Mangroves
-
తీరానికి మరింత రక్షణ
సాక్షి, అమరావతి: మడ అడవుల విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా వృద్ధిచెందుతోంది. తీర ప్రాంతానికి రక్షణలో ఈ అడవులు కీలకపాత్ర వహిస్తాయి. తుపానులు వచ్చినప్పుడు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కోతను నివారిస్తాయి. గడచిన ఎనిమిదేళ్లలో 10శాతం మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు అటవీశాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. 2014నాటికి రాష్ట్రంలో 31,888 హెక్టార్లలో ఇవి విస్తరించగా, ప్రస్తుతం ఈ విస్తీర్ణం 40,500 హెక్టార్లకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తర్వాత మన రాష్ట్రంలోనే మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 2,114 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, గుజరాత్లో 1,175 చదరపు కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లో 616 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువ మడ అడవులు ఉన్నాయి. గోదావరి తీరంలో కాకినాడ, బీఆర్ అంబేద్కర్ జిల్లాలు, కృష్ణా తీరంలో కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఇవి విస్తరించాయి. ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొద్దిమేర మడ అడవులు ఉన్నాయి. ప్రధానంగా కాకినాడ జిల్లాలోని కోరింగ అభయారణ్యంలో ఉన్న మడ అడవులు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 187.81 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఆ తర్వాత కృష్ణా అభయారణ్యంలో 137.76 చదరపు కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు తగ్గుతుండటంతో, రాష్ట్రంలో ఈ అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసింది. అక్కడి నుంచి విత్తనాలు తీసుకెళ్లి సముద్ర ముఖద్వారాల్లో చల్లించింది. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల సహకారంతో సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మడ అడవుల ద్వారా తీర ప్రాంత రక్షణతోపాటు, అక్కడ నివసించే లక్షలాదిమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. -
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి
ముంబై: మహారాష్ట్రలో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ముంబై- అహ్మదాబాద్ మధ్య నడవున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ముంబైతోపాటు పొరుగున్న ఉన్న పాల్ఘర్, థానే జిల్లాల్లో విస్తరించి ఉన్న 22,000 మడ చెట్లను నరికేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అనుమతిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.. ఈమేరకు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా ముంబై, పాల్ఘడ్, థానే జిల్లాల్లోని 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడం కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్ బెంచ్ తీరస్కరించింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ కోసం నరికివేత అవసరమైతే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. దీంతో ఎన్‌ఎచ్‌ఆర్‌ఎస్‌సీఎల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా? ప్రాజెక్టు నిర్మాణం కోసం నరికివేయాల్సిన మడ చెట్ల సంఖ్యలను 50,000 నుంచి 20,000 వరకు తగ్గించామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ తరపున న్యాయవాది ప్రహ్లాద్ పరాంజపే కోర్టుకు తెలిపారు. అంతేగాక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందామని.. దీనికి తోడు నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్లు ఎక్కువ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. మడ అడవులకు సమీపంలో ఉన్న రెండు ప్లాట్‌ఫారమ్‌లను కొద్దిగా దూరంగా మార్చాలని, దీనివల్ల నరికివేసే మడ చెట్ల సంఖ్య తగ్గుతుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ సూచించాయని పేర్కొన్నారు. ఇందుకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ అంగీకరించిందని, దీంతో చెట్ల సంఖ్య 53,467 నుండి 22,000కి తగ్గిందని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై బాంబే ఎన్విరాన్మెంటల్ యాక్షన్ గ్రూప్ అనే ఎన్జీవో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిషేధిత ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. అలాగే చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుధీర్భంగా ఇరు వార్గల వాదనలు విన్న ధర్మాసనం.. డిసెంబర్ 1న రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది. -
