nedurumalli janardan reddy
-
రాజ్యసభ ఖాళీ సీట్ల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్
ఏపీలో నేదురుమల్లి మరణంతో ఖాళీ అయిన స్థానం న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంతో పాటు.. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు జూలై 3న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా నేదురుమల్లి గత నెల 9వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ స్థానంతో పాటు తమిళనాడులో టి.ఎం.సెల్వగణపతి మరణంతో ఖాళీ అయిన స్థానం.. ఒడిశాలో శశిభూషణ్‌బెహ్రా, రబినారాయణ్ మహాపాత్రల రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కలిపి మొత్తం నాలుగు స్థానాల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల తుది గడువు ఈ నెల 23వ తేదీగా ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు 24వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. వచ్చే నెల (జూలై 3న) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించింది. -
కిరణ్ పలకరింపు.. రఘువీరా చిరునవ్వు!
నేదురుమల్లి సంతాపసభలో తారసపడిన ఇద్దరు నేతలు.. కలవని మాటలు హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనాంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రఘువీరారెడ్డిలు ఎదురెదురుగా తారసపడినప్పటికీ ఇద్దరి మధ్య మాటలు కలవలేదు. తనకు సమీపంలో కూర్చున్న రఘువీరాను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బాగున్నారా ప్రెసిండెంట్ గారూ’ అని పలకరించగా.. రఘువీరా నుంచి చిరునవ్వు మాత్రమే బదులొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సంతాపసభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మితోపాటు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వేణుగోపాలరెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, దత్తాత్రేయ, రాయపాటి సాంబశివరావు, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కిరణ్‌కుమార్‌రెడ్డి తన సహచరులందరితో కలివిడిగా మాట్లాడానికి ప్రయత్నించారు. తనపక్కనే ఉన్న జానారెడ్డితో ఎక్కువగా మాట్లాడుతూ గడిపారు. పాలనాధక్షుడు నేదురుమల్లి: వక్తలు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంచి పాలనాధక్షుడని సంతాపసభలో వక్తలు కొనియాడారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు భిన్నంగా తనకు ఎంత కష్టమొచ్చినా పార్టీ వీడని వ్యక్తి అని కొనియాడారు. పార్టీపరంగా కేంద్ర స్థాయిలో తగినంత గుర్తింపు ఇవ్వకపోయినా పార్టీ మారలేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం రైతులకు లబ్ధి కలిగించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా నేదురుమల్లి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించే ప్రక్రియకు దేశంలో నాంది పలికింది నేదురుమల్లేనని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధుల పథకాన్ని ఆయన తెచ్చాకే కేంద్రం ఎంపీ లాడ్స్ పథకాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. పదవుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా, ఏ పదవీ లేనప్పడు మానవతావాదిగా నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కలిగివున్న వ్యక్తి నేదురుమల్లి అని జానారెడ్డి కీర్తించారు. 1983లో తనను రాజకీయాల్లో ప్రోత్సహించింది జనార్దన్రెడ్డినేనని మేకపాటి తెలిపారు. రాజకీయంగా పదేళ్ల విరామం తరువాత తిరిగి తాను నరసరావుపేట లోక్‌సభకు పోటీ చేయడానికి నేదురుమల్లి సహకరిస్తే, వైఎస్సార్ ఆశీర్వదించారని చెప్పారు. జనార్దన్‌రెడ్డి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడడంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని రఘువీరా తెలిపారు. -
నేదురుమల్లి స్థానానికి ఉపఎన్నిక
జూలై 3న నిర్వహణ షెడ్యూలు జారీ చేసిన ఈసీ ఏపీ నుంచి నిర్మలా సీతారామన్! పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం లేనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిన బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ను ప్రస్తుతం ఏపీ నుంచి ఖాళీ అయిన స్థానం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీకి, టీడీపీకి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. హైదరాబాద్/న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం షెడ్యూలును ప్రకటించింది. జూలై 3న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 16న జారీ చేయనుంది. 23వ తేదీ వరకు నామినేషన్లకు గడువుంది. 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ తుదిగడువు. అవసరమైన పక్షంలో ఎన్నికను జూలై 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లకు కేటాయిస్తూ రాజ్యసభ సచివాలయం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేటాయింపులో నేదురుమల్లి ప్రాతినిధ్యం వహించిన స్థానం ఆంధ్రప్రదేశ్ కోటాలోకి వెళ్లింది. సుదీర్ఘ అస్వస్థత కారణంగా నేదురుమల్లి మే 9వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. అయితే ఆయన పదవీకాలం 2016 జూలై 21 వరకు ఉంది. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక నిర్వహిస్తుండగా, ఈ స్థానం నుంచి గెలుపొందే సభ్యుని పదవీ కాలపరిమితి మిగిలిన ఒక ఏడాది 11 నెలలు మాత్రమే ఉంటుంది. దేశవ్యాప్తంగా మరో మూడు రాజ్యసభ స్థానాలకూ ఎన్నికల షెడ్యూలు.. ఇదిలా ఉండగా నేదురుమల్లి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానంతోపాటు దేశవ్యాప్తంగా మరో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలును ప్రకటించింది. టీఎం సెల్వగణపతి(తమిళనాడు) అనర్హతకు గురికావడం, ఒడిశాకు చెందిన శశిభూషణ్ బెహ్రా, రాబినారాయణ్ మహాపాత్ర లిద్దరూ రాజీనామా చేసిన కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పెద్దాయనకు తుది వీడ్కోలు
నాలుగు దశాబ్దాల పాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, నెల్లూరు పెద్దాయనగా అందరూ పిలుచుకునే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి శనివారం జిల్లావాసులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. పెద్దాయన మృతి జిల్లాకు తీరనిలోటుగా నేతలు పేర్కొన్నారు. జనార్దన్‌రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వాకాడుకు తీసుకొచ్చారని తెలియడంతో కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో వాకాడుకు చేరుకుని పెద్దాయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన స్వర్ణముఖితీరం జనసంద్రంగా మారింది. వాకాడు, న్యూస్‌లైన్ : నేదురుమల్లి నివాసానికి శనివారం ఉదయం ఆరు గంటలకు భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కడసారి నేదురుమల్లి భౌతికకాయాన్ని చూసేందుకు బారులుదీరారు. అశ్రునయనాలతో నివాళులర్పించారు. సాయంత్రం మూడు గంటల వరకు సందర్శన కోసం ఉంచారు. అనంతరం స్వర్ణముఖి తీరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలానికి వేదపండితుల మంత్రోచ్ఛణల మధ్య భౌతికకాయాన్ని తరలించారు. దారి పొడవునా ఎన్‌జేఆర్ అమర్హ్రే నినాదాలు మా ర్మోగాయి. భౌతికకాయానికి ఉంచిన చితికి నేదురుమల్లి పెద్ద కుమారుడు రాంకుమార్‌రెడ్డి నిప్పు పెట్టారు. ప్రముఖుల నివాళి రాజకీయ రంగంలో ఉద్ధండుడిగా పేరు గాంచిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ప్రముఖులు వాకాడుకు చేరుకుని ఆయనకు కడసారి నివాళులర్పించారు. నేదురుమల్లి కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేసి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య, వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మేరిగ మురళీధర్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనీల్‌కుమార్‌యాదవ్, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పసల పెంచలయ్య, అజీజ్, డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు కరణం బలరాం, జెడీ శీలం, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, చింతా మో హన్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచల బాబుయాదవ్, కొడవలూరు ధనుంజ యరెడ్డి, సీవీ శేషారెడ్డి, పనబాక కృష్ణయ్య, సినీనటుడు మోహన్‌బాబు, టీడీపీ నాయకులు బల్లి దుర్గాప్రసాద్‌రావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెలవల సుబ్రమణ్యం, నన్నపనేని రాజకుమారి, సింహపురి యూనివర్శిటీ వైస్ చాన్సలర్ రాజారామిరెడ్డి తదితరులు కడసారి వీడ్కోలు పలికారు. శోకసంద్రంలో స్వర్ణముఖి తీరం వాకాడు సమీపంలోని స్వర్ణముఖి తీరం శోకసంద్రంలో మునిగింది. నేదురుమల్లి భౌతికకాయాన్ని స్వర్ణముఖిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలికి తీసుకు రావడంతో ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నవారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. కడసారిగా పెద్దాయనకు వీడ్కోలు పలికారు. -
అభివృద్ధిలో నేదురుమల్లి ముద్ర
