National Project
-
ప్రాజెక్టుల ప్రగతిపై పీఎం మోదీ సమీక్ష
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ జాతీయ ప్రాజెక్టుల ప్రగతిపై బుధవారం ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలువురు కేంద్ర శాఖల కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఢిల్లీ–వడోదర–ముంబై ఎక్స్‌ప్రెస్ వే, చోటాదపూర్–ధార్ రత్లాం–మాహౌ–ఖాండ్వా–అకోలా రైల్వే లైన్ కన్వర్షన్, ముంబై–నాగపూర్–ఝూర్సుగుడ పైపులైన్, బైలదిల్లా ఐరన్ ఓర్ డిపాజిట్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వానిధి) అంశాలకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల ప్రగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, రహదారులు–భవనాలశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీశాఖ కార్యదర్శి కె.శశిధర్, పీసీసీఎఫ్ ఎ.కె.ఝా తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా పోలవరం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం నిరంతర మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున అన్ని విధాలా కేంద్రం మద్దతు అవసరమని పేర్కొంది. తిరువనంతపురంలో శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. విద్యుత్, అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కూడిన అధికారుల బృందం పాల్గొంది. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కానందున రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటి అమలు, పర్యవేక్షణ కోసం తగిన సాధికారతతో కూడిన ప్రభావవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలి విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి చట్టంలో, అప్పటి ప్రధాని పార్లమెంట్లో కీలక అంశాలపై హామీ ఇచ్చారు. దాదాపు దశాబ్ద కాలం గడుస్తున్నా అనేక కీలకమైన హామీలు అమలు కాలేదు. ఫలితంగా రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ► రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాలకు ప్రత్యేకంగా అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వనున్నట్లు విభజన చట్టంలో పేర్కొనడమే కాకుండా పార్లమెంట్లో అప్పటి ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. బుంధేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లకు ప్రణాళికా సంఘం సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ దగ్గర పెండింగ్‌లో ఉంది. జానాభా, ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకుని బుంధేల్ఖండ్ తరహా ప్యాకేజీ కింద ఏడు జిల్లాలకు రూ.25,000 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి. ► రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు.. పీఎంకేఎస్‌వై సవరించిన మార్గదర్శకాల కింద మద్దతు ఇవ్వాలి. ఈ రెండు పథకాల వల్ల కొత్త ప్రాంతానికి నీటి పారుదల సౌకర్యం, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరాకు అవకాశం కలుగుతుంది. తద్వారా ఈ ప్రాంతాలను పీడిస్తున్న కరువు, పేదరికం, నిరుద్యోగ సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది. పారిశ్రామిక రాయితీలు పొడిగించాలి ► విభజనతో ఏపీ హైదరాబాద్‌ను కోల్పోవడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు లేవు. అందువల్ల రాష్ట్రాభివృద్ధి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని సెక్షన్ 94 కింద (2) రాష్ట్రంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలానికి పారిశ్రామిక రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల తరహాలో పారిశ్రామిక రాయితీలను పొడిగించాలి. ► విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రకటించింది. వీలైనంత త్వరగా రైల్వే జోన్ ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాల మండలి చైర్మన్ హోదాలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. ► విభజన చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం వివిధ సంస్థల ఆస్తుల విభజన కోసం ఉత్తర్వు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉంది. విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా సంస్థల ఆస్తుల విభజన పూర్తి కాకపోవడంతో పరిపాలన పరమైన ఇబ్బందులను రాష్ట్రం ఎదుర్కొంటోంది. పౌర సేవలపైన ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తన అధికారాలను వినియోగించి త్వరగా ఆస్తుల పంపిణీ పూర్తికి ఆదేశాలు జారీ చేయాలి. ► విభజన చట్టంలోని సెక్షన్ 93 కింద షెడ్యూల్ 13లో జాతీయ స్థాయి ప్రాముఖ్యత గల వ్యవసాయ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.135 కోట్ల సాయం అందించి రాష్ట్ర వ్యవసాయ యూనివర్శిటీనే జాతీయ స్థాయి యూనివర్సిటీగా పరిగణించాలని సూచించింది. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినందున జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ► విభజన అనంతరం రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రెవెన్యూ లోటు గ్రాంటును రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ గ్రాంటు మంజూరులో జాప్యం వల్ల రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతోంది. ఆస్తుల పంపిణీపై ఇద్దరు సీఎస్‌లతో భేటీ విభజన చట్టంలోని షెడూŠయ్ల్స్లో గల ఇన్స్టిట్యూషన్స్ ఆస్తులు, అప్పుల పంపిణీలో జాప్యంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హోం శాఖ కార్యదర్శికి సూచించారు. చట్టంలోని నిబంధనల మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించి.. ఆస్తుల పంపిణీ అంశాన్ని పరిష్కరించాలని చెప్పారు. -
‘కేంద్రం’ వాటాకు ‘కత్తెర’
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా జాతీయ హోదా పొందిన సాగు నీటి ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం ఇచ్చే నిధులకు కత్తెర వేసింది. కొత్త జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలే భరించాలి. దేశ విస్తృత ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు వాటికి జాతీయ హోదా కల్పించి, అంచనా వ్యయంలో 90 శాతం నిధులను ఇప్పటివరకూ కేంద్రం భరిస్తోంది. ఇప్పుడా నిధుల్లో కోత పెట్టింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానం కింద చేపట్టే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరితో పాటు ఇతర ప్రాజెక్టులకూ ఇదే రీతిలో నిధులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, రెండు హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్), కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, లడఖ్‌లకు పాత విధానంలోనే 90 శాతం ఇవ్వనుంది. ఇంతకు ముందే ఆమోదం పొందిన పోలవరంతోపాటు 15 జాతీయ ప్రాజెక్టులకు ప్రస్తుత పద్ధతి ప్రకారమే 90 శాతం నిధులిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తెలిపింది. జాతీయ హోదా కల్పన, నిధులు మరింత క్లిష్టం ► తాజా మార్గదర్శకాల ప్రకారం.. నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుదుత్పత్తి వ్యయం తదితర సమస్యల వల్ల నిధుల కొరతతో నిర్మాణం పూర్తి కాని అంతర్రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులకు కొత్తగా జాతీయ హోదా కల్పించి, సత్వరమే పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నీటి లభ్యత, పంపిణీ సమస్య లేకుండా ఒక రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లు అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించనుంది. ► ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తారు. ► రాష్ట్రం తన వాటా నిధులను జమ చేసి.. 75 శాతం ఖర్చు చేయకపోతే కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే.. ఆమోదం పొందిన పెరిగిన వ్యయంలో 20 శాతమే కేంద్రం భరిస్తుంది. మిగతా నిధులను ఆయా రాష్ట్రాలే భరించాలి. ► పాత విధానంలో కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టే జాతీయ హోదా కింద కేంద్రం నిధులిచ్చే చివరి ప్రాజెక్టు. ఏఐబీపీ నిధుల మంజూరులోనూ కోత నిధుల కొరత వల్ల సకాలంలో పూర్తి కాని దేశంలోని 99 ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం నిధులిస్తోంది. కొత్తగా ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకూ నిధుల మంజూరులో కోతలు పెడుతూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ► ఎనిమిది ఈశాన్య, రెండు హిమాలయ రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లఢఖ్‌లలో ఏఐబీపీ కింద కొత్త ఎంపిక చేసే ప్రాజెక్టులకు వాటి అంచనా వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. ► కరవు నివారణ పథకం (డీపీఏపీ), ఎడారి నివారణ పథకం(డీడీపీ) అమలవుతున్న ప్రాంతాలు, గిరిజన, వరద ప్రభావిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్, విదర్భ, మరఠ్వాడ, కేబీకే (ఒడిశా) ప్రాంతాల్లో కొత్తగా ఎంపిక చేసే ఏఐబీపీ ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 60 శాతం ఇవ్వనుంది. మిగతా ప్రాంతాల్లో ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 25 శాతం నిధులిస్తుంది. మిగతా వ్యయాన్ని ఆ రాష్ట్రాలే భరించాలి. -
సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది!
