Mirwaiz Umar Farooq
-
మోదీది హిందూ అజెండా!?
సాక్షి, శ్రీనగర్ : దేశంలోకి ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను అనుమతించకపోవడంపై హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మాన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని మతరాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ట్విటర్ వేదికగా హురియత్ నేత కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు చాలా కాలంగా ఇస్లామింగ్ బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇస్లామ్ చట్టాల ప్రకారం విధులు నిర్వహించే ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. -
గంభీర్ ఎందుకలా అన్నాడు?
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన దేశాభిమాన్ని మరోసారి బయటపెట్టాడు. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్‌కు ఘాటైన సమాధానం ఇచ్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలిచినందుకు సంబరాలు చేసుకోవాలంటూ మిర్వాయిజ్ ఇచ్చిన పిలుపుకు దీటుగా స్పందించాడు. పాకిస్తాన్‌కు వెళ్లి వేడుకలు చేసుకోవాలని చురక అంటించాడు. ‘అంతటా టపాసులు కాల్చండి. ఈద్ పండుగ ముందుగానే వచ్చింది. ఉత్తమ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ టీమ్‌కు అభినందనలు’ అంటూ మిర్వాయిజ్ ట్వీట్ చేశారు. దీనికి గంభీర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘మిర్వాయిజ్ మీరు ఎందుకు సరిహద్దు దాటి వెళ్లకూడదు? చైనా బాంణాసంచా అయితే పేల్చడానికి బాగుంటుంది. రంజాన్ అక్కడ సెలబ్రేట్ చేసుకోండి. ప్యాకింగ్‌లో నేను మీకు సహాయం చేస్తాన’ని ట్వీట్ చేశాడు. గంభీర్ స్పందనపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టును మిర్వాయిజ్ అభినందించగడం ఇదే మొదటిసారి కాదు. చాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్ గెలిచినప్పుడు కూడా ఇదేవిధంగా ఆయన స్పందించారు. ఫైనల్లో భారత్‌పై పాక్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.