ఘనంగా అయ్యప్ప గ్రామోత్సవం
పుట్టపర్తి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో శ్రీమణికంఠ సేవాసమితి ఆధ్వర్యంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి వేలాదిమంది అయ్యప్ప మాలధారులు నారాయణ సేవలో పాల్గొన్నారు. అయ్యప్ప కన్నెస్వాములు అయ్యప్ప విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 2,000 మంది అయ్యప్పలు, గ్రామస్తులు హాజరయ్యారు. సాయంత్రం పట్టణ వీధుల్లో అయ్యప్ప, సత్యసాయి చిత్రపటాలను ప్రత్యేక అలంకరణతో పలకీని తయారు చేసి ఊరేగించారు. మాలధారులు అయ్యప్ప భక్తి పాటలు పాడుతూ ముందుకు సాగారు. నారాయణసేవను నగర పంచాయతీ అద్యక్షుడు పీసీ గంగన్న ప్రారంభించారు. కార్యక్రమాన్ని యర్రంశెట్టి సూర్యనారాయణ దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప గ్రామోత్సవం సందర్భంగా పట్టణం సందడిగా మారింది.