శ్రీకాకుళం ,అరసవల్లి: ‘అత్త సొమ్ము.. అల్లుడి సోకు..’ అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ తీరు. జాతీయ ప్రాజెక్టుల్లో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది. ఆ నిధులతో చేస్తున్న పనులను తామే చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డాబులకు పోతున్నారు. అదంతా తమ ప్రభుత్వ ఘనతే అని టీడీపీ ప్రభుత్వ పెద్దలు జబ్బలు చరుస్తున్నారు. ఆఖరికి జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) విస్తరణ పనులు కూడా తమ వల్లనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు బాహాటంగా చెప్పుకున్న విషయం విదితమే. దేశాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైనా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే..అదంతా రాష్ట్ర సర్కార్ అభివృద్ధి ఖాతాలోకి వేసుకుంటూ...ప్రచార ఆర్భాటాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో రూ.16,878 కోట్లతో 1384 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను విస్తరించేందుకు గాను 32 పనులకు కేంద్ర ఉపరితల, జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సోమవారం జరిగిన కార్యక్రమం వేదిక నుంచి శంకుస్థాపన చేశారు. ఇందులో సేతు భారతం ప్రాజెక్టు కింద 11 రైల్వే ఓవర్ బ్రిడ్జిలను (ఆర్వోబీ) కూడా నిర్మించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ.345.23 కోట్లుతో ఒక అంతరాష్ట్ర సరిహద్దు రోడ్డు విస్తరణతో పాటు రెండు ఆర్వోబీల నిర్మాణ పనులకు కూడా ఆకివీడులోనే కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయితే ఇదంతా తమ ప్రభావమే అని జిల్లాలో టీడీపీ నేతలు హడావుడి చేయడం చూస్తుంటే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రూ.345.23 కోట్లతో పనులు.. జిల్లాలో కీలకమైన రహదారి అభివృద్ధిలో భాగంగా మూడు ప్రాజెక్టులనురూ.345.23 కోట్లుతో నిర్మించేందుకు కేంద్రం నిర్ణయించింది. వీటిలో నరసన్నపేట జమ్ము జంక్షన్ నుంచి పాతపట్నం వరకు రోడ్డు విస్తరణ పనులతో పాటు ఇదే మార్గంలో రెండు చోట్ల రైల్వే రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీ) కూడా నిర్మించేందుకు ప్రతిపాదించారు. మొత్తం 39 కిలోమీటర్ల మేర ఉన్న నరసన్నపేట–పాతపట్నం ప్రధాన రహదారి విస్తరణకు రూ. 228.32 కోట్లు, అలాగే చల్లపేట వద్ద (తిలారు గేటు) వద్ద 1.4 కి.మీ పొడవున ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.58.31 కోట్లు, పాతపట్నం పట్టణ సరిహద్దు వద్ద 1.46 కి.మీ పొడవున ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.58.6 కోట్లు మేర కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేశారు. ఈమేరకు ఈ మూడు ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రహదారుల అభివృద్ధి, పోర్టులు, రైల్వే, నదుల అనుసంధానం తదితర పనులకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ఇప్పటికే పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకు తొలి దశగా నాలుగు లైన్ల జాతీయ రహదారిని (ఎన్‌హెచ్–16) ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1423 కోట్లుతో యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. దీంతో జిల్లా వాసులకు ప్రధాన రహదారి కష్టాలు తీరనున్నాయి. తాజాగా నరసన్నపేట–పాతపట్నం రహదారి విస్తరణతో పాటు ఎప్పటినుంచో కలగా ఉన్న తిలారు గేటు ఆర్వోబీ, పాతపట్నం ఆర్వోబీల నిర్మాణాలతో ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు రవాణా వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. చెన్నై–కోల్కత్తా రైల్వే మార్గంలో తిలారు స్టేషన్ సమీపంలో ఉన్న గేటుతో పాటు నౌపడ–గుణుపూర్ రైల్వే మార్గంలో ఉన్న పాతపట్నం గేటు వద్ద కూడా నిత్యం అంతరాయం ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇలాంటి ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. రాష్ట్ర సర్కార్ హడావుడిపై సర్వత్రా విమర్శలు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రతి ప్రాజెక్టును తమ అభివృద్ధిలో భాగమే అని ప్రకటించుకుంటున్న చంద్రబాబు సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కీలకమైన పోలవరం నుంచి, గ్రామీణ స్థాయిలో రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల వరకు అన్నింట్లో రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తున్నట్లుగా టీడీపీ పెద్దలు హడావుడి చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, జలవనరులు, రోడ్లు, ఇతరత్రా కేంద్ర పథకాలతో చేపడుతున్న అభివృద్ధిని పూర్తిగా తామే చేయించుకుంటున్నట్లుగా టీడీపీ పెద్దలు ప్రకటనలు చేస్తుండడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో కూడా కేంద్రం వాటా ఏమీ లేదని.. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఘనతే అని సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటిస్తుండడం విడ్డూరంగా ఉందని వారంటున్నారు. 2020 మార్చి నాటికి విస్తరణ పనులు పూర్తి: శ్రీకాకుళం జిల్లాలో జమ్ము జంక్షన్ (నరసన్నపేట) నుంచి పాతపట్నం (పర్లాఖిమిడి సరిహద్దు) వరకు జాతీయ రహదారి–326ఏ, విస్తరణకు, అలాగే రెండు ఆర్వోబీలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులను రూ.345.23 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు ఈ పనులన్నీ వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం విస్తరణ పనులు గ్రౌండింగ్ అయ్యాయి. ఆర్వోబీల నిర్మాణాలకు మాత్రం కొంత భూసేకరణ సమస్యలు తలెత్తుతున్నాయి. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించి, బ్రిడ్జిల నిర్మాణాలను వేగవంతం చేస్తాం. – ఎల్వి.సుబ్రహమణ్యం, ఈఈ, జాతీయ రహదారి విభాగం (విశాఖ). -
