట్టం చేసి బంగారుతల్లి పథకాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చటంతోనే సరిపెట్టి ఇదే పథకాన్ని నిర్వీర్యం చేసి ఆడపిల్లల కుటుంబాలను మోసం చేయటం తగదు. ఏ ప్రభుత్వమొచ్చిన ఇటువంటి పథకాన్ని కొనసాగించాలి. – పాలిశెట్టి వెంకటసత్యదేవి, పోతనాపల్లి, శృంగవరపుకోట ఉత్తర్వులే ఇచ్చారు.. వెలుగు శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన బంగారుతల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చటంతో పాటు ఐసీడీఎస్‌కు బదలాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రమే జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి రికార్డులు కూడా ఇంకా వెలుగు శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక, పథకం కొనసాగింపు చేయాలనే ఆదేశాలైతే రానిమాట వాస్తవం. – శాంతకుమారి, సీడీపీఓ, శృంగవరపుకోట -
మహాలక్ష్మి.. మహా మోసం..
‘‘పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ. 30,000 బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయస్సు వచ్చే నాటికి రూ.రెండు లక్షలను అందజేస్తాం.’’ – 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోని 16వ పేజీలో పొందుపర్చిన హామీ ఇది. సాక్షి, మండపేట: బాలిక సంక్షేమానికి మహాలక్ష్మి పథకాన్ని తెస్తామన్న టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తక పోగా దివంగత వైఎస్ ఆశయానికి తూట్లు పొడిచింది. బాలిక సంరక్షణ కోసం వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన బంగారు తల్లి పథకానికి మంగళం పాడుతూ ఏకంగా ఆన్లైన్ నుంచి తొలగించేసింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం పేరిట దరఖాస్తులు స్వీకరణకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది వాపోతున్నారు. బాలిక శిశు మరణాలు, బాల్య వివాహాలను అరికట్టి బాలికల ఉన్నత చదువులకు బాటలు వేసేందుకు 2005లో అప్పటి సీఎం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం (జీసీఐపీఎస్) ప్రవేశపెట్టారు. ఒక ఆడ పిల్లతో శస్త్రచికిత్స చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇరువురు ఆడపిల్లలతో శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రెండు బాండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని మార్పులు, చేర్పులతో 2013 మే ఒకటో తేదీ నుంచి గత ప్రభుత్వం బంగారుతల్లి బాలికాభ్యుదయ సాధికార చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరి ఆడ పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో అర్హులైన వారిని ఎంపిక చేసేవారు. పుట్టిన వెంటనే తొలి విడతగా రూ. 2,500, మొదటి రెండేళ్లు ఇమ్యూనైజేషన్, వైద్య సేవలు కోసం ఏడాదికి రూ.2,000 చొప్పున, 3, 4, 5 సంవత్సరాల్లో పౌష్టికాహారం నిమిత్తం ఏడాదికి రూ.1,500 చొప్పున, విద్యాభ్యాసం నిమిత్తం 1 నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ. 2,000 చొప్పున, 6, 7, 8 తరగతుల్లో ఏడాదికి రూ.2,500 చొప్పున బ్యాంకు ఖాతాకు జమచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ. 3,000 చొప్పున, ఇంటర్మీడియట్లో ఏడాదికి రూ.3,500లు చొప్పున, డిగ్రీలో ఏడాదికి రూ. 