లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో
ధర్మారం (కరీంనగర్ జిల్లా) : ధర్మారం ఎమ్మార్వో కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఎమ్మార్వో రమేశ్ కుమార్.. ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి దుంగతుర్తి వీఆర్వో శ్రీనివాస్‌ను లంచం డిమాండ్ చేశారు. వీఆర్వో నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.