ఒంపు సొంపుల ఏరులో.. మడ అడవుల మధ్యలో
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతి సిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ..వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ..చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలు పోతున్నట్లు వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలా హిరిలో.. అంటూ సాగే పడవ ప్రయాణం.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్లు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే! నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకూ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి. వీటిలో మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీటిలో వేర్లు, మొదళ్ళు కనబడుతూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మడ అడవుల నడుమ, నదీపాయలు, సింకుల్లో ప్రయాణిస్తూ సాగే ప్రయాణం సుందర్బన్ అడవుల అందాలను తలపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సహజ సిద్ధ ప్రకృతి సోయగాలకు నెలవు ఈ తీర ప్రాంతం. ప్రత్యేకమైన ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ మడ అడవుల అందాలను తిలకించాలంటే నాగాయలంక, గుల్లలమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నుంచి ప్రత్యేక పడవల్లో వెళ్ళాల్సి ఉంటుంది.. రవాణా సదుపాయం కల్పిస్తే మరింతగా టూరిజం అభివృద్ధి ప్రస్తుతం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసుకుని టూరిస్టులు ఈ లైట్‌హౌస్ సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం రిస్కుతో కూడుకోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల లైట్‌హౌస్‌ని సందర్శించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేక పోతున్నారు. దీనికితోడు లైట్‌హౌస్ ప్రాంతంలో ఏమీ దొరక్క పోవడం పర్యాటకులకు నిరాశే మిగులుతుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక లాంచీలు, బోట్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. లైట్‌హౌస్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా లైట్‌హౌస్ ఓ వైపు పచ్చని మడ అడవులు, మరో వైపు కృష్ణా నది, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య ఉండే మడ అడవుల నడుమ ఉండే గుల్లలమోద లైట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగాయలంక నుంచి 25 కి.మీ దూరంలో లైట్ హౌస్ ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌ని 1972లో ఆధునీకరించారు. దీని ఎత్తు 135 అడుగులు. 9 అంతస్తులు కలిగి ఉంది. 1977 ఉప్పెనకు ఈ లైట్‌హౌస్ 5వ అంతస్తు వరకూ వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పచ్చని మడ అడవులు, నదీపాయల నడుమ ఉండటం ఈ లైట్‌హౌస్ ప్రత్యేకత. (క్లిక్: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) -
కమెడియన్ ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు
ముంబై: అవినీతి ఆరోపణలు చేసిన కమెడియన్ కపిల్ శర్మ చిక్కుల్లో పడ్డారు. ఇంటి నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కపిల్ శర్మను అరెస్ట్ చేయాలని సీనియర్ న్యాయవాది అభా సింగ్ డిమాండ్ చేశారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో సింగ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కపిల్ శర్మ మడ అడవుల(మాంగ్రూవ్స్)ను నాశనం చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారి ఒకరు తనను రూ. 5 లక్షలు లంచం అడిగారని కపిల్ శర్మ ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. అవినీతి అధికారిపై ఏసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కపిల్ ను అభా సింగ్ ప్రశ్నించారు. కపిల్ శర్మ చేపట్టిన అక్రమ నిర్మాణాలను బీఎంసీ అధికారులు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. సెలబ్రిటీలకు పోలీసులు ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. సల్మాన్ ఖాన్ కేసు పదేళ్లు నడవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కపిల్ వ్యవహారంపై మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) మండిపడగా, రానున్న బీఎంసీ ఎన్నికల్లో దీన్ని లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
