MLA Amjad Basha
-
ముస్లింల ద్రోహి చంద్రబాబు
సాక్షి కడప: నాలుగేళ్ల తర్వాత కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు రాలేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీ కూడా ముస్లింలకు కేంద్రంలో మంత్రి పదవి కేటాయించగా ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించలేదు.. ముస్లిం మైనార్టీల ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోవడం తథ్యమన్నారు. కేవలం ఎన్నికలకు ముందు ముస్లిం మైనార్టీలకు ఏదో చేస్తున్నట్లు ఊదరగొట్టి మరోమారు ఓట్ల కోసం మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని.. మంగళవారం రాత్రి ‘సాక్షి’ టీవీ ఫోర్త్ ఎస్టేట్ లైవ్ షోలో ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ గుంటూరులో నారా హమారా.. టీడీపీ హమారా అంటూ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని కేవలం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలోనే ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి 200 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చేలా చేసిన నాయకుడు వైఎస్సార్ మాత్రమేనని, ఆయనను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబును ఎవరూ నమ్మరని ఆయన విమర్శించారు. భారతదేశంలోనే అవినీతిలో ప్రత్యేక ముద్ర తెచ్చుకుని నంబర్ వన్ స్థానంలో ఉన్న చంద్రబాబుకే అవినీతి సామ్రాట్ బిరుదు ఉందని.. ఆ అవినీతి పుత్రుడు లోకేష్‌బాబు అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ‘సారే ఆంధ్ర ముసల్మాన్ కా ఏక్ హి... వైఎస్సార్ హమారే’ అనేది ముస్లింల నినాదమని టీడీపీ పాలకులు తెలుసుకోవాలన్నారు. వంద మంది చంద్రబాబులు వచ్చినా జగన్ సీఎం కావడం తథ్యం పట్నంబజారు (గుంటూరు): వంద మంది చంద్రబాబులు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ఎం రెహమాన్ స్పష్టం చేశారు. గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని నిఘా వర్గాల ద్వారా తెలిసి, మైనారిటీ వర్గాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వి.ఖాదర్ బాషా, ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు టోపీలు పెట్టి ముస్లింలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారని చెప్పే ప్రయత్నాలను చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం హమారా... ప్రజల డబ్బు దుబారా: ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజవకర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నిర్వహిస్తోంది టీడీపీ హమారా.. నారా హమారా కాదని, అధికారం హమారా.. ప్రజల డబ్బు దుబారా అని విమర్శించారు. సమావేశంలో పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్ అహ్మద్, మైనారిటీ విభాగం గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని, సయ్యద్ మాబు తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో ఇఫ్తార్.. హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
కువైట్ : కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్ భారత అంబాసిడర్ అయిన హెచ్.ఇ.కే. జీవసాగర్‌ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్‌లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్‌తో మాట్లాడుతూ.. కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్‌లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు. మహిళలు భారత్ నుంచి కువైట్‌కు రావాలంటే స్పాన్సర్ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్‌ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్ గ హౌస్ మెయిడ్ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అంబాసిడర్‌ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. -
విమర్శించేందుకు టీడీపీకి సిగ్గు ఉండాలి..
సాక్షి, వైఎస్సార్ కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఏపీకి ప్రతేక హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను.. రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నికలకు రావానలి టీడీపీ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి.. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం దారుణం అన్నారు. -
రాష్ట్రానికి బాబు వెన్నుపోటు పొడిచారు
-
ఆయనకు తల్లికి, చెల్లికి తేడా తెలియనట్లుంది
సాక్షి, కడప : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్‌కు తల్లికి, చెల్లికి తేడా తెలియనట్లుందని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (శుక్రవారం) విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రను మంత్రి ముద్దుల యాత్రగా అభివర్ణించడంపై విరుచుకుపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బీరును హెల్త్ డ్రింక్‌గా వర్ణించిన మంత్రి నుంచి ఇంతకంటే మాటలు ఊహించలేమన్నారు. ఇలాంటి వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం మినహా ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు అర్జీలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అనారోగ్య, అవినీతి, స్కాములు, క్షుద్ర, తాంత్రిక, సెక్స్ కాల్‌మనీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తూర్పారబట్టారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే సీఎం చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. 16 మాసాలుగా ఒక రాష్ట్ర సీఎంకు ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే కారణం అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమించాలి
కడప వైఎస్సార్ సర్కిల్ : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రజా ఉద్యమంలా పోరాటం సాగించాలని ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాషా పేర్కొన్నారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక రా.రా. గ్రంథాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పొందుపరిచి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాల్సిందిపోయి తనకేమి పట్టనట్లు వ్యవహారించడం తగదన్నారు. రాయలసీమలో నిరుద్యోగం తాండవించి, వలసలు వెళుతుంటే వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రంతో పోరాడాల్సిందిపోయి కేంద్ర పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ఎలాంటి అభివృద్ది నిధులు కేటాయించకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తకపోవడం సహించరాని విషయమన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి రెండున్న సంవత్సరాలు దాటుతున్నా ఎటువంటి అభివృద్దిగానీ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన పాపాన పోలేదన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, పారిశ్రామికంగా అభివృద్ది జరగాలంటే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరి అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడానికి సిద్దం కావాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు న్యాయవాదులు తమవంతు మద్దతుగా ఆందోళనలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ మాట్లాడుతూ సీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడుతూ వెఎస్సార్ జిల్లా అన్ని విధాలా వెనుకబడి ఉందన్నారు.ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షులు సంగటి మనోహర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, సీపీఎం కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు పి.అంకుశం, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేశు, పీడీఎస్‌యూ నాయకులు నాగేంద్ర పాల్గొన్నారు. -
‘అనుమతులే లేవు.. 1.93 లక్షల ఇళ్లా?’
సాక్షి, హైదరాబాద్: ‘ఓవైపు ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులే ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వం 1.93 లక్షల ఇళ్లు ఇచ్చేశాం అని చెబుతోంది. దీనిపై స్పష్టతనివ్వాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు సైట్ స్పెసిఫికేషన్స్ (ఇంటికి సంబంధించిన నిబంధనలు) తీవ్ర ప్రతిబంధకాలుగా ఉన్నాయని, దీనికారణంగా 60 గజాలు, 80 గజాలు స్థలాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు కాకుండా పోతున్నాయన్నారు. బ్యాంకుల్లో సెక్యూరిటీ అడుగుతున్నారు: అంజాద్‌బాషా లక్షా తొంభైమూడు వేల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్నారు...అవి ఎక్కడ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మంత్రిని సూటిగా ప్రశ్నించారు. లోన్లకోసం బ్యాంకులకు వెళితే బ్యాంకర్లు సెక్యూరిటీ లేనిదే ఇవ్వలేమని కరాఖండీగా చెబుతున్నారని, లబ్ధిదారులు రూ.50 వేలు బ్యాంకు డిపాజిట్ చేయగలరా అని ప్రశ్నించారు.