Mughal Empire
-
‘తాజ్‌మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్‌మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‌ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్‌మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్‌ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్‌తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..
దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని హీరామండి గురించిన ఆసక్తికర విషయాలు... ఇది లాహోర్‌లో ఉంది. హీరామండి (డైమండ్ మార్కెట్) చాలా మంది వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ఇక్కడ స్త్రీలు పేదరికం కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి వేశ్యా వృత్తి తమ జీవనశైలిగా బతుకుతున్నారు. ఇది ఎందుకిలా మార్చబడిందో తెలుసుకోవాలంటే చరిత్రపుటల్లోకి తొంగిచూడాల్సిందే.. మిగతానగరాలు ఆధునీకరించబడినప్పటికీ ఈ నగరం మాత్రం చారిత్రక అవశేషంగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకుందాం.. ఆ మార్కెట్ స్థాపకుడు ఇతడే.. సిక్కుల మహారాజైన రంజిత్ సింగ్ మంత్రి అయిన హీరా సింగ్ పేరు మీదనే దీనికా పేరు వచ్చింది. హీరా సింగ్ అక్కడ ఓ ధాన్యం మార్కెట్‌ను స్థాపించాడు. అంతేకాకుండా తరచుగా తవైఫ్ (నర్తకి) లను కూడా ఆ మార్కెట్ తీసుకొచ్చేవాడు. సిక్కు రాజైన రంజిత్ సింగ్ ఆ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. దీనికి షాహి మొహల్లా అని కూడా పేరుంది. లాహోర్ కోట పక్కనే ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది. మొగల్ రాజుల కాలంలో... మొగలుల సామ్రాజ్యంలో లాహోర్ కూడా ఒక భాగమే. దీని ఇతర నగరాల్లో హీరామండి ఒకటి. వీరికాలంలో ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల నుంచి అందమైన మహిళలను (వేశ్యలు) ఇక్కడికి తీసుకొచ్చేవారు. వారికి ముజ్రాస్ అనే సంప్రదాయ నృత్యాన్ని కఠిన శిక్షణతో నేర్పేవారు (ఆ కాలంలో డాన్స్, సంగీతం, లలిత కళలు, పెయింటింగ్‌లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి). వీరితో ధనవంతులు కచేరీలు నిర్వహించేవారు. తర్వాత కాలంలో భారతదేశం నుంచి కూడా మహిళలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. వీరు మొగల్ రాజుల ముందు శాస్త్రీయ నృత్యం చేసేవారు. తర్వాత కాలంలో ఈ నృత్యం కుటుంబ సంప్రదాయంగా మారింది. చివరికి మొగలుల వైభవం మసకబారసాగింది. విదేశీ దండయాత్రల కాలంలో రాజ భవనంలో ప్రత్యేకంగా నిర్మించిన తవైఫ్ఖానా ధ్వంసమైపోయింది. కాలక్రమేణా నృత్యకారిణుల ప్రతిష్ట దెబ్బతిని వేశ్యలుగా మారారు. క్రమంగా ఇది వేశ్యా కూపంగా మారింది. ఇప్పుడు అక్కడ నపుంసకులు నృత్యం చేస్తున్నారు. ప్రస్తుతం తవైఫ్ అనేపదం వేశ్యకు పర్యాయపదంగా అక్కడ వాడబడుతుంది. రెండు రకాలైన జీవనశైలి వాస్తవానికి ఇక్కడ రెండు రకాలైన జీవనశైలి కలిగిన స్త్రీలు నివసిస్తున్నారు. నిజానికి రాత్రిళ్లు 11 నుంచి1 గంటల మధ్య సమయంలో ఈ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. తమ కష్టమర్లు వెళ్లిపోగానే మామూలు మహిళల్లానే వారిళ్లకు చేరుకుంటారు. ముజ్రా నృత్యం చేసేవారు సాధారణంగా ఈ రొంపిలోకి దిగరు. వీరు తమ వృత్తి పట్ల నిబద్థత, అంకిత భావం, గౌరవం ప్రదర్శిస్తున్నారు. తాము ముజ్రా నృత్యకారినులని గర్వంగా చెప్పుకొంటారు కూడా. ఇక మరొక రకం కేవలం రూ. 200 నుంచి 400 లకు వేశ్యా వృత్తిని జీవనోపాధిగా బతికేవారు. ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ వాస్తవం మాత్రం ఇది. ఎందుకంటే వీరి అజ్ఞానం, నిరక్ష్యరాస్యత అక్కడి పురుషుల విలాసానికి ప్రతీకగా ఎంచబడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. ఈ కథనం ఆధారంగా.. పగలంతా ఈ ప్రదేశం మామూలు మార్కెట్లా కనిపిస్తుంది. కానీ చీకటైతే మాత్రం రెడ్‌లైట్ ఏరియాగా మారిపోతుంది. కళంక్ సినిమాలో ఇక్కడి పరిస్థితిని కొంతమట్టుకు చూపారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హీరా మండిపై సినిమాను తెరకెక్కించనున్నాడు. చదవండి: టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు.. -
ఆధారాల మీద కొత్త వెలుగు
ఇలాంటి ప్రయత్నం తెలుగు ప్రాంతంలోనే విజయవంతమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, కలకత్తా సంచాలకుడు ఎస్పీ సేన్ 1978లోనే చారిత్రక ఆధారాలను పుస్తకంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు. భారతదేశంలో చరిత్ర గురించి ఆలోచించేవాళ్లు, చరిత్రకారులు, చరిత్ర ఆధారంగా సృజనాత్మక రచనలు చేసేవారు కూడా పురావస్తు శాఖకు వెళ్లడం కనిపించదని ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత విలియం డాల్రింపుల్ ‘లాస్ట్ మొఘల్’ పుస్తకం పీఠికలో అంటారు. అది చదివినప్పుడు మనసు చివుక్కుమనే మాట నిజం. కానీ, కాస్త ఆలోచిస్తే అందులో కొంత సత్యం ఉందనే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే 20వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు ప్రాంతాలలోను, భారతదేశంలోను కూడా చరిత్ర రచనకు ఉపక్రమించిన పలువురు మనసావాచా ఆ పనిచేశారు. ఒక ఉదాహరణ: మల్లంపల్లి సోమశేఖరశర్మ ‘రెడ్డి రాజ్యాల చరిత్ర’. లేదా ఇటీవలే వచ్చిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’గ్రంథం. పరిపూర్ణమైన రీతిలో ఆధారాలను ఉపయోగించుకున్న చరిత్ర రచన ఎంత పరిపుష్టంగా ఉంటుందో ఆ పుస్తకాలు చెబుతాయి. కానీ తరువాత ఇంత ఖ్యాతి ఉన్న రచనలు తక్కువ. చరిత్ర రచన లేదా నిర్మాణానికి అత్యంత కీలకం– చారిత్రక ఆధారాలే. చారిత్రకత, విశ్వసనీయత ఆ ఆధారాలకు మరింత ముఖ్యం అంటుంది చరిత్రతత్త్వం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వెలువరించిన ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’చరిత్రకారులనీ, సృజనాత్మక రచనలు చేసేవారిని ముమ్మాటికీ ఆధారాల పట్ల గౌరవం పెంచుకునేటట్టు, అలాంటి బాధ్యత గురించి మరింత అవగాహన పెంచడానికి దోహదం చేస్తుంది. చారిత్రక ఆధారాలంటే ఏమిటి? ఒక కాలపు చరిత్రను నిర్మించడానికి అనివార్యంగా తీసుకునే ఆ కాలపు ఆధారాలు. శిలాశాసనాలు, నాణేలు, విదేశీ పర్యాటకులరచనలు, పురాతన సాహిత్యం, స్థల పురాణాలు ఆ ఆధారాలను ప్రధానంగా అందిస్తాయి. వీటిలో మళ్లీ ప్రైమరీ అనీ, సెకండరీ అనీ ఉంటాయి. ఇలాంటి ఆధారాల పరంపరను క్రోడీకరించినదే ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’. క్రీస్తుపూర్వం 5000 (చరిత్ర పూర్వయుగం) నుంచి, క్రీస్తుశకం 2016 వరకు జరిగిన చరిత్రకు ఆధారాలను సంపాదకులు, రచయితలు ఈ ఉద్గ్రంథంలో పొందు పరిచారు. అందుకే ఇదొక గొప్ప ప్రయత్నమని చెప్పాలి. పదహారు అధ్యాయాలలో ఈ సమాచారం మొత్తం అందించారు. పురాతన, మధ్య యుగ, ఆధునిక చరిత్రలతో పాటు, సమీప గతానికి చెందిన ఆధారాలను కూడా ఇందులో గమనిస్తాం. ద్రవిడ విశ్వవిద్యాలయం (కుప్పం), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్), ఇతర వదాన్యుల సహాయ సహకారాలతో మొత్తం తొమ్మిది వాల్యూంలలో తెలుగువారి చరిత్రను దాదాపు సంపూర్ణమనదగిన రీతిలో సంకలనం చేశారు. ఆ కృషికి ఈ ఆధారాల వాల్యూం పరాకాష్ట. చరిత్ర పూర్వయుగం, చరిత్ర ఆరంభ దశ, మధ్య యుగ చరిత్ర ఆరంభ దశ, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర చరిత్ర, బహమనీలు, కుతుబ్‌షాహీల చరిత్ర, ఆధునిక ఆంధ్ర దేశ చరిత్ర, అసఫ్జాహీలు, కోస్తాంధ్ర, రాయలసీమ, హైదరాబాద్ స్టేట్, సమకాలీన ఆంధ్రప్రదేశ్, సాహిత్యాధారాలు, జానపద కళలు–సంస్కృతి, కళ–వాస్తు, లలితకళలు అన్న 16 అధ్యాయాలలో చారిత్రక ఆధారాలను విస్తారంగా ఇచ్చారు. అలాగే గ్రంథాలయాలు, ఇండియన్ హిస్టారికల్ రివ్యూ పత్రికలో అచ్చయిన వ్యాసాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వవిద్యాలయాల చరిత్ర శాఖలలో జరిగిన కృషి, ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్ ప్రచురణలు, ప్రముఖుల పత్రాలు, నెహ్రూ స్మారక గ్రంథాలయం (ఢిల్లీ) వంటి చోట లభ్యమయ్యే చారిత్రక ఆధారాలు ఏవో కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్‌కు సమర్పించిన పత్రాల వివరాలు, తెలుగు పత్రికల జాబితా, గౌతమి గ్రంథాలయంలో లభ్యమవుతున్న గ్రంథాలు, వేటపాలెం సారస్వత నికేతన్‌లోని గ్రంథాల వివరాలు, లండన్‌లోని ఇండియా ఆఫీస్ గ్రంథాలయంలో లభించే గ్రంథాల పేర్లు కూడా ఈ వాల్యూంలో ఇచ్చారు. ఆ విధంగా చరిత్ర రచనకు ఈ వాల్యూం చక్కని దిశను చూపిందనే చెప్పవచ్చు. ఎన్. చంద్రమౌళి, సి.సోమసుందరరావు, డి. భాస్కరమూర్తి, కె. సూర్యనారాయణ, కేఎస్ కామేశ్వరరావు, అబ్దుల్ మాజిద్, ఏఆర్ రామచంద్రారెడ్డి, వి. లలిత, కనకదుర్గ వంటి చరిత్రకారులు ఈ ఆధారాల వాల్యూం కోసం శ్రమించారు. వకుళాభరణం రామకృష్ణ సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పుస్తకాన్ని మండలి వెంకటకృష్ణారావు, పీవీ పరబ్రహ్మశాస్త్రిలకు అంకితం ఇవ్వడం సముచితంగా ఉంది. మరొక విషయం కూడా తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఇలాంటి ప్రయత్నం తెలుగు ప్రాంతంలోనే విజయవంతమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, కలకత్తా సంచాలకుడు ఎస్పీ సేన్ 1978లోనే చారిత్రక ఆధారాలను పుస్తకంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు. ‘సోర్సెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా’పేరుతో ఆయా యుగాలకు అవసరమైన ఆధారాలను సంకలనం చేయడం సేన్ ఉద్దేశం. కానీ మొదటి భాగం మాత్రమే ఆయన వెలువరించగలిగారు. 1999లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తెలుగువారి సమగ్ర చరిత్ర రచనా యజ్ఞానాన్ని ప్రారంభించింది. ఇది 2016కు పూర్తయింది. ఇప్పుడు ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’వాల్యూంతో మొదట వచ్చిన వాల్యూమ్లకు పరిపూర్ణత చేకూరినట్టయింది. అందులో నిక్షిప్తం చేసిన కొన్నివేల పేజీల చరిత్రకు ఆధారాలు ఈ వాల్యూంలో లభిస్తాయి. ఈ కృషి ఒక అద్భుతం. ఈ భారాన్ని మోసిన చరిత్రకారులందరికీ తెలుగువారు కృతజ్ఞులై ఉండాలి. (‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’ పుస్తకం నేడు విజయవాడ పుస్తకోత్సవంలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా...ముఖ్యఅతిథి మండలి బుద్ధప్రసాద్) –కల్హణ -
ఆ ఒక్క సమాధి కూల్చితే చాలూ!
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్ మహల్ వివాదం పచ్చిగా ఉండగానే.. ఇప్పుడు తెరపైకి మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. దేశ రాజధానిలోని హుమయున్ సమాధిని కూల్చివేయాలంటూ ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. తద్వారా ముస్లింలకు పెద్ద సమస్య తీరుతుందని ఆయన అంటున్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ లేఖలోని విషయాలను గురువారం మీడియాకు తెలియజేశారు. హుమయున్ సమాధిని కూల్చివేయాల్సిందే. ప్రస్తుతం దేశంలో ముస్లింలు చనిపోతే వారిని ఖననం చేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు హుమాయున్ సమాధి ఉన్న ప్రాంతాన్ని గనుక అప్పగిస్తే స్మశానం(ఖబరిస్థాన్) లోటు తీరుతుంది. మరో వందేళ్లదాకా ముస్లిం జనాభా కోసం స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం లేదు. అని రిజ్వీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టాల మూలంగా కొత్త సమాధులు నిర్మించటం సాధ్యమయ్యే పని కాదని.. అందుకే హుమయూన్ సమాధి కూల్చివేతకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అయినా చనిపోయాక రాజు.. పేద తేడా ఏంటి? ఇప్పుడు ఆ సమాధిని ఇలా ఉపయోగించటం వల్ల ఆయన చేసిన పాపాల్లో కాస్తైన ప్రాయశ్చిత్తం దక్కుతుందేమో అని రిజ్వీ చెప్పారు. అభివృద్ధి కోసం ఖర్చు చేయాలే తప్ప.. దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలను హింసించిన ఇలాంటి వారి సమాధులపై కాదని అన్నారు. ఇక తాజ్ వ్యవహారంపై స్పందిస్తూ... దానిని సమాధిగా ఎవరూ చూడరని.. ఓ అందమైన ప్రపంచ వింతగానే భావిస్తారని ఆయన అన్నారు. మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సమాధి 30 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. మొత్తం 200 ఎకరాలకు పైగానే ఆ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. అయితే జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్న దీనిని తొలగించి కూల్చివేయాలని ఇప్పుడు షియా బోర్డే లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. -
చరిత్రను తిరగరాయటం అవసరమా?