4,000లు చొప్పున చెల్లించడంతో పాటు డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్మీడియట్లోనే చదువు నిలుపుచేస్తే రూ.50,000లు జమచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొందరికి సాయం అందించింది. ఆన్లైన్ నుంచి బంగారు తల్లి పథకం తొలగింపు 2016 ఏప్రిల్ నుంచి బంగారు తల్లి పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. అప్పటికి జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో 3,879 దరఖాస్తులు ఆన్లైన్ కాగా వీటిలో కేవలం 813 మందికి తొలి విడత సాయం అందింది. అలాగే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 24,909 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదుచేయగా కొద్దిమంది మాత్రమే సాయం అందించారు. ఆన్లైన్ నిలిపివేయడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండానే ఈ పథకాన్ని మొత్తం ఆన్లైన్ నుంచి ప్రభుత్వం తొలగించడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మా ఇంటి మహాలక్ష్మి పేరిట గతంలో దరఖాస్తులు స్వీకరించినా తర్వాత వాటి విషయమై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులకు స్పష్టత ఇచ్చే అధికారులే కరువయ్యారు. ఆన్లైన్ లేకపోవడంతో దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియడం లేదని సంబంధిత శాఖలకు చెందిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ఏమీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు నా భర్త తాపీమేస్త్రీగా పనిచేస్తుంటారు. ఇద్దరు ఆడపిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడుతున్నాం. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. అధికారులను అడుగుతుంటే ఆ పథకం అమలులో లేదని చెబుతున్నారు. – బొత్స నాగదేవి, ద్వారపూడి ఆ పథకం లేదంటున్నారు ముందు ఆడపిల్ల కాగా 2014లో మరలా అమ్మాయి పుట్టింది. బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాం. బాండు కోసం ఎన్నో మార్లు అధికారులను అడిగితే త్వరలో వస్తుందని చెప్పారు తప్ప ఇప్పటికి రాలేదు. ఇప్పుడేమో ఆ పథకం లేదని చెబుతున్నారు. – కె. రాజ్యలక్ష్మి, ద్రాక్షారామ -
మహాలక్ష్మికి మంగళం!
ఆడపిల్లలు భారమని భావించేవారి వారి ఇంట్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2013 మే ఒకటో తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకానికి శ్రీకారం చుట్టింది. 2014లో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఆరు నెలల తర్వాత ఈ పథకానికి మా ఇంటి మహా లక్ష్మిగా పేరు మార్చింది. అయితే పేరు మార్చేందుకు చూపించిన ఉత్సాహం పథకం అమలుపై మాత్రం చూపించలేకపోయింది. ఫలితంగా ఈ పథకం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు దరఖాస్తులు స్వీకరించడం లేదు. గతంలో చేసుకున్నవారికి అతీగతీ లేదు. మూడున్నరేళ్లుగా ఈ పథకాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా మరిచిపోయింది. రూపాయి కూడా నిధులు విదల్చలేదు. చివరి బడ్జెట్లో సైతం ఈ పథకం గురించి కనీస ప్రస్తావన లేదు. వీరఘట్టం: మాఇంటి మహాలక్ష్మి పథకాన్ని పకడ్బందీగా కొనసాగిస్తామని గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడేమో పూర్తిగా మంగళం పలికింది. ఇంత వరకు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి విధివిధానాలను సైతం ప్రకటించలేకపోయింది. మూడున్నరేళ్లుగా మూగబోయిన పథకాన్ని కొనసాగిస్తామని కళ్లబొల్లి ప్రకటనలు చేస్తున్నారే తప్ప, ఆచరణకు నోచుకోకపోవడంపై ప్రజలు, మహిళలు మండిపడుతున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులు కేటాయించలేదంటే మహిళలు, చిన్న పిల్లల పట్ల టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. పథకం ప్రయోజనాలు దరఖాస్తు చేసుకున్న ఆడపిల్లలకు జనన నమోదు సమయంలోనే రూ.2500 చెల్లిస్తారు. ఇలా రెండేళ్ల వరకు ఇస్తారు. 3 నుంచి 5 ఏళ్ల లోపు వారికి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఏటా రూ.1500 చెల్లించాలి.· 6 నుంచి 10 ఏళ్ల వరకు ఏటా ప్రభుత్వ పాఠశాలల ద్వారా 2 వేలు ఇవ్వాలి. 