meeting hall
-
రైతు బంధు పై రభస
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దున్నేవారికి కాకుండా భూమి ఉన్నవారికే పెట్టుబడి సాయం అందుతోందని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 20శాతం మంది రైతుల దరికి ఇంకా ‘రైతుబంధు’ చేరలేదని వ్యాఖ్యానించింది. శనివారం చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జెడ్పీ సమావేశంలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకంపై వాడీవేడి చర్చ సాగింది. సభ ప్రారంభంకాగానే.. మంచాల, కందుకూరు జెడ్పీటీసీ సభ్యులు మహిపాల్, జంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఉద్దేశంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటికీ, సగం మందికి ఇంకా లబ్ధి చేకూరలేదనే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించిన అధికారపక్ష సభ్యులు.. సాంకేతిక కారణాలతో కొంతమంది ఖాతాలో నగదు జమ కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోకుండా అడ్డగోలుగా మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది. రెవెన్యూతోనే తలనొప్పి.. రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల వ్యవహారాన్ని సమావేశం ఆక్షేపించింది. రెవెన్యూ అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పకడ్బందీగా రికార్డులను సరిదిద్దకపోవడం.. ఉద్దేశపూర్వకంగా పాస్‌బుక్కులను జారీచేయకపోవడంతో చాలామంది రైతులకు రైతుబంధు రాకుండా పోయిందని సభ్యులు విమర్శించారు. అభ్యంతరాలులేని భూములకు కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, శంషాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాలో నిధులు జమ కాకున్నా జమ అయినట్లు సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని, ఇలా రైతులను మోసం చేయడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. సాంకేతిక సాకులతో రైతుబంధు పథకాన్ని వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. రైతుబంధుతో సంపన్నులకే లబ్ధి చేకూరిందని, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలో ఇంకా నయాపైసా జమ కాలేదని మంచాల జెడ్పీటీసీ సభ్యుడు మహిపాల్ అన్నారు. శంకర్పల్లి ఎంపీపీ చిన్న నర్సిములు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ సాకుతో ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు జరగడంలేదని, పాస్‌పుస్తకాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. తాజాగా పాస్‌పుస్తకాలు అందినవారికి త్వరలోనే రైతుబంధు సాయం అందుతుందని, పాత బకాయిలు మాత్రం ఇచ్చే అంశంపై స్పష్టత లేదని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. క్షమాపణ చెబుతున్నా.. ‘అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది. కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం కింద ప్రతి రైతుకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సాంకేతిక కారణాలతో కొంతమందికి ఇంకా సాయం అందలేదు. నగదు పంపిణీలో ఆలస్యమైనందుకు సర్కారు తరుఫున క్షమాపణలు చెబుతున్నా’ అని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. మేమే అక్రమార్కులమా? మొయినాబాద్ మండలంపై మీరు(డీపీఓ) కక్షగట్టారు. 111 జీఓ పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల లేఅవుట్ల జోలికి వెళ్లకుండా మావే కూల్చుతున్నారంటే మీ ఉద్దేశమేమిటో తెలుస్తోంది. ఎమ్మెల్యేతో మీరు మిలాఖత్ అయ్యారు. అజీజ్‌నగర్‌లో బడాబాబులు నిర్మించిన విల్లాలను టచ్ చేయకుండా.. 200 గజాల స్థలంలో ప్లాట్లు కొన్నవారిని వేధిస్తున్నారు అని మొయినాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాపచంద్రలింగం తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. హిమాయత్‌సాగర్ బొడ్డున హరీష్‌రావు, ఎమ్మెల్యే వివేకానంద నిర్మించిన భవనాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. సభ్యుడి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేధించిన డీపీఓ పద్మజారాణి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం తప్ప వివక్ష పాటిస్తున్నామనడం సరికాదన్నారు. అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నా తొలగిస్తామని, అజీజ్‌నగర్ విల్లాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. సీనరేజీ సుంకం ఇవ్వరా? హైకోర్టు తీర్పు ఇచ్చినా సీనరేజీ సెస్సు ఇవ్వకపోవడం ఏమిటని చేవెళ్ల జెడ్పీటీసీ చింపుల శైలజ ప్రశ్నించారు. 2012–13 నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.520 కోట్లను విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా కౌంటర్ దాఖలు చేయాలని భావించడం చూస్తే స్థానిక సంస్థలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ అంశంపై కలెక్టర్ లోకేశ్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుతం ఈ అంశం ఆర్థిఖ శాఖ పరిధిలో ఉందని, త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు. జిల్లా ఖనిజ నిధి కింద అభివృద్ధి పనులు చేసేందుకు వెసులుబాటు ఉందని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి, వికారాబాద్ జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, మల్లారెడ్డి, వివేకానంద, మహేశ్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, రోహిత్‌రెడ్డి, ఆనంద్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, వివిధ మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. విజేతలకు సన్మానం ఇటీవల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి సన్మానించారు. శాలువా, పూలమాలలతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారుల సంఘం ఆకాక్షించింది. -
నేరడిగొండకు రాహుల్ రాక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండలో ఈనెల 20న బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్ కృష్ణన్, బొస్రాజ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించి ఖరారు చేశారు. ఇచ్చోడలోని ఎడ్ల అంగడి, టింబర్ డిపో ప్రాంతాలను కూడా పరిశీలించినప్పటికీ, చివరికి నేరడిగొండలోనే పీఏసీఎస్ కార్యాలయం వెనుక గల స్థలాన్ని సభ కోసం ఖరారు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లో రాహుల్‌గాంధీ పాల్గొనే సభకు అనువైన స్థలాలను తొలుత అన్వేషించారు. చివరకు నేరడిగొండ పీఏసీఎస్ కార్యాలయ వెనక గల స్థలం బహిరంగ సభకు అనువుగా ఉంటుందని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. జిన్నింగ్ మిల్లు వద్ద గల స్థలం హెలిప్యాడ్ నిర్మాణానికి అనువుగా ఉంటుందని తేల్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, జిల్లా నాయకులు గండ్రత్ సుజాత, జాదవ్ నరేష్, కుమ్రం కోటేశ్వర్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. భారీ జన సమీకరణకు నిర్ణయం ఉత్తర తెలంగాణలో రాహుల్‌గాంధీతో ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్నికల ప్రచారసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ జరపడం ద్వారా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ఈ మేరకు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. దసరా తరువాత నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా కాంగ్రెస్ పట్ల ప్రజానీకంలో గట్టి నమ్మకాన్ని కలిగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో దసరా లోపు టికెట్లు ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పోటాపోటీగా ఆశావహులు జనాన్ని తరలించే అవకాశం ఉంది. నేరడిగొండలో సభా స్థలాన్ని చూపిస్తున్న జాదవ్ అనిల్‌కుమార్ -
కరీంనగర్‌కు నేడు అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం కరీంనగర్ రానున్నారు. ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్ నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి సభ నిర్వహించారు. ఆ సభ సక్సెస్ కావడంతో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ రెండో సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కరీంనగర్లో నిర్వహించే అమిత్ షా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం కరీంనగర్ రానున్నారు. ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్ నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి సభ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ రెండో సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కరీంనగర్లో నిర్వహించే అమిత్ షా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. అమిత్ షా బహిరంగ సభకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం సిద్ధమైంది. సభా వేదిక ఏర్పాట్లను మంగళవారం కూడా రాష్ట్ర నాయకులు పరిశీలించారు. బహిరంగ సభ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించడంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు. కరీంనగర్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టనున్న ఎన్నికల శంఖారావం, సమరభేరి సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. అగ్రనేతల నజర్లో కరీంనగర్.. పాగా వేసేందుకు ప్రయత్నం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో జిల్లా రాజకీయాలపై పట్టు బిగించేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించి బుధవారం కరీంనగర్ నగరంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభ నిర్వహిస్తున్నారు. ఆయన రాక, బహిరంగ సభ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సభను విజయవంతం చేసి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కమల వికాసాన్ని విరబూయించే చర్యల్ని తీసుకుంటున్నారు. గతంలోనూ పార్టీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ కరీంనగర్లో నిర్వహించిన భారీ సభకు హాజరై ఇక్కడి ప్రజల ఆశీసుల్ని అందుకున్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా రెండు పర్యాయాలు జిల్లాలోని సభలకు హాజరయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓసారి వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో 2014 ఏప్రిల్ 22వ తేదీన కరీంనగర్‌లోని అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన భారీ సభకు భాజపా ప్రధాని అభ్యర్థి హోదాలో మోదీ విచ్చేశారు. పార్టీలో నమో నినాదాన్ని నింపి గత ఎన్నికల్లో ఓటు బ్యాంకుని పెంచుకునేలా