మామిడిలో పెట్టుబడులు రావడం లేదు
ఐదెకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మూడేళ్లుగా మామిడికి మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేదు. అయినా ఈ ఎడాది రూ. 45 వేలు మామిడి తోటలపై పెట్టుబడి పెట్టా. వాతావరణం అనుకూలించిన పోవడంతో గత పూత ఆలస్యంగా వచ్చింది. ఉద్యానవన అధికారుల సూచన మేరకు మందులు వాడినా దిగుబడి రాలేదు. ఇటీవల వచ్చిన గాలీవానలకు 10 శాతం పంట నష్టపోయాం. దీనికితోడు జ్యాస్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా ఏర్పడి మామిడికి ధర లేకుండా చేస్తున్నారు. - పి.బాబుకిరణ్రెడ్డి, రైతు, సామిరెడ్డిపల్లె, పెనుమూరు మామిడి తోటలు అడిగేవారే లేరు...? రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోటపై ఆధార పడి సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి నాలుగేళ్లయింది. అప్పు పెరుగుతోంది తప్ప కష్టాలు తీరలేదు. ప్రతి ఏటా దిగుబడి బాగానే వస్తుంది. అయినా తోట ఇస్తావా.. అంటూ అడిగేవారు లేరు. ఆరు సంవత్సరాలుగా ఎకరా తోట రూ.లక్ష కంటే ఎక్కువ ధరకు ఏనాడు అమ్ముడు పోలేదు. ప్రతి సంవత్సరం నష్టాలు తప్ప లాభం వచ్చిన దాఖలాలు లేవు. మార్కెట్ ఉండి ఉంటే వ్యాపారులకు తోటలను అమ్మకుండా నేరుగా కాయలను విక్రయించి లాభపడేవాడ్ని. - వెంకటాద్రి, రైతు, ఆవులపల్లె, మదనపల్లె రూరల్ వూమిడి సాగుతో అప్పులు మిగిలారుు.... వూమిడి పంట సాగు చేయుడంతో ఈ ఏడాది పూర్తిగా అప్పులు మిగిలారుు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పంట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పెట్టుబడులు పెట్టి కాపాడుకున్నాం. వారం రోజుల క్రితం వీచిన ఈదురు గాలులతో ఉన్న పంట కాస్తా నేలపాలు అరుుంది. ఎక్కడకు తరలించినా క్వింటాల్ ధర రూ.పది వేలకు మించి కొనుగోలు చేయడంలేదు. వారపు సంతల్లో రాలి కాయులు కిలో పదిరూపాయలకు అమ్మినా కొనుగోలు చేసేవారు లేరు. జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించినా వెంటనే చెల్లింపులు ఉండవు. - ఆర్.శ్రీరావుులు, రైతు, కలకడ. సగం పంట దెబ్బతింది గాలీవానలకు సగానికిపైగా మామిడి పంట దెబ్బతింది. మిగిలిన పంటకైనా గిట్టుబాటు ధరా లభిస్తుందన్న ఆశలు లేవు. వేరుశెనగ రైతుల తరహాలో ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి, ఆదుకోవాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడతాం. అధికారులు పంటనష్టం అంచనా వేసి రైతన్నలను ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోక పోతే పరిస్థితి అంతే. -రాజశేఖరరెడ్డి, రైతు, ఐలవారిపల్లె రూ.3లక్షలు నష్టపోయా నగరి నియోజకవర్గంలో గాలివాన బీభత్సానికి రూ.కోటిన్నర పైగా మామిడి పంట నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల మామిడి తోట ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడిలో సుమారు రూ. 3 లక్షలు నష్టపోయాను. ఈ ఏడాది రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశా. రాలిపోయిన కాయలను మార్కెట్‌కు తరలిస్తే కూలీల ఖర్చు కూడా రాలేదు. - రామకృష్ణమరాజు, రైతు, నార్పరాజుకండ్రిగ(విజయపురం) ప్రభుత్వం ఆదుకోవాలి రెండెకరాల మామిడితోట ఉంది. గతేడాది కంటే దిగుబడి 50 శాతానికి పడిపోయింది. పెనుగాలులకు ఒకటిన్నర టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. దీంతో దాదాపు రూ. 15 వేల నష్టం వాటిల్లింది. మందుల పిచికారికే రూ. 10 వేలు ఖర్చు చేశా. ప్రస్తుతం ఉన్న కాయలతో నష్టం తప్పదనిపిస్తోంది. కాయలు నేలరాలినా అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. - మునిరాజ, బూరగమంద(సదుం) -
పై-లీన్ విపత్తులో మన నేరమెంత?
