మూడు మార్గాల్లో మెగాబ్లాక్ నేడు | Mega Black today in three ways | Sakshi
Sakshi News home page

మూడు మార్గాల్లో మెగాబ్లాక్ నేడు

Published Sat, Feb 15 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

Mega Black today in three ways

 సాక్షి ముంబై: సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో పలు లోకల్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించనున్నారు. అదే సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

 సెంట్రల్‌లో...
 ఠాణే-కళ్యాణ్ రైల్వే స్టేషన్ల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పై ఉదయం 10.39 నుంచి మధ్యాహ్నం 3.22 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ఠాణే-కళ్యాణ్‌ల మధ్య డౌన్ ఫాస్ట్ ట్రాక్‌పైకి మళ్లించనున్నారు. ఈ క్రమంలో స్లో లోకల్ రైళ్లకు కేవలం డోంబివలి రైల్వేస్టేషన్‌లోనే హాల్ట్ ఇవ్వనున్నారు. సీఎస్‌టీ-ఠాణేల మధ్య అప్, డౌన్ ఫాస్ట్ లోకల్ రైళ్లని ఘాట్కోపర్ అనంతరం విక్రోలి, భాండూప్, ములుండ్ రైల్వేస్టేషన్‌లలో కూడా ఆపనున్నారు. ముంబ్రా, కల్వా, దివా వెళ్లే ప్రయాణికులు ముందు డౌన్ మార్గంలో ప్రయాణించి అ తర్వాత అప్ మార్గంలో వచ్చే విధంగా అధికారులు వెసులుబాటును కల్పించారు.  

 హార్బర్‌లో...
 హార్బర్ మార్గంలో మాన్‌ఖుర్ద్-నెరూల్ రైల్వేస్టేషన్ల మధ్య ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో హార్బర్ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. అయితే సీఎస్టీ నుంచి పన్వేల్/బేలాపూర్/వాషిలకు నడిచే రైళ్లను కుర్లా వరకు మెయిన్ లైన్‌లో ఠాణే మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. మాన్‌ఖుర్ద్ -పన్వేల్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వీటికి చించ్‌పోక్లీ, కరీరోడ్ స్టేషన్లలో హాల్ట్ ఉండదని రైల్వే అధికారులు వెల్లడించారు.

 పశ్చిమ రైల్వేలో...
 పశ్చిమ రైల్వే మార్గంలో ఆదివారం ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. గోరేగావ్-బోరివలి రైల్వేస్టేషన్ల మధ్య అప్, డౌన్ మార్గంలో ఈ మెగాబ్లాక్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

Advertisement

పోల్

Advertisement