సాక్షి : భారత దేశ చరిత్రలో మొగలులు సాధించింది ఏం లేదు. దేశాన్ని పూర్తిగా కొల్లగొట్టడం తప్ప.. ఈ వ్యాఖ్యలు చేస్తుంది ఎవరో కాదు ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ. అందుకే చరిత్ర పుసక్తాలను తిరగరాయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దినేశ్ మాత్రమేకాదు .. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అంశంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. నిజానికి ఈ వ్యవహారం దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తోంది. ఇస్లాం పాలకులైన మొగలుల జీవిత కథలను పాఠ్యాంశాల నుంచి తొలగించాలంటూ హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1977 లో జనతా ప్రభుత్వ హయాంలో జన సంఘ్ నేతలు కొందరు చరిత్ర పుస్తకాలను మార్చేందుకు తీవ్రంగా యత్నించారు. రొమిల థాపర్, బిపిన్ చంద్ర, హరబన్స్ ముఖియా కొందరు జనసంఘ్ నేతలు పుస్తకాలు రాశారు కూడా. అయితే జాతీయ విద్యా పరిశోధక మండలి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటం ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు.. రాజకీయ ప్రభావాలు మెల్లి మెల్లిగా ఇస్లాం పాలకులైన మొగలుల చరిత్రను క్రమక్రమంగా కనుమరుగు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే హిందుత్వ సంస్థ అయిన ఆరెస్సెస్ తమ ఆలోచనలకు తగ్గట్లుగా చరిత్ర పుస్తకాలను ప్రచురించింది. మరికొన్ని చోట్ల కూడా ఇప్పటికే ప్రచురించిన పుస్తకాలతోనే పాఠాలు బోధించటం మొదలుపెట్టేశారు. గుజరాత్లో శిక్షా బచావో ఆందోళన్ సమితి కన్వీనర్, ఆరెస్సెస్ భావజాలకుడు దీనానాథ్ బత్రా రాసిన పుసక్తాలకు 2014 నుంచే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన రాసిన పుస్తకాలనే ప్రవేశపెట్టబోతుంది. ఇక రాజస్థాన్ ప్రభుత్వం పదో తరగతి పుస్తకాల్లోని ఏకంగా గాంధీ, నెహ్రూలకు సంబంధించిన పాఠ్యాంశాలపై కోత విధించి.. హిందుత్వ వాది వీర సావర్కర్ కథాంశాన్ని హైలెట్ చేసింది. మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలైతే ఏకంగా మొగలులకు సంబంధించిన కథలను తగ్గించేసి హిస్టరీ అండ్ సివిక్స్ పేరటి పుస్తకాలకు నామకరణం చేసి పైగా అందులో మరాఠా వీరుడు శివాజీ పాలనకు సంబంధించిన విషయాలను.. మధ్యయుగం, మరాఠా సామ్రాజ్య విస్తరణ వంటి అంశాల గురించి ప్రస్తావించాయి. అయితే మొగలులు బ్రిటీషర్ల మాదిరిగా ఏనాడూ దేశంపై పడి దోచుకునే ప్రయత్నం చేయలేదని హర్బన్స్ ముకియా అనే చరిత్ర ప్రొఫెసర్ చెబుతున్నారు. పైగా అక్బర్, బాబర్ లాంటి చక్రవర్తులు మన మతాలు, సాంప్రదాయాలకు మంచి గౌరవం ఇచ్చి మనలో ఒకరిగా కలిసిపోయారని, పైగా కళా సంపదను మనకు అందించారని అంటున్నారు. కొందరు వామపక్ష భావ జాలాలున్న రచయితలు స్వేచ్ఛ తీసుకుని చరిత్రపై రాయటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ముకియా అంటున్నారు. ఏది ఏమైనా ఈ అంశంలో మతపరమైన వాదనలు కాకుండా, సుదీర్ఘ అధ్యయనం అవసరమన్న భావనను చరిత్రకారులు బలంగా వినిపిస్తున్నారు. -
