Odd Even rule
-
పార్లమెంటుకు ట్యాక్సీల్లో రావాలా?
విభేదాలు పక్కనపెట్టి ఏకమైన ఎంపీలు న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక విషయంలో పార్టీల పరంగా విభేదించుకుంటూ.. పార్లమెంటులో రచ్చరచ్చ చేసే ఎంపీలంతా ఒక విషయంలో మాత్రం ఏకమయ్యారు. పార్టీకతీతంగా అందరూ కలిసి ఒకే గొంతు వినిపించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి నిబంధనను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలని పార్లమెంటులో ఎంపీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ట్రాఫిక్ నియంత్రించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల నంబర్ ప్లేట్ల ఆధారంగా సరి-బేసి నిబంధనను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలతో పార్లమెంటుకు రాకుండా ఎంపీలను అడ్డుకుంటున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ నిరసన వ్యక్తం చేశారు. సరి-బేసి నిబంధన కారణంగా పార్లమెంటుకు రావడం కష్టంగా మారిందని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం కావడంతో పార్లమెంటుకు బయలుదేరిన పలువురు ఎంపీలకు సరి-బేసి షాక్ తగిలింది. సరి-బేసిని ఉల్లంఘించి బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ తన వాహనంలో దర్జాగా పార్లమెంటుకు వచ్చారు. దీనిపై విలేకరులు ప్రశ్నించడంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇతర ఎంపీలూ ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో సరి-బేసి నిబంధన నుంచి ఎంపీలను మినహాయించాలని, తాము ట్యాక్సీల్లో పార్లమెంటుకు రాలేమని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. -
‘సరి-బేసి’తో కాలుష్యం ఎందుకు పెరిగింది?
న్యూఢిల్లీ: నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ వాహనాల నియంత్రణ విధానం బేస్ అంటూ సోషల్ మీడియా ప్రశంసించినా, ఈ విధానం తొలిరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చంకలు గుద్దుకున్నా నగరంలో కాలుష్యం శాతం ఎందుకు తగ్గలేదు. రోడ్లపైనా కార్ల రాకపోకలను చెప్పుకోతగ్గ స్థాయిలో నియంత్రించగలిగినా, కొత్త సంవత్సరం సందర్భంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు సెలవుదినం ప్రకటించినప్పటికీ కాలుష్యం ఏమాత్రం ఎందుకు తగ్గలేదు. వాస్తవానికి గత వారం కన్నా శుక్రవారం ఎక్కువుందని, ఆ మాటకొస్తే దీపావళి తర్వాత ఎక్కువ కాలుష్యం నగరంలో నమోదైందని నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు ఇండికేటర్లే కాకుండా, పుణెలోని ఐఐటిఎం సీనియర్ సైంటిస్ట్ గుఫ్రాన్ బేగ్ తెలిపారు. ఉదయం పూట ఎనిమిది గంటల వరకు కాలుష్యం తగ్గిందని, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకల్లా నార్మల్ రేంజ్‌కన్నా ఐదింతల కాలుష్యం పెరిగిందని ఆయన వివరించారు. వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణం కావచ్చని ఆ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కార్ల నియంత్రణా విధానం నుంచి మహిళలను మినహాయించడం, వారు నడిపే కార్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరి-బేసి విధానంలో ఆశించిన మేరకు కార్ల రాకపోకలను నియంత్రించలేక పోయారని, అంతకుమించి టూ వీలర్ల రాకపోకల సంఖ్య పెరగడం వల్ల కాలుష్యం తగ్గకపోగా పెరిగిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుమిత రాయ్ చౌదరి చెప్పారు. ఆయన వాదనతోని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఏకీభవిస్తున్నారు. వాస్తవానికి కార్లకన్నా ద్విచక్ర వాహనాల వల్లనే ఎక్కువ కాలుష్యం ఏర్పడుతోందని, కొన్ని కార్లను నియంత్రించడం వల్ల వారు ద్విచక్ర వాహనాలను ఆశ్రయించారని వారంటున్నారు. ఢిల్లీలో ద్విచక్ర వాహనాలు 55 లక్షలు ఉన్నాయి. నగరంలో కాలుష్య స్థాయిని ఎప్పటికప్పుడు తెలియజేసే చార్ట్ బోర్డును