పై-లీన్ తుపాను గండం దాటిపోయిందంటూ 'హమ్మయ్య' అని ఈ నిట్టూర్పు విడిచేసి, చేతులు దులిపేసుకుంటే అంతకి మించి నేరం మరొకటి లేదంటున్నారు నిపుణులు. లక్షలాది ఇళ్లు నేలమట్టం చేసి, లక్షల కుటుంబాలకీ నిలవ నీడ లేకుండా చేసి, రవాణా, ప్రసార వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి, వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన పై-లీన్ విషయంలో హమ్మయ్య అనుకోవలసిందేమైనా ఉందంటే అది ప్రాణనష్టాన్ని నివారించచడం ఒక్కటే. 1999 ఒడిశా పెను తుపాను తర్వాత, ఈ 14 ఏళ్లలో అతి పెద్ద తుపాను పై-లీన్ అని వాతావరణ శాఖ ప్రకటించింది. రగులుతున్న రాజకీయ వర్తమానం నుంచి, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా అనుకున్నాయో, లేదా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల ఫలితమో గానీ, ప్రభుత్వాలు ముందెన్నడూ లేనంత భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాయి. చనిపోయిన వారి సంఖ్య 25 (మాత్రమే) కావడం కూడా 'హమయ్య' అనుకునే వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎన్ని సార్లైనా, చేతులు కాలాక మాత్రమే ఆకులు పట్టుకుంటున్న ఈ నిర్లక్ష్యం ఉపేక్షించరానిది. ప్రచండ పై-లీన్ ప్రతాపం పెనుగాలులు, కుండపోత వర్షం, గట్లు తెగిన నదులు, పోటెత్తి జనవాసాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం. నేలమట్టమైన ఇళ్లు, కొట్టుకుపోయిన పంటలు, కుప్పకూలిన కొబ్బరి చెట్లు, తెప్పలా తేలిన జీడిమామిడి చెట్లు, ఆచూకీలేని అరటి తోటలు.. అంతా కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన విషాదం. ప్రాథమిక అంచనా ప్రకారం.. మన రాష్ట్రం వరకూ 6000 హెక్టార్లలో అరటి, జీడి, మొక్కజొన్న, కొబ్బరి, , చెరకు పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో కొబ్బరి విస్తీర్ణం అధిక శాతం కనుక, బాధిత రైతుల్లో 90 శాతం కొబ్బరి రైతులే! ఇది కాకుండా, కేవలం ఆరు మండలాల్లోనే 8000 హెక్టార్లలో వరి నాశనమైంది. ఇందులో పొట్ట దశకు వచ్చి పాడైన పంట 3500 హెక్టార్లలో ఉంది. లక్షలాది టేకు చెట్లు వెన్ను విరిగి కూలాయి. గాలులు గంటకి 230 కిలో మీటర్ల వేగంతో వీచాయి, దానితో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వంగిపోయిన విద్యుత్ స్థంభాలు ఎన్నో. పశువులు, సైబేరియా నుంచి వచ్చిన వలస పక్షులు ఎన్ని చనిపోయాయో లెక్కకి తేలదు. కుండపోత వర్షాలకి వరదలెత్తిన నదులు గ్రామాలకి గ్రామాల్నే ముంచెత్తాయి. 150 ఎకరాల్లో రొయ్యల చెరువులు దెబ్బ తిన్నాయి. మానవ తప్పిదమెంత? ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుకోలేక పోయినా, ఆ తీవ్రతని తగ్గించే ప్రత్యామ్నాయాల్ని చేజేతులా నాశనం చేసుకోవడం వల్లే తుపానులు, ఉప్పెనల్లో భారీ నష్టం జరుగుతుంది. "ఏ ట్రాపికల్ సైక్లోన్ (ఉష్ణమండలాల్లో వచ్చే తుపానులు) పరిణామాలైనా మూడు- ఒకటి పెనుగాలులు, రెండు కుంభవృష్టి, మూడు ఉప్పెన (లేదా సునామి). ఈ మూడు వైపరీత్యాల తీవ్రతని 40 శాతం వరకూ తగ్గించే రక్షణ కవచాలు మడ చెట్లు. సముద్రం ఒడ్డున పెరిగే ఈ అడవుల్ని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం అడ్డగోలుగా నరికేస్తుంటే పట్టించుకునే నాథులే లేరు," అని