డిండి, పాలమూరుకు జాతీయ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా తాగు, సాగు అవసరాల కోసం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లా అవసరాల కోసం చేపట్టిన డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై శుక్రవారం జరిగే కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల జాతీయ హోదా అంశాన్ని ప్రధానంగా చేర్చింది. ఇక కేంద్ర జల సంఘం టీఏసీ అనుమతులన్నీ ఇచ్చిన దృష్ట్యా కాళేశ్వరంనూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ కోరనుంది. రాష్ట్రం ప్రస్తావించనున్న ఇతర అంశాలు ఇవే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మేరకు ఎగువ రాష్ట్రాలకు 80 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ ప్రకారం 2011 జనవరిలో పోలవరానికి జల సంఘం అనుమతివ్వగానే మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీల వాటా వినియోగిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎగువన మిగతా 45 టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ కృష్ణా బేసిన్లో 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నా 5.75 లక్షల హెక్టార్లే (15 శాతం) సాగవుతోంది. ఈ దృష్ట్యా 45 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి. అలాగే పట్టిసీమ ద్వారా 2017–18 వాటర్ ఇయర్లో 100 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఈ జలాల్లోనూ రాష్ట్రానికి వాటా దక్కాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయగా అందుకు విరుద్ధంగా 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. జల సంఘం దీనిపై బ్యాక్‌వాటర్ అధ్యయనం చేయలేదు. 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తే భద్రాచలం రామాలయంతో పాటు బొగ్గు నిక్షేపాలు, మణుగూరులోని మినరల్ ప్లాంటు, అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన చట్ట సవరణతో రాష్ట్రంలోని 6 మండలాలతో పాటు సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. వీటిని తెలంగాణకు ఇచ్చేయాలి. ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీరు తరలించే కాల్వలు పూడికతో నిండిపోవడంతో 4.56 టీఎంసీలకు మించి అందడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో అడుగు మేర పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. ఈ పనులకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తున్నందున కేంద్ర జోక్యం చేసుకొని పనులు పూర్తయ్యేలా సహకరించాలి. కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు తొలి విడతలో 19 టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా బోర్డు చెప్పినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. రెండో విడత ఎక్కడో ఇంకా నిర్ణయించలేదు. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద ఎక్కువ నీటిని బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోంది. దీన్ని అడ్డుకునేలా టెలిమెట్రీని తక్షణం అమల్లోకి తేవాలి. -
మిడ్‌మానేరు.. ఇక జాతీయ ప్రాజెక్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామ సమీపంలో చివరిదశ నిర్మాణంలో ఉన్న మధ్యమానేరు రిజర్వాయర్ ఇక జాతీయ ప్రాజెక్టు జాబితాలో చేరనుంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీలో గురువారం ప్రకటన చేయడం జిల్లా ప్రజల్లో ఆనందం నింపింది. బోయినపల్లి(చొప్పదండి): ‘మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణానికి 2006లో టెండర్లు పిలిచారు. ఆ తర్వాత ఎనిమిదిన్నరేళ్లలో రూ.106కోట్లు ఖర్చు చేశారు. మూడేళ్లలో మేం రూ.461కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్టు కోసం 25 గేట్లు సిద్ధమయ్యాయి. రెండు, మూడు నెలల్లో గేట్లు బిగించి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అని గురువారం మిడ్‌మానేరుపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. 2లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన మిడ్‌మానేరు ప్రాజెక్టు అంశం అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్సారెస్పీ నుంచి 12 టీఎంసీల నీరు ఇక్కడకు తరలించడంతో ఎస్సారెస్పీలో నీటి లభ్యత లోటు ఏర్పడిందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మంత్రి హరీశ్‌రావు మిడ్‌మానేరుపై పూర్తి వివరణ ఇచ్చారు. అలాగే సింగూర్ ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి విడుదల చేసి లోటు పూడుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలు 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మధ్యమానేరుకు రూపకల్పన చేశారు. ఈ సమయంలోనే నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు 122 కిలోమీటర్ల పొడవున వరదకాలువ నిర్మించారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న తర్వాత పోటెత్తే వరదనీరును వరదకాలువ ద్వారా మిడ్‌మానేరులోకి తరలించేందుకు వీలుగా నిర్మించారు. వైఎస్సార్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.461కోట్లు ఖర్చు చేయడంతో పది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రత్యేక గుర్తింపు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉన్న ప్రాజెక్టుగా మధ్యమానేరు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) జాబితాలో మిడ్‌మానేరు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు 25 శాతం నిధులు వస్తాయని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో కాంక్రిట్ పనులు 4.8లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సి ఉంది. 2006 నుంచి ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేవరకు కేవలం 50వేల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 4.10లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేశారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పనుల కోసం ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీరు 5.20 టీఎంసీలుంది. వచ్చే నవంబర్ వరకు నీటి నిల్వ మిడ్‌మానేరు ప్రాజెక్టు ఆధారంగా మిషన్ భగీరథ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలు, 466 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా నీరు విడుదల చేసి 5 టీఎంసీలు నిల్వ చేసింది. వచ్చే ఏడాది నవంబర్ వరకు మిడ్‌మానేరులో ఇది నిల్వ ఉంటుందని ఎస్ఈ శ్రీకాంత్‌రావు చెప్పారు. ఈలోగా ప్రాజెక్టుకు 25 గేట్లు బిగించి పూర్థిస్థాయిలో నీరు నిల్వ చేయాలని భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 2018 మార్చి వరకు మిడ్‌మానేరు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. పెరగనున్న భూగర్భజలాలు మిడ్‌మానేరులో ఏడాదిపాటు 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే.. బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్, కొదురుపాక, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం రుద్రవరం, సంకెపెల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా తదితర ముంపు గ్రామాల పరిధిలోని పునరావాస కాలనీల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశముంది. -
జాతీయ ప్రాజెక్టుగా ‘కాళేశ్వరం’!