సెక్రటేరియట్ వద్ద ఏర్పాటుచేసి మరీ ఎప్పటికప్పుడు వివరాలను మీడియాకు తెలియజేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా శుక్రవారం నగరంలో కాలుష్యం స్థాయి పెరిగిన విషయాన్ని అంగీకరించారు. మూడు, నాలుగు రెట్లు పెరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఐదడుగుల లోతు కాలుష్యం నీటిలో ఐదడుగుల ఎత్తు మనిషి నిలబడి కాలుష్యం హెచ్చు తగ్గుల గురించి చెప్పవచ్చని, 15 అడుగుల కాలుష్య కాసారంలో ఐదడుగుల వ్యక్తి నిలబడి ఏమీ చెప్పలేడంటూ తనకు తోచిన పోలికతో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. డిసెంబర్ నెలలో సరి సంఖ్య, బేసి సంఖ్య (ఫ్యాన్సీ నెంబర్లు మినహా)లకు డిమాండ్ బాగా పెరిగిందని ఆర్టీయే వర్గాలు తెలిపాయి. ఒక్కో నెంబర్‌కు 21వేల రూపాయల చార్జీని విధించగా ఒక్క డిసెంబర్ నెలలోనే తమ సంస్థకు 64 లక్షల రూపాయలు వసూలయ్యాయని వెల్లడించాయి. ఏడాది మొత్తంలో డిసెంబర్ నెలలోనే కార్ల అమ్మకాలు బాగా పెరిగాయని ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి. సాధారంగా ఆఫర్ల కారణంగా డిసెంబర్ నెలలోనే సేల్స్ ఎక్కువ ఉంటాయని, అయితే ఈ సారి రెండో కారు కొనేందుకు వచ్చినవారు పది శాతం మంది ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలు దేనికి కొలమానం? కారు వాడకాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశం కారు వాడకందారుల్లో కనిపించడం లేదు. సరి-బేసి సంఖ్య కారులు కలిగి ఏరోజుకు ఏది అవసరమో దానిపై ప్రయాణించాలనుకుంటున్నారన్న విషయం సుస్పష్టం. అందుకని ఆప్ ప్రభుత్వం ఈ సరి-బేసి సంఖ్య విధానంపై ఎక్కువ కాలం ఆధారపడకుండా ప్రత్యామ్మాయ మార్గాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది విజ్ఞుల అభిప్రాయం. -
ఢిల్లీలో కార్ల నియంత్రణ సక్సెస్ అవుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచ కాలుష్య నగరాల్లో ఒకటైన ఢిల్లీ నగరంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి ‘సరి-బేసి’ నెంబర్ కార్ల అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇది విజయవంతమవుతుందా, ఆశించిన ఫలితాలు సాధిస్తామా ? అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే. నగరంలోని ధనవంతులకు ఇప్పటికే ఒకటికి మించిన కార్లు ఉన్నాయి. ఒక రోజు సరి సంఖ్య మరో రోజు బేస్ సంఖ్య కార్లను తీసుకపోరా? రెండో కారు లేనివారు సెకండ్ హ్యాండ్ కారైనా కొనరా? సరి-బేసి సంఖ్య నెంబర్ ప్లేట్ ఉండేలా జాగ్రత్త పడలేరా? ఇంతవరకు కారు ప్రయాణానికి అలవాటు పడిన వారు రైలో, బస్సో ఎక్కి ప్రయాణం చేయగలరా? ప్రపంచంలోని పలు దేశాల నగరాల్లో ఇప్పటికే ఈ వాహనాల నియంత్రణ విధానం అమలులో ఉంది. అక్కడ ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందా? ఇస్తే అందుకు కారణాలు ఏమిటీ? అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనాతోపాటు పలు యూరప్ నగరాలు, ల్యాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఈ వాహనాల నియంత్రణ విధానం అమలు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో బీజింగ్ నగరం మొదటి స్థానంలో ఉంది. అక్కడి రోడ్లపై కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 అత్యంత కాలుష్య నగరాల్లో అందులో మన దేశంలోనే 13 నగరాలు ఉన్నాయి. మెక్సికో సిటీ, యూరప్ నగరాల్లో ఈ నియంత్రణ విధానం సక్సెస్ అవడానికి సంబంధిత కారణాలు అనేకం ఉన్నాయి. ఢిల్లీలో ప్రతి వెయ్యిమందికి 157 కార్లు ఉన్నాయి. సింగపూర్‌లో ప్రతి వెయ్యిమందికి 38 కార్లు, హాంకాంగ్‌లో 25 కార్లు ఉన్నాయి. దీన్నిబట్టి ఢిల్లీలో కార్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రపంచ దేశాలు ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నాయి. అందులో నిర్దేశించిన ప్రాంతాల్లోకి ఎలాంటి వాహనాలను అనుమతించక