Minister Posts
-
మంత్రి పదవులు వస్తాయని ఆశించిన గద్దే రామ్మోహన్, శ్రీరాం తాతయ్య
-
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ప్రీతీ పటేల్ బోరిస్ జాన్సన్ కేబినెట్లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్మాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌తో జాన్సన్కీ అనుబంధం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. -
నాకు మంత్రి పదవి ఇవ్వాలి, లేదు..నాకే దక్కాలి
దొడ్డబళ్లాపురం: నాకు మంత్రి పదవి ఇవ్వాలి, లేదు.. నాకే దక్కాలి, పార్టీ కోసం నేనే ఎక్కువ పనిచేశా.. జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఇలా పదవుల కోసం పోటీ నెలకొంది. జేడీఎస్ హైకమాండ్ తన 37 మంది ఎమ్మెల్యేలను దేవనహళ్లి–నందికొండ మార్గంలోని ప్రిస్టేజ్ గోల్ఫ్ షైర్ రిసార్టులో ఉంచిన సంగతి తెలిసిందే. మంగళవారంనాడు రిసార్టు రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. ఉదయం 6 గంటల నుండే ఆయా ఎమ్మెల్యేల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరాసాగారు. తమ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ అక్కడున్న మీడియాలకు ఇంటర్వ్యూలివ్వడం ప్రారంభించారు. మద్దతుదారులను పోలీ సులు లోపలకు వెళ్లనివ్వకపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి వారిని కలుసుకుని ముచ్చటించి వెళ్లిపోయారు. నేనొక్కడినే... మొదట చింతామణి నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ జేడీఎస్‌లో రెడ్డి సామాజిక వర్గం నుండి గెలిచింది తానొక్కడినే అన్నారు. అందులోనూ చిక్కబళ్లాపురం జిల్లాలో కూడా జేడీఎస్ పార్టీ తరఫున గెలిచింది కూడా తానేనన్నారు. అందువల్ల రెండవసారి గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పేం లేదన్నారు. బీజేపీ నాకూ గాలం వేసింది దేవనహళ్లి ఎమ్మెల్యే నిసర్గ నారాయణస్వామి బీజేపీ వారు తనకు కూడా ఫోన్ చేసి గాలం వేశారని, అయితే కాల్ రికార్డు చేయడం తెలియకపోవడం వల్ల వారి పేర్లు చెప్పలేకపోతున్నానన్నారు. తాను మంత్రి పదవికి అర్హుడేనని, రేస్‌లో ఉన్నానని చెప్పారు. మధ్యాహ్నం రిసార్టుకు చేరుకున్న ఎమ్మెల్సీ శరవణ మాట్లాడుతూ కుమారస్వామి సీఎం అవుతారని తాను రెండు నెలల క్రితమే చెప్పానని, అప్పుడే తాను స్వీట్లు కూడా పంచానన్నారు. రాష్ట్రంలోపర్యటించి పార్టీ గెలుపునకి కృషి చేశానని, తనకు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమన్నారు. ప్రమాణోత్సవం తరువాత మళ్లీ రిసార్టుకు మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే బండెప్ప కాశప్పనవర్ బుధవారంనాడు కుమారస్వామి ప్రమాణోత్సవానికి జేడీఎస్ ఎమ్మెల్యేలు అందరూ వెళ్తామన్నారు. కార్యక్రమం ముగిశాక తిరిగి రరిసార్టుకు వస్తామన్నారు. గురువారం అసెంబ్లీలో బలనిరూపణ తరువాత ఎమ్మెల్యేలు అందరూ వారివారి నియోజకవర్గాలకు వెళ్తామన్నారు. బుధవారంనాడు ఏ జేడీఎస్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని తెలిపారు. ఎమ్మెల్యేలతో నిఖిల్‌గౌడ భేటీ ఇలా ఉండగా సోమవారం రాత్రి 9 గంటలకు రిసార్టుకు విచ్చేసిన కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ రాత్రి రెండు గంటల వరకూ ఎమ్మెల్యేలతో చర్చించారు. కుమారస్వామి బిజీగా ఉండి రాలేకపోయినందున తాను వచ్చానని మీ విన్నపాలు డిమాండ్లు ఏమున్నా నిరభ్యరంతంగా తనకు చెప్పుకోవాలని,తాను కుమారస్వామికి చేరవేస్తానని ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు కూడా తమతమ విన్నపాలు నిఖిల్‌కు విన్నవించుకున్నట్టు సమాచారం. -
