the movement
-
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
ప్రొద్దుటూరు క్రైం: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ, జమ్మలమడుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లాలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఉద్యమం చేసే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాల్సిన అవసరం ఉందన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళితే బాగుంటుందని చెప్పారు. ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి.భాస్కర్‌రావు మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో నిర్మాణాలు మొదలు పెడితే తర్వాత ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం ఉండదని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. పులివెందుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కరుణాకర్, ఇవి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దసరా అయిపోయిన వెంటనే సీఎంను కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బార్ అసోసియేషన్ నాయకులు ముక్తకంఠంతో నినదించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ముడిమెల కొండారెడ్డి, గొర్రె శ్రీనివాసులు, జిలాని బాషా, దాదాపీర్, మల్లేల లక్ష్మీప్రసన్న, ఓబులేసు, కమలాపురం, మైదుకూరు బార్ అసోసియేషన్ల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఇస్మాయిల్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం
సెప్టెంబర్ 2న పెద్ద ఎత్తున సమ్మె సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య వరంగల్ అర్బన్ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అవలంభిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తుందని అ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య తెలిపారు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం అవరణంలోని ప్లానిటోరియంలో శనివారం సీఐటీయూ నగర కమిటీ సమావేశం ఇనుముల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చుక్కయ్య మాట్లాడుతూ రెండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారం తగ్గినా, మన దేశంలో డీజిల్, పెట్రోల్ రేట్లకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడడం లేదన్నారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్డీఏ విధానాలపై సెప్టెంబర్ 2న సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. అదేరోజు ఆటో కార్మికులు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నగర కమిటీ సభ్యులు ఎం.డీ.మహూబూబ్ పాషా, కాడబోయిన లింగయ్య, జన్ను ప్రకాశ్, పి.విష్ణువర్థన్, వి.నాగేశ్వర్రావు, సాంబయ్య, ముక్కెర రామస్వామి, పాశం రవి, జి.మహేష్, తోట్టే అశోక్, రాజబోయిన రాజు, సంపత్, డి.రమేష్, సాంబయ్య, విజేందర్, ఉప్పలయ్య, యాకుబ్ పాల్గొన్నారు. -
ఉద్యమానికి ఐలమ్మే స్ఫూర్తి
సమరశీలత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.. యువతకు ఉపాధి కల్పిస్తేనే అభివృద్ధి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సభలో ప్రొఫెసర్ కోదండరాం సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘తెలంగాణ పోరాట పటిమకు గుర్తు.. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం వీరోచితంగా పోరాడి.. జైలుకెళ్లడం.. దొరల గూండాలను ఎదిరించి.. తన భూమిని కాపాడుకున్న ధీరవనిత చాకలి ఐలమ్మ’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కీర్తించారు. ఖమ్మంలోని ధర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయనతోపాటు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ సోమవారం ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐలమ్మ విగ్రహావిష్కరణ, వర్థంతి సభకు తెలంగాణ బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి అధ్యక్షత వహించగా.. కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా సామాజిక ఉద్యమాలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.. చాకలి ఐలమ్మ సమరశీలత్వాన్ని ఆదర్శంగా తీసుకుని కొనసాగిందన్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు చేయూతనివ్వాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి దిశలో నడుస్తుందని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం కష్టమైన పనికాదని, ప్రణాళికతో ముందుకెళితే ఇది సాధ్యమేనన్నారు. ప్రజలకు అండగా.. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో జిల్లా జేఏసీ నాయకులు విస్తృతంగా పోరాటం చేసి.. ఉద్యమ జెండాను రెపరెపలాడించారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. దళితులకు రాజ్యాధికారం దక్కితేనే స్వాతంత్య్ర ఫలాలు దక్కుతాయని అంబేడ్కర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో దళితులకు 25 శాతం ఉచిత విద్యను అందించాలని చెప్పిన ప్రభుత్వ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఇచ్చిన జీఓలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఎందుకు అడ్డొస్తాయని ప్రశ్నించారు. ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఎన్నో అవాంతరాలు కల్పించారని, అయినా వీటిని ఎదుర్కొని విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ.. వారి కోసం అమలు చేయాల్సిన పథకాలను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ప్రొఫెసర్లు ఐ.తిరుమలి, కనకాచారి, బీవీ.రాఘవులు, సామాజిక వేత్త ఉ.సాంబశివరావు, చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచందర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, బీసీ ఫ్రంట్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కేవీ.కృష్ణారావు, డాక్టర్ ఎస్.పాపారావు, రచయిత జ్వలిత, పలు సంఘాల నేతలు చిలకల వెంకటనర్సయ్య, లింగాల రవికుమార్, జె.విశ్వ, సుంకర శ్రీనివాస్, భద్రునాయక్, వినయ్‌కుమార్, లాల్‌జాన్‌పాషా, వరలక్ష్మి, దుంపటి నగేష్, వెంపటి నాగేశ్వరరావు నాయుడు, కె.నర్సయ్య, షేక్ షకీనా, తిప్పట్ల నర్సింహారావు, పొదిల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆ నేడు 8 సెప్టెంబర్ 1978
బ్లాక్ ఫ్రైడే తమ పాలకుడు రెజా షాకు వ్యతిరేకంగా ఇరాన్లో ప్రజల ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చింది. అగ్రరాజ్యం అమెరికా అండదండలు ఉన్న తనను ఉద్యమాలేవీ చేయలేవని షా గట్టిగా నమ్మాడు. మరోవైపు... ప్రజా ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతం అవుతోంది. బంద్‌లు, ధర్నాలతో ఇరాన్ అట్టుడికి పోతోంది. తిరుగుబాటు కారణాలలో షా అనుసరిస్తున్న ‘పాశ్చాత్యీకరణ’ పోకడలు, అణచివేత స్వభావం, అవినీతి, అస్తవ్యస్త పాలన...మొదలైనవి కీలక పాత్ర వహించాయి. టెహ్రన్లోని జలెహ్ స్క్వేర్ దగ్గర వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. ప్రభుత్వం విధించిన మార్షల్ లా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఒకవైపు హెచ్చరిస్తూనే మరోవైపు నిరసనకారులపై కాల్పులు జరిపారు సైనికులు. అధికారిక లెక్కల ప్రకారం 88 మంది ఆ కాల్పుల్లో చనిపోయారు. 88 కాదు వేలాది మంది చనిపోయారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇరాన్ చరిత్రలో రక్తపు మరకగా నిలిచిన ఈ హత్యాకాండకు ‘బ్లాక్‌ఫ్రైడే’గా పేరుబడి... ఇరాన్ విప్లవం తారస్థాయికి చేరేలా, షా దేశం విడిచి ప్రవాసం వెళ్లేలా చేసింది. -
'బాబును A1 ముద్దాయిగా చేర్చాలి'
-
మంచిని పెంచడమే విశ్వాసుల కర్తవ్యం
ఇస్లాం వెలుగు స్వీయ సంస్కరణతో పాటు, సమాజ సంస్కరణ బాధ్యత కూడా దైవ విశ్వాసులపై ఉంది. నైతిక, మానవీయ విలువలతో కూడిన సుందర సత్సమాజ నిర్మాణం కోసమే విశ్వాసులను ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. సమాజంలో ఏ విధమైన దుష్కార్యాలు, దుర్మార్గాలు జరగకుండా చూడడం; మంచిని, సత్కార్యాలను పెంపొందించడం విశ్వాసుల విధి. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. ‘‘విశ్వసించిన ప్రజలారా! ఇక నుంచి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ, వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడులనుండి వారిస్తారు’’ (3-110). అంటే సమాజంలో మంచిని వ్యాపింపజేయడం, చెడులను నిరోధించడం దైవ విశ్వాసుల విద్యుక్త ధర్మమన్నమాట. సమాజంలో దుర్మార్గాలు ప్రబలిపోతూ ఉంటే చూస్తూ కూర్చోవడం విశ్వాసుల లక్షణం ఎంతమాత్రం కాదు. చెడులకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా శక్తి మేరకు పోరాడాలి. చెడులు అంతమయ్యే వరకు పోరాటం ఆపరాదు. అందరూ కలసి సంఘటిత ఉద్యమం ద్వారా వీటి నిర్మూలనకు కృషి చేయాలి. అదే సమయంలో మంచి పనుల వైపునకు ప్రజలను ప్రోత్సహించాలి. సత్కార్యాల వల్ల ఒనగూడే ప్రయోజనాలను వారికి వివరించాలి. దుష్కార్యాల పర్యవసానాన్ని ఎరుక పరుచుకోవాలి. ఇహ పర లోకాల్లో ఎదురయ్యే పరాభవాల పట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాలి. దైవ విశ్వాసం, పరలోకం, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటే, అంతగా విశ్వాసుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. - మహ్మద్ ఉస్మాన్‌ఖాన్