రూ. 500 కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఔత్సాహిక చిన్న వ్యాపార వేత్తల కోసం రూ.500 కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ ప్రారంభమైంది. చిన్న వ్యాపారవేత్తలు తమ ఐడియాలను నిజం చేసుకోవడానికి తోడ్పాటు నందించడానికి ఈ ఇండియా ఇన్‌క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ (ఐఐఐఎఫ్)ను ఏర్పాటు చేశామని నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ చైర్మన్ శామ్ పిట్రోడా తెలిపారు. లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల (ఎంఎస్ఎంఈ)మంత్రిత్వ శాఖ రూ.100 కోట్లను సమకూరుస్తుండగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, బీమా కంపెనీలు, విదేశీ ఆర్థిక సంస్థలు అందిస్తాయన్నారు. చాలా మంది యువ వ్యాపారవేత్తలు తగిన పెట్టుబడి లేక తమ నవకల్పనలకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని, దీనిని నివారించడానికే ఈ ఫండ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు.