opens higher
-
సెన్సెక్స్ లాభాల సెంచరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం మరింత పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించింది. 116 పాయింట్ల లాభంతో32, 506 వద్ద,నిఫ్టీ 45పాయింట్ల లాభంతో 10, 191 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా టెలికాం, ఆటో, ఫార్మ రంగాలు లాభపడుతున్నాయి. యూబీఎల్ (యునూటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) నుంచి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వైదొలగనున్నారనే వార్తలతో లాభపడుతోంది. ఐడియా, భారతి ఎయిర్టెల్,రిలయన్స్, మారుతి, ఐటీసీ లాభపడుతున్నాయి. అలాగే డా. రెడ్డీస్, సన్ ఫార్మ కూడా లభాల్లో ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో యాక్సిస్, ఐసీఐసీఐ, జీ, ఐడీఎఫ్సీ నష్టాల్లో ట్రేడ్అవుతున్నాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సిరియా ఆందోళనలు, నాలుగో క్వార్టర్ ఫలితాలు ప్రకటన నేపథ్యంలో సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకులు, టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మద్దతుతో ట్రేడింగ్ ప్రారంభంలో నిఫ్టీ 9200 లెవల్ కు దగ్గర్లో ట్రేడైంది.. ప్రస్తుతం 12.50 పాయింట్ల లాభంలో 9193 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ సైతం స్వల్పంగా 74.74 పాయింట్లు లాభపడుతూ 29,650 గా నమోదవుతోంది. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అంచనావేసిన దానికంటే మెరుగ్గానే ఇన్ఫీ ఫలితాలను ప్రకటిస్తుందని అంచనాలు వస్తుండటంతో ఈ కంపెనీ షేర్లు లాభాలు పండిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వు రేట్లు పెంచుతుందనే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోతూ వస్తోంది. నిన్న 28 పైసలు క్షీణించిన రూపాయి, నేడు మరింత కిందకి 35 పైసల నష్టంలో ట్రేడవుతోంది. ఆసియన్ ఈక్విటీలు కూడా ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల ఆందోళనలు కొనసాగుతూ ఉండటంతో వాల్ స్ట్రీట్ కూడా కిందకే క్లోజైంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 72 రూపాయలు పెరిగి 28,756గా నమోదవుతోంది. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం పాజిటివ్ గా మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో 27,362 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 8439 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. ఎగిసి 8400 స్థాయిని అధిగమించింది. ప్రధానంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, హిందాల్కో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇంకా ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ లాభపడగా... బాష్, భారతీ, ఐసీఐసీఐ, సన్ ఫార్మా, బీపీసీఎల్ నష్టాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్లకు టాక్స్ ప్రయోజనాల అంచనాల నేపథ్యంలో నెల రోజుల తరువాత దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్లు చేపట్టడం గమనార్హమని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్ 20 తరువాత ఈ తరహా కొనుగోళ్లు ఇదే మొదటి సారని విశ్లేషించారు. మంగళవారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ. 142 కోట్లకుపైగా, దేశీయ మదుపర్లు రూ.607కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం విశేషం. అటు డాలర్ బలహీనంగా ఉండడటంతో దేశీయ కరెన్సీ బలంగా ఉంది. 18 పైసలు లాభపడి రూ.67.93 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. 215 భారీ లాభంతో రూ.28,744 వద్ద ఉంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 36.84 పాయింట్ల లాభంలో 26,411 గాను, నిఫ్టీ 9 పాయింట్ల లాభంలో 8113 గాను ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్ల సపోర్టుతో నిఫ్టీ 8100 మార్కును స్థాయిని నిలుపుకోగలిగింది. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్ షేర్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 67.86గా ప్రారంభమైంది. ఫెడరల్ మీటింగ్ ప్రకటనలు, ఇటీవల నెలకొన్న కొన్ని ప్రాంతీయ రాజకీయ ఆందోళనలతో డాలర్స్ ఇండెక్స్ పెంపు కొనసాగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అశుతోష్ రైనా తెలిపారు. ప్రస్తుతం 103 లెవల్‌కి పైన ట్రేడ్ అవుతుందని చెప్పారు. మరోవైపు ఆసియన్ షేర్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 27,215 నిఫ్టీ 8,218. దగ్గర ట్రేడవుతున్నాయి. ముందు లాభాలతో ప్రారంభమై, నష్టాల్లో జారుకున్నాయి. మళ్ళీ కొద్దిగా పుంజుకుని, స్వల్పలాభాలతో ట్రేడవుతూ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి12 పైసలు లాభపడి 63.36 దగ్గర ఉంది.