► ప్రస్తుత ప్రాజెక్టు పూర్వాపరాలతో నివేదిక తయారీకి సీఎం ఆదేశం ► ఆగమేఘాలపై సీఎస్‌కు నీటిపారుదలశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేస్తూ కొత్తగా చేపట్టిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకానికి కేంద్ర జాతీయ హోదా దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫిబ్రవరి రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తుండటం, ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరడంతో ప్రస్తుత డీపీఆర్‌తోపాటు ప్రాజెక్టు పూర్వాపరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీంతో ఆగమేఘాలపై కదిలిన ఉన్నతాధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఈ నివేదికను అందజేశారు. ఇక మిగిలింది చర్చలే ఇప్పటికే సిద్ధమైన కాళేశ్వరం డీపీఆర్ ప్రకారం మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి అక్కడ్నుంచి గోదావరి నదీ మార్గం ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో 19 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు నిర్మించాలని ప్రణాళిక వేశారు. మొత్తంగా బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాల కోసం రూ. 10,200 కోట్లతో అంచనాలు సిద్ధమవగా ఎల్లంపల్లి దిగువన సైతం పలు రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు, పలుచోట్ల తగ్గింపునకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేవలం మేడిగడ్డ ముంపునకు సంబంధించి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర చర్చలు, ఒప్పందాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇవి కొలిక్కి వస్తే కాళేశ్వరానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగినట్లే. అదీగాక ముఖ్యమైన పర్యావరణ, అటవీ, గిరిజన సలహా మండలి ఆమోదం కాళేశ్వరానికి అవసరం లేదు. గోదావరి నదీ ప్రవాహాన్ని వాడుకుంటూనే మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నీటి తరలింపు ఉండటం, ఎల్లంపల్లి దిగువన ఇప్పటికే అవసరమైన అనుమతులు ఉండటంతో కొత్త అనుమతులు అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని ప్రధానికి మరోసారి నివేదించాలని నిర్ణయించింది. -
పోలవరంపై బీజేపీలో అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళ్లారు అని వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం ఇబ్బందే కాదని, ఇక్కడ పనులు చేపట్టడమే సమస్య అని తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు పనులకు అంచనాలు తయారు చేసి, పనులకు సంబంధించిన బిల్లును కేంద్రానికి అందజేస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో స్పష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరును మార్చడం సరికాదని.. అభిప్రాయపడ్డారు. పుష్కరాల అవినీతిపై విచారణ జరుగుతోంది గోదావరి పుష్కర పనుల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు స్నాన ఘట్టాల గుర్తింపు, దేవాదాయ శాఖ తరుఫున చేట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. -
పట్టిసీమ ప్రహసనం
మరి మూడేళ్ళలో (2018 కల్లా) జాతీయ ప్రాజెక్టుగా పోలవరం సాకారం అవుతుందంటూ ఘంటాపథంగా ప్రకటిస్తున్న చంద్రబాబునాయుడు పట్టిసీమను ఎందుకు కట్టవలసివస్తోందో ప్రజలకు వివరించకుండానే పనులు ప్రారంభించారు. వరదలో ఉన్న గోదావరి నీటిని వరదలో ఉన్న కృష్ణలోకి పంపుతామంటున్నారు. నీటిని నిల్వ చేసే వ్యవస్థలేని పట్టిసీమ ఎందుకనే ప్రశ్నకు సమాధానం లేదు. ‘నది లేని చోట సైతం వంతెన నిర్మిస్తానంటూ వాగ్దానం చేసే రాజకీయ వాదులు ప్రపంచం అంతటా ఉంటారు’ అంటూ ప్రచ్ఛన్న యుద్ధంలో సోవి యట్ యూనియన్‌కు నాయకత్వం వహించిన ప్రధాని నికితా కృశ్చవ్ చమత్క రించాడు (పొలిటీషియన్స్ ఆర్ ది సేమ్ ఆల్ ఓవర్. దే ప్రామిస్ టు బిల్డ్ బ్రిడ్జ్ ఈవెన్ వేర్ దేర్ ఈజ్ నో రివర్). కృశ్చవ్ 1971లోనే స్టాలిన్ ఉన్న చోటికి వెళ్ళి పోయాడు. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు సోవియట్ యూనియన్ పతనం ప్రచ్ఛన్న యుద్ధానికి చరమగీతం పాడింది. అమెరికా ఒకే ఒక అగ్రదేశంగా, మార్కెట్ ఎకానమీ ఒకే ఒక అభివృద్ధి నమూనాగా నిలిచాయి. అనేక దేశాలలో పరిపాలనా వ్యవస్థలు మారిపోయాయి. డబ్బు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, డబ్బు అన్నిటినీ శాసించడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు సంవత్సరాలకోసం రూ.1,300 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తికి ఎందుకు ఎత్తుతున్నారో, కొత్త రాజధాని నిర్మాణం పేరుతో సింగపూరు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో, డబ్బు చేయడం తెలిసిన వ్యక్తులనే తన చుట్టూ ఎందుకు పెట్టుకున్నారో, భూమి స్వాధీనం చేసుకోవడంకోసం రైతులనూ, జాల ర్లనూ, ఇతరులనూ ఎందుకు వేధిస్తున్నారో అర్థం చేసుకోవాలంటే ఈ నేపథ్యం తెలుసుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం సక్రమంగా ప్రారంభించిన పని సగం అయినట్టే (వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్) అని అంటారు. కానీ ప్రారంభించిన వెనువెంటనే పని పూర్తి కావడం కనికట్టు. ఇది హస్తవాసి కాదు. హస్తలాఘవం. మార్చి 29న పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ఆరు మాసా లు పూర్తి కాలేదు. అప్పుడే ఆ స్కీమ్‌ను జాతికి అంకితం చేసేశారు. పట్టిసీమతో కానీ, పోలవరంతో కానీ ఏ మాత్రం ప్రమేయం లేకుండానే గోదావరి నీటిని తాడిపూడి ప్రాజెక్టు దగ్గర తోడి పోలవరం కుడి కాలువ ద్వారా బుడమేరులోకి పంపించి విజయవాడలో కృష్ణా బరాజ్‌లోకి పారించే విధంగా చాతుర్యం ప్రద ర్శించారు. పోలవరం కుడి కాలువలో గోదావరి నీరు కృష్ణా జిల్లాలోకి ప్రవేశిం చగానే నదుల అనుసంధానం జరిగిపోయిందంటూ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు కేరింతలు కొడుతూ సంబరం చేసుకుంటున్నారు. ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అంటూ సినీకవి చెప్పినట్టు జగమే మాయ అనుకుంటూ లేనిది ఉన్నట్టు భ్రమిస్తూ అవాస్తవ జగత్తులో విహరించేవారికి ఎదురేమున్నది? ఎన్నికలలో గట్టెక్కి అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ప్రజలతో నిమిత్తం లేదు. ప్రజల పేరు మీద పాలకులు ఏమి చేసినా ప్రశ్నించకూడదు. ప్రతిపక్షం చట్టసభలలో నిలదీస్తే అచ్చన్నాయుడినీ, బుచ్చయ్య చౌదరినీ ప్రయోగిస్తారు. వీధులలో పోరాటం చేస్తే పోలీసు బలగంతో అణచివేస్తారు. మంత్రులకూ, అధికార పక్షానికి చెందిన శాసనసభ్యులకూ చంద్రబాబు నాయుడు వ్యూహాలలో, ఎత్తుగడలలో చాలావరకూ అంతుబట్టవు. ఒకటీ అరా చూచాయగా తెలిసినా వివరాలు అడిగే సాహసం చేయరు. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షానికి రాష్ట్రంలో వెన్నెముక లేదు. వేగుల ద్వారా తన మంత్రిమండలి సభ్యుల గురించే కాకుండా దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన సమాచారం సైతం తెప్పించుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ తప్పు జరుగుతున్నా, ప్రజాధనం వృధా అవుతున్నా అదుపు చేయరు. మిత్ర పక్షం ఆత్మరక్షణలో ఉండటమే మంచిదనే అభిప్రాయం. వారి ఆరాటంలో వారు నిర్విరామంగా ఉంటే ప్రత్యేక హోదా అంటూ, పోలవరం ప్రాజెక్టుకు నిధు లంటూ ఒత్తిళ్ళు ఉండవు. రాష్ట్రంలో ఏమి చేసుకున్నా చూసీచూడనట్టు పోవ డమే మేలన్నది మోదీ మనోగతం కావచ్చు. అందుకే ముఖ్యమంత్రి ఏది చేయ దలుచుకుంటే అది చేయగలుగుతున్నారు. కే ంద్రం పట్టించుకోదు. మం త్రివర్గంలో ప్రతిఘటన లేదు. శాసనసభాపక్షంలో ఎదురు లేదు. ప్రతిపక్షాన్ని ఆలకించే సమస్య లేదు. దబాయింపు రాజకీయం రాజ్యం చేస్తున్నప్పుడు నష్ట పోయేది ప్రజలే కాదు. పాలకులు కూడా. తప్పు తెలుసుకొని సవరించుకునే అవకాశం ఉండదు. అడుగు కదలని పోలవరం మరి మూడేళ్ళలో (2018 కల్లా) జాతీయ ప్రాజెక్టుగా పోలవరం సాకారం అవు తుందంటూ ఘంటాపథంగా ప్రకటిస్తున్న చంద్రబాబునాయుడు పట్టిసీమను ఎందుకు కట్టవలసి వస్తోందో ప్రజలకు వివరించకుండానే పనులు ప్రారంభిం చారు. వరదలో ఉన్న గోదావరి నీటిని వరదలో ఉన్న కృష్ణలోకి పంపుతా మంటున్నారు. నీటిని నిల్వ చేసే వ్యవస్థ లేని పట్టిసీమ ఎందుకనే ప్రశ్నకు సమాధానం లేదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మిస్తే జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకూ, ఎడమ కాలువ ద్వారా గోదావరి జిల్లాలకూ, విశాఖపట్టణం జిల్లాకూ నీరు భూమ్యాకర్షణశక్తి వల్ల ప్రవహిస్తుంది. ఇప్పటికే ఉన్న తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల స్కీమ్‌లు విద్యుచ్ఛక్తిని వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోయవలసిన అగత్యం అప్పుడు ఉండదు. పోలవరం కుడికాలువ ద్వారా నీరు కృష్ణా డెల్టాకు ప్రవహిస్తున్నప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల అక్కర ఉండదు. నిజంగానే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి విశ్వసిస్తుంటే పట్టిసీమపైన రూ.1,300 కోట్లు పోయడం దండగమారి పని. పోలవరం నిర్మాణం ఇప్పట్లో సాధ్యం కాదని ముఖ్యమంత్రికి స్పష్టంగా తెలిసి ఉంటే 2018 నాటికి పూర్తవుతుందని ప్రకటించడం వంచన. ఆత్మవంచనో, పరవంచనో తెలియని అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధానంలో పరస్పర విరుద్ధమైన అంశాలే కాకుండా అయోమయం కలిగించే అంశాలు కూడా ఉన్నా యని మాజీ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ హనుమంతరావు వ్యాఖ్యానించింది ఇందుకే. ఏమి ఆశించి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారో తెలియదు. తెలిసిన వారు చెప్పరు. ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవలసిందే. తెలుగు దేశం ప్రభుత్వం పట్ల ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి శనివా రంనాడు బందరు సమీపంలో మంత్రిని ప్రజలు తరిమిన తీరూ, విజయనగరం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణం కోసం వందల ఎకరాలు సమీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ భోగాపురం మండలం రైతులు మండిపడుతున్న వైనం, శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు రేవు నిర్మాణం కోసం గ్రామాలు ఖాళీ చేయడానికి నిరాకరిస్తూ జాలర్ల కుటుంబాలు పోరాటం చేస్తున్న విధానం గమనిస్తే చాలు. తమ పట్ల నిర్లక్ష్యం, వివక్ష కొనసాగుతున్నాయను కుంటూ రాయలసీమ ప్రజలు రగిలిపోవడం చూస్తే అర్థం అవుతుంది పాలకుల పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో. దబాయింపు రాజకీయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పట్టిసీమను తాగునీటికోసం, పరి శ్రమల వినియోగానికి నీరు అందించడంకోసం ఉద్దేశించినట్టే ఉన్నది. కృష్ణా డెల్టా గురించి కానీ రాయలసీమ గురించి కానీ ప్రస్తావన లేదు. ఇంత అస్ప ష్టంగా జీవో ఎందుకు ఇచ్చారని అడిగినవారిని అభివృద్ధి నిరోధకులటూ నింది స్తారు. రాయలసీమకు నీరివ్వడం ఇష్టం లేదా అంటూ దబాయిస్తారు. సంగతి చూస్తామంటూ తర్జని చూపిస్తూ బెదిరిస్తారు. దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఇంత హాస్యాస్పదమైన, వివాదాస్పదమైన సందర్భం క నలేదు. వినలేదు. మనసులో ఒకటి చేతల్లో మరొకటి. చెప్పింది చేయరు. చేసేది చెప్పరు. శనివారంనాడు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పను లను పరిశీలించిన బీజేపీ బృందంలో కామినేని శ్రీనివాస్ అనే మంత్రివర్యుడు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల బీజేపీ నాయకులు అసంతృప్తి వెలిబుచ్చారు. అదే విషయం మంత్రివర్గ సమావేశంలో సదరు మంత్రి చెప్పరు. ముఖ్యమంత్రికి నివేదించరు. అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని దృష్టికి తీసుకొని వెళ్ళరు. మీడియాకు చెబుతారు. ఇది కేవలం రాజకీయ విన్యాసం. పోలవరం పనులు జరగకపోవడానికి ఎవరు కారణం? విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్ర నిధులతో పనులు సమస్తం జరగాలి. తెలంగాణలోని అయిదు మండలాలనూ ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైతే కేంద్ర ప్రభుత్వం చేసింది కానీ పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకోసం కేటాయించింది సిబ్బంది వేతనాలకు సరిపోదు. 25 వేల కోట్లు అవసరమైన ప్రాజెక్టు సంవ త్సరానికి వెయ్యి కోట్లు కేటాయిస్తే ఎన్నేళ్ళకు పూర్తవుతుంది? ఏయే పనులు జరగడం లేదని అసంతృప్తిగా ఉన్నారో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబు, ఇతర నాయకులు ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రం చేయవలసిన పను లేమిటో, కేంద్రం చేయవలసిన పనులేమిటో వివరించాలి. ఎందుకు పనులు జరగడం లేదో చెప్పాలి. సుప్రీంకోర్టులో కేసులు పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోలేదు. అనేక కేసులు ఇప్ప టికీ సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నాయి. పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ నేషనల్ ఎన్విరాన్మెంట్ అపిలేట్ అథారిటీ 2007 డిసెంబరు 19 ఉత్తర్వు జారీ చేసింది. దాన్ని వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసి స్టే తెచ్చుకుంది. కానీ హైకోర్టులో విచారణ జరగలేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ కేసుకు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు పంపించారు. పోలవరానికి సంబంధించి ఇతర కేసులతో పాటు ఇది కూడా విచారణకు నోచుకోకుండా పడి ఉంది. పోలవరం పనులు చేసుకోవచ్చు నంటూ ఇటీవల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జావ్దేకర్ మౌఖికంగా చెప్పా రు. లిఖిత పూర్వకంగా ఎటువంటి అనుమతీ రాలేదు. ఎన్డీఏకి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ మద్దతు రాజ్య సభలో అవసరం. పోలవరం ప్రాజెక్టును పట్నాయక్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మొత్తం 26 గ్రామాలే మునిగిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంటే వంద గ్రామాల దాకా మునుగుతాయని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వాదిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రామన్‌సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇటువంటి పరిస్థితులలో పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా నిధులు అందించి ప్రోత్సహించే అవకాశాలు తక్కువ. ఈ విషయం తెలిసే ఏదో ఒక ప్రాజెక్టు నిర్మించి చూపించాలనే సంకల్పంతో పట్టిసీమను చంద్రబాబునాయుడు పట్టు కున్నారని అనుకోవాలి. నిజంగానే పోలవరం లేకుండా నదులు అనుసంధానం చేయాలని అను కున్నా పట్టిసీమతో పని లేదు. గోదావరి కుడి ఒడ్డున తాడిపూడి, ఎడమ ఒడ్డున పుష్కరం ఉన్నాయి. కొరవ ఉన్న పనులు పూర్తి చేసి తాడిపూడి స్థాయిని పెంచు కుంటే పట్టిసీమ లేకుండానే పోలవరం కుడికాలువకు గోదావరి నీరు పంప వచ్చు. కానీ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు 80 టీఎంసీల నీరు పంపడం అసా ధ్యం. తాడిపూడి సామర్థ్యం 1,100 క్యూసెక్కులు. కానీ ఇప్పుడు 600 క్యూసె క్కుల నీరు మాత్రమే ఎత్తిపోయగలుగుతున్నారు. వారం రోజుల కిందట గోపా లపురం దగ్గర పోలవరం కుడికాలువలోకి పంపింది వర్షపు నీటితో కలిపి 600 క్యూసెక్కుల కంటే ఎక్కువ ఉండదు. 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించవల సిన కాలువలో ఇంత తక్కువ ప్రమాణం నీరు పంపితే అది పిల్ల కాలువ అవు తుంది. బుడ మేరు చేరేవరకూ నీటి పరిమాణం ఇంకా కొంత తగ్గిపోతుంది. పట్టిసీమలో 13 పంపులతో నీరు ఎత్తిపోయాలని సంకల్పించారు. మొదటి పంపు ఇంకా రావలసి ఉంది. దాని సామర్థ్యం 300 క్యూసెక్కులు ఉంటుంది. ఒక్క పంపు కూడా రాకుండా పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం, నదుల అనుసంధానం జరిగిపోయినట్టు సంబరాలు చేసుకోవడం ఆత్మవంచన కాక ఏమవుతుంది? - కె.రామచంద్రమూర్తి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ -
జాతీయ ప్రాజెక్టులకు సాంకేతిక సాయం
ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలను కనుక్కునేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) మరింత నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డెరైక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్‌తోపాటు, స్వాస్థ్య భారత్, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ డిజిటల్ ఇండియా, నమామి గంగా వంటి ప్రాజెక్టుల సత్వర అమలుకు అవసరమైన సాంకేతికతను సీఎస్ఐఆర్కు చెందిన 37 పరిశోధన సంస్థలు అభివృద్ధి చేస్తాయని గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. ఇటీవల డెహ్రాడూన్‌లో ముగిసిన సీఎస్ఐఆర్ డెరైక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయమంత్రి వై.ఎస్.సుజనా చౌదరిలు పాల్గొన్న ఈ సమావేశంలో ‘డెహ్రాడూన్ డిక్లరేషన్’ పేరుతో ఓ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేశామని వివరించారు. పరిశోధన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కంపెనీలు స్థాపించేలా చర్యలు తీసుకోవడం, ఏడాదికి కనీసం 12 టెక్నాలజీలను జనబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం, పేదల జీవన ప్రమాణాలను పెంచే టెక్నాలజీలకు ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలను ప్రణాళికలో పొందుపరిచినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు. చౌక మందులపై దృష్టి: డెహ్రాడూన్ డిక్లరేషన్‌లో భాగంగా తాము పారసిటమాల్, ఐబూబ్రూఫిన్ వంటి అత్యవసర మందుల తయారీకి అవసరమైన రసాయనాలను చౌకగా ఉత్పత్తి చేయడంపై దృష్టిపెట్టామని ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. గంగా నది శుద్ధికి సంబంధించిన నమామి గంగ ప్రాజెక్టులోనూ ఐఐసీటీ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. నల్లగొండలో మరిన్ని నీటి శుద్ధి కేంద్రాలు: నీటిలోని ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు ఐఐసీటీ అభివృద్ధి చేసిన టెక్నాలజీని నల్లగొండ జిల్లాలో మరింత విసృ్తతంగా వాడాలని నిర్ణయించామని చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆ జిల్లాలో మూడు డీ ఫ్లోరినేషన్ ప్లాంట్లు నడుస్తున్నాయని, ఏదైనా స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. -
పట్టిసీమ ఎత్తిపోతలు ఎందుకంటే...
ఆ ప్రాజెక్టుపై పార్టీ నేతలకు బాబు పాఠాలు సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై సొంత పార్టీ నేతలను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక తంటాలు పడుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయడానికి వీలున్న తరుణంలో మధ్యలో పట్టిసీమపై వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు సొంత పార్టీ నేతలకు ఆ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలు జరుగుతున్నపుడు రెండు సార్లు టీడీపీ శాసనసభా పక్షం సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దాని ప్రాధాన్యతను వివరించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు కూడా అలాంటి క్లాసులే సుదీర్ఘంగా తీసుకోవడం విశేషం. ఇదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయాలంటూ వారికి ఉపదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలు, టీడీపీకి చెందిన జిల్లా పరిషత్ ప్రతినిధులతో చంద్రబాబు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పట్టిసీమ ఎజెండాగా సాగిన ఈ సమావేశానికి లోకేశ్ కూడా హాజరయ్యారు. ప్రతిపక్షాల నుంచి ఈ ప్రాజెక్టుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయని, వాటిపై నేతలంతా స్పందించాలని నేతలకు ఆదేశించినట్లు సమాచారం. -
దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి
రాయలసీమ మహాసభ తీర్మానం కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాసభ కేంద్ర కమిటీ అధ్యక్షుడు శాంతి నారాయణ ప్రతిపాదించిన పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. దుమ్ముగూడెం వల్ల 160 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం నుంచి సీమ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవచ్చన్నారు. -
కన్నీరే మిగిలింది
పోలవరం ప్రాజెక్టును నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడం, ఆర్డినెన్స్ ద్వారా కార్యాచరణకు పునాదులు వేయడం తెలుగుజాతి సంతోషించదగ్గ పరిణామం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది. ఈ విభజన తెచ్చిన సవాళ్ల గురించి సమీక్షించుకోవాల్సిన తరుణమిది. రెండు మూడు రాష్ట్రాల రాజధానులను ఇముడ్చుకోగలిగిన హైదరాబాద్‌ను వదులుకుని నాలుగైదు లక్షల కోట్లు వెచ్చించి కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి రావడం పెద్ద విషాదం. ఇప్పుడు రాజధానిని నిర్మించుకుని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, విద్యుత్ ప్రాజెక్టులను, పారిశ్రామికాభివృద్ధినీ, గ్రామీణాభివృద్ధినీ రైతాంగ ప్రయోజనాలను కాపాడగలిగే విధానంతో ప్రణాళికలను రూపొందించుకోవాలి. కృష్ణా, గోదావరి జలాలను అత్యధికంగా విని యోగించుకోగల సానుకూల అంశం మన రాష్ట్రానికి ఉన్నది. పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు దిగువన ఉన్నందున కరువులు, వరదలు, సంభవించినప్పుడు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ఎక్కువ నీటిని మన రాష్ట్రానికి బచావత్ కమిషన్ కేటాయించింది. ఈ నదులపై ఆధారపడి తెలంగాణ, సీమాంధ్రలలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో రాష్ట్రానికి తప్పనిసరిగా లభించే మిగులు జలాల ఆధారంగా నిరంతరం కరువులకు గురయ్యే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలూ, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, కోయిల్‌సాగర్, భీమ ప్రాజెక్టులు ఇందులో ప్రధానమైనవి. పోలవరం ప్రాజెక్టును నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడం, ఆర్డినెన్స్ ద్వారా కార్యాచరణకు పునాదులు వేయడం తెలుగుజాతి సంతోషించదగ్గ పరిణామం. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్! హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్న భావన తెలుగుజాతిలో ఏర్పడింది. లక్షల కోట్లు సీమాంధ్రులు పెట్టుబడిగా పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో భాగస్వాములయ్యారు. కానీ కొందరు తెలంగాణ ప్రాంత నాయకులు సీమాంధ్రులను దోపిడీదారులని, తమ హక్కుల్ని హరించి నాగరికతను ధ్వంసం చేశారని, తమ ఉద్యోగాలను లాక్కున్నారని నిరంతరం ప్రచారం చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోయాక కర్నూలుకు ఒక మారు, కర్నూలు నుండి హైదరాబాద్‌కు ఒక మారు రాజధానులు మారాయి. నేడు మరో రాజధానిని సీమాంధ్ర ప్రజలు ఎంచుకోవలసి రావడం భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ జాతికి జరగనంతటి అవమానం. నేడు రాజధాని కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేసుకోవడం దురదృష్టకరం. సీమాంధ్రను ఆదుకోవాలనీ, పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలనీ విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలనీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిరావడం దారుణం. సమైక్యాంధ్రలో లభించే ఆదాయ వనరులతో తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే ధ్యేయంగా 2004-09 మధ్య ైవె ఎస్ సాగించిన పాలనకు నేటికి ఎంత తేడా ఉందో చూస్తున్నప్పుడు తెలుగోడి ఆత్మగౌరవం చిన్నబోతోంది. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన దీక్షలు, పోరాటాలు, పర్యటనలు, సభలు, సమావేశాలు ఒక సమరాన్నే తలపించనప్పటికి రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలంగాణ , సీమాంధ్రగా విడిపోయినప్పటికి ఇరురాష్ట్రాలలో తెలుగు ప్రజల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పాటుపడతామని వైఎస్సార్సీపీ పేర్కొనడం అభినందనీయం. రాష్ట్రంలో అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కారాదు. అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వరంగ పరిశ్రమలు, విద్యాలయాలు, విమానయాన సౌకర్యాలు, ఓడరేవులు, పరిశ్రమల ఏర్పాటు చేపట్టాలి. స్మార్ట్ సిటీలు పది ప్రాంతాల్లో విస్తరిస్తాయని చెప్పడం శుభసూచకం. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇతరులపై దుమ్మెత్తిపోయడమే ఒక విధానంగా చేపట్టే నాయకులు ఇక నుంచైనా నిర్మాణాత్మాక కార్యక్రమాలకు, విలువలతో కూడిన రాజకీయాలకు చోటుయిచ్చి ప్రజలలో భవిష్యత్ పట్ల ఆశను, ఆసక్తిని కల్పించాలి. (వ్యాసకర్త కదిలిక సంపాదకుడు) -
63 పేజీలు, 13 షెడ్యూళ్లు
=ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం =పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ పరిధి ఉన్నత, సాంకేతిక, వైద్యవిద్య ప్రవేశాలకు పదేళ్ల పాటు ప్రస్తుత విధానమే పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇరు రాష్ట్రాల్లో రిజర్వ్డ్ నియోజకవర్గాల పునర్విభజన గోదావరి, కృష్ణా జలాల నిర్వహణకు సర్వోన్నత మండళ్లు కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులు ప్రాజెక్టుల అజమాయిషీకి 2 నదులకు వేర్వేరు బోర్డులు కృష్ణా బోర్డు ఏపీలో, గోదావరి బోర్డు తెలంగాణలో వాటి చైర్మన్లు, సభ్యులను నియమించేది కేంద్రమే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 సోమవారం అసెంబ్లీకి చేరింది. 