క్రికెటర్ ప్రేమ పెళ్లి
లాహార్: పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ ఓ ఇంటివాడయ్యాడు. బ్రిటీష్-పాకిస్థాని యువతి నర్జిస్ ను అతడు పెళ్లాడాడు. మంగళవారం లాహోర్ లో జరిగిన వీరి వివాహానికి పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు. సోమవారం మెహందీ వేడుక నిర్వహించారని స్థానిక మీడియా వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో రిసెప్షన్, వలీమా ఏర్పాటు చేశారని తెలిపింది.
ఆరేళ్ల క్రితం ఆమిర్ ను లండన్ లో నర్జిస్ కలిసింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఆమోదం తెలిపి 2014లో నిశ్చితార్థం జరిపారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆమిర్ ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్నా నర్జిత్ అతడినే పెళ్లాడింది. తనది ప్రేమ వివాహం అని, తమ పెళ్లికి ఇరు కుటుంబాలు సంతోషంగా అంగీకరించాయని ఆమిర్ తెలిపాడు. ఆమిర్, నర్జిజ్ లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది.