mayor swaroopa
-
అభివృద్ధికి వారిద్దరే ఆటంకం
అనంతపురం సెంట్రల్: ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప వల్ల టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నాలుగేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అంతా అవినీతి, అక్రమాలేనని ధ్వజమెత్తారు. కోర్టురోడ్డులోని చారిత్రాత్మక భవనం పీస్ మెమోరియల్ హాల్ ఆధునికీకరణపై అనేక విమర్శలు వస్తున్నాయన్నారు. çపురాతన భవన స్థలాలను అద్దెకు ఇచ్చుకున్నారని, ఇందులో ఎవరెవరికీ ఎంత వాటాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆయన భారతం రాసినట్లు నాలుగు పేజీల లేఖ రాస్తూ వివరణ పంపారని వివరించారు. జాతీయ రహదారిలో ఓ నేత రెండు సెంట్ల స్థలం రాయించుకుని.. ఎనిమిది సెంట్లను అక్రమించుకున్నాడని ఆరోపించారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, త్వరలోనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. అనంతపురం నగర అభివృద్ధిని వారిద్దరూ అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధించాలని తాను తీవ్రంగా శ్రమించగా.. దీన్ని కూడా రాజకీయం చేసి అడ్డుకున్నారని బాధపడ్డారు. అందువల్లే మరువ వంకను గతేడాది పరిశుభ్రం చేసినా.. మళ్లీ యథావిధిగా ప్లాస్టిక్‌తో నిండిపోయిందన్నారు. అలాగే రోడ్ల వెడల్పు విషయంలో కొంతమంది నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకొని కోర్టును ఆశ్రయించేలా పురమాయించారన్నారు. అంత వెడల్పు అవసరమా అంటూ రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించకుండా అడ్డుపుల్ల వేయడానికి యత్నించారన్నారు. పేరుకు ‘అవే’ పేరుతో నీతులు చెబుతున్నారని... అవే లేదు.. ఏం లేదంటూ చిందులు తొక్కారు. ఇంటిపైన రాళ్లు పెట్టుకున్న నీచ సంస్కృతిని ఆయనదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదిరి తీరును తూర్పారబట్టారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. కనీసం మీడియానైనా బాధ్యతగా వీరి అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. ఇక జిల్లా పోలీసులకు చేవ లేకుండా పోతోందని ఎంపీ జేసీ అన్నారు. పోలీసుల తీరు వల్లే శాంతి భద్రతలు కాపాడటం ఇబ్బందిగా మారిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటూ నేరస్తులకు కూడా రాచమర్యాదలు చేస్తున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. -
అలా ముగించేశారు !
– పాలకవర్గం తీరుకు నిరసనగా కార్పొరేటర్ల వాకౌట్ – రూ.58 కోట్లకు బడ్జెట్ ఆమోదం అనంతపురం న్యూసిటీ : ప్రజాసమస్యల ప్రస్థావన లేకుండానే నగర పాలక సంస్థలో శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం తూతూ మంత్రంగా ముగించారు. తొలుత ప్రజాసమస్యలపై చర్చ జరిగాకే బడ్జెట్‌ను ఆమోదించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టినా మేయర్ స్వరూప ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నలుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేశారు. చివరకు మేయర్ రూ.58 కోట్లతో బడ్జెట్‌కు ఆమోదించగా అందుకు టీడీపీ కార్పొరేటర్లు ఓకే చెప్పేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ పట్టు బడ్జెట్ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు గంగన హిమబిందు, బోయ గిరిజమ్మ, జానకి, బాలాంజినేయులు, గూడురు మల్లికార్జున, షుకూర్ ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. నగరంలో పందులు, కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయని, పారిశుద్ధ్యం పడకేసిందని, నగరపాలక సంస్థలో పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. బడ్జెట్ చదవడాన్ని ఆపాలంటూ అకౌంటెంట్ దేవశంకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ స్వరూప జోక్యం చేసుకుని తొలుత బడ్జెట్ చదవాలని ప్రజా సమస్యలపై మళ్లీ మాట్లాడుదామని అల్టిమేటం జారీ చేశారు. కమిషనర్ సత్యనారాయణను చుట్టుముట్టి సమస్యలపై మాట్లాడాలని ఇది వరకే మీ దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ అనుమతితో కేవలం బడ్జెట్ అంశంపై మాత్రమే చర్చించాలంటూ తోసిపుచ్చారు. అందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు.. కలెక్టర్ ఎక్కడైనా ప్రజా సమస్యలపై మాట్లాడవద్దని చెప్పారా.. అని నిలదీస్తే కమిషనర్ నోట మాట రాలేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏవిధంగా బడ్జెట్ సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై రోజూ నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి చెట్లకు, గోడలకు చెప్పి వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అరగంటపాటు తీవ్ర గందరగోళం నెలకొనింది. అంతలోనే 9వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి నీటి కొళాయికు బిరడా వేయలేని నిస్సహాయ స్థితిలో పాలకవర్గం, అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో నీరు సరిగా రావడం లేదన్నారు. టీడీపీ రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ సైతం ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని పట్టుబట్టారు. చివరకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం, అధికారుల తీరును తప్పుబడుతూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో నలుగురు స్వతంత్య్ర, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి బయటకు రావడం గమనార్హం. పందికొక్కుల్లా మెక్కుతున్నారు : వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గంగన హిమబిందు, బోయ గిరిజమ్మ, జానకి, బోయ పక్కీరమ్మ, బోయ సరోజమ్మ,బాలాంజినేయులు, షుకూర్, పోతులయ్య, గూడురు మల్లికార్జున, చింతకుంట సుశీలమ్మ, వెంకటరమణమ్మ ధ్వజమెత్తారు. సమావేశాన్ని వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ పందికొక్కుల్లా ప్రజాధనాన్ని మెక్కుతున్నారని ఆరోపించారు. త్వరలో పాలకవర్గం అవినీతి, అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు. రూ 58 కోట్లకు ఆమోదం : గతేడాది మిగులు బడ్జెట్ రూ.3.98 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్ రూ. 54.55 కోట్లను కలుపుకుని రూ. 58.53 కోట్లతో బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. అందులో రూ 54.55 కోట్ల సాధారణ రాబడులు కాగా రూ.46.87 కోట్లు ఖర్చులున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ గంపన్న, ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఆ మెసేజ్‌లు పంపింది మహిళేనట!
అనంతపురం : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎం. స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపింది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. (చదవండి : మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం) -
టీడీపీలో ఎస్ఎంఎస్ల ప్రకంపనలు
– ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు – తాజాగా ఎమ్మెల్యే సూరికి రావడంపై చర్చ అనంతపురం సెంట్రల్ : టీడీపీలో సెల్ఫోన్ల సంక్షిప్త సందేశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఆగంతకుని నుంచి బెదిరింపు మెసేజ్ వస్తుందో అంతుబట్టడం లేదు. ఇప్పటికే అనంతపురం మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికు ఇటువంటి సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. వీరు ఎస్పీ రాజశేఖర్‌బాబును కలసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీని గురువారం కలవడం చర్చనీయాంశమైంది. ఆయన రాకతో పోలీసు వర్గాల్లోనూ చర్చ సాగింది. ఆయనకూ బెదిరింపు మెజేస్ వచ్చిందా లేక ఇతర సమస్యపై ఎస్పీని కలిశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు ఎస్పీ రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయ అధికారులు మాత్రం నేతల రాకపై నోరు మెదపడం లేదు. అత్యంత రహస్యంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అన్ని విషయాలు బయటపెడితే పార్టీ పరువు బజారును పడుతుందనే ధోరణిలో ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య ప్రజాప్రతినిధులకు బెదిరింపుల మెసేజ్‌లు వచ్చి రోజులు గడుస్తున్నా ఏం జరుగుతోందో.? ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా బయట పెట్టలేకపోవడం పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మేయర్‌కు చెక్..!
→ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ → డిప్యూటీ మేయర్ వర్గం ఆధిపత్యం → ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ → ప్రశాంతంగా ముగిసిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనంతపురం న్యూసిటీ : స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ స్వరూప వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించిన విధంగానే మేయర్‌పై ఉన్న అసమ్మతిని కార్పొరేటర్లు ఓటుతో బుద్ధి చెప్పారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ మేయర్ గంపన్న వర్గం ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడంతో ఇక మేయర్‌కు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. నగరపాలక సంస్థలోని పింఛన్ గదిలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ వర్గం నటేష్ చౌదరి, విజయశ్రీ, లక్ష్మిరెడ్డి, మేయర్ వర్గం నుంచి రాజారావు, రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ గెలుపొందారు. సజావుగా ఎన్నికలు : స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయి. కమిషనర్ చల్లా ఓబులేసు పర్యవేక్షణలోఉదయం 11 నుంచి 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఓట్లను కమిషనర్ చల్లా ఓబులేసు లెక్కించారు. 50 డివిజన్లకుగానూ 11 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బహిష్కరించగా, మేయర్, డిప్యూటీ మేయర్, 26వ డివిజన్ కార్పొరేటర్ ఆదినారాయణ ఎన్నికలకు గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 36 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో నటేష్ చౌదరికి 20, రాజారావుకు 20, విజయశ్రీ 19, లక్ష్మిరెడ్డి 19, ఉమామహేశ్వర్‌కు 18 ఓట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచి గెలుపొందారు. ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు గంగన హిమబిందు, గిరిజమ్మ, చింతకుంట సుశీలమ్మ, బోయ సరోజమ్మ, వెంకట్రమణమ్మ, బోయ పక్కీరమ్మ, జానకి, బాలాంజినేయులు, షుకూర్, గూడూరు మల్లికార్జున, సాకే పోతులయ్య స్టాండింగ్ కమిటీ ఎన్నికలను బíß ష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగన హిమబిందు, బోయగిరిజమ్మ, జానకి, షుకూర్ మాట్లాడుతూ పాలకవర్గం ప్రజల కనీస అవసరాలైన మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి వాడల్లో నివసిస్తున్న పేద ప్రజల పింఛన్ అందించడంలో పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. పాలకవర్గంలో అవినీతి చోటు చేసుకోయిందని సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారని గుర్తు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్టాండింగ్ కమిటీను ఎన్నుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహించకూడదనే ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. అనంతరం కమిషనర్ చల్లా ఓబులేసుకు వినతిపత్రం అందించి వెళ్లిపోయారు. మేయర్‌కు చెక్ : మేయర్ స్వరూపకు చెక్ పెట్టేందుకే ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ వర్గానికి కార్పొరేటర్లు ఓట్లేశారని ఆ పార్టీకు చెందిన నేతలే అంటున్నారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇష్టానుసారంగా అభివద్ధి పనులు చేపట్టారని, పలు డివిజన్లను విస్మరించడం కారణంగానే మేయర్‌కు వ్యతిరేకంగా ఓటేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేయర్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఎన్నికల్లో ప్రే„ý కపాత్ర పోషించారన్న వాదనా ఉంది. నగరాభివద్ధికి కషి – స్టాండింగ్ కమిటీ సభ్యులు నగరాభివద్ధి కోసం కషి చేస్తామంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు లక్ష్మిరెడ్డి, విజయశ్రీ, ఉమామహేశ్వర్ తెలిపారు. సమస్యలపై పోరాడే వారినే కార్పొరేటర్లు గెలిపించారని, అందుకు కతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