‘పశ్చిమ’లో అసంతృప్త రాగం
* పదవుల్లో ప్రాధాన్యం లేదని టీడీపీ నేతల విమర్శ ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా ఈ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీతో కలిసి జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి రావడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కీలకమయ్యాయనేది కాదనలేని వాస్తవం. దీంతో టీడీపీ శ్రేణులు తమ పంట పండినట్టేనని భావించారు. మంత్రి పదవుల్లోను, ప్రభుత్వ పోస్టుల్లోను తవుకు కీలకశాఖలు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ ఆశించిన వారిని అందలమెక్కించని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహారశైలితో జిల్లా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి రాగం మొదలవుతోంది. జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయించినా శాఖల కేటాయింపు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. చింతలపూడి ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పీతల సుజాత మంత్రి పదవి ఇచ్చి గనులు, భూగర్భ, స్త్రీ శిశుసంక్షేమశాఖలు కట్టబెట్టినా మిత్రపక్ష బీజేపీ తరఫున తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావుకు ఎవరూ తీసుకోవడానికి ముందుకురాని దేవాదాయశాఖను అప్పగించారు. బీజేపీకి ఇచ్చిన పదవిని మినహాయిస్తే తమకు ఒకే మంత్రి పదవితో సరిపుచ్చడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీకి మొదటి నుంచి కొమ్ముకాస్తున్న సామాజికవర్గానికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తాజాగా ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టి సహాయమంత్రి హోదా ఇచ్చారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం శాసనసభ వ్యవహారాలకే పరిమితమయ్యే విప్ పదవిని కట్టబెట్టడంపైన కూడా టీడీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. సామాజికవర్గాల సమతూకంలో మరో రెండు వర్గాలకు పదవులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. డెల్టా ప్రాంతంలో ఈసారి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బలమైన రెండు సామాజిక వర్గాలకు ఏం పదవులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఆచంట ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పోలవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు తొలివిడతలో అవకాశం రాకపోవడంతో ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు. కీలక శాఖలన్నీ పొరుగు జిల్లాలకే జిల్లా మొత్తం స్వీప్ చేసినా పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు పదవుల పంపకంలో సరైన ప్రాధాన్యత రాలేదన్న వాదనలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పొరుగు జిల్లా నేతలకు వచ్చిన పదవులతో పోల్చిచూస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈ వాదనలను ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లకు గాను 14 సీట్లు గెలిచిన టీడీపీ నేతలకు పదవుల పంపకంలో అగ్రతాంబూలం లభించింది. ఆ జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవితో కీలకమైన హోంశాఖ, ఎమ్మెల్సీ కోటాలో యనమల రామకృష్ణుకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ అప్పగించారు. ఇటు కృష్ణాజిల్లా చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలకమైన భారీ, మధ్యతరహా నీటిపారుదలశాఖ, కొల్లు రవీంద్రకు ఎక్సైజ్‌శాఖ కట్టబెట్టారు. అదే జిల్లా నుంచి బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్‌ను వైద్య ఆరోగ్యశాఖ వరించింది. అంతెందుకు.. 17 నియోజకవర్గాల్లో 12 గెలిచిన గుంటూరు జిల్లానూ కీలక పదవులు వరించాయి. ఆ జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యవసాయశాఖ, రావెల కిషోర్‌బాబుకు సాంఘికసంక్షేమ శాఖ ఇవ్వగా, ఏకంగా అత్యున్నతమైన స్పీకర్ పదవిని కూడా ఆ జిల్లాకే చెందిన కోడెల శివప్రసాదరావుకు అప్పగించారు. పొరుగు జిల్లాలకు వెల్లువలా పదవుల పంపకం చేస్తున్న టీడీపీ అధినాయకత్వం ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడంపై పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. -
బండారు భగభగ
మంత్రి పదవి దక్కక మనస్తాపం టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా అయ్యన్నకు అందలంపై గుర్రు సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో మంత్రి పదవుల సెగ రాజుకుంది. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబికింది. తొలి పందేరంలో తనకు స్థానం దక్కకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రాజీనా మా చేశారు. ఆదివారం రాత్రి గుంటూరులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఆయన తనకు మంత్రివర్గంలో చోటివ్వక పోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు. సోమవారం హుటాహుటీన అనుచరులతో సమావేశమై ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌లో తన రాజీనామా పంపారు. తనకు 18 వేల ఓట్ల మె జార్టీ వస్తే, అయ్యన్నకు రెండు వేల ఓట్ల ఆధిక్యతే వచ్చిందని, అయ్యన్నతో పోల్చితే వివాద రహితుడినైన తనకు బాబు మొండిచేయి చూపారంటూ ఆవేదనకు గురయినట్టు తెలిసింది. ఇటీవల పార్టీలో చేరిన గంటా కు మంత్రి పదవి ఎలా ఇస్తారని బండారు ప్రశ్నిస్తున్నారు. చాన్నాళ్ల నుంచి అయ్యన్న, బండారుల మధ్య అసలు పొసగడం లేదు. అయ్యన్న జిల్లాలో పార్టీపై పెత్తనం చేస్తున్నారనే నెపంతో ఆయనకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకున్నారన్న వాదన ఉంది. బండారు ప్రయత్నాలతో గంటా పార్టీలో చేరడం అయ్యన్నకు రుచించలేదు. దీంతో చంద్రబాబు సమక్షంలోనే గంటాపై విమర్శలు చేసి తన వైఖరిని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో అయ్యన్నపై చంద్రబాబు గుర్రుగా ఉన్నందున ఆయనకు బదులు తనకు మంత్రి పదవి వస్తుందని బండారు అంచనా వేశారు. కానీ బాబు అయ్యన్న వైపే మొగ్గు చూపడంతో బండారుకు ఆశనిపాతమైంది. మంత్రి పదవి ఇవ్వకపోయినా వచ్చేసారైనా అవకాశం ఇస్తామన్న హామీ కూడా దక్కకపోవడం బండారు మనస్తాపానికి కారణంగా చెబుతున్నారు. అయితే బండారుకు వుడా ఛైర్మన్ పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. దీనిపై బండారుతో ‘సాక్షి’ మాట్లాడగా, తనకు వుడా ఛైర్మన్ పదవి వద్దని చెప్పారు. బండారు అలకను పార్టీ అధిష్ఠానం పట్టించుకుంటుందో లేదో చూడాలి. -
అమాత్య రేసులో ఇద్దరు సాను‘కుల’మయ్యేనా !