జ్ఞాపకాలు సాక్షి, రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శుక్రవారం మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని ఈ ప్రాంతంతో ఆయనకు గల అనుబంధాన్ని జిల్లావాసులు నెమరు వేసుకున్నారు. ఆయన హయాంలో జిల్లా అభివృద్ధిలో కీలకమనదగ్గ పనులు ప్రారంభించారు. రాజమండ్రిలో 1991లో గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందరరెడ్డితో జనార్దనరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. పుష్కరాలకు వచ్చిన సందర్భంగా ఆయన గోపాలపురం వెళ్లి సోమసుందరరెడ్డిని కలుసుకున్నారు. ఇదే ఏడాది ఏలేశ్వరంలో ఏలేరు ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1992 జూన్ 26న పి.గన్నవరంలోని కొత్త ఆక్విడెక్టుకు శంకుస్థాపన చేశారు. నక్సలైట్ల అణచివేత 1990 డిసెంబర్ 17న ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నేదురుమల్లి అధికారంలో ఉన్న కాలంలో నక్సలైట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. 1991 సంవత్సరంలో ఏఓబీలో సుమారు 250 మంది పౌరులు, 75 మంది పోలీసు జవానులు, 102 మంది నక్సలైట్లు మరణించారు. ఈ కాలంలో వీరిపై ఉక్కుపాదం మోపి రైతు కూలీ సంఘాలను అణచివేశారు. లొంగుబాట్లకు వెసులుబాటు కల్పించారు. 1992లో సుమారు 9,000 మంది పోలీసులకు లొంగిపోయారు. వీరిలో నక్సలైట్ క్యాడర్‌తో పాటు, మిలిటెంట్లు, సానుభూతిపరులు ఉన్నారు. అప్పటి నుంచి బలం, బలగం తగ్గడంతో ఉద్యమం కూడా బలహీనపడుతూ వచ్చింది. -
మన మినిస్టర్స్..
ఆదిలాబాద్ : నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి ప్రభుత్వాల్లో చిలుకూరి రాంచంద్రారెడ్డి మార్కెటింగ్, చిన్న నీటి పారుదల శాఖల మంత్రిగా పనిచేశారు. రాంచంద్రారెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పడాల భూమన్న కూడా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. నిర్మల్ : జిల్లా రాజకీయ కేంద్రంగా నిర్మల్‌కు పేరుంది. ఇక్కడి నాయకులు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిం చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవులు చేపట్టారు. పి.నర్సారెడ్డి 1964లో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించడమే కాకుండా రెండుసార్లు మంత్రి పదవులను సైతం చేపట్టారు. నర్సారెడ్డి రాష్ట్ర భారీ నీటి పారుదల, రెవె న్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారి మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఈ కాలంలో ఆయన సమాచార శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో, 1998లో జరిగిన మధ్యంతర, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొంది మరోసారి హ్యాట్రిక్ సాధించా రు. ఈ మూడు పర్యాయాలు రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ, కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అయిండ్ల భీంరెడి ్డకి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. మంచిర్యాల : లక్సెట్టిపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న మంచిర్యాల 2009లో పునర్విభజన అనంతరం మంచిర్యాల నియోజకవర్గంగా మారింది. 1967, 1972 ఎన్నికల్లో జేవీ నర్సింగారావ్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. జీవీ సుధాకర్ రావు 1985-1989 మధ్యకాలంలో స్వతంత్రంగా, 1989లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జీవీ సుధాకర్‌రావ్ రాష్ట్రంలో నీటి పారుదల శాఖ, రవాణా, చక్కెర శాఖ మంత్రి పదవులను పొందారు. చెన్నూర్ : 1967లో నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోదాటి రాజమల్లు ఆర్యోగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ నుంచి గెలుపొందిన బోడ జనార్దన్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదే కార్మిక శాఖను 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన గడ్డం వినోద్ చేపట్టారు. ముథోల్ : నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత గడ్డెన్నది. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం పొందిన గడ్డెన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కోట్ల విజయ భాస్కరరెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు. బోథ్ : లంబాడా వర్గం తొలి ఎమ్మెల్యే అమర్‌సింగ్ తిలావత్. 1978 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. టీడీపీ తరఫున గేడాం రామారావు 1985లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు నగేష్ కూడా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, జీసీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నుంచి రెండో ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్నాక భీంరావు రాష్ట్రంలోనే తొలి గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. నిజాం సర్కార్‌తో పోరాడిన స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే కావడం గర్వకారణం. సిర్పూర్ : కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన కేవీ కేశవులు 1972, 78 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో చేనేత మంత్రిగా పనిచేశారు. 1983, 85లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేవీ నారాయణరావు 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా వ్యవహరించారు.