పోవడం, ఆ ప్రాంతంలోకి దారితీసే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయడం, పార్కింగ్ చార్జీలను పెంచడం, రద్దీ వేళల్లో ‘రద్దీ చార్జీలు’ విధించడం, మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయడం, సైకిల్ లేదా కాలి నడకన వెళ్లడాన్ని ప్రోత్సహించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. నగరాల్లో డీజిల్ కార్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించిన దేశాలు కూడా ఉన్నాయి. ఒకే కుటంబానికి ఒకే కారు కొనే నియంత్రణలు కూడా కొన్ని నగరాల్లో కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రతి వాహనం కాలుష్యాన్ని కచ్చితంగా చెక్‌చేసే విధానాలను కూడా అమలు చేస్తున్నారు. నగరంలోని మురకివాడల్లో నివసిస్తున్న నాలుగున్నర లక్షల మంది ఆక్రమిస్తున్న స్థలం మొత్తం నగరం విస్తీర్ణంలో కేవలం మూడు శాతంకాగా, కార్లు ఆక్రమిస్తున్న స్థలం పదిశాతమని ఢిల్లీలోని ‘సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ సంస్థ అంచనావేసింది. పార్కింగ్ స్లాట్లకు మొత్తంగా 23 నుంచి 27 చదరపు కిలోమీటర్ల స్థలం అవసరమని అభిప్రాయపడింది. ఇలాంటి స్థితిలో ఢిల్లీలో కార్ల రాకపోకలను తగ్గించాలంటే రైలు, బస్సు రవాణాను మెరుగుపర్చాలి. అంటే నగరంలోని ప్రతి మూలకు కనెక్టివిటీ ఉండాలి. విదేశాల్లోలాగా ‘బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ను అమలు చేయాలి. అంటే బస్సులను మాత్రమే అనుమతించే ప్రత్యేకమైన ‘స్పీడ్ ట్రాక్’లు ఉండాలి. ఇంటి ముందు రోడ్డుపై కార్ల పార్కింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు. పార్కింగ్ స్థలాన్ని చూపిస్తేనే కారు కొనేందుకు అనుమతివ్వాలి. రద్దీ చార్జీలు విధించాలి. ఆటోమొబైల్ లాబీ ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఈ నిబంధనలను అమలు చేయడం అంత సులభం కాదు. టోల్గేట్లకు వ్యతిరేకంగా ముంబైలో జరుగుతున్న ఆందోళన వెనక ఆటోమొబైల్ లాబీ ఉన్న విషయం తెల్సిందే. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కార్లను నియంత్రించడానికి ముందే ప్రజా రవాణా వ్యవస్థను ముఖ్యమంత్రి కేజ్రివాల్ మెరగుపర్చి ఉండాల్సింది. ఢిల్లీలోని మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన 4,500 బస్సుల్లో నాలుగు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇది వరకు ఆరువేల బస్సుల్లో ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా బస్సులు సంఖ్య పెరగాల్సింది తగ్గుతూ వచ్చింది. -
'సరి-బేసి' సూపర్ సక్సెస్: కేజ్రీవాల్
-
'సరి-బేసి' సూపర్ సక్సెస్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు తాము అమలు చేస్తున్న సరి-బేసి సంఖ్యల విధానానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ విధానాన్ని ఢిల్లీ ప్రజలు హృదయపూర్వకంగా అంగీకరించారని పేర్కొన్నారు. 'సరి-బేసి విధానానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రోడ్లపై కార్లు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ పథకం తప్పకుండా విజయవంతమవుతుంది. అయితే శాశ్వతంగా సరి-బేసి నిబంధన అమలు చేయడం కుదరదు. భవిష్యత్ లో ఢిల్లీ ...దేశానికి ఆదర్శనంగా నిలుస్తుంది' అని మీడియాతో చెప్పారు. పెద్ద సవాళ్లను అధిగమించగలమని ఢిల్లీ ప్రజలు రుజువు చేశారని ప్రశంసించారు. దేశానికి మార్గసూచిలా నిలిచారని కితాబిచ్చారు. తన కారులో మరో నలుగురితో కలిసి తాను కార్యాలయానికి వెళ్లినట్టు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇద్దరు మంత్రులు, తన వ్యక్తిగత కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిలను కారులో ఎక్కించుకున్నానని తెలిపారు. సరి-బేసి విధానం అమలుపై సానుకూల స్పందన వ్యక్తం కావడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.