మామిడిలో పెట్టుబడులు రావడం లేదు
ఐదెకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మూడేళ్లుగా మామిడికి మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేదు. అయినా ఈ ఎడాది రూ. 45 వేలు మామిడి తోటలపై పెట్టుబడి పెట్టా. వాతావరణం అనుకూలించిన పోవడంతో గత పూత ఆలస్యంగా వచ్చింది. ఉద్యానవన అధికారుల సూచన మేరకు మందులు వాడినా దిగుబడి రాలేదు. ఇటీవల వచ్చిన గాలీవానలకు 10 శాతం పంట నష్టపోయాం. దీనికితోడు జ్యాస్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా ఏర్పడి మామిడికి ధర లేకుండా చేస్తున్నారు.
- పి.బాబుకిరణ్‌రెడ్డి, రైతు, సామిరెడ్డిపల్లె, పెనుమూరు
మామిడి తోటలు అడిగేవారే లేరు...?
రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోటపై ఆధార పడి సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి నాలుగేళ్లయింది. అప్పు పెరుగుతోంది తప్ప కష్టాలు తీరలేదు. ప్రతి ఏటా దిగుబడి బాగానే వస్తుంది. అయినా తోట ఇస్తావా.. అంటూ అడిగేవారు లేరు. ఆరు సంవత్సరాలుగా ఎకరా తోట రూ.లక్ష కంటే ఎక్కువ ధరకు ఏనాడు అమ్ముడు పోలేదు. ప్రతి సంవత్సరం నష్టాలు తప్ప లాభం వచ్చిన దాఖలాలు లేవు. మార్కెట్ ఉండి ఉంటే వ్యాపారులకు తోటలను అమ్మకుండా నేరుగా కాయలను విక్రయించి లాభపడేవాడ్ని.
- వెంకటాద్రి, రైతు, ఆవులపల్లె, మదనపల్లె రూరల్
వూమిడి సాగుతో అప్పులు మిగిలారుు....
వూమిడి పంట సాగు చేయుడంతో ఈ ఏడాది పూర్తిగా అప్పులు మిగిలారుు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పంట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పెట్టుబడులు పెట్టి కాపాడుకున్నాం. వారం రోజుల క్రితం వీచిన ఈదురు గాలులతో ఉన్న పంట కాస్తా నేలపాలు అరుుంది. ఎక్కడకు తరలించినా క్వింటాల్ ధర రూ.పది వేలకు మించి కొనుగోలు చేయడంలేదు. వారపు సంతల్లో రాలి కాయులు కిలో పదిరూపాయలకు అమ్మినా కొనుగోలు చేసేవారు లేరు. జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించినా వెంటనే చెల్లింపులు ఉండవు.
- ఆర్.శ్రీరావుులు, రైతు, కలకడ.
సగం పంట దెబ్బతింది
గాలీవానలకు సగానికిపైగా మామిడి పంట దెబ్బతింది. మిగిలిన పంటకైనా గిట్టుబాటు ధరా లభిస్తుందన్న ఆశలు లేవు. వేరుశెనగ రైతుల తరహాలో ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి, ఆదుకోవాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడతాం. అధికారులు పంటనష్టం అంచనా వేసి రైతన్నలను ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోక పోతే పరిస్థితి అంతే.
-రాజశేఖరరెడ్డి, రైతు, ఐలవారిపల్లె
రూ.3లక్షలు నష్టపోయా
నగరి నియోజకవర్గంలో గాలివాన బీభత్సానికి రూ.కోటిన్నర పైగా మామిడి పంట నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల మామిడి తోట ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడిలో సుమారు రూ. 3 లక్షలు నష్టపోయాను. ఈ ఏడాది రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశా. రాలిపోయిన కాయలను మార్కెట్‌కు తరలిస్తే కూలీల ఖర్చు కూడా రాలేదు.
- రామకృష్ణమరాజు, రైతు, నార్పరాజుకండ్రిగ(విజయపురం)
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండెకరాల మామిడితోట ఉంది. గతేడాది కంటే దిగుబడి 50 శాతానికి పడిపోయింది. పెనుగాలులకు ఒకటిన్నర టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. దీంతో దాదాపు రూ. 15 వేల నష్టం వాటిల్లింది. మందుల పిచికారికే రూ. 10 వేలు ఖర్చు చేశా. ప్రస్తుతం ఉన్న కాయలతో నష్టం తప్పదనిపిస్తోంది. కాయలు నేలరాలినా అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
- మునిరాజ, బూరగమంద(సదుం)