muthyala raju
-
శభాష్ కలెక్టర్: సీఎం జగన్ అభినందనలు
సాక్షి, ఏలూరు : గోదావరి వరద సహాయక చర్యలు, పునరావాసం ఏర్పాట్లు బాగా చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కలెక్టర్ రేవు ముత్యాలరాజును అభినందించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద పరిస్థితి, కోవిడ్–19, ఇళ్ల పట్టాలు, ఎన్ఆర్ఈజీఎస్, నాడు–నేడు, వైఎస్సార్ చేయూత, ఆర్బీకేలకు అనుబంధంగా గిడ్డంగుల నిర్మాణం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ వరద ముంపునకు గరైన ఇళ్ల నష్టం అంచనా నమోదు ప్రారంభించామని వివరించారు. కోతకు గురైన పాత పోలవరం నెక్లెస్ బండ్‌ను పటిష్టపరిచే పనులను చేపట్టామని పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో వరదలు వచ్చినా ఇబ్బంది లేని పరి స్థితి ఉంటుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏదైనా సహాయం అవసరమైతే ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో మాట్లాడాలని సూచించారు. తొలుత సీఎం జగన్ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో కలెక్టర్ కృషి అభినందనీయమన్నారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, వారికి అందించాల్సిన సహాయాలు సకాలంలో అందించడంలో తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ముంపునకు గురైన గృహాల నష్టం అంచనా నివేదికలు త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 7 నాటికి బాధితులకు సహాయం అందేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేలు అందించడంతో పాటు అదనంగా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ అందజేయాలని పేర్కొన్నారు. దెబ్బతిన్న బ్రిడ్జిలు, డ్రెయిన్లకు మరమ్మతులు చేయించాలన్నారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతోపాటు, ఆరోగ్య బృందాలు కూడా పర్యటించి వైద్యసహాయం అందించాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ కె.నారాయణ నాయక్, జేసీలు హిమాన్షు శుక్లా, ఎన్.తేజ్‌భరత్ పాల్గొన్నారు. -
అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు
ఏలూరు (మెట్రో): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. జాబ్‌కార్డులు కావాల్సిన వారు గ్రామ సచివాలయంలో ఆధార్‌కార్డు జిరాక్స్ జతపర్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాల్లో వసతులు కల్పించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 600 కోట్ల పనులు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌కు సిద్ధం కావాలి : ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేందుకు సిద్ధంకావాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులకు సూచించారు. ఈ నెల 30న జిల్లాలో 938 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో నాడు– నేడు మొదటి విడత కింద 1148 పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. సమావేశంలో జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్. తేజ్‌భరత్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ఆరా కోవిడ్–19, ఈ ఏడాది అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, రైతుభరోసా కేంద్రాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, నాడు– నేడు పనులు, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. జిల్లా ప్రగతిపై ఆరా తీశారు. ఈ కాన్పరెన్స్‌లో కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్, జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్.తేజ్‌భరత్ పాల్గొన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 31 వరకూ గడువు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణను సెక్షన్ 22 (2) ఏపీ రైట్స్ చట్టం ప్రకారం చేపడతామని పేర్కొన్నారు. పేద రైతులకు చివరి అవకాశంగా 2020 మే 31ని గడువుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని సాదాబైనామాల రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. క్రమబద్దీకరణ కోసం ఫారం–10 నమూనాలో తహసీల్దార్‌కు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు నకలు, కొన్న రిజిస్టర్ కాని క్రయ దస్తావేజు నకలు, భూమి కొనుగోలు, సాగులో ఉన్నట్టు పత్రాలను జత చేయాలని పేర్కొన్నారు. ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదార్ పాస్ బుక్స్ యాక్ట్ 1971 రూల్స్ 1989 అనుసరించి జిల్లా యంత్రాంగం అమలుకు ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి పట్టా చేయించుకోనట్లయితే ఆ భూమిపై హక్కు పత్రాలు పొందడానికి అవకాశం ఉండదని వెల్లడించారు. భూమిపై హక్కుకు రుజువుగా ఉండే పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్ పొందాలంటే సాదాబైనామా విక్రయాన్ని క్రమబద్దీకరించుకుని ఫారం 13 (బీ) సర్టిఫికెట్ పొందాలని పేర్కొన్నారు. బ్యాంకు రుణం కావాలన్నా, ఎరువులు, క్రిమి సంహారక మందులు, ప్రభుత్వం ఇచ్చే పంట నష్టం పరిహారం, ఇన్సూరెన్స్ ద్వారా పంట నష్టపరిహారం కావాలన్నా, భూతగాదాలు వచ్చినప్పుడు హక్కును రుజువు చేసుకోవాలన్నా పాసు పుస్తకం టైటిల్ డీడ్ అవసరమని తెలిపారు. సాదాబైనామా క్రమబద్దీకరణపై ఆర్డీఓలు విస్తృత