స్టార్ స్టైలిస్ట్... నిశ్చయ్ నియోగి
హైదరాబాద్: రవీనా టండన్ నుంచి సోనాక్షి వరకు, జూహీ నుంచి శ్రద్ధాకపూర్ వరకు, రానా నుంచి రన్బీర్ సింగ్ దాకా నిశ్చయ్ నియోగీ స్టైలింగ్‌కు ఫ్యాన్సే.. చాలా మంది స్టార్స్‌కు లక్కీ మస్కట్.. స్టార్స్‌ని స్టైలిష్‌గా మార్చే ఈయన హైదరాబాదీ. ముంబైలో బిజీగా ఉండే నిశ్చయ్ నియోగి ఇటీవల ఓ అసైన్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు.. స్టైలింగ్, స్టైలిస్ట్ స్టార్స్‌పై వివరాలు ఆయన మాటల్లోనే.
మీ గురించి..
‘హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన నేను యూకేలో ఫ్యాషన్ డిగ్రీ చేసి అక్కడే 7 ఏళ్లపాటు అంతర్జాతీయ పత్రికల కు పని చేశా. సెలవుల్లో నగరానికి వచ్చిన నాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో రెయిన్బో చిత్రానికి అవకాశం వచ్చింది. దీంతో తొలి సారి స్టైలిస్ట్‌గా పనిచేశాను. ఆయన ఇచ్చిన అవకాశం నాకు టర్నింగ్ పాయింట్. ఈ విషయంలో ఆయనకు జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటా...
ముంబై కాల్..
రెయిన్బో సినివూ తర్వాత జావేద్ అక్తర్ ఫోన్ చేసి హైదరాబాద్‌లో ఏం చేస్తావ్ వెంటనే ముంబైకి రా అన్నారు. అప్పటి నుంచి 6 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నాను. అనిల్ కపూర్, జూహీ చావ్లా, ప్రియాంక చోప్రా, సోనూసూద్, శ్రద్ధా కపూర్, కృతీ సనన్, కాజోల్, తమన్నా తదితర బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్లకి స్టైలిస్ట్‌గా చేశాను. సోనాక్షిసిన్హాకు కెరీర్ ప్రారంభం నుంచి నేనే స్టైలిస్టుగా ఉన్నాను. ఆమె యాడ్స్‌కి కూడా పని చేశాను.
మీ కెరీర్లో బాగా గుర్తింపు తెచ్చినవి..
సౌత్ స్కోప్ క్యాలెండర్‌తో నాకు గుర్తింపు వచ్చింది. ఫిలింఫేర్ కోసం కంగ్నా రనౌత్‌కి చేసిన స్టైలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత సోనాక్షి స్టైలిస్ట్‌గా మరింత పాపులారిటీ వచ్చింది. ఆమెకు ఐఫా అవార్డ్ కోసం స్టైలింగ్ చేశాను. బెస్ట్ వెల్డ్రెస్డ్ వుమెన్ లిస్ట్‌లో ఆమె టాప్ త్రీలో నిలిచారు. టాలీవుడ్లో నెగెటివ్ రోల్ కోసం జగతిబాబు మేకవర్కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.
బాలీవుడ్, టాలీవుడ్ల మధ్య తేడాలు
గతంలో మాలా సిన్హా ఆంకే సినిమాలో 80కి పైగా కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. 1940 హీరోయిన్ నూతన్, ఆ తర్వాత వైజయంతి, హేమామాలిని, షర్మిలా ఠాగూర్‌లు ఫ్యాషన్‌కు సింబల్‌గా నిలిచారు. వాళ్లు ఎప్పటి నుంచో ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్. ఇక సోనమ్ దాన్ని ఇంకో లెవల్‌కు తీసుకువెళ్లారు. ఇండియన్ సినిమాలో ఆమెలా ఎవరూ స్టైలింగ్‌లో ప్రయోగాలు చేయులేదు. ప్రస్తుతం కంగనా కూడా బాగా ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు.
మేకప్, హెయిర్‌లో ఇక్కడ చాలా తేడా ఉంది. ఇక్కడ సింపుల్‌గా ఒక పోనీ వేసుకుని, క్లిప్స్, బ్యాండ్ పెట్టుకుని నెటివిటీ ఫ్యాషనే కనిపిస్తుంది. సౌత్‌లో హీరోయిన్ల కన్నా హీరోలు ఫ్యాషన్, స్టైల్లో ఫాస్ట్‌గా చేంజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఆసక్తి కూడా వాళ్లలోనే కనిపిస్తుంది. తెలుగులో పెద్ద హీరోయిన్లు కూడా ఎక్స్పరిమెంట్ చేయట్లేదు. . దానికి కారణం హీరోలు ఉన్నంత కన్సిస్టెంట్గా సినిమాల్లో హీరోయిన్లు ఉండకపోవటం కావచ్చు.
టాలెంట్ మెరుగుపరచుకోవాలి
ఈ రంగంలో అవకాశాలు బాగా ఉన్నాయి. ఏ వృత్తి అయినా ఎప్పటికప్పుడు టాలెంట్‌ని మెరుగుపరుచుకోవాలి. హార్డ్‌వర్క్, క్రియేటివిటీ తప్పనిసరి.
తెలుగు సినిమాల్లో ఫ్యాషన్‌పై..
హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, కే3 ప్యాంట్స్, వేలాడే కమ్మలు వేసుకుని కనిపిస్తున్నారు. షాట్స్ ఎక్స్పోజింగ్, ప్యాంట్ ఫుల్ కవర్ అవుతుందని 3/4ప్యాంట్స్ వేసుకుంటారు. ఏదైనా కాన్ఫిడెంట్‌గా చేస్తే బాగుంటుంది. తెలుగు సినిమా వాళ్లు ఫ్యాషన్‌లో వెనుకబడి ఉన్నారు.
టాలీవుడ్లో ఫ్యాషన్ ప్రయోగాలపై..
ఈ విషయంలో నాగార్జునకు హ్యాట్సాఫ్. ఆయన స్టైల్స్, లుక్స్‌లో చాలా ఎక్స్పరిమెంట్స్ చేశారు. తెలుగులో ఎవరూ ఆయనలా ప్రయోగాలు చేయలేదు. ఇక రామ్‌చరణ్ డ్రెస్సింగ్ ఎక్స్పెన్సివ్, స్టైలిష్‌గా ఉంటుంది. నాగచైతన్య డ్రెస్సింగ్ డీసెంట్‌గా ఉంటుంది.. అయితే ఆడియన్స్‌ను ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. వీళ్లకి ఇదే చాలు అనుకుంటే ఫ్యాషన్ ముందుకు వెళ్లదు. ఎక్స్పరిమెంట్స్ చేయాలి. క్లాత్స్ మాత్రమే కాకుండా హెయిర్, లుక్ అన్నింట్లో మార్పులు రావాలి.’ అంటారు నిశ్చల్ నియోగి.’