వాపోయారు ఆంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఓఎస్ఆర్యు భానుకుమార్. సోమవారం సాక్షితో మాట్లాడుతూ, మడ అడవుల్ని సంరక్షించుకోగలిగినట్టైతే పై-లీన్ తుపాను నష్టం ఎంతో నివారించబడేదని ఆయన అన్నారు. "ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మడ అడవులు గోడలా నిలిచి మానవాళికి రక్షణ కల్పిస్తున్నాయి. తీరం కోతకు గురవకుండా ఇవి కాపాడతాయి. సునామీ సమయాల్లో సముద్రపు నీరు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇలవమడ, నల్లమడ, గుగ్గిలం తెల్లమడ ఈల్వమడతోపాటు మొత్తం 35 రకాల చెట్లు ఈ అడవుల్లో కనిపిస్తాయి. ఇవి రెండు నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు ఎదిగి తీరంలో రక్షణ కవచంగా నిర్మిస్తాయి," అని ఆయన చెప్పారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ మడ చెట్ల పెంపకం గురించి ఒక కొత్త పథకాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. మడ చెట్లు రక్షణ కవచమే కాకుండా, చేపల పునరుత్పత్తికి దోహదపడతాయనీ, దాని వల్ల దేశ సముద్ర ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని మరో వాతావరణ అధ్యయన నిపుణులు అచ్యుతరావు తెలిపారు. అయితే, కొందరు స్వార్థపరులు మడ అడవులను నరికేస్తూ, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారు; దానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకు తున్నారు. ఎంతో విలువైన వృక్ష సంపద వంట చెరకుగా మారిపోతోంది. మడ అడవులు తరిగిపోతూ తీర్రపాంతంలో భూమి కోతకు గురికావడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి దుష్పరిణామాలతో పాటు, ప్రకృతి విలయానికి వేల కోట్లలో నష్టం కలుగుతోంది. దానికి ప్రాణనష్టం కూడా తోడైతే ఏ గణాంకాలు ఆ తీవ్రతని అంచనా వేయగలవు? అందరి సమష్టి బాధ్యత సముద్ర తీర ప్రాంతాల్లో మాంగ్రోవ్ అని పిలవబడే మడ అడవుల పెంపకం అమెరికా వంటి దేశాల్లో విధిగా ఆచరిస్తారు. వాటిని నరికివేయడం పెద్ద నేరం. దానికి కఠినమైన శిక్షలు అమలు చేసాయి ఆ ప్రభుత్వాలు. "నిజానికి మన దేశంలో కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం, సముద్రతీరంలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు," అన్నారు కోస్తా పర్యావరణ అధ్యయన ఆచార్యులు డి ఇ బాబు. ఆ నిబంధనలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలింపు ఉండదని ఆయన సాక్షి కి వివరించారు. అయితే నిషేధాలని పక్కనపెట్టి అక్రమార్కులు యథేచ్చగా చేపల చెరువులను తవ్వేస్తున్నారు, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారు. పై-లీన్ ఉత్తర వాయువ్య దిశగా ఒడిషా వైపు వెళ్లిపోవడం వల్ల, నిలకడగా ఒక చోట నిలవకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పింది. లేకుంటే, తెలంగాణా జిల్లాలకి కూడా వాన దెబ్బ తగిలేదని, హైదరాబాదు వాతావరణ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు,పొదల సముదాయమే మడ అడవులు. ఆ తీరప్రాంతాల్లో, నదీ ముఖద్వారాలలో పరిశ్రమలు స్ధాపించడం, చేపల, రొయ్యల చెరువులు తవ్వడం తీవ్రమైన నేరాలు. వాటి వల్ల మడ అడవులను అంతరించకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు ప్రతీ ఒక్కరిమీద వుంది.