ప్రసంగించారు. గతంలో జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో నితిన్గడ్కరీతోపాటు జాతీయ నాయకురాలు స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రులు ఉమ్మడి జిల్లాకు వచ్చి ఇక్కడి ప్రజలతో మమేకమైన సందర్భాలున్నాయి. మళ్లీ అదే తరహాలో ఈ ఎన్నికల్లో ప్రచార హోరును జోరుగా కొనసాగించే సన్నాహాల్ని పార్టీ చేపడుతోంది. భారీ బందోబస్తు.. పోలీసు బలగాల మోహరింపు.. ముందస్తు సమరంలో కమలం జోరుని పెంచాలని సరికొత్త వ్యూహంతో నిర్వహించే అమిత్ షా భారీ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగా, పోలీసు బలగాలు సైతం మోహరించాయి. కరీంనగర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌ను మంగళవారం ఉదయమే తమ అధీనంలోకి తీసుకున్న కేంద్ర పారా మిలటరీ బలగాలు, పూర్తిగా వారి పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లు హెలిప్యాడ్, సభావేదిక వద్ద తనిఖీలు నిర్వహించారు. అమిత్ షా హాజరయ్యే ఈ సభలోని పలు ప్రాంత్లాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి నగరంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు ఆంక్షలతోపాటు దారి మళ్లింపు షెడ్యూల్‌ను రెండు రోజుల ముందుగానే విడుదల చేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ, పి.మురళీధర్‌రావు, పోల్సాని సుగుణాకర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు బండి సంజయ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, కరీంనగర్ జిల్లాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లలో బిజీ బిజీగా గడిపారు. దారిమళ్లింపు, వాహనాల పార్కింగ్ ఇలా.. బీజేపీ సభ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తాయని పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. సభ పూర్తయ్యే వరకు దారి మళ్లింపు చర్యలు అమల్లో ఉంటాయని చెప్పారు. మానేరు జలాశయ సమీపంలో ఉన్న క్రీడా పాఠశాల మైదానం, శాతవాహన విశ్వవిద్యాలయం, ఐటీ టవర్స్ ప్రాంతం, కొండ సత్యలక్ష్మి గార్డెన్స్, లక్ష్మి వేంకటేశ్వర దేవాలయం సమీపంలోని స్థలాల్లో వాహనాలను నిలుపుదలకు కేటాయించినట్లు చెప్పారు. భారీ వాహనదారులు ఈ దారి మళ్లింపు చర్యలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. అదే రోజు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం వేళ పరీక్ష ముగిసిన తర్వాత ఎటూ వెళ్లకుండా సదరు కేంద్రాల్లోనే ఉండి, దారి మళ్లింపు చర్యలు ముగిసిన తర్వాత ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు. పెద్దపల్లి, గోదావరిఖని: పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్ బేకరి మీదుగా సభావేదికకు చేరుకునే కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలపాలి. హైదరాబాద్, వరంగల్: హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి సభా వేదిక వద్దకు వచ్చే వాహనాలు ఎన్టీఆర్ విగ్రహం, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్ బేకరీల మీదుగా చేరుకొని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలపాలి. చొప్పదండి, మంచిర్యాల: చొప్పదండి, మంచిర్యాల మార్గాల ద్వారా సభా వేదికకు చేరుకునే వాహనాలు నాఖాచౌరస్తా, పెద్దపల్లి ఫ్లైఓవర్, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్ బేకరీల మీదుగా సభా వేదికకు చేరుకుని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలపాలి. సిరిసిల్ల, వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు చింతకుంట క్రాస్‌రోడ్డు, సిరిసిల్ల, బైపాస్, రాంచంద్రాపూర్‌కాలనీ మీదుగా సభా వేదికకు చేరుకుని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపాలి. జగిత్యాల: నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రేకుర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, చింతకుంట క్రాస్‌రోడ్, పద్మనగర్ బైపాస్, రాంచంద్రాపూర్ కాలనీ మీదుగా సభావేదికకు చేరుకోవాలి. కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలపాలి. -
ఆశీర్వాద సభకు.. అంతా సిద్ధం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. గురువారం నల్లగొండలో సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి ఎన్నికల బహిరంగ సభను నల్లగొండలో ఏర్పాటు చేసిన గులాబీ దళం.. అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి కనీసం మూడు లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం నాలుగైదు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రచారం చేశారు. జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఇప్పటికే పది చోట్ల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులతో నిమిత్తం లేకుండా ఒక విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అభ్యర్ధులకు ప్రచార సామగ్రిని కూడా పంపించింది. దీనిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో ఊపును తీసుకువచ్చేందుకు బహిరంగ సభ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించనున్న టీఆర్ఎస్ ‘ ప్రజా ఆశీర్వాద ’ సభలో ఆపద్ధర్మ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొననుండడంతో గడిచిన నాలుగు రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు, పార్టీ నాయకులు సభా ప్రచారంలోనే మునిగిపోయి ఉన్నారు. గులాబీ జెండాల రెపరెపలు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బహిరంగ సభ ఖరారు కావడంతో పనిలో పనిగా సభ ప్రచారం కూడా మొదలు పెట్టిన నేతలను గ్రామ గ్రామాన పార్టీ ప్రచార సామగ్రితో హోరెత్తిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పాతిక వేల మందిని సమీకరించే యోచనతో నాయకులు ఏ చిన్న గ్రామాన్నీ విడిచిపెట్టడం లేదు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. నల్లగొండకు సమీపంలో ఉన్న నియోజకవర్గాలనుంచి బైక్ ర్యాలీలు, ఆటో ర్యాలీల ద్వారా సభాస్థలికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలలతో రహదారులను నింపేశారు. సభను విజయవంతం చేసేందుకు గడిచిన మూడు నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలో పలువురు నేతలు తిష్టవేసి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, స్థానిక అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంతోపాటు సభా ఏర్పాట్లలో మునిగిపోయారు. జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లా కేంద్ర సమీంలోనే.. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి పక్కనే సభా స్థలాన్ని ఎంపిక చేశారు. సభాస్థలం పక్కనే హెలిపాడ్ సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలతో ఇబ్బందులు లేకుండా నియోకవర్గాల వారీగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సభా స్థలి పరిశీలన నల్లగొండ రూరల్ : టీఆర్ఎస్ సభా స్థలిని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తదితరులతో కలిసి సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట రేఖల భద్రాద్రి, జి.వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్‌రెడ్డి, జెల్లా మార్కెండెయ, ఫరీద్, అభిమన్యు శ్రీనివాస్, జిల్లా శంకర్, మోహన్‌బాబు తదితరులు ఉన్నారు. కాన్వాయ్ ట్రయల్ రన్ సభా స్థలానికి 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్‌ను తీసుకెళ్లడానికి పోలీసులు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. పోలీస్ అధి కారులు దగ్గరుండి కాన్వాయ్‌ను పర్యవేక్షించారు. సీఎం ప్రత్యేక సెక్యూరిటీ సభా స్థలానికి చేరుకుని అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడండి : కలెక్టర్ సభకు సీఎం రాక సందర్భంగా ప్రొటోకాల్ ప్రకా రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. సభా స్థలంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. భద్రతా చర్యల గురించి ఎస్పీ, ఇతర అ ధికారులతో చర్చించారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చే యడంతో పాటు ప్రయాణికులకు సూచనలు చేసేందుకు సహాయకులను నియమించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సభా వేదిక ముందు వీఐపీలు, ప్రముఖులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా సభ జరుగుతున్నంత సేపు సభపై నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
అమిత్ షా సభ కోసం..
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఉత్తర తెలంగాణలో సత్తా చాటే పనిలో నిమగ్నమైంది. కమలనాథులకు ఒకప్పుడు మంచి పట్టున్న కరీంనగర్ నుంచే తమ ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 10న కరీంనగర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ టార్గెట్‌గా, మహాకూటమికి దీటుగా బీజేపీ ఒంటరిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని చేపట్టి పట్టుసాధించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. గతంలో ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపక తప్పదు. ఈనెల ఐదులోగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమైనట్లు కమలనాథులు ప్రకటిస్తున్నారు. కాగా.. అమిత్‌షా సభ సక్సెస్ కోసం 13 నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను నియమించి సుమారు 1.25 లక్షల మందిని తరలించేలా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉత్తరాదిన బీజేపీ విజయం సాధించేలా కృషి చేసి, దక్షిణాదిన పాగా వేసేలా పనిచేసిన పార్టీ సీనియర్ నేతలను ఈ జిల్లాకు ఇన్‌చార్జీలుగా నియమించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్‌చార్జీలుగా నాలుగు మాసాల క్రితమే నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది నియోజకవర్గాలకు ఇన్చార్జిగా రామ్ మాధవ్‌ను, నాలుగు నియోజకవర్గాలకు బండారు దత్తాత్రేయను నియమించి ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలిసింది. అలాగే అమిత్ షా సభ ఇన్చార్జిగా తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంర్రారెడ్డిని, సమన్వయకర్తగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సహాయ సమన్వయ కర్తలుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ అధ్యక్షుడు సుగుణాకర్‌రావును నియమించారు. అందులో భాగంగా 10న కరీంనగర్లో అమిత్ షా పర్యటించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అమిత్ షోతో ఉత్తర తెలంగాణాలో బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెంచేలా కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా పర్యటనతో పార్టీలో ముఖ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించి పార్టీని గెలుపు దిశగా పయనించేలా వ్యూహాన్ని అమలు చేస్తారని చర్చసాగుతోంది. గుజరాత్, కర్నాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణాలో అమలు చేసేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో వేసిన కమిటీలకే ఓటర్ల బాధ్యతలను అప్పగించేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను, కేటాయించిన నిధుల వివరాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఓట్లు రాబట్టుకునే కరసత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్శించి బలం పెంచుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పక్కా ప్రణాళికతో పార్టీ శ్రేణులను మార్గదర్శకం చేస్తూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇదే క్రమంలో ఈనెల 10న కరీంనగర్లో అమిత్ షా సభను నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. పాగా వేసేందుకు ప్రయత్నం.. మరోమారు బూత్‌స్థాయి నుంచి సమీక్ష.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి ఒకప్పుడు గట్టి పట్టు ఉండగా గ్రూప్ రాజకీయాలతో రానురాను పార్టీ బలహీనపడింది. నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అమిత్ షా పర్యటనతో సమస్యలన్నీ సద్దుమణిగి బీజేపీకి పూర్వవైభవం వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, తద్వారా పార్టీని విస్తరింపజేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా నాయకత్వం, ఈ మధ్య మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్ర జిల్లాకు చేరనుండగా, శంకరపట్నంలో బహిరంగ సభ నిర్వహించారు. కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్యాడర్ ప్రధాని నరేంద్రమోదీ జోష్‌తో ముందుకు సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు పార్టీ నాయకత్వం వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎంఎల్ఏ చింతల రామచంద్రారెడ్డి తరచూ పర్యటించడం ద్వారా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 2,097 పోలింగ్‌బూత్‌లకు గాను 2,050 పైచిలుకు బూత్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కనీసం 10 నుంచి 25 మందితో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. కాగా గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో అభ్యర్థులు, బూత్‌స్థాయి కమిటీలు, అమిత్ షా సభ సక్సెస్ కోసం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. విజయవంతం చేయండి ఈనెల 10న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభను సక్సెస్ చేయాలని కోరారు. అమిత్ షాతోపాటు జాతీయ, రాష్ట్ర కమిటీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ సభలో పాల్గొంటారని, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కీలకమైన సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. -
నేడు నిజామాబాద్‌కు కీసీఆర్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ తొలి ప్రచార సభను ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నగరం లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ వేదికను నిర్మించారు. సభా స్థలాన్ని సర్వాం గ సుందరంగా తీర్చిదిద్దారు. మైదానాన్ని చదును చేసి బారికేడ్లను నిర్మించారు. టీఆర్ఎస్ జెండాలు, తోరణాలతో నగరమంతా గులాబీ మయంగా మారింది. అధినేత కేసీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో కూడి న భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. సీఎం బహిరంగ సభా నిర్వహణ బాధ్యతలను భూజానెత్తుకున్న ఎంపీ కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారం రోజులుగా జిల్లాలోనే ఉండి పర్యవేక్షించా రు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభలో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాక.. కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. హెలిక్యాప్టర్‌లో నేరుగా సభా స్థలానికి వస్తారు. ఇందుకోసం సభా స్థలం వద్ద హెలిప్యాడ్‌ను నిర్మించారు. వచ్చిన వెంటనే కొద్దిసేపు పార్టీ అభ్యర్థులతో సమీక్షిస్తారు. అనంతరం బహిరంగసభా వేదిక పైకి వచ్చి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. భారీ జన సమీకరణ.. బహిరంగసభను టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయవంతం చేసేందు కు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు తొలి ప్రచార సభ కావడంతో ఆ పార్టీ ఈ బహిరంగసభపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది చొప్పున జన సమీకరణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు తాజామాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభకు భారీగా తరలిరావాలని గ్రామాలు, నగరంలోని వివిధ డివిజన్లలో ఇం టింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. నాలుగు జిల్లాల నుంచి వెయ్యి ఆర్టీసీ బస్సులు.. భారీ జన సమీకరణలో నిమగ్నమైన టీఆర్ఎస్ వర్గాలు ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవే టు వాహనాలను వినియోగిస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఆర్టీసీ రీజియన్ల నుంచి సుమారు వెయ్యి బస్సులను బుక్‌చేశారు. అలాగే డీసీఎంలు, ఇతర ప్రైవేటు వాహనాలను గ్రామా ల్లో అందుబాటులో ఉంచి జన సమీకరణ చేపట్టారు. ప్రతి గ్రామానికి ఒకటీ రెండు వాహనాలను అందుబాటులో ఉంచారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. -
