‘మన ఊరు’కు ప్రత్యేకాధికారులు
సాక్షి, హైదరాబాద్: ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం కోసం తెలంగాణలోని పది జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కోజిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 28తేదీ వరకు ఆయా జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించింది. ఈ పర్యటనల్లో భాగంగా వారు ప్రాధాన్యం ఉన్న సమావేశాల్లో పాల్గొనాలని సూచించింది. తమ నివేదికలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులు: హైదరాబాద్‌కు సోమేశ్‌కుమార్, రంగారెడ్డి- బీఆర్ మీనా, మెదక్ - బి.వెంకటేశం, నల్గొండ - అనిల్, మహబూబ్‌నగర్ - జగదీశ్, వరంగల్ - రాహుల్ బొజ్జా, ఖమ్మం- నీరబ్ కుమార్ ప్రసాద్, కరీంనగర్ - పార్థసారథి, నిజామాబాద్ - జనార్థన్‌రెడ్డి, ఆదిలాబాద్ - అశోక్