అనంతపురం టౌన్: నిరుద్యోగుల బలహీనతను ఆసరగా వారికి టోకరా ఇచ్చి డబ్బులు గడించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరికి నకిలీ నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఇలాంటి ఉత్తర్వుతో ఒక వ్యక్తి మేయర్ స్వరూప వద్దకు రెండు రోజుల కిందట వచ్చి చూపించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అవాక్కయ్యారు. సంస్థలో ఎలాంటి ఖాళీలు లేవు. అది నకిలీ ఉత్తర్వని ఆ వ్యక్తికి చెప్పి పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఆమె తీవ్రంగా పరిగణించి అధికారులను అప్రమత్తం చేశారు. వివరాల్లోకి వెళితే కార్పొరేషన్లో కాంట్రాక్టు పద్ధతితో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చినట్లు ఒక వ్యక్తి మేయర్ ఇంటి వద్దకు నియామక ఉత్తర్వు తీసుకొచ్చారు. దానిపైన అధికారుల సంతకాలు (పోర్జరీ) ఉన్నాయి. దాన్ని పరిశీలించిన ఆమె ఉత్తర్వు ఎవరు ఇచ్చారని ఆ వ్యక్తిని అడిగారు. తన స్నేహితుని వద్ద నుంచి ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్‌గా కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నియామక ఉత్తర్వు ఇచ్చినట్లు అతను చెప్పాడు. సంస్థలో ఎలాంటి కాంట్రాక్టు పోస్టులు లేవు. ఎప్పుడైనా ఖాళీలు ఏర్పడితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేసుకుంటాము. ఇలా నేరుగా సంస్థ ఉత్తర్వులు ఇవ్వదని చెబుతూ దాన్ని పరిశీలించి అది నకిలీదని గుర్తించారు. మీ స్నేహితునికి ఈ ఉత్తర్వు ఎవరు ఇచ్చారని అడిగారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, మా స్నేహితుడిని పిలుచుకు వస్తానని చెప్పి ఉత్తర్వు తీసుకుని వెళ్లిపోయాడని తెలిసింది. అటు తరువాత ఆ వ్యక్తి మళ్లీ మేయర్ వద్దకు రాలేదు. ఇంటి దొంగల పనేనా.. కాంట్రాక్టు ఉద్యోగాలకు నకిలీ నియామక ఉత్తర్వులు ఇస్తూ మోసం చేస్తున్న వారు ఇంటి దొంగలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ప్రజాప్రతినిధులు దీని వెనుక ఉన్నారా..? లేక బయటివారితో కలిసి ఇక్కడి సిబ్బంది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత ధైర్యంగా అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నారంటే ఇదో పెద్ద రాకెట్లా జరుగుతోంది. బయటి వారెవరైనా ఇలాంటి వ్యవహారం నడుపుతున్నారా అనేది విచారణ జరిపిస్తే వెలుగు చూసే అవకాశం ఉంది. అనంతపురం కార్పొరేషన్ ఒక్కదాంట్లోనేనా లేక ఇతర మునిసిపాలిటీల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారా అనేదానిపై విచారణ చేయాల్సి అవసరం ఉంది. ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మకండి: స్వరూప, మేయర్ కార్పొరేషన్లో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెపితే నమ్మకండి. అలాంటి వారి మాయలో పడి డబ్బులు పోగొట్టుకోకండి. ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి. సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఖాళీ లేవు. ఎప్పుడైనా ఒకటో రెండు ఖాళీ ఏర్పడితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వాటిని భర్తీ చేస్తాము. తప్పితే నేరుగా నియామకం ఉండదు. ఇక నకిలీ నియామక ఉత్తర్వులపై అధికారులను అప్రమత్తం చేశాను. సంస్థలో సిబ్బందిలో ఎవరైనా ఇంటి చర్యలకు పాల్పడుతున్నారా అనే కోణంలో విచారణ చేయాలని ఆదే శించాను. తన వద్దకు వచ్చిన వ్యక్తి వద్ద ఉన్న నకిలీ నియామక ఉత్తర్వు జిరాక్స్ కాపీ తీసుకోలేదు. ఆ కాపీ ఉంటే కేసు పెట్టేవాళ్లం.