కేసీఆర్ సభకు వెళ్లొద్దని ప్రతిజ్ఞ
కమ్మర్పల్లి(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరగ నున్న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు వెళ్లవద్దని కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామస్తులు తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ శివారులోని జగదాంబ క్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. తమ గ్రామానికి అధికారికంగా మంజూరైన చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం గేట్‌వాల్వ్ బిగించడంలో పాలకులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేస్తున్నప్పటికీ, చౌట్పల్లి గ్రామంతో వివాదం కారణంగా తమ గ్రామ చెరువులోకి నీరు రావడం లేదని వాపోయారు. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారికంగా మంజూరైన గేట్‌వాల్వ్‌ను ఏర్పాటు చేయకపోవడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులమంతా ఏకమై అధికార పార్టీకి మద్దతు ఇవ్వకూడదని, ప్రజాప్రతినిధులు గ్రామానికి వస్తే వారికి కూడా మద్దతుగా నిలవకూడదని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారం జరిగే సీఎం సభకు గ్రామంలో ఎవరు కూడా వెళ్లకూడదని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నాటికి గేట్ వాల్వ్ బిగించకపోతే ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తీర్మానించారు. అనంతరం గ్రామస్తులంతా అధికార పార్టీకి మద్దతు తెలపకూడదని, సీఎం సభకు వెళ్లకూడదని ప్రతిజ్ఞ చేశారు. -
కేసీఆర్ సభపై.. దృష్టి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇతర పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్లో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఈ నెల 6వ తేదీనే ఆ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కేవలం రెండు నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. విపక్ష పార్టీల కంటే ముందుండాలన్న నాయకత్వ వ్యూహంలో భాగంగా అక్టోబర్ 4వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. నల్లగొండ బైపాస్ సమీపంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల నుంచి కనీసం మూడు లక్షల మందిని సమీకరించే పనిలో పార్టీ నాయకులు ఉన్నారు. ఇరవై రోజులకు పైగా పార్టీ అభ్యర్థులు తమ నియోకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అన్ని నియోకవర్గాలకు ప్రచార సామగ్రి కూడా సరఫరా చేశారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ.10లక్షల విలువైన ప్రచార సామగ్రి అందినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇదే ఎన్నికల ఊపును కొనసాగించేందుకు పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగానే నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే, మరోవైపు ఈ సభ సక్సెస్‌పై దృష్టి పెట్టారు. నియోజకవర్గానికి కనీసం పాతిక వేల మందిని తీసుకువస్తే కానీ పెట్టుకున్న లక్ష్యం మేరకు మూడు లక్షల మందిని సమీకరించే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు నేతలంతా దీనిపైనే దృష్టి సారించారు. సన్నాహక సమావేశాలు పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభ కావడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ హాజరు కానున్న మూడో సభ కావడంతో జిల్లా నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. విపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో, తమ ప్రత్యర్థులు ఎవరనే విషయాన్ని పక్కన పెట్టి నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో చుట్టివచ్చే పనిలోఉన్నారు. ఇదే క్రమంలో ప్రతి గ్రామం నుంచి కేసీఆర్ సభకు జనాన్ని సమీకరించడం ద్వారా అంతటా ఎన్నికల వేడిని పుట్టించవచ్చని, ప్రతిపక్ష అభ్యర్థులు గ్రామాలకు వచ్చే సమయానికే తాము కనీసం ఒకటికి రెండు సార్లు తిరిగి రావచ్చన్న ఆలోచనతో పల్లెలకు వెళుతున్నారు. దీనికి గాను మండలాలు, గ్రామాల వారీగా టార్గెట్లు పెట్టేందుకు ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మండలాల వారీగా సన్నాహక సమావేశాలు కూడా జరుపుతున్నారు. ఇవి కూడా చిన్నపాటి బహిరంగ సభలను తలపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌లు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న సన్నాహక సమావేశాలకు హాజరవుతున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో తిప్పర్తి, శనివారం కనగల్, పెద్దవూరలో ఇప్పటికే సమావేశాలు జరిగాయి. ఆదివారం నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల, నల్లగొండ జిల్లాకేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమీకరణ బాధ్యతలు అప్పజెప్పేందుకు ఈ సమావేశాలు జరుపుతున్నారు. బైక్.. ఆటో ర్యాలీలు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు, కేసీఆర్ బహిరంగ సభను అవకాశంగా భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు చేతినిండా పని పెడుతున్నారు. నల్లగొండకు సమీపంలో ఉన్న నియోజకవర్గాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున సభకు కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గంనుంచి ఈ సభకు కనీసం 10వేల మోటార్ బైక్‌లు, 1500 ఆటోలతో ర్యాలీగా రావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల చెప్పాయి. కేవలం కట్టంగూరు, నకిరేకల్, కేతేపల్లి మండలాల నుంచి వీటిని ఏర్పాటు చేస్తుండగా, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల నుంచి పెద్ద వాహనాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించని కోదాడ, హుజూర్నగర్ నియోకవర్గాల్లో హడావిడి కొంత తక్కువగా కనిపిస్తున్నా.. మిగిలిన పది నియోజకవర్గాల్లో ఎన్నికల జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. -
2,500 రైతు సమావేశ మందిరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,500 రైతు సమావేశ మందిరాలను నిర్మించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వాటి నిర్మాణాలకు రూ.300 కోట్ల కేటాయింపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. ఒక్కో సమావేశ మందిరానికి రూ.12 లక్షల చొప్పున కేటాయించాలని సీఎం నిర్ణయించారు. వాస్తవంగా సమావేశ మందిరాలకు సంబంధించి రెండు మూడు ప్రణాళికలతో వ్యవసాయశాఖ సీఎం వద్ద ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. మందిరాలను రూ.25 లక్షలు, రూ.20 లక్షలతో నిర్మించేలా ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఆడంబరంగా మందిరాలు అవసరం లేదని, సమావేశాలు పెట్టుకునేలా ఉంటే సరిపోతుందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. దీంతో రూ. 12 లక్షలతో నిర్మించేందుకు నిర్ణయించారు. ఏఈవో క్లస్టర్ల వారీగా మందిరాలు... రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) ఉన్నారు. ఆ ప్రకారం ప్రతీ మూడు గ్రామాలకు ఒక ఏఈవో నియమితులయ్యారు. ప్రస్తుతం 2,500 మంది ఏఈవోలున్నారు. మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే గ్రామంలో రైతు సమావేశ మందిరాలను నిర్మిస్తారు. గ్రామంలో దాతల ద్వారా స్థల సేకరణ చేసే అవకాశముంది. ఆ స్థలంలోనే సమావేశ మందిరాలను నిర్మిస్తారు. మైకు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా తీర్చిదిద్దుతారు. ఆ మూడు గ్రామాలకు చెందిన రైతు సమితి సభ్యుల సమావేశాలు అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన వంటివి ఈ మందిరాల్లోనే నిర్వహిస్తారు. రైతులకు సంబంధించిన ప్రతీ కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తారు. దీంతో ఏఈవో క్లస్టర్లు కీలకం కానున్నాయి. ఇప్పటివరకు మండల స్థాయిలోనూ ఇలాంటి సమావేశ మందిరాలు లేవు. కనీసం వ్యవసాయాధికారులకు కూడా మండలాల్లో పూర్తిస్థాయిలో కార్యాలయాలు లేవు. అటువంటిది మూడు గ్రామాలకు కలిపి ఒక సమావేశ మందిరం నిర్మిస్తుండటంతో రైతుల వద్దకు ప్రభుత్వ పథకాలు చేరే అవకాశముంది. -
జల వివాదాలు జటిలం
రాష్ట్ర విభజన వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో అనేక వివాదాలు ఏర్పడతాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక పరిష్కారమని శనివారం స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో ‘‘రాష్ట్ర విభజన- జల వివాదాలు’’ అనే అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు సురేష్, ఐజేయూ నాయకుడు శ్రీనివాసులురెడ్డి , మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. - న్యూస్‌లైన్, కడప కలెక్టరేట్ ప్రాజెక్టులు నిరర్థకం రాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలంగాణలో ని నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమ ప్రాజెక్టులకు నికర జలాలు లభించవు. ఇప్పటికే సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చుచేసి 70 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టులు విభజన వల్ల నిరర్థకంగా మా రుతాయి. మిగులు జలాల పంపిణీపై పరిష్కార ఒప్పందాలు చేసుకోవడానికి అ వకాశం ఉండదు. శ్రీశైలం, జురాల, నాగార్జున సాగర్లు అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులుగా మారుతాయి. విభజన తర్వాత ఏర్పాటయ్యే బోర్డు ట్రిబ్యూనల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు నీరుసక్రమంగా అందించేందుకే పరిమితమవుతుం ది. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశం బోర్డు పరిధిలో ఉండదు. తెలంగాణ ఏర్పడితే పోలవరం, దమ్ముగూడెం, సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు నిర్మాణం కావు. రాయల తెలంగాణ వల్ల కూడా చుక్కనీరు అందదు. నీటి సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణా నీటిని ఉపయోగించుకొనే 18 జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడాలి. ఇక మిగిలిన ఐదు జిల్లాలు ఏం పాపం చేశా యి. లేదంటే మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను సీమాం ధ్రలో కలపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలు. శాసనసభ ప్రొరోగ్ కా లేదు గనుక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సభను సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. - ఎంవి మైసూరారెడ్డి, వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు నీటి కేటాయింపులు వివాదాస్పదమవుతాయి ఎస్ఆర్బీసీ, బీమా, శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు నీటి విడుదల వంటి అంశాల్లో రాష్ర్ట పరిధిలో జరిగిన కేటాయింపులు విభజన తర్వాత వివాదాస్పదంగా మారుతాయి. రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదని చెప్పడం మూర్ఖత్వం. కృష్ణా జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న శ్రీబాగ్ ఒప్పందం కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణా- పెన్నా ప్రాజెక్టులు అటకెక్కించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తామని చెప్పిన సిద్దేశ్వరం గాలిలో కలిసిపోయింది. బళ్లారిని రాయలసీమ వాసులు కోల్పోయారు. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ అన్యాయంగా తీర్పు ఇచ్చింది. నికర జలాలను మాత్రమే పంపిణీ చేసి మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానమే సాగునీటి సమస్యకు పరిష్కారం. -టి.లక్ష్మినారాయణ, డెరైక్టర్, నీలం రాజశేఖరరెడ్డి రీసెర్చ్ సెంటర్. గోదావరిపై హక్కు కోల్పోతాం తెలంగాణ వాసులు ఇప్పటికే పోలవరం ప్రా జెక్టుకు అడ్డు చెబుతున్నారు. ఇక రాష్ట్రమే విడిపోతే ఆ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయి సీమకు అందాల్సిన నికర జలాలు దక్కకుండా పో తాయి. భద్రాచలాన్ని వదులుకుంటే గోదావరిపై హక్కే కోల్పోతాం. విభజన జరిగితే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజి నిండిన తర్వాతగానీ మనకు నీరు అందదు. తెలంగాణలోని బీమా ప్రాజెక్టుకు కూడా 20 టీఎంసీల నికర జలాలు లభించవు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను కోసం సాగర్ నుంచి ఇస్తున్న 12 టీఎంసీల నీటిని ఎవరు భరించాలో తేల్చాల్సి ఉంటుంది. కేసీ కెనాల్‌కు శ్రీశైలం నుంచి నీటి విడుదలకు అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇలాంటి జల వివాదాలు ఏర్పడవు. - ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు నికర జలాలు కేటాయించాకే విభజనపై చర్చ రాష్ట్రంలోని ఎనిమిది కరువు జిల్లాల కోసం మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చుక్కనీరు లభించదు. ట్రిబ్యునల్స్, రివర్ వ్యాలీ అథారిటీలు ఈసమస్యను పరిష్కరించలేవు. దీనికి పరి ష్కారమేదైనా ఉంటేసమైక్య రాష్ట్రం లోనే జరగాలి. విభజిస్తామంటే సీమ పరిస్థితి ఏమిటి?. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల కేటాయింపు సమస్యను పరిష్కరించాలి. - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాలి రాయలసీమలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరముంటుంది. నికర జలాలు అందకపోతే ఇవి ఎందుకు కొరగాకుండా పోతాయి. కృష్ణా మిగులు జలాలను బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయడం వల్ల మనం నష్టపోయాం. సీమ వాసులే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ ఇక్కడ కరువు, దారిద్య్రం పోలేదు. పో లవరం ప్రాజెక్టును తెలంగాణా నేతలు వ్యతిరేకించడంలో అర్థంలేదు. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ నుంచే అధికంగా వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఖాళీచేసి వెళ్ళాలనడం దారుణం. -ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. సమైక్యవాదులను గెలిపించండి రానున్న ఎన్నికల్లో సమైక్యవాదులను ప్రజలు గెలిపిం చాలి. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే జ ల వివాదాలు ఏర్పడవు. ఇప్పటికే తుంగభద్ర నుంచి సీబీఆర్‌కు, మైలవరానికి నీరు రావడం లేదు. రాష్ట్ర విభజనే జరిగితే మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు నిరుపయోగమవుతాయి. అన్ని పార్టీలు సమైక్యాంధ్ర కోసం పాటుపడాలి. గంగా-కావేరి అనుసంధాన కార్యక్రమం జరగాలి. -ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే, జమ్మలమడుగు 3 ఉద్యోగులకు బ్యాంకు రుణాలకు సన్నాహాలు Preparations for bank loans to employees కడప సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, వారికి బ్యాంకుల ద్వారా రుణాలందిస్తామని డీఆర్వో ఈశ్వరయ్య తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమైక్యాంధ్ర ఉద్యమంపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు సమ్మెలో ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ బిల్లులు పాస్ కావడం లేదని తెలిపారు. చిరు ఉద్యోగులు సమ్మెతో కష్టాలు, నష్టాలకు గురికావలసి వస్తోందన్నారు. ఇలాంటి వారందరి కోసం బ్యాంకుల ద్వారా రుణాలందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా పలు బ్యాంకు అధికారులతో రుణాల విషయం చర్చించామన్నారు. సమావేశంలో ట్రెజరీ జిల్లా అధికారులు రంగప్ప, నాగరాజు, బాలసుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, ఎన్జీవో సంఘం నాయకులు కెవి శివారెడ్డి, శ్రీనివాసులు, జి. రవికుమార్, రామ్మూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.