ప్రచారం చేయించాలని, గ్రామాల్లో టాంటాం వేయించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలపై సమీ„ý. జిల్లాలో జ్యూవెలరీ, దుస్తులు, చెప్పుల షాపులు తెరిచేందుకు అనుమతి లేదని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో లాక్డౌన్ నిబంధనలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లాక్డౌన్ నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించరాదని పేర్కొన్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు వద్దే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని పోలీసు అధికారులకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్. తేజ్‌భరత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ ముత్యాల టు ఆణిముత్యాల
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గాడిలో పడుతుందా అన్నది కీలకంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం ఆధ్వర్యంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్యారెంటీలు లేకుండా కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చేశారు. మరోవైపు ఇష్టారాజ్యంగా కనీసం టెండర్లు పిలవకుండానే తెలుగు తమ్ముళ్లకు అవుట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇప్పటికే బ్యాంకు అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జిగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు బాధ్యతలు స్వీకరించడంతో అక్రమార్కులలో వణుకు మొదలైంది. అంతా అడ్డగోలే! గత డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం హయాంలో టెండర్లు పిలవకుండా అవుట్సోర్సింగ్ నియామకాలు జరిగిపోయాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బ్యాంకులో అవుట్‌సోర్సిం గ్ కింద సుమారు 50 మంది వరకూ పనిచేస్తున్నారు. చైర్మన్ డ్రైవర్‌ను కూడా పర్మినెంట్ చేయించుకునే ప్రయత్నం జరిగింది. చివరి జనరల్ బాడీలో తన డ్రైవర్‌ను పర్మినెంట్ చేయాలని సీఈఓకు చెప్పారు. తన పార్టీకి చెందిన వారిని ఎక్కువ మందిని నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగిని ఇంటి వద్ద పనులు చేయిం చుకోవడం కోసం నియమించుకున్నారు. ఇతనిని ఆకివీడు, ఒడిశాలలో చైర్మన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వంటలు చేయడం కోసమే వాడుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అతనికి వాలంటరీ రిౖటైర్‌మెంట్ ఇచ్చి అతని కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు యత్నాలు జరుగుతున్నా యి. ఇందుకు మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం ఐదేళ్లు సర్వీస్ ఉంటే గానీ వాలంటరీ రిటైర్మెంట్కు అనుమతి ఇవ్వకూడదు. అయితే ఈ ఉద్యోగికి మూడేళ్లు కూడా ఇంకా సర్వీస్ లేదని సమాచారం. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ముగ్గురిని బ్యాంకులో నియమించినట్టు సమాచారం. 18 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కుమారుడికి కోర్టు ఆర్డర్ సరిగా లేకపోయినా ఉద్యోగం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు సీఈఓగా 2015లో రిటైరైన వ్యక్తిని నియమించుకున్నారు. విచారణ గాలికి.. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణ ఇంతవరకూ తేలలేదు. డీసీసీబీలో జరిగిన అక్రమాలపై ఈ ఏడాది జనవరి 18న రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తనకు ఉన్న పలుకుబడితో ఇప్పటి వరకూ విచారణ పూర్తికాకుండా ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు 33.32 కోట్ల రూపాయలు సెక్యూరిటీలు లేకుండా రుణం ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమయ్యారు. సెక్యూరిటీలు లేకుండా రుణాలు ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమైన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరిలోనే విచారణకు ఆదేశించినా ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక తొక్కి పెట్టేందుకు అంటూ ఒక్కో బ్యాంకు బ్రాంచి నుంచి మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. సుమారు 34 బ్రాంచుల నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ ముత్యాల రాజు బాధ్యతల స్వీకరణ కొత్త ప్రభుత్వం డీసీసీబీకి పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ముత్యాలరాజును నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన అధికారిగా పేరున్న ముత్యాలరాజు బ్యాంకు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రం అవకతవకలు బయటపడే అవకాశం ఉంది. -
సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్
