opal
-
ఆ ఊళ్లో అడుగుపెట్టాలంటే భయపడాల్సిందే..కనీసం నేలపై నడవాలంటే..
ఆస్ట్రేలియాలోని ఆ ఊళ్లోకి అడుగుపెడితే, పాతాళలోకంలోకి ప్రవేశించినట్లే ఉంటుంది. అక్కడి కట్టడాలన్నీ నేలకు దిగువన నిర్మించుకున్నవే! ఇళ్లు, హోటళ్లు, పబ్బులు, ప్రార్థన మందిరాలు– అన్నీ నేలకు దిగువనే ఉంటాయి. బయటి నుంచి చూస్తే, వాటి పైకప్పులన్నీ చిన్న చిన్న గుట్టల్లా కనిపిస్తాయి. అక్కడ నేల మీద నడవాలంటే, ఆచి తూచి అడుగులేయాలి. ఎందుకంటే అడుగడుగునా గోతులు ఉంటాయి. ఆ గోతులకు రక్షణగా ఎలాంటి కంచెలు ఉండవు. కాకుంటే, అక్కడక్కడా ఆచి తూచి నడవాలనే హెచ్చిరిక బోర్డులు కనిపిస్తాయి. ఈ విచిత్రమైన ఊరు దక్షిణ ఆస్ట్రేలియాలో అడిలాయిడ్ నగరానికి వాయవ్యాన 846 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరి పేరు కూబర్ పెడీ. పాతాళ గృహాలు మాత్రమే కాదు, ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ‘ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్’ రత్నాలు దొరుకుతాయి. ఈ ఊరి పరిధిలో దాదాపు డెబ్భైకి పైగా ఓపల్ గనులు ఉన్నాయి. ఊరి జనాభాలో ఎక్కువ మంది ఈ గనుల్లో పనిచేసే వారే! గని కార్మికులు, ఇంజినీర్లు, వారి అవసరాల కోసం ఏర్పడిన దుకాణాలు, హోటళ్లు, పబ్బులు, చర్చిలు ఈ ఊళ్లో కనిపిస్తాయి. ఇక్కడి గనుల్లో అత్యంత నాణ్యమైన ఓపల్ రత్నాలు దొరుకుతాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. గనులు ఉన్న ఊళ్లు ప్రపంచంలో ఎన్నో ఉన్నా, ఇక్కడ ఉన్నట్లుగా మరెక్కడా పాతాళగృహాలు ఉండవు. మరి ఇక్కడి జనాలు ఎందుకలా నేల అడుగున ఇళ్లు కట్టుకున్నారనే అనుమానం ఎవరికైనా రావచ్చు. కూబర్ పెడీ ఎడారి ప్రాంతంలో వెలసిన ఊరు. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మరీ దుర్భరంగా ఉంటాయి. సాధారణంగా 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంటాయి. ఒక్కోసారి 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎండల ధాటిని తట్టుకుని, బతికి బట్టకట్టడానికే ఇక్కడి జనాలు ఇలా నేల అడుగున కట్టడాలను నిర్మించుకున్నారు. ఈ ఊరి ఉపరితలం కంటే, నేల అడుగునే చల్లగా ఉంటుంది. దాదాపు శతాబ్దకాలంగా ఇక్కడ ఓపల్ గనుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఊరి జనాభా రెండున్నర వేలకు పైగా ఉంది. వీరిలో ఎనభై శాతం మంది గనులకు సంబంధించిన వారే! ఆస్ట్రేలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక. ఈ ఊళ్లో మూడు పడక గదుల పాతాళగృహం ధర 41 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.21.83 లక్షలు) మాత్రమే! అయితే, ఇక్కడి వాతావరణం కారణంగా ఈ ఊళ్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి ఎవరూ ఇష్టపడరు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీ రూ.15,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ).. ఓఎన్జీసీ పెట్రో–అడిషన్స్ లిమిటెడ్‌కు (ఓపీఏఎల్) సుమారు రూ.15,000 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. అధిక రుణభారం కారణంగా నష్టపోతున్న ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణకు ఓఎన్జీసీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని దహేజ్ వద్ద భారీ పెట్రోకెమికల్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీకి 49.36 శాతం, గెయిల్ ఇండియాకు 49.21, గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్ప్‌నకు (జీఎస్పీసీ) 1.43 శాతం వాటా ఉంది. ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా షేర్ వారెంట్లను ఈక్విటీగా ఓఎన్జీసీ మారుస్తుంది. రూ.7,778 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను బైబ్యాక్ చేస్తుంది. అలాగే ఈక్విటీ రూపంలో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా ఓపీఏఎల్‌లో దాదాపు 95 శాతం వాటా సమకూరుతుందని స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్‌లో ఓఎన్జీసీ వెల్లడించింది. ఇది అమలు చేసిన తర్వాత ఓఎన్జీసీకి ఓపీఏఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. ‘ఆర్థిక పునరి్నర్మాణంతో ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీ హోల్డింగ్‌ను పెంచుతుంది. ఓపీఏఎల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.14,864 కోట్లుగా ఉంటుంది’ అని ఓఎన్జీసీ పేర్కొంది. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఓపీఏఎల్‌లో గెయిల్, జీఎస్పీసీ వాటా 5 శాతానికి పరిమితం అవుతుంది. 2008లో ఓపీఏఎల్‌లో గెయిల్ వాటాను కైవసం చేసుకుంది. దహేజ్ ప్లాంట్ ప్రణాళిక సమయంలో రూ.12,440 కోట్లతో అంచనా వేశారు. కానీ 2017లో దాదాపు రూ.30,000 కోట్లతో పూర్తయింది. ప్లాంటుకు భారీ వ్యయం, నిర్మాణం ఆలస్యం కావడంతో గెయిల్ తన ఈక్విటీ వాటాను రూ.996.28 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఓపీఏఎల్ నష్టాలు 2023 మార్చి నాటికి రూ.13,000 కోట్లకు చేరుకున్నాయి. -
పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకుల పాత్ర కీలకం
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సూక్ష్మపరిశీలకుల (మైక్రోఅబ్జర్వర్లు) పాత్ర కీలకమని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే రాంగోపాల్ చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు వ్యవహరించాల్సిన పలు అంశాలపై సమగ్రంగా వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు సూక్ష్మ పరిశీలకుడు ఇచ్చే నివేదికతో పాటు ప్రిసైడింగ్ అధికారి డైరీని కూడా ఆధారంగా తీసుకుని రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు. పోలింగ్ కేంద్రం లోపల అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్‌లిస్టు ఆధారంగా పరిశీలించి నిర్ధారించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం బయట ఎన్ని గొడవలు జరిగినా లోపల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేస్తున్న చోట అందరి ఏజెంట్లను అనుమతించడానికి స్థలం సమస్య వస్తుందని, అక్కడ ప్రాధాన్య క్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన పార్టీల ప్రాతిపదికన ఏజెంట్లను అనుమతించాలని చెప్పారు. మీడియా ప్రతినిధుల్లో కూడా జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారినే లోనికి అనుమతించాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించాలని, అప్పటివరకు వరుసలో ఉన్న అందరినీ ఓటింగ్‌కు అనుమతించాలన్నారు.ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య పాల్గొన్నారు.