NTV Nielsen Survey
-
వైఎస్సార్సీపీయే నంబర్‌వన్
ఎన్టీవీ-నీల్సన్ సర్వే వెల్లడి 59-63 స్థానాల తో రెండో స్థానంలో టీఆర్ఎస్ 48-54 స్థానాలతో టీడీపీకి మూడో స్థానం కాంగ్రెస్‌కు కేవలం 28 నుంచి 35 సీట్లు 25 లోక్‌సభ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీవే టీఆర్ఎస్కు 8-10; కాంగ్రెస్, టీడీపీలకు 3-5 సీఎంగా 50 శాతం మంది సీమాంధ్రుల ఓటు జగన్‌కే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 39 శాతం ఓట్లు బాబుకు సీమాంధ్రలో 38, తెలంగాణలో 19 శాతం ఓట్లు సాక్షి, హైదరాబాద్: ఎన్టీవీ-నీలన్స్ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. నీల్సన్ నిర్వహించిన సర్వే ఫలితాలను రెండు రోజులుగా ఎన్టీవీ ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. తొలి రెండు రోజుల్లో వరుసగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో చేసిన సర్వే ఫలితాలను వెల్లడించిన ఎన్టీవీ, తాజాగా శనివారం తెలంగాణ ప్రాంతం వివరాలను ప్రసారం చేసింది. మూడు ప్రాంతాల్లో కలిపి మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 132 నుంచి 145 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఇక టీఆర్ఎస్ ఒక్క తెలంగాణకే పరిమితమైనప్పటికీ అక్కడ 59 నుంచి 63 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని తేలింది. 48-54 సీట్లతో టీడీపీ మూడో స్థానానికి పరిమితమవుతుందని, కేవలం 28-35 సీట్లతో అధికార కాంగ్రెస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటుందని వెల్లడైంది. బీజేపీ 7-10 సీట్లు గెలుచుకోనుంది. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీకి 39 నుంచి 44 సీట్లు, కోస్తాంధ్రలోని మొత్తం 123 స్థానాల్లో 87 నుంచి 95 స్థానాలు దక్కనున్నాయి. తెలంగాణలో పార్టీకి 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలింది. ఈ లెక్కన మూడు ప్రాంతాల్లో కలిపి వైఎస్సార్సీపీకి 132 నుంచి 145 స్థానాలు దక్కుతాయని సర్వే వెల్లడించింది. ఇక సీమలో టీడీపీకి 7-10, కోస్తాంధ్రలో 23-27, తెలంగాణలో 14-17 స్థానాలు వస్తాయని తేలింది. కాంగ్రెస్ అయితే సీమలో 2-4 స్థానాలు, కోస్తాంధ్రలో 0-2 స్థానాలు, తెలంగాణలో 19-24 స్థానాలకే పరిమితం కానుంది. రాష్ట్ర విభజన క్రెడిట్ టీఆర్ఎస్కే దక్కనున్నట్టు సర్వే తేల్చింది. హడావుడిగా తెలంగాణ ఏర్పాటును ప్రకటించి లబ్ధి పొందాలన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలే కానున్నాయని పేర్కొంది. ఎంఐఎం 7 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది. మిగతా స్థానాలు బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఇతరులకు దక్కుతాయని తెలిపింది. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ హవాయే రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నిక ల్లో మాదిరిగానే లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీయే ప్రభంజనం సృష్టిస్తుందని నీల్సన్ సర్వే పేర్కొంది. ఏకంగా 23-25 ఎంపీ సీట్లను పార్టీ గెలుచుకుంటుందని వెల్లడించింది. టీ ఆర్ఎస్ 8-10 ఎంపీ సీట్లు గెల్చుకోవచ్చని, కాంగ్రెస్‌కు కేవలం 3 నుంచి 5 సీట్లే వస్తాయని పేర్కొంది. టీడీపీ కూడా 3 నుంచి 5 స్థానాలతోనే సరిపెట్టుకోనుంది. బీజేపీకి ఒక స్థానం రావచ్చని, ఇతరులకు రెండు ఎంపీ సీట్లు దక్కుతాయని, వాటిలో హైదరాబాద్‌ను మజ్లిస్ చేజిక్కించుకోవచ్చని సర్వే పేర్కొంది. సీమాంధ్ర సీఎంగా జగన్‌కే ఓటు 2014లో కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉందన్న ప్రశ్నకు సీమాంధ్ర ప్రాంతం మొత్తం నుంచి సర్వే సమాచారం సేకరించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చూడాలని ఏకంగా 50 శాతం మంది సీమాంధ్రులు కోరుకున్నారు. 38 శాతం మంది చంద్రబాబును, 12 శాతం మంది ఇతర నేతలను సీఎంగా కోరుకున్నారు. తెలంగాణలో ఓట్ల శాతం టీఆర్ఎస్కు 32 శాతం, కాంగ్రెస్‌కు 26 శాతం, టీడీపీకి 20 శాతం, బీజేపీ 8.5 శాతం, వైఎస్సార్సీపీకి 7శాతం, మజ్లిస్, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీలకు 6.5 శాతం తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు అనే ప్రశ్నతో ఈ సర్వే నిర్వహించారు. కేసీఆర్‌ను సీఎంగా చూడాలని 39 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో బలమైన కేడర్ ఉందని టీడీపీ చెప్పుకుంటున్నప్పటికీ చంద్రబాబును సీఎంగా కోరుకుంటున్న వారు 19 శాతమే. తెలంగాణలో 9 శాతం ప్రజలు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. మరో 9 శాతం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు సీఎంగా ఓటేశారు. ఎంపీ సీట్లలోనూ టీఆర్ఎస్సే తె లంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ 8-10 స్థానాలను గెలుచుకోనుంది. కాంగ్రెస్‌కు కనాకష్టంగా 1 నుంచి 3, టీడీపీకి 1 నుంచి 2 స్థానాలు దక్కనున్నాయి. సమైక్యవాదంతో ముందుకెళ్లనున్న వైఎస్సార్సీపీకి తెలంగాణలో ఒక లోక్‌సభ స్థానం దఖలు పడే అవకాశాలున్నాయి. -