ఆగస్టు 1 నుంచి ప్రతి సోమవారం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2499 నెల్లూరు(పొగతోట): జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఆగస్ట్ 1 నుంచి ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం కోసం 1800 425 2499 టోల్‌ఫ్రీ నంబర్‌ను సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే డయల్ యువర్ ప్రోగ్రామ్‌కు ప్రజలు ఫోన్ చేయగానే కాల్సెంటర్లోని సిబ్బంది ముందుగా సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం ఫోన్‌ను కలెక్టర్‌కు లింక్ చేస్తారు. కలెక్టర్ స్వయంగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. ఈ సంభాషణ మొత్తాన్ని రికార్డు చేయనున్నారు. అనంతరం సమస్యలను శాఖల వారీగా విభజించి సంబంధిత జిల్లా అధికారులకు మెయిల్ ద్వారా పంపుతారు. ఫోన్లో తికమకగా సమాధానం చెప్పిన, సమస్యలను సక్రమంగా వివరించకపోయిన ఫోన్‌కట్ చేస్తారు. కలెక్టర్ గ్రీవెన్స్‌డేకు హాజరయ్యే అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఫోన్లో మాట్లాడతారు. భూ సమస్యలు, రేషన్‌కార్డులు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, పాఠశాలల్లో మౌళిక వసతులు, తదితర సమస్యలను కలెక్టర్‌కు విన్నవించవచ్చు. జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం భూములు, నివేశన స్థలాల హద్దుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మాజీ సైనికులు, నిరుపేదలకు కేటాయించిన భూములకు హద్దులు చూపకపోవడంతో సాగు చేసుకోలేకపోతున్నారు. చేతిలో పట్టాలు పెట్టుకుని భూములు చూపించండి అంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లబ్ధిదారులు భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తే వెంటనే హద్దులు చూపేలా అధికారులు చర్యలు చేపడుతారు. చౌకదుకాణాల డీలర్లు రేషన్ సక్రమంగా ఇవ్వకపోయిన డయల్ యువర్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చు. నిరుపేదలు నగదు ఖర్చు పెట్టుకుని, సమయం వథా చేసుకుని కలెక్టర్ కార్యాలయానికి రాకుండా గ్రామం నుంచే కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేయవచ్చు. -
జిల్లాను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ ప్రతి శనివారం గ్రీవెన్స్ అర్జీలపై సమీక్ష గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా వద్దు మైండ్‌సెట్ మార్చుకోండి అధికారులకు కలెక్టర్ ముత్యాలరాజు పిలుపు నెల్లూరు(పొగతోట): అన్ని రంగాల్లోను జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తన చాంబర్లోనూ, గ్రీవెన్స్హాలులోనే అధికారులతో సమీక్షలు నిర్వహించారు. టీం వర్క్‌తో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. కొత్త కలెక్టర్ ఎలా ఉంటారో..అనే అపోహలను పక్కనపెట్టాలన్నారు. చిన్నతనంలో తాను పత్రికల్లో తన ఫొటో మొదటి పేజీలో రావాలనే లక్ష్యంతో ముందుకు సాగానని, కొంతకాలం తర్వాత సాధించానని చెప్పారు. అదేవిధంగా అధికారులందరూ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలనే సంకల్పంతో విధులు నిర్వర్తిస్తే తప్పకుండా సాధించవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానన్నారు. డయల్ యువర్ కలెక్టర్ ప్రతి సోమవారం డయిల్యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తాననిముత్యాలరాజు తెలిపారు. ఇకపై వారం వారం చేసిన అభివృద్ధి, చేయవలసిన పనులపై సమీక్షప్రతి సోమవారం జిల్లా అధికారులందరితో సమావేశం నిర్వహిస్తానని శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అధికారిక కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అనేక కష్టాలు పడి కలెక్టరేట్‌కు వస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అర్జీ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రతి శనివారం సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అందరూ పనితీరు మార్చుకోవాలని, వంద శాతానికి పైగా ఫలితాలు సాధించేలా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్వో మార్కండేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
లెహర్.. డర్
సాక్షి, కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను 1996లో సంభవించిన కోనసీమ తుపానుకు రెట్టింపు వినాశనాన్ని సృష్టించనుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ జిల్లావాసులను హెచ్చరించారు. సోమవారం రాత్రి తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. జిల్లా మొత్తం ఈ తుపాను తాకిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ తుపాను పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం మండలానికి రూ.మూడు లక్షలు కేటాయించినట్టు చెప్పారు. బాధిత ప్రజలతో పాటు పాడి పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రావద్దని; పూరిళ్లు, కచ్చా ఇళ్లలో ఉన్నవారు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. జిల్లాకు పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను కేటాయించారని తెలిపారు. ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, తుని, కొత్తపల్లి మండలాలకు ఒక్కొక్కటి, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలకు రెండేసి చొప్పున ఈ బృందాలను పంపనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం : కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ సోమవారం సందర్శించి, లెహర్ తుపానుపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాణనష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలందరూ బుధవారం ఉదయానికల్లా పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. ఈ కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడా ఆహారం నిల్వ ఉంచాలని కాట్రేనికోన తహశీల్దారును ఆదేశించారు.