Mega Black
-
పలు మార్గాల్లో నేడు మెగాబ్లాక్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతు పనులు చేపడతారు. తత్ఫలితంగా కొన్ని లోకల్ రైళ్ల సేవలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెంట్రల్, హార్బర్ రైల్వే ప్రజాసంబంధాల అధికారులు వెల్లడించారు. సెంట్రల్మార్గంలో... ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో ఠాణే తర్వాత రైళ్లను మాటుంగా వరకు ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. ఈ కారణంగా ఈ మార్గంలో ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సైన్ స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మాటుంగా తర్వాత మళ్లి స్లో లైన్లో నడుపుతారు. అదేవిధంగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో నిలుపుతారు. అప్ స్లో లైన్లో నాహుర్, కాంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లన్నీ 15 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్మార్గంలో... హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అదేవిధంగా ట్రాన్స్‌హార్బర్ లైన్లో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య కూడా రద్దు చేయనున్నారు. పన్వెల్-అంధేరీ మధ్య సేవలు ఉండవు. అయితే ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో సీఎస్టీ-నెరూల్, ఠాణే-నెరూల్ సెక్షన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు. -
మూడు మార్గాల్లో మెగాబ్లాక్ నేడు
సాక్షి ముంబై: సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో పలు లోకల్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించనున్నారు. అదే సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. సెంట్రల్లో... ఠాణే-కళ్యాణ్ రైల్వే స్టేషన్ల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పై ఉదయం 10.39 నుంచి మధ్యాహ్నం 3.22 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ఠాణే-కళ్యాణ్‌ల మధ్య డౌన్ ఫాస్ట్ ట్రాక్‌పైకి మళ్లించనున్నారు. ఈ క్రమంలో స్లో లోకల్ రైళ్లకు కేవలం డోంబివలి రైల్వేస్టేషన్లోనే హాల్ట్ ఇవ్వనున్నారు. సీఎస్టీ-ఠాణేల మధ్య అప్, డౌన్ ఫాస్ట్ లోకల్ రైళ్లని ఘాట్కోపర్ అనంతరం విక్రోలి, భాండూప్, ములుండ్ రైల్వేస్టేషన్లలో కూడా ఆపనున్నారు. ముంబ్రా, కల్వా, దివా వెళ్లే ప్రయాణికులు ముందు డౌన్ మార్గంలో ప్రయాణించి అ తర్వాత అప్ మార్గంలో వచ్చే విధంగా అధికారులు వెసులుబాటును కల్పించారు. హార్బర్లో... హార్బర్ మార్గంలో మాన్‌ఖుర్ద్-నెరూల్ రైల్వేస్టేషన్ల మధ్య ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో హార్బర్ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. అయితే సీఎస్టీ నుంచి పన్వేల్/బేలాపూర్/వాషిలకు నడిచే రైళ్లను కుర్లా వరకు మెయిన్ లైన్లో ఠాణే మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. మాన్‌ఖుర్ద్ -పన్వేల్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వీటికి చించ్‌పోక్లీ, కరీరోడ్ స్టేషన్లలో హాల్ట్ ఉండదని రైల్వే అధికారులు వెల్లడించారు. పశ్చిమ రైల్వేలో... పశ్చిమ రైల్వే మార్గంలో ఆదివారం ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. గోరేగావ్-బోరివలి రైల్వేస్టేషన్ల మధ్య అప్, డౌన్ మార్గంలో ఈ మెగాబ్లాక్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.