కోస్తాంధ్రలోనూ జగన్ హవానే..
* 123 అసెంబ్లీ స్థానాల్లో 87-95 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే * మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 16 సీట్లు ఫ్యాన్వే * జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న 48% మంది ప్రజలు * సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న కాంగ్రెస్ * టీడీపీకి 23 నుంచి 27 అసెంబ్లీ స్థానాలే సాక్షి, హైదరాబాద్: రాయలసీమ తరహాలోనే కోస్తాంధ్రలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం ఉందని ఎన్టీవీ - నీల్సన్ సర్వేలో వెల్లడైంది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలతో పాటు అన్నింటా వైఎస్ జగన్మోహన్రెడ్డి హవా కొనసాగింది. వచ్చే సాధారణ ఎన్నికల తరువాత జగన్ ముఖ్యమంత్రి కావాలని కోస్తాంధ్ర ప్రజలు 48 శాతం మంది కోరుకున్నట్లు వెల్లడైంది. కోస్తాంధ్రలోని 123 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 87 నుంచి 95 స్థానాలు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయపార్టీల స్థితిగతులపై నిర్వహించిన తాజా సర్వేలో భాగంగా శుక్రవారం కోస్తాంధ్రకు సంబంధించిన నీల్సన్ సర్వే ఫలితాలను ఎన్టీవీ ప్రసారం చేసింది. కోస్తాంధ్రలోని ఓటర్లు జగనే సీఎం కావాలని అత్యధికంగా 48 శాతం మంది కోరుకుంటుండగా... అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబును 38 శాతం మంది ప్రజలు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఇద్దరి మధ్య పది శాతం తేడా ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే కోస్తాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 87 నుంచి 95 స్థానాలు దక్కించుకొని పెద్దన్న పాత్ర పోషించనుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న టీడీపీని ఈసారి కూడా ఓటర్లు దూరంపెట్టారు. ఆ పార్టీకి 23 నుంచి 27 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే రాయలసీమతో పోల్చితే టీడీపీ కాస్త మెరుగైన స్థానాలు దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం 4 నుంచి 7 స్థానాలతో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విభజిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కోస్తాలో నామమాత్రంగా ఉన్న బీజేపీకి 0 నుంచి ఒక్కస్థానం దక్కే అవకాశముంది. ఇతరులు 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశమున్నట్లు పేర్కొంది. లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ హవా కోస్తాంధ్రలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. ఆ పార్టీకి 12 నుంచి 16 స్థానాల దాకా గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 0 నుంచి 2 స్థానాలకే పరిమితమైంది. రెండు స్థానాలు కూడా టీడీపీకి దక్కని పరిస్థితి ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్‌కు 0 నుంచి 2 స్థానాలు దక్కవచ్చనుకున్నా.. ఖాతా తెరవడమే ఆపార్టీకి కష్టంగా ఉన్నట్లు పేర్కొంది. గతంలో 2009లో 17 స్థానాలకు గాను 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి పరిస్థితి దయనీయంగా మారింది. ఓట్లశాతం విషయంలో కూడా వైఎస్సార్సీపీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. 45 శాతం ఓట్లతో మొట్ట మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండోస్థానంలో టీడీపీకి 38 శాతం ఓట్లు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 13 శాతం మాత్రమే ఓట్లు రానున్నట్లు సర్వే స్పష్టంచేసింది. రాయలసీమ, కోస్తాంధ్రల్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 126-139 స్థానాలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో ఉంటుందని సర్వేలో వెల్లడైంది. టీడీపీ 30-47 స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్ కేవలం 6-11 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని తెలుస్తోంది. ఇక మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 19-24 స్థానాలు వైఎస్సార్సీపీ దక్కించుకుంటుందని కాంగ్రెస్, టీడీపీలు 0-3 స్థానాలకే పరిమితమవుతాయని సర్వే స్పష్టంచేస్తోంది. -