మంత్రి పదవుల ఆశావహులకు సామాజిక వర్గం గుబులు పట్టుకుంది. సీనియారిటీ ఉన్నా సామాజిక వర్గ సమీకరణాలతో తమకు మంత్రి పదవులు దక్కుతాయా అన్న టెన్షన్ వారిలో మొదలైంది. దీంతో రాజధానికి పరుగులు తీస్తున్నారు. లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు. అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లాకు రెండు పదవులు వస్తాయా? ఒకటితో సరిపెడతారా? మొండి చేయి చూపిస్తారా అన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తే కాపు సామాజిక వర్గం నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామి, వెలమ సామాజిక వర్గం నుంచి రెండో పర్యాయం ఎన్నికైన కోళ్ల లలితకుమారి మంత్రి పదవుల రేసులో ముందు వరుసలో ఉన్నారు. పతివాడతో పోల్చితే లలితకుమారి సీనియారిటీ తక్కువగా ఉన్నా తాత కోళ్ల అప్పలనాయుడు పార్టీకి అందించిన సేవలే ఆమెను ముందు వరుసలోకి తెచ్చి పెట్టాయి. జిల్లాలో ఎన్నికైన మిగతా ఎమ్మెల్యేలు అమాత్య పదవులు ఆశిస్తున్నా వారికంత సీన్ లేదనే వాదన ఉంది. పతివాడ, కోళ్లను కూడా పీడిస్తున్న భయం.. అయితే, ఇప్పుడు పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారిలకు కూడా భయం పట్టుకుంది. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల సామాజికవర్గ సమీకరణాలే కారణంగా తెలుస్తోంది. పక్క జిల్లా అయిన శ్రీకాకుళంలో కాపు సామాజిక వర్గం నుంచి కిమిడి కళా వెంకటరావు, వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రధానంగా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అందుకు తగ్గ లాబీయింగ్ చేసుకుంటున్నారు. సీనియారిటీ ఉండడంతో పాటు కాపు సామాజిక వర్గ పెద్ద నేతగా కళా వెంకటరావు చెలామణి అవుతున్నారు. ఇక, అచ్చెన్నాయుడు విషయానికొస్తే తన అన్న, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడికి పార్టీలో ఉన్న ప్రాధాన్యం మేరకు ప్రతిపాదిత జాబితాలోకి వచ్చారు. ఈ ఇద్దరే కాకుం డా ఆ జిల్లాలో గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా పదవి ఆశిస్తున్నారు. మరో పొరుగు జిల్లా అయిన విశాఖలో కూడా అదే సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి గంటా శ్రీనివాసరావు, వెలమ సామాజిక వర్గం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి రేసులో ఉన్నారు. అందుకు తగ్గ పైరవీలు చేసుకుంటున్నారు. పార్టీ కీలక నేతల ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి. ఈ విధంగా అటు శ్రీకాకుళంలో కిమిడి, కింజరాపునకు, ఇటు విశాఖ నుంచి గంటా, చింతకాయల, బండారులను మంత్రి వర్గంలోకి తీసుకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన విజయనగరం జిల్లా నేతలు పతి వాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారిలను పరిగణనలోకి తీసుకుంటారా అన్నసందేహం నెలకొంది. పొరుగు జిల్లా నేతలకు ఉన్న పలుకుబడి, ఆర్థిక బలం, లాబీయింగ్ వీరికి లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లా నేతలతో పోటీపడి పతివాడ, కోళ్ల ముందుకు రాగలరా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల సమీకరణాలను పక్క న పెట్టి జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయిస్తే రేసులో ఉన్న ప్రధాన నేతలిద్దరికీ దక్కనున్నాయి. ఒకవేళ జిల్లాకు ఒకటే కేటాయిస్తే అది ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి పదవులు ఖాయమనుకుంటున్న పతివాడ, కోళ్లకు టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజధానికి పరుగులు తీస్తున్నారు. అధినేత చుట్టూ తిరుగుతున్నారు. ఆయన దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కోటరీ నాయకులతో లాబీయింగ్ చేస్తున్నారు. చివరికి అమాత్య యోగం ఇద్దరినీ వరిస్తుం దా లేదంటే ఒక్కరికే దక్కుతుందా అనేది చూడాలి. -
ఒక్క చాన్స్ ప్లీజ్
