కనిష్ఠం 90 ఓట్లు.. గరిష్ఠం 64677
ఇంతకుముందు జరిగిన 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీ, అత్యంత ఎక్కువ మెజారిటీ ఎవరెవరికి వచ్చాయో తెలుసా? అలాగే, వెయ్యి ఓట్ల లోపు మెజారిటీ ఎంతమందికి వచ్చిందో తెలుసా? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. అయితే చూడండి.
2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసిన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి తన ప్రత్యర్థిపై 90 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. అలాగే, సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన తన్నీరు హరీష్ రావు 64677 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఇది అత్యధికం. ఇక ఆ ఎన్నికల్లో వెయ్యిలోపు ఓట్ల తేడాతో గెలిచిన వాళ్లు ఏకంగా 21 మంది ఉన్నారు. వాళ్లలో నిన్న మొన్నటి వరకు రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, కొలుసు పార్థసారథి, తోట నరసింహం లాంటివాళ్లు సైతం ఉన్నారు. ఇలా వెయ్యిలోపు మెజారిటీతో నెగ్గిన వాళ్లు ఎవరెవరంటే..
ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి (నెల్లూరు సిటీ) 90, కె.తారకరామారావు (సిరిసిల్ల) 171; కొలుసు పార్థసారథి (పెనమలూరు) 177; ఎస్.వేణుగోపాలాచారి (ముధోల్) 183; యలమంచిలి రవి (విజయవాడ తూర్పు) 190; పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) 229; పొన్నాల లక్ష్మయ్య (జనగామ) 236; కె.మీనాక్షి నాయుడు (ఆదోని) 256; దిరిశం పద్మజ్యోతి (తిరువూరు) 265; ద్రోణంరాజు శ్రీనివాసరావు (విశాఖ దక్షిణం) 341; రేగా కాంతారావు (పినపాక) 349; సివిరే సోమా (అరకు లోయ) 402; అంబటి బ్రాహ్మణయ్య (అవనిగడ్డ) 417; పసుపులేటి బాలరాజు (పాడేరు) 587; బడుకొండ అప్పలనాయుడు (నెల్లిమర్ల) 597; జైపాల్ యాదవ్ (కల్వకుర్తి) 597; గొల్ల బాబూరావు (పాయకరావుపేట) 656; తోట నరసింహం (జగ్గంపేట) 789; మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్) 848; డాక్టర్ పి.రవి (పూతలపట్టు) 951; జయమంగళ వెంకటరమణ (కైకలూరు) 974.