11 నుంచి 13 ఏళ్ల వరకు 6, 7 తరగతి చదివే సమయంలో ఏటా రూ. 2,500 చెల్లించాలి. 14 నుంచి 15 ఏళ్ల లోపు వారికి ఏటా రూ.3,500, 16 నుంచి 17 ఏళ్ల వరకు ఇంటర్ చదివే సమయంలో ఏటా రూ.3,500, 18 నుంచి 21 ఏళ్ల వరకు ఏటా రూ.4 వేలు, 21 ఏళ్లు వచ్చిన అనంతరం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధిస్తే రూ.5 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.1,55,500 అందించాలి. విధివిధానాల్లేక.. మా ఇంటి మహాలక్ష్మి పథకం సర్కార్ తీరు కారణంగా మూడున్నరేళ్లుగా నిలిచిపోయింది. లబ్ధిదారులకు పైసా కూడా ఇప్పటి వరకూ విదల్చలేదు. 2013 నుంచి ఈ పథకాన్ని ఇందిరక్రాంతి పథం (వెలుగు) శాఖ కార్యాలయం అధికారులు నిర్వహించేవారు. తర్వాత ఈ శాఖ నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పథకాన్ని బదలాయించారు. వెలుగు శాఖ కార్యాలయంలోని కంప్యూటర్లో ఉన్న దరఖాస్తులను తొలగించారు. ఐసీడీఎస్ శాఖకు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదు. ఫలితంగా జిల్లాలోని ఆడపిల్లల తల్లిదండ్రులు అర్జీలు ఎవరికి ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. రెండు శాఖల వారు దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఈ పథకానికి ఎటువంటి నిధులను చివరి బడ్జెట్లో కేటాయించకపోవడంతో ఈ పథకంపై లబ్ధిదారులు ఆశలు వదులుకుంటున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. 2013లో ప్రారంభమైన మా ఇంటి మహాలక్ష్మి పథకానికి జిల్లాలో 15,986 మంది మహిళలు «ఇంత వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,698 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో 14,707 మందికి 3,66,42,500 రూపాయలను మొదటి ఏడాది కేటాయించారు. ఇందులో ఒకొక్కరికీ రూ.2,500 చొప్పున చెల్లించారు. 2014 నుంచి పథకం నిలిచిపోయింది. కాగా..గత మూడున్నరేళ్ల నుంచి జిల్లాలో సుమారు 25 వేల మంది ఆడపిల్లలు జన్మించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ నిలిచిపోయిందని అధికారులు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరిగారు. కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా మా ఇంటి మహాలక్ష్మి పథకానికి 2013లో దరఖాస్తు చేసుకున్నాను. రెండు నెలల తరువాత రూ.2500 ఇచ్చారు. బాండు ఇవ్వలేదు. అధికారులకు అడిగితే ఈ పథకం నిలిచిపోయిందంటున్నారు. – బి.లక్ష్మీభారతి, వీరఘట్టం -
బంగారు తల్లీ.. మోసపోతున్నావా చెల్లీ!
- బంగారు తల్లికి బ్రేక్..ఆ స్థానంలో - ‘మహాలక్ష్మి’ పథకం అమలుకు ప్రభుత్వ నిర్ణయం - మూడేళ్లలో మూడుసార్లు పథకం పేర్లు, విధివిధానాలు మార్పు - పథకం మార్చిన ప్రతిసారీ ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు - ‘సీమ’లో బాలికా సంరక్షణ పథకం పెండింగ్ దరఖాస్తులే 12,425 - బంగారు తల్లి దరఖాస్తులదీ అదే పరిస్థితి... సాక్షి, చిత్తూరు: బంగారుతల్లి పథకం పేరు మారనుంది. ఆడబిడ్డలకు అండగా ఉండేం దుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ‘బాలికా సంరక్షణ పథకాన్ని’ ‘బంగారుతల్లి’గా గత ఏడాది అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మార్పు చేశారు. దీంతో అప్పటి వరకూ అమలవుతున్న బాలికాసంరక్షణ పథకం అటకెక్కింది. అప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్న వారికి అన్యాయం జరిగింది. సరిగ్గా గత ఏడాది జూలై ఒకటిన ప్రారంభమైన బంగారుతల్లి పథకాన్ని ఏడాది గడవకముందే ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఎత్తేసేం దుకు రంగం సిద్ధం చేసింది. ఆ స్థానంలో ‘మహాలక్ష్మి’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత బుధవారం ప్రకటన కూడా చేశారు. దీంతో ‘బంగారుతల్లి’ లబ్ధిదారులు, దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. భ్రూణ హత్యల నివారణ కోసం మొదలైన పథకం: ఆడపిల్ల పుట్టడం భారమని భావించే కుటుంబాల్లో స్వాంతన కల్గించి, వారికి ఆర్థికంగా అండగా నిలిచి, తద్వారా భ్రూణ హత్యలను నివారించేందుకు 2005 ఏప్రిల్ 1న ‘బాలికాసంరక్షణ పథకాన్ని’ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 11వ తేదీ త ర్వాత ఒకరు లేదా ఇద్దరు ఆడపిల్లలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారు. ఈ పథకానికి అర్హులు. ఒక ఆడపిల్లకే ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయలు, ఇద్దరికైతే చెరో 30వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందిస్తారు. ఈ బాండ్లకు పూచీ ఎవరో? గత ఏడాది జూలై 1 నుంచి ‘బంగారుతల్లి పథకం’ అమలవుతోంది. దీంతో అప్పటివరకూ బాలికా సంరక్షణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను కిరణ్ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసింది. 2013 మార్చి 31వరకూ రాయలసీమలో 12,425 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 2010-11, 11-12లో దరఖాస్తు చేసుకున్నవి. నిబంధనల మేరకు వీటన్నిటికి దరఖాస్తు చేసుకున్న ఆర్థిక సంవత్సరంలోనే బాండ్లు అందించాలి. కానీ అలా జరగలేదు. గత ఏడాది మార్చి 31న బాలికాసంరక్షణ పథకాన్ని కిరణ్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటివరకూ బాండ్లు అందకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా రద్దు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వాటికి బాండ్లు ఇవ్వలేదు. ఇదేంటని అప్పట్లో ప్రశ్నిస్తే బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిగాలేవని, కంప్యూటర్లో పేర్ల నమోదు తప్పుగా నమోదయ్యాయని కుంటిసాకులు చెప్పారు. దీంతో 12,425 మంది దరఖాస్తుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆపై 2013 మే 1 నుంచి పుట్టిన పిల్లలకు మాత్రమే ‘బంగారుతల్లి’ని వర్తింపజేశారు. ఇప్పుడు ‘బంగారు తల్లి’ లబ్ధిదారులకు ఇక్కట్లు 2013 మే 1నుంచి పుట్టిన బిడ్డలకు ‘బంగారుతల్లి’ పథకం వర్తింపజేశారు. ఈ పథకం నిర్వహణను ఐసీడీఎస్, డీఆర్డీఏలకు సంయుక్తంగా అప్పగించారు. గత ఏడాది మే 1నుంచి జూన్ 23 వరకూ పుట్టిన ఆడబిడ్డల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే బిడ్డతల్లికి తొలిదశలో 2,500 రూపాయలు చెల్లించారు. అయితే ఈ బాధ్యతను ఏఎన్ఎంలకు, జననాల సర్వే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలకు, బాలికల వివరాల నమోదు బాధ్యత వీఆర్వోలకు అప్పగించారు. దీంతో శాఖల మధ్య సమన్వయం లేక వచ్చిన ద రఖాస్తుల్లో 20-30 శాతం మందికి కూడా బాండ్లు అందలేదు. దాదాపు 70 శాతం దరఖాస్తులకు ఇంకా బాండ్లు అందించాల్సి ఉంది. రాయలసీమలో ‘బంగారుతల్లి’ ద్వారా 3500 దరఖాస్తులకు బాండ్లు అందించాల్సి ఉంది. ‘మహాలక్ష్మి’తో మరిన్ని చిక్కులు ‘బంగారుతల్లి’ ద్వారా బిడ్డ పుట్టినప్పటి నుంచి డిగ్రీ పట్టా పొందే వరకూ డబ్బులు తల్లి ఖాతాలో జమ చేస్తారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెడితే బాండ్లు పొందిన వారికి ఏ పథకం అమలవుతుంది? అసలు అమలవుతుందా? లేదా? అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ‘బంగారుతల్లి’ ప్రవేశంతో ‘బాలికాసంరక్షణ’ బాండ్లు బుట్టదాఖలయ్యాయి. అదే పరిస్థితి ఇప్పుడు తలె త్తే ప్రమాదం ఉంది. పథకాల మార్పు వల్ల 2010 నుంచి లబ్ధిదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వీటికి ‘మహాలక్ష్మి’ కష్టాలు తోడవనున్నాయి.