మంత్రి పదవి కోసం కేసీఆర్‌పై ఒత్తిడి తెలంగాణకూ ఇద్దరు డిప్యూటీ సీఎంలు? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కోసం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి విజ్ఞాపనలు, ఒత్తిళ్ల తాకిడి నానాటికీ పెరుగుతోంది. 63 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 50 మంది దాకా బెర్తు కోసం ఆశపడుతున్నారు. పలువురు ఎమ్మెల్సీలతో పాటు ఏ సభలోనూ లేని కొందరు సీనియర్లు కూడా తమకు పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిదని రోజూ కేసీఆర్‌తో పాటు ఆయనపై ప్రభావం చూపగలిగే హరీశ్‌రావు, కేటీఆర్ తదితరులను కూడా కలుస్తున్నారు. పార్టీకి చేసిన సేవ, సాధిం చిన మెజారిటీ తదితరాలను ఏకరువు పెడుతున్నారు. అయితే మంత్రివర్గ కూర్పుపై ఫలితాలకు ముందే కేసీఆర్ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. జిల్లాలు, సామాజికవర్గం, శాఖలతో సహా కేబినెట్‌పై స్పష్టతకోసం ఫామ్ హౌస్‌లోనే సన్నిహితులతో చర్చలు జరిపారు. వరంగల్‌లో తీవ్ర పోటీ: ఆశావహుల జాబితా వరంగల్‌లో భారీగా ఉంది. ఈ జిల్లా విషయంలో కేసీఆర్ కూడా కొంత ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుండి పని చేస్తుండటం, సీనియారిటీ, విధేయతపరంగా చూస్తే జిల్లాలో అర్హులు ఎక్కువేనని ఆయన భావిస్తున్నారు. ఆవిర్భావం నుంచీ పని చేస్తున్న ఎస్.మధుసూదనాచారి భూపాలపల్లి నుండి గెలిచారు. మంత్రిగా, ఎంపీగా పని చేసిన ఎ.చందూలాల్ ములుగు నుంచి గెలిచారు. రాజీనామా చేసిన ప్రతీసారి గెలుస్తూ, పార్టీకి విధేయునిగా ఉండే దాస్యం వినయ్‌భాస్కర్ వరంగల్ పశ్చిమ నుండి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా దానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన డాక్టర్ టి.రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు నుండి గెలిచిన కొండా సురేఖ కూడా ఆశావహుల జాబి తాలో ఉన్నారు. కేసీఆర్ సన్నిహితుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నుంచి గెలి చారు. ఇలా జిల్లాలో కనీసం ఆరుగురు ముఖ్యులు పోటీపడుతున్నారు. కానీ ఇద్దరికి మించి ఇచ్చే పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలూ టీఆర్ఎస్ వారే. రాజకీయాల్లో కేసీఆర్ సమకాలికుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బెర్తు ఖాయమే. ఏనుగు రవీందర్ రెడ్డి, గంపా గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి సీనియర్లూ పోటీలో ఉన్నారు. కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్‌లకు చోటు దక్కనుంది. మిగతా ఎమ్మెల్యేలూ ఆశ పడుతున్నా కేసీఆర్‌ను అడగలేని పరిస్థితి! తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకం కానున్న పారిశ్రామికాభివృద్ధి, ఐటీ విస్తరణ తదితరాల్లో కేటీఆర్ సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు, ఐటీ ముఖ్యుల నుంచి కేసీఆర్‌కు ఇలాంటి సూచనలు అందినట్టు తెలిసింది. తెలంగాణకూ ఇద్దరు డిప్యూటీలు?: ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశముంది. ముస్లిం మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ ఇప్పటికే కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. తెలంగాణకు దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న హామీని నిలుపుకోలేదన్న విమర్శలను తగ్గించుకోవడానికి ఆ వర్గానికి రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని యోచి స్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సీనియర్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఈశ్వర్, రాజయ్యల్లో ఒకరికి అవకాశమివ్వాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
పదవులు కోసమే రాజీనామాలు చేయలేదు: బొత్స
హైదరాబాద్: తనతోపాటు మిగిలినవారందరూ పదవులు కాపాడుకునేందుకే రాజీనామాలు చేయలేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించారు. అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి వేరువిధంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు డిసెంబరు మొదటి వారంలో శాసనసభకు వస్తుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీని సమావేశపరచడానికి ప్రోరోగ్ సమస్యకాదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌లో అందరూ అర్హులేనన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కొందరు కాంగ్రెస్‌ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారన్నారు.