నాడు ఘనం - నేడు దీనం
-
సత్ఫలితాలనిచ్చే పర్యటన
నాలుగున్నర శతాబ్దాలక్రితం పానిపట్టు యుద్ధంలో విజయం సాధించి మన దేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ పుట్టినిల్లు ఉజ్బెకిస్థాన్ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అడుగుపెట్టారు. ఎనిమిది రోజులపాటు సాగే మధ్య ఆసియా పర్యటనలో ఆయన ఇంకా కజకస్థాన్, తుర్క్మెనిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్లను సందర్శిస్తారు. మధ్యలో బ్రిక్స్ దేశాలు, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు రష్యా వెళ్లొస్తారు. ఆయనది క్షణం తీరికలేని ఎజెండా. అందులో మధ్య ఆసియా దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరుచుకోవడమొక్కటే కాదు... భద్రతా సమస్యలనుంచి ప్రాంతీయ ప్రాజెక్టుల వరకూ...ఐఎస్ ఉగ్రవాదుల బెడదనుంచి పెట్టుబడుల వరకూ ఎన్నో ఉన్నాయి. పూర్వపు సోవియెట్ యూనియన్నుంచి విడివడి ఈ అయిదు దేశాలూ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించి అప్పుడే పాతికేళ్లు కావస్తున్నది. ఇన్నేళ్లుగా ఈ దేశాలన్నిటితోనూ మనకు సుహృద్భావ సంబంధాలే ఉన్నాయి. కనుకనే తుర్క్మెనిస్థాన్ నుంచి పైప్లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాను పొందేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందంపై 2012 మే నెలలో సంతకాలయ్యాయి. తుర్క్మెనిస్థాన్- అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్-ఇండియా(తాపీ) ప్రాజెక్టుగా పిలిచే కీలకమైన ఆ ప్రాజెక్టు బృహత్తరమైనది. 1,680 కిలోమీటర్లు ప్రయాణించే ఆ పైప్‌లైన్ ద్వారా మనతో పాటు మన పొరుగునున్న అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లకు సైతం గ్యాస్ లభ్యమవుతుంది. దాని ఆధారంగా విద్యుదుత్పాదననూ, సత్వర పారిశ్రామిక అభివృద్ధినీ, ఆర్థికాభివృద్ధినీ సాధించేందుకు వీలవుతుంది. 30 ఏళ్లపాటు కొనసాగే ఈ ఇంధన సరఫరా వ్యవస్థ వాస్తవానికి 2018 నుంచి ప్రారంభం కావలసి ఉన్నది. అయితే, కాగితాల్లో ఉన్నంత సొగసుగా ఆచరణ లేదు. ఇందుకు కారణాలనేకం. ఈ పైప్‌లైన్ ప్రయాణించే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మృత్యు క్షేత్రం. ఉగ్రవాదుల తుపాకుల మోత, మందుపాతరల పేలుళ్లు అక్కడ సర్వ సాధారణం. నిత్యం నెత్తురొలికే జాగా అది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులనుంచి పైప్‌లైన్‌ను రక్షించుకోవడం ఎలా అన్నది సంక్లిష్టమైన సమస్య. ఇక తనకు సన్నిహితంగా మెలిగే తుర్క్మెనిస్థాన్ వేరే దేశాలకు గ్యాస్ అమ్మజూపడం చైనాకు ససేమిరా ఇష్టంలేదు. ఈ ప్రాజెక్టువల్ల తన ఇరాన్-పాకిస్థాన్-ఇండియా(ఐపీఐ) ప్రాజెక్టుకు ముప్పు కలుగుతుందన్న శంక ఇరాన్‌కు ఉంది. భారత్, పాక్ సంబంధాల్లో నిరంతరం ఉండే ఇబ్బందులు సరేసరి. వెయ్యికోట్ల డాలర్లు (సుమారు రూ. 