జగన్‌కు జై కొట్టిన రాయలసీమ
-
జగన్‌కు జై కొట్టిన రాయలసీమ
* జగన్ సీఎం కావాలని కోరుకుంటున్న 54 శాతం మంది సీమ ఓటర్లు * ఎన్టీ వీ-నీల్సన్ సర్వేలో వెల్లడి * చంద్రబాబు సీఎం కావాలన్న 37 శాతం ఓటర్లు * 52 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 39-44 సీట్లు * టీడీపీకి 7-10; కాంగ్రెస్‌కు 2-4 సీట్లే * 7-8 ఎంపీ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కే అవకాశం * కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కోసీటు దక్కవచ్చు లేదా అస్సలు రాకపోవచ్చు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాయలసీమ జై కొట్టింది. వచ్చే సాధారణ ఎన్నికల తరువాత ఆయన ముఖ్యమంత్రి కావాలని 54 శాతం మంది ఓటర్లు కోరుకున్నారు. రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ స్థానాలకుగాను 39 నుంచి 44 సీట్లను ఆయన నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోనుందని ఎన్టీవీ-నీల్సన్ సంస్థ సంయుక్తంగా చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను గురువారం నుంచి మూడు రోజుల పాటు ఎన్టీవీ ప్రసారం చేయనుంది. తొలి రోజు గురువారం రాత్రి రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని ఎన్టీవీ ప్రసారం చేసింది. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయం తీసుకున్న తరువాత అక్టోబర్ నెలాఖరు వరకూ 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్థానాల పరిధిలోని 18-24, 25-44, ఆ తర్వాత 45 సంవత్సరాలకు మించి వయసు ఉన్న మూడు కేటగిరీల్లో 1.74 లక్షల మంది ఓటర్ల అభిప్రాయాలను శాంపిళ్లుగా సేకరించి సర్వే చేసినట్లు ఎన్టీవీ వెల్లడించింది. సర్వేను పార్టీల వారీగా మాత్రమే చేశామని, వచ్చే ఏడాది జనవరిలో, తిరిగి సాధారణ ఎన్నికలకు ముందు కూడా సర్వే చేస్తామని తెలిపింది. తాము ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెట్టామని, వచ్చే ఎన్నికల్లో సీఎంగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నెన్ని సీట్లు వస్తాయి, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నెన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనే అంశాలపై ప్రజాభిప్రాయాన్ని రాబట్టామని ఎన్టీవీ తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో 600 మంది అభిప్రాయాలు.. రాయలసీమలోని మొత్తం 52 నియోజకవర్గాలకు గాను ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి 600 మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మొత్తంగా 31 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వచ్చే ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు రాయలసీమ ప్రాంతంలోని 54 శాతం మంది జగన్మోహన్రెడ్డిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని చెప్పారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నామని 37 శాతం మంది మాత్రమే చెప్పారు. వీరిద్దరికి మధ్య సీఎం పదవి విషయంలో జనాభిప్రాయంలో 17 శాతం తేడా ఉంది. ఇతరులు సీఎంగా కావాలని తొమ్మిది శాతం మంది ప్రజలు కోరుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 52 అసెంబ్లీ సీట్లకుగాను 39 నుంచి 44 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. టీడీపీ ఏడు నుంచి పది సీట్లు, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి నాలుగు సీట్లకు పరిమితం కానున్నాయి. బీజేపీ, ఇతరులు చెరో స్థానం చేజిక్కించుకోనున్నారు. ఇదే ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ 51 శాతం ఓట్లను, టీడీపీ 33, కాంగ్రెస్ 13, బీజేపీ రెండు, ఇతరులు ఒక శాతం ఓట్లను సాధించుకునే అవకాశం ఉంది. రాయలసీమలో ఉన్న ఎనిమిది లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ ఏడు లేదా ఎనిమిది, టీడీపీ, కాంగ్రెస్‌లో ఏదో ఒక పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 శాతం, టీడీపీ 33 శాతం, కాంగ్రెస్ 15 శాతం, బీజేపీ, ఇతరులు చెరో 1 శాతం ఓట్లు సాధించుకునే అవకాశం ఉందని ఎన్టీవీ- నీల్సన్ సర్వేలో వెల్లడైంది.