13 షెడ్యూళ్లతో కూడిన ఈ 63 పేజీల బిల్లులో కేంద్ర కేబినెట్‌కు కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లులోని వివరాలే కొన్ని చిన్న సవరణలు మినహా యథాతథంగా ఉన్నాయి. ముసాయిదా బిల్లులో తెలంగాణలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలను పొందుపరచలేదు. వాటిని తాజా బిల్లులో చేర్చారు. అలాగే హైదరాబాద్‌లోని ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యల్లో సీమాంధ్రులకు ఐదేళ్ల పాటు అవకాశాలను కల్పిస్తామని ముసాయిదాలో పేర్కొనగా కేబినెట్ నిర్ణయం తర్వాత దాన్ని పదేళ్లకు పెంచారు. ముసాయిదాలోని మిగతా అంశాలన్నిటినీ యథాతథంగా బిల్లులో పొందుపరిచారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి... = గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి పదేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్టం రూపు దాల్చిన తర్వాత 45 రోజులకు మించకుండా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై నిపుణుల కమిటీ సిఫార్సులు చేస్తుంది. =ప్రస్తుత గవర్నరే ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ఆయన పదవీ కాల పరిమితిని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. =ఉమ్మడి రాజధానిలో నివసించే వారి ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రత తదితరాలను కాపాడే ప్రత్యేక బాధ్యత గవర్నర్దే. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదించి, తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. దాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదు. కేంద్రం నియమించిన ఇద్దరు అధికారులు గవర్నర్‌కు సలహాదారులుగా ఉంటారు. =ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్‌గా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవాలి. =ఇరు రాష్ట్రాలకు శాసనమండలి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మండలిలో గరిష్టంగా 50 మంది, తెలంగాణ మండలిలో గరిష్టంగా 40 మంది సభ్యులుంటారు. =ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలను నిర్ణయించేందుకు ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను ఎన్నికల సంఘం చేపడుతుంది =ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ప్రస్తుత హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుంది =జనాభా ప్రాతిపదికన రాష్ర్టం వెలుపలి ఆస్తుల పంపకం =జనాభా ప్రాతిపదికనే పింఛన్ల భారం పంపకం =ఐఏఎస్ సహా అఖిల భారత సర్వీసులకు ఇరు రాష్ట్రాలకు రెండు ప్రత్యేక కేడర్లు =ఉద్యోగుల స్థానిక, జోనల్ వ్యవస్థ కొనసాగుతుంది. ఈ కేటగిరీలో ఎక్కడి ఉద్యోగులక్కడే = ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటయ్యేదాకా అక్కడి అవసరాలను రాష్ట్రపతి ఆమోదంతో యూపీఎస్సీ తీరుస్తుంది. = గోదావరి, కృష్ణా జలాల నిర్వహణ కోసం సర్వోన్నత మండళ్ల ఏర్పాటు. కేంద్ర జలవనరుల మంత్రి చైర్‌పర్సన్‌గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. నదీ జలాలు, ఇతర విషయాల పరిశీలనకు గోదావరి, కృష్ణాలపై వేర్వేరుగా నిర్వహణ బోర్డుల ఏర్పాటు. గోదావరి బోర్డు తెలంగాణ పరిధిలో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ పరిధిలో పని చేస్తాయి. ఈ బోర్డులకు చైర్మన్‌ను, సభ్యులను కేంద్రమే నియమిస్తుంది. రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటి నుంచి నీటి విడుదల తదితరాలు ఈ బోర్డుల అజమాయిషీలో ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే వాటికి సంబంధించి కూడా ఈ బోర్డే నిర్ణయం తీసుకుంటుంది. =పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా =ఎక్కడి ప్రాంత విద్యుత్ ప్రాజెక్టులు వారికే. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కొనసాగింపు. సీమాంధ్రలోని మిగులు విద్యుత్‌పై పదేళ్ల పాటు తెలంగాణకే మొదటి తిరస్కార హక్కు (అంటే తొలుత తెలంగాణకు ఇవ్వజూపి, వద్దంటేనే ఇతర రాష్ట్రాలకు విక్రయించాలి) =ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, మండలితో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం =ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ కాలేజీల్లోనూ ప్రస్తుతమున్న అడ్మిషన్ల కోటా పదేళ్లపాటు యథాతథం =ఇరు రాష్ట్రాలకు 371డి వర్తింపు ఏ షెడ్యూల్లో ఏముందంటే... బిల్లులో మొత్తం 13 షెడ్యూళ్లున్నాయి. వాటి వివరాలు... 1వ షెడ్యూల్: రాష్ట్రంలోని రాజ్యసభ సభ్యుల వివరాలు 2వ షెడ్యూల్: తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాల వివరాలు 3వ షెడ్యూల్: విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లోని శాసనమండలి నియోజకవర్గాల వివరాలు 4వ షెడ్యూల్: సమైక్య రాష్ట్రంలోని శాసనమండలి సభ్యుల వివరాలు 5వ షెడ్యూల్: తెలంగాణలోని ఎస్సీ కులాల జాబితా 6వ షెడ్యూల్: తెలంగాణలోని ఎస్టీ కులాల జాబితా 7వ షెడ్యూల్: సమైక్య రాష్ట్రంలోని మొత్తం 41 రకాల నిధుల వివరాలు 8వ షెడ్యూల్: ఉద్యోగుల పింఛన్ల బాధ్యత పంపిణీ 9వ షెడ్యూల్: ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల వివరాలు 10వ షెడ్యూల్: 42 శిక్షణ సంస్థలు/కేంద్రాల వివరాలు 11వ షెడ్యూల్: నదీ జలాల నిర్వహణ బోర్డులు, విధి విధానాలు 12వ షెడ్యూల్: బొగ్గు, ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల పంపిణీ 13వ షెడ్యూల్: విద్య, మౌలిక సదుపాయాల వివరాలు రాష్ట్రపతి లేఖలో ఉన్నదిదీ..! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన లేఖలో ఏముంది.? అందులో ఆయన ఏం పేర్కొని ఉంటారు? ఆసక్తికరమైన ఆ లేఖను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం సభ ముందుంచారు. రాష్ట్రపతి లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది... ‘‘కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్లందరితో అన్ని అంశాలపై విస్తృతస్థాయిలో సంప్రదింపుల అనంతరం, రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరవాత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ల్లు-2013లో తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తత్సంబంధిత అంశాలతో సాధ్యమైనంత త్వరలో ఆచరణాత్మకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ ప్రతిపాదిత బిల్లుతో కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు ప్రభావితం కానున్నాయి. భారత రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఈ ప్రతిపాదిత ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ల్లు-2013’పై రాష్ట్ర శాసనసభ 2014 జనవరి 23 లోగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నాను’’ ఏడాది వరకే ఉమ్మడి ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు పదేళ్లకు మించకుండా ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు.. ఒక ఏడాది వరకు ఉన్నత విద్యామండలి రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తుందని పేర్కొంది. ఏడాదివరకు లేదా రెండు రాష్ట్రాలు అంగీకరించిన వ్యవధి వరకు ప్రస్తుత ఉన్నత విద్యామండలి, ఇంటర్మీడియెట్ బోర్డు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తదితర సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలని పేర్కొంది. అయితే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశపరీక్షలు ఉండాలనే నిబంధన ఉన్న కారణంగా రెండు రాష్ట్రాలు కలిపి ప్రవేశపరీక్షల నిర్వహణకు, ప్రవేశాల కల్పనకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పే అవకాశం ఉంది. చెరో గిరిజన విశ్వవిద్యాలయం.. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ-బోధనాసుపత్రి ఏర్పాటుచేయడంతో పాటు రెండు రాష్ట్రాల్లో చెరో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయనున్నట్టు బిల్లులో పేర్కొంది. అలాగే తెలంగాణలో ఒక హార్టికల్చరల్ వర్సిటీ ఏర్పాటవుతుందని తెలిపింది. కానీ ఈ వర్సిటీని ఎవరు ఏర్పాటు చేస్తారో పేర్కొనలేదు.