64,000 కోట్లు) వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు చుట్టూ ఇలా సమస్యలు ముసురు కోవడంవల్ల అది ముందుకు కదలడంలేదు. అది 2020 నాటికి పూర్తికావడం ఖాయమని చెబుతున్నా అదంత సులభమేమీ కాదు. అఫ్ఘాన్‌లోని భద్రతాపరమైన సమస్యలు అధిగమించలేనివేమీ కాదని న్యూఢిల్లీలో తుర్క్మెనిస్థాన్ రాయబారిగా ఉన్న దుర్దుయేవ్ అన్నారు. ఆ దేశానికి అఫ్ఘాన్‌తో ఉన్న సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను చూస్తే ఆయనది కేవలం ఆశాభావమేనన్న సందేహం కలుగుతుంది. మోదీతో జరిపే చర్చలవల్ల దీనికొక దోవ దొరుకుతుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్న విశ్వాసంతో తుర్క్మెనిస్థాన్ ఉంది. అన్నిచోట్లా మనల్ని అధిగమిస్తూ ముందుకెళ్తున్న చైనా మధ్య ఆసియాలో కూడా ఇప్పటికే తన పాదం మోపింది. రెండేళ్లక్రితం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ దేశాలన్నిటినీ సందర్శించి వాటికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉదారంగా రుణాలిచ్చారు. అక్కడినుంచి చైనాకు చమురు, సహజవాయు పైప్లైన్లు ఉన్నాయి. ఈ దేశాల అధినేతలు మన దేశాన్ని సందర్శించడం, మన నేతలు అక్కడికెళ్లడం రివాజుగా సాగుతున్నా సంబంధాలను ఈ స్థాయికి తీసుకెళ్లాలన్న స్పృహ యూపీఏ హయాంలో మన నాయకులకు రాలేదు. అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలతో ఉండే ప్రాంతంతో ఉండే సంబంధాల ద్వారా మనం బహుముఖ అభివృద్ధిని సాధించవచ్చునన్న వివేచన వారికి లేకపోయింది. వాస్తవానికి ఈ విషయంలో మధ్య ఆసియా దేశాలు ఎంతో సుముఖంగా ఉన్నాయి. చైనా, రష్యాలనుంచి ఎంతగా సాయం పొందుతున్నా వారిద్దరిపైనే ఆధారపడటం మంచిదికాదన్న అభిప్రాయం ఆ దేశాలకు ఉంది. ఇలాంటి స్థితిని ఉపయోగించుకుని స్వీయ ప్రయోజనాలను సాధించాలని తహతహలాడుతున్న యూరొప్ దేశాలను చూసైనా మన దేశం నేర్చుకుని ఉండాల్సింది. కానీ ఆ పని అవసరమైనంతగా జరగలేదు. మధ్య ఆసియా దేశాల్లో భారత్‌కు చెందిన సంస్థలు ఫార్మా, ఇంజనీరింగ్, టూరిజం రంగాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ఆధునీకరణ పనుల్ని మన దేశమే స్వీకరించింది. ఇది పూర్తయితే తమ మధ్య ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలు గణనీయంగా విస్తరిస్తాయన్న ఆశ మధ్య ఆసియా దేశాలకు ఉంది. ఇక తజికిస్థాన్, కిర్గిజిస్థాన్లు రెండింటికీ అపారమైన జలవనరులున్నాయి. భారత్ తమనుంచి జలవిద్యుత్‌ను కొనాలని ఆ దేశాలు కోరుకుంటున్నాయి. మధ్య ఆసియా ప్రాంతం భద్రతరీత్యా ఎంతో కీలకమైనది. ఇరాక్‌లో అమెరికా సేనల వైఫల్యం, అఫ్ఘాన్‌నుంచి అది వైదొలిగే ప్రక్రియ మొదలుకావడం వంటి కారణాలరీత్యా ఈ ప్రాంత దేశాల్లో ఉగ్రవాదం కాలూనడానికి ప్రయత్నిస్తున్నది. సిరియా, ఇరాక్లలో చెలరేగుతున్న ఐఎస్ ఉగ్రవాదులు ఇక్కడ సైతం పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంపై తన పూర్వ వైభవాన్ని నెలకొల్పుకొనాలని రష్యా భావిస్తోంది. చైనా తన సొంత ఎజెండాతో ముందుకెళ్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల్లో విస్తృత పర్యటనకు పూనుకోవడం వ్యూహాత్మకంగా మన దేశానికి ఎంతగానో పనికొస్తుంది. రాగలకాలంలో దీని సత్